నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానము బైబిల్ నుండి సామెతలు 21:20వ వచనమును స్వీకరించుచున్నాము. ఆ వచనము, "విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింట నుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును'' అని చెప్పబడియున్నది. జ్ఞానముగల వాని యొక్క బలమైన పునాది మీద నిర్మాణము చేయబడుతుంది. జ్ఞానము యింటిని నిర్మాణము చేయును. కనుకనే, జ్ఞానుల యింట అమూల్యమైన నిధి ఉంటుంది. అమూల్యమైన తైలము, లేక నూనె ఉంటుంది. జ్ఞానమునకు అంత శక్తి ఎందుకు ఉన్నది? అని మీరు అడగవచ్చును. జ్ఞానము అనగా ఎవరు? అని చూచినట్లయితే, ఆయన ఎవరో కాదు, ఆయన యేసు క్రీస్తు. జగత్తుపునాది వేయబడక మునుపే ఈ యొక్క జ్ఞానము దేవుని యొద్ద ఉండి యున్నదని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది. ఈ జ్ఞానము ద్వారా సకల విశ్వము కూడా సృజించబడియున్నది. అవును, జ్ఞానము ద్వారా సకల విశ్వాంతరాళమును ఆయన సృజించియున్నాడు. ఆ యొక్క జ్ఞానము వ్యక్తియై యున్నాడు. దేవుడు తన వాక్కును పంపించి లోకమును సృజించాడు. దేవుని వాక్యము చెబుతుంది, అది దేవుని యొక్క జ్ఞాన వాక్యము. ఆ యొక్క జ్ఞానము యేసుక్రీస్తు. జగత్తుపునాది వేయబడక మునుపే ఆయన ఉండియున్నాడు. ఎందుకనగా, లోకమునకు పునాది వేయబడక మునుపే దేవుడు సమస్తమును ప్రణాళిక చేసియున్నాడు అని ఈలాగున హెబ్రీయులకు 4:3 మరియు హెబ్రీయులకు 1:2వ వచనములలో తెలియజేయుచున్నది.

నా ప్రియులారా, ఇంకను దేవుని యొక్క జ్ఞానమే సమస్తమైన సృష్టమును కూడా లోకరహితంగా పరిపూర్ణము చేసియున్నది. కోట్ల సంవత్సరములు గడిచిపోయినప్పటికిని, పరిణామాల వెంబడి పరిణామాలు జరుగుతున్నప్పటికిని, రూపాంతరము వెంబడి రూపాంతరము జరుగుతున్నప్పటికిని, జీవము ఇంకను స్థిరపరచబడియున్నది. అన్నియు ఇంకను లోకరహితముగా క్రమమైన పద్ధతిలో నడుచుచున్నవి. అన్నియు కూడా జీవమును తీసుకొని రావడానికి సమస్తమును కూడా జీవింపజేయడానికి క్రమముగా జరుగుచున్నవి. దొంగ దొంగ తనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; కానీ, యేసు సమృద్ధి జీవమును ఇచ్చుటకు వచ్చియున్నాడు. ఆయనే జ్ఞానమై యున్నాడు. అందుచేత ఆయన ఈలాగున సెలవిచ్చుచున్నాడు, ' నా కుమారుడా/కుమారీ, నేను మీ జీవితమును నిర్మాణము చేయాలని మీ పట్ల కోరుచున్నాను' అని ఆయన మీతో మాట్లాడుచున్నాడు. ఇంకను ఆయన మిమ్మును చూచి, 'నా పిల్లలారా, నేను మీ జీవితమును నిర్మాణము చేయాలని కోరుచున్నాను. జ్ఞానముగా ఉన్న నాతో మీ జీవితము నిర్మాణము చేయాలని కోరుచున్నాను' అని అంటున్నాడు. కాబట్టి, మీరు మీ హృదయాలను తెరచి, ' యేసయ్యా, నీవు మా హృదయములోనికి రమ్మని,' మీరు చెప్పుచుండగా, ఇంకను మీరు, ' నా పాపములు, వ్యసనములు, లోకభోగేచ్ఛల నుండి మరియు లోకము మీద ఉన్న నిరీక్షణ నుండి బయటకు రావడానికి మాకు సహాయము చేయుటకు నాలోనికి రమ్ము' అని ఆయనను మీరు మీలోనికి ఆహ్వానించుచుండగా, 'నేను మీలోనికి వచ్చెదను, నేను మిమ్మును నా ఆనంద తైలముతో నింపెదను' అని సెలవిచ్చుచున్నాడు. అవును, తైలము ఆనందమును తీసుకొని వచ్చును. తైలము ఆనందమునకు ప్రతిబింబము. తైలము ఎప్పుడు కూడా అగ్నిని మండింపజేయుచున్నది. ఆనందతైలము. జ్ఞానము ఆనందతైలమును తీసుకొని వస్తుంది. ఆలాగే, ఈ లోకానికి సంబంధించిన నిధులు, మరియొక లోకమునకు ప్రవేశించడానికి సంబంధించిన నిధులు, ఆధ్యాత్మికమైన నిధులు, లోకపరమైయున్న నిధులు, లోక సంబంధమైన విధానములో భద్రత కొరకై దేవుడు లోకపరమైన నిధులు అనుగ్రహించుచున్నాడు. అన్ని విషయములలో దేవుని ఘనపరచునట్లుగా, పరలోకములో ప్రవేశించునట్లుగా ఆధ్యాత్మికమైన నిధులను అనుగ్రహించును. దేవుడు దైవజ్ఞానము ద్వారా తన నిధులను మీకు అనుగ్రహించుచున్నాడు. ఈ రెండును యేసు యొద్ద నుండి వచ్చును. యేసు జ్ఞానము చేత నింపబడియున్నాడు. యేసు జ్ఞానమునందును, వయస్సునందును, దేవుని దృష్టియందును, మానవుల దయయందును వర్థిల్లుచుండెను అని వ్రాయబడియున్నట్లుగానే, అటువంటి కృపను దేవుడు నేడు మీకివ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు ఆనందించండి.

ఈ జ్ఞానం కార్యరూపంలో ఎలా పని చేసియున్నదో తెలియజేయుచున్న ఈ చక్కటి సాక్ష్యమును మీతో పంచుకోవాలని మీ పట్ల కోరుకుంటున్నాను. పూణె నుండి సహోదరి షారన్ తన అద్భుతమైన సాక్ష్యమును మనకు తెలియజేసియున్నారు. ఆమె తల్లిదండ్రులు తనను యౌవన భాగస్థుల పధకములో సభ్యురాలినిగా చేర్పించారు. ఆమె కేవలము 1 సంవత్సరము వయస్సులో ఉన్నప్పుడే, దేవుడు ఆమెను యౌవన భాగస్థురాలినిగా ఆశీర్వదించియున్నాడు. ఎందుకనగా, యౌవన భాగస్థులు అందించుచున్న కానుకల ద్వారా లక్షలాది మందికి మేము ఉచితముగా సేవలను అందించుచున్నాము. షారన్, తాను 10 వ తరగతి పరీక్షలు వ్రాసియున్న సమయములో, ఆమె 90.8 శాతము మార్కులను పొందుకొనెను. ఆలాగే 12వ తరగతి పరీక్షలు వచ్చేశాయి. ఆమె ఇంగ్లీషు పరీక్షలు వ్రాయబోవుచున్న సమయములో ఆమె చేతికి వాపు వచ్చినది. ఆమె ఎంతగానో బాధపడుచుండెను. అయినప్పటికిని, దేవుడు ఆమె పట్ల అద్భుత కార్యములను జరిగించవలెనని యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమును సంప్రదించినప్పుడు, ప్రార్థన యోధులు లేఖనముల ద్వారా ఆమె కొరకు ప్రార్థించియున్నారు. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఆమెను స్వస్థపరచియున్నాడు. ఆమె పరీక్షలు వ్రాసెను. ఆమెకు చివరి పరీక్షలలో 91.23 శాతము మార్కులను సాధించెను. కెమిస్ట్రీ (రసాయన శాస్త్రములో) ప్రధమ స్థానమును పొందుకొని, మొదటి స్థానములో నిలిచియుండెను. ఆమె తన యొక్క డిగ్రీ విద్య కొరకు ఇంకను కొనసాగుచుండగా, 97.25 శాతము మార్కులతో ఉత్తీర్ణురాలైనది. ఆమె తన కళాశాలలో మొదటి స్థానములో ఉండెను. ఆ తర్వాత మాస్టర్ డిగ్రీని 100 శాతము ఉపకార వేతనము (స్కాలర్‌షిప్)తో చదివెను. ఈ రోజు ఒక పెద్ద సంస్థ కొరకు పని చేయుచుండెను. ఆమె ఒక యౌవన భాగస్థురాలుగా ఉన్నందున దేవుడు ఆమెను వర్థిల్లింపజేసెను. నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా ఈ ఆశీర్వాదమును పొందుకొనవచ్చును. యౌవన భాగస్థుల పధకములో యౌవనస్థుల కొరకు ప్రతి రోజు ప్రార్థించుచుండగా, మీ జీవితమును యేసునకు సమర్పించుకొనండి. నా ప్రియులారా, ఇదే ఆశీర్వాదం, ఇదే జ్ఞానం, మీకు అందుబాటులో ఉన్నది. కనుకనే, మీరు ప్రార్థించినప్పుడు, మీ జీవితాన్ని యేసుకు అప్పగించి, ఆయన జ్ఞానాన్ని అడిగినప్పుడు, ఆయన వచ్చి తన ఆనంద తైలమునిచ్చు జ్ఞానముతోను మరియు తన నిధితోను, ఈ రెండింటితోను నేడు నింపి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా వర్థిల్లింపజేయును గాక.

ప్రార్థన:
మహాఘనుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ బిడ్డలైన మమ్మును కౌగలించుకొని, నీ జ్ఞానముతో నింపుము. దేవా, సమస్తమును అర్థము చేసుకొనే అవగాహనను మాకు మరియు మా పిల్లలకు నేడు దయచేయుము. ప్రభువా, మా చదువులలోను మరియు ఉద్యోగములోను, కుటుంబములోను, వ్యాపారములో నీ యొక్క జ్ఞానముతో మమ్మును నింపి, వర్థిల్లజేయుము. యేసయ్యా, నీవు జగత్తు పునాది వేయబడక మునుపే, నీవు దేవుని జ్ఞానంగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు నీ యొక్క వాక్యంతో విశ్వాన్ని నిర్మించావు మరియు ఇప్పుడు కూడా అదే జ్ఞానంతో మా జీవితాన్ని నిర్మించుటకు కృపను అనుగ్రహించుము. దేవా, ఈ రోజు, మేము నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించుచున్నాము. యేసయ్యా, నీవు మాలోనికి వచ్చి, మమ్మును పాపం, వ్యసనాలు మరియు ఈ లోక విషయాలపై ఆధారపడటంతో బంధించే ప్రతి సంకెళ్లను బ్రద్ధలు చేసి, నీ యొక్క ఆనంద తైలంతో మమ్మును నింపుము. ప్రభువా, నీ యొక్క జ్ఞానం మా ఇంటిని శాంతి, ఉద్దేశ్యం మరియు పై నుండి వచ్చే దైవిక నిధితో మమ్మును నింపునట్లుగా చేయుము. దేవా, నీ యందు మాత్రమే మేము సంపూర్ణంగా నమ్మకము కలిగి ఉండడానికి మాకు నేర్పించుము మరియు మా జీవితం నీ యొక్క పరిపూర్ణమైన క్రమ పద్ధతికిని మరియు సమృద్ధిని ప్రతిబింబించునట్లుగా చేయుము. ప్రభువా, మా జ్ఞానం, మా పునాది మరియు మా నిత్యానందముగా ఉండుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.