ఉద్యోగ ఆశీర్వాద పధకం

 
" నీవు యెహోవా యందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. '' (యెషయా 58:14)

 

2020, ఆగష్టు 17వ తేదీన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారం డాక్టర్. పాల్ దినకరన్‌గారి ద్వారా యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో, " ఉద్యోగ ఆశీర్వాద పధకమును'' ప్రారంభించబడినది. ఈ పధకం ద్వారా క్రింద తెలుపబడిన అవసరతలో ఉన్నవారికి సేవలందించబడును

  • తగిన ఒక మంచి ఉద్యోగం, ఉన్నత స్థానం మరియు వృత్తిపరమైన ప్లేస్‌మెంట్‌నకు ప్రయత్నిస్తున్న వారి కొరకు
  • తమ వృత్తిలో నిచ్చెన ఎక్కాలని కోరుకొనువారి కొరకు
  • సరైన నష్టపరిహారం పొందలేని వారు లేక ఏదియు పొందలేని వారందరి కొరకు,
  • సరైన ప్లస్‌మెంట్ కొరకు పోటీ పరీక్షలు వ్రాయడానికి సిద్ధపడుచున్న వారి కొరకు
  • (ప్లేస్డ్ ఆన్ ది బెంచ్) ఒక సదావకాశము కొరకు ఎదురు చూచుచున్న వారు లేదా కష్టమైన బదిలీ మీద వెళ్లవలసి యున్నవారు
  • ఏ ఉద్యోగంలోను విజయం సాధించలేని వారు మరియు ఉద్యోగమును లేక తమ స్థానాన్ని నిలబెట్టుకోలేని వారు
  • అనవసరమైన ఖర్చులు పెట్టడం అలవాటుగా ఉన్నవారు
  • తగినంత సంపాదించినప్పటికిని, వారు అప్పుల ఊబిలో మునిగిపోయిన వారి కొరకు
  • వారు పని చేయుచున్న వారి మధ్య అనుగ్రహం అవసరం మరియు ప్రశాంతమైన పని వాతావరణాన్ని కలిగి ఉండుట కొరకు
  • ప్రాపంచిక దుర్మార్గాల నుండి కాపుదల మరియు అసూయపడే ప్రజలు కొరకు మరియు
  • కావలసిన బలం మరియు శక్తితో సేవ చేయడానికి మంచి ఆరోగ్యమును కోరుకునేవారు.

"మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు...నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.'' (యోవేలు 2:25,26) 

"తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.'' (సామెతలు 22:29)

" యోసేపును బట్టి, దేవుడు ఐగుప్తీయుని గృహమును ఆశీర్వదించెను మరియు యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములో నేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను'' (ఆదికాండము 39:2-5).

ఈ పరిచర్యలో భాగస్థులుగా ఇతరులను ఆశీర్వదించడానికి మీరు ముందుకు వచ్చినప్పటికిని, యోసేపును హెచ్చిం చి, తన ఉద్యోగాన్ని ఆశీర్వదించి, అతనిని అధికారిగా చేసిన సర్వశక్తిమంతుడైన ప్రభువు మీకు తప్పకుండా తగిన ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు మరియు ఆయన మీ కోసం మీ యజమానులను, మీ కార్యాలయాన్ని మరియు మీ సహోద్యోగులను ఆశీర్వదిస్తాడు. ప్రభువు మీకు ప్రతిదానిని రెట్టింపు కొలతతో దీవెనలను అనుగ్రహిస్తాడు, మీరు వంద రెట్లు ఆశీర్వాదం పొందడానికి ఇది మీకు తోడ్పడుతుంది (ఆదికాండము 26:12) మరియు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా మీరు అనుభవింతురు (యెషయా 65:22)

మీరు ప్రోత్సహించబడుటకు ఇక్కడ మీ కొరకు ఒక సాక్ష్యం:

బ్యాంకు మేనేజర్‌గా పదోన్నతి:

నేను యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో యౌవన భాగస్థురాలను మరియు ఉద్యోగ ఆశీర్వాద పధకములో భాగస్థురాలను. నేను 13 సంవత్సరములుగా ఉద్యోగం చేయుచున్నాను. నేను ఒక కంపెనీలో కాంట్రాక్టర్‌గా చేరి పనిచేసేదానను. ఆరంభములో దేవుని కృప వలన నా కాంట్రాక్టు పొడిగించబడినది. ఆ తరువాత అకస్మాత్తుగా, నా కాంట్రాక్టు పూర్తి కానున్నదనియు మరియు నా ఉద్యోగములోని చివరి తేదీ, 2022 నవంబర్ అని తెలియజేయుచు నాకు ఈమెయిల్ అందింది. నా ఉద్యోగ స్థలములో నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. వెంటనే నేను ఎదుర్కొనుచున్న నా పరిస్థితిని గూర్చి తెలియజేయుచు, నా కొరకు ప్రార్థన చేయమని కోరి, డాక్టర్. పాల్ దినకరన్‌గారికి ఈ మెయిల్ పంపించాను. నాకు స్థిరమైన ఉద్యోగము లభిస్తుందని డాక్టర్. పాల్ దినకరన్‌గారు నాకు జవాబును పంపించారు. రెండు రోజులలోనే దేవుడు నా పరిస్థితిని అద్భుత రీతిగా మార్చివేశాడు. నా కాంట్రాక్టు పొడిగించబడినది. నన్ను ఆశ్చర్యపరచుచూ, కొన్ని రోజుల తరువాత అకస్మాత్తుగా, నేను ఇంతకు ముందు పని చేసిన యాక్సిస్ బ్యాంక్ నుండి మేనేజర్‌గా ఉద్యోగములో చేరమని తెలియజేయుచూ ఆఫర్ లేటర్ అందింది. అది పర్మనెంటు ఉద్యోగము. ఆవిధంగా నేను అవమానము నొందిన స్థలములోనే దేవుడు నన్ను హెచ్చించాడు. నేను అవమానమును ఎదుర్కొనిన అదే స్థలములో ఉన్నతమైన అవకాశమును అనుగ్రహించి ఆశీర్వదించిన దేవునికి స్తోత్రములు. నా భవిష్యత్తు కొరకు ఎంతో భారముతో ప్రార్థన చేసిన డాక్టర్. పాల్ దినకరన్‌గారిని బట్టి కూడ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక

- ప్రియదర్శిని, మరతహల్లి


ప్రియమైన స్నేహితులారా, మీరు ఈ పధకములో నమోదు చేసుకొని మరియు బాధపడే ఇతరులను ఆశీర్వదించినప్పుడు, మీ జీవితంలో దేవుని అద్భుతాలను మీరు చూడగలరు. ఆయన మీ కొరకు నూతన అవకాశముల ద్వారాలను తెరుస్తాడు. ఇంకను దేవుడు మరియు మనుష్యుల దయతో మిమ్మును కప్పుతాడు. మీ కార్యాలయంలో దేవుని నడిపింపు మీరు మంచి ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది

"యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. '' (కీర్తనలు 5:12)

" యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.''

(కీర్తనలు 3:3)

ఉద్యోగ ఆశీర్వాద పధకము యొక్క ముఖ్య లక్షణాలు

  • భారతదేశంలో కోయంబత్తూరులోని కారుణ్య నగర్‌లో ఉన్న బేతెస్ద ప్రార్థనా కేంద్రం వద్ద డాక్టర్. పాల్ దినకరన్‌గారు మరియు కుటుంబ సభ్యులు, అలాగే ప్రార్థనా యోధులు కలిసి దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడాలని ప్రార్థిస్తారు
  • ప్రార్థనా గోపురము వద్ద నిర్వహించబడిన వృత్తిపరంగా ప్రణాళిక (కెరీర్ ప్లానింగ్) వంటి కార్యక్రమములకు మీరు ఆహ్వానించబడతారు.
  • ఆన్‌లైన్ శిక్షణా కోర్సులలో చేరడానికి ప్రాధాన్యత ఉంటుంది:
  • నైపుణ్య-ఆధారిత శిక్షణ , సీషా శిక్షణా కేంద్రాల కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రాధాన్యత

క్రింది మార్గాల ద్వారా మిమ్మును లేదా మీ కుటుంబ సభ్యులను లేదా మీ పరిచయస్తులను ఈ ఉద్యోగ ఆశీర్వాద పధకములో భాగస్థులుగా నమోదు చేయవచ్చును

  • ప్రార్థనా గోపురము, 16, డి.జి.యస్. దినకరన్ రోడ్, చెన్నై 600 028, ఇండియా
  • ఈ మెయిల్: [email protected] 
  • మీరు విదేశాలలో ఉన్నా లేదా మీ ప్రాంతములో మీకు సమీపములో నున్న ప్రార్థనా గోపురమును కనుగొనుటకు లేక సంప్రదించుటకు ఈ క్రింది ఫోన్ నెంబరుకు కాల్ చేయండి: 044 23456677,+91 44 23456677
  • వెబ్‌సైట్:www.jesuscalls.org/prayer-towers