దేవుని యందు నమ్మకం ఉంచిన వారి పట్ల ఆయన పూర్ణశాంతిని కలుగజేస్తాడు. వారు ఎలాంటి సవాళ్లు ఎదురైనా, ఆయన మమ్మును భద్రంగా మా గమ్యస్థానానికి నడిపిస్తాడన్న ప్రశాంతతోను, నెమ్మదితో...
మా కొత్త పాటలు


A Musical Tribute To Dr. Paul Dhinakaran


Stella Ramola & Daniel Davidson | Tamil Worship


Stella Ramola & Daniel Davidson Sing Bro. D.G.S. Dhinakaran’s Greatest Hits


అరైస్ జుక్ బాక్స్


కాలం మారుమ్


A Musical Tribute To Dr. Paul Dhinakaran


Stella Ramola & Daniel Davidson | Tamil Worship


Stella Ramola & Daniel Davidson Sing Bro. D.G.S. Dhinakaran’s Greatest Hits


అరైస్ జుక్ బాక్స్


కాలం మారుమ్
ఆశీర్వాద పథకాలు
సాక్ష్యములు

Haryana
ప్రార్థనల ద్వారా మాతృత్వము
నా భర్త పేరు ధీరజ్ సింగ్. మాకు వివాహమై నాలుగు సంవత్సరములగుచున్నను, మాకు సంతానము కలుగలేదు. ఎంతో మంది డాక్టర్లను సంప్రదించినను, ఎవ్వరు కూడ కారణమును కనుగొనలేకపోయారు లేక స్వస్థతను కలుగజేయలేకపోయారు. కానీ మేము నిరాశ చెందలేదు, ప్రార్థన చేయుట కొనసాగించాము. యేసు పిలుచుచున్నాడు జాతీయ ప్రార్థన గోపురమును సహితం సందర్శించాము. అక్కడ, ప్రార్థన యోధులు మా కొరకు ఎంతో భారముతో ప్రార్థన చేశారు. ఆ తరువాత మేము కుటుంబ ఆశీర్వాద పధకములో చేరాము మరియు దేవుడు గొప్ప అద్భుతకార్యమును జరిగించుననే నమ్మకముతో, ఇంకా పుట్టని నా బిడ్డను ముందుగానే విశ్వాసముతో యౌవన భాగస్థుల పధకములో చేర్చాను. కొన్ని నెలల తరువాత, దేవుడు కృపతో మా ప్రార్థనలను ఆలకించాడు | మరియు నేను గర్భం ధరించాను. నాకు మగబిడ్డ పుట్టాలని ప్రత్యేకముగా ప్రార్థన చేసుకొన్నాను మరియు 2023, ఏప్రిల్ 28వ తేదీన, మా కుమారుడు ఇస్సాకు జన్మించాడు. మా తండ్రియైన దేవునికి మరియు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలోని ప్రార్థన యోధులకు మేము ఎంతో కృతజ్ఞులమై యున్నాము. మా కుటుంబమును కట్టిన దేవునికే సమస్త మహిమ కలుగును గాక. - శిఖా, హర్యానా

Chennai
నేను యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో యౌవన భాగస్థురాలను. నా యొక్క 11వ మరియు 12వ తరగతులలో, | నేను నా చదువును కొనసాగించుటకు చాలా కష్టపడ్డాను. ప్రార్థన సహాయము కొరకు తరచుగా యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు ఫోన్ చేస్తుండేదానను. ఒకసారి ఒక ప్రార్థన యోధునితో మాటలాడుచున్నప్పుడు, ప్రజలను ఆదరించుటకును మరియు విరిగి నలిగిన హృదయముగల వారిని ఉద్దరించుటకును భవిష్యత్తులో దేవుడు నన్ను ఉపయోగించుకొనునని ఆయన నాతో చెప్పారు. నేను ఆయనకు చెప్పకపోయినను, నా వ్యక్తిగత ప్రార్థనలలో నేను > వేటి గురించి అయితే ప్రార్థన చేసుకొనుచున్నానో ఆ ప్రార్థన విన్నపముల కొరకు ఆయన ప్రవచనాత్మకముగా ప్రార్థన చేశారు. చివరిగా నేను 2022 NEET పరీక్షలో 632/720 మార్కులు సాధించాను. మరియు ఇప్పుడు నేను వేలూరులోని CMC కాలేజీలో MBBS చదువుచున్నాను. ప్రార్థన యోధులందరికి నా కృతజ్ఞతలను తెలియజేయుచున్నాను. ఆయన చేసిన మేలులను బట్టి దేవునికే సమస్త స్తుతి, మహిమ, ఘనత ప్రభావములు కలుగును గాక.
- యస్.నిషా వెరోనిక, చెన్నై.