యౌవన భాగస్థుల పధకము

 

జ్ఞానము, అభివృద్ధి, కాపుదల!
  

నేటి ప్రపంచంలో, పిల్లలు మరియు యౌవ్వనస్థులు ప్రతి ఒక్కరు గొప్ప ప్రలోభాలను మరియు దుర్మార్గపు ఆకర్షణలను ఎదుర్కొంటున్నారు. ఇది వారి జీవితాలను నాశనం చేయుచున్నది. చెడు ప్రభావాలన్నిటి నుండి వారిని రక్షించడానికి వారు యుక్త వయస్సులోనికి వచ్చేవరకు ప్రార్థనలో ప్రభువు యెదుట ఉంచడం ఎంతో అవసరం. కనుకనే, ఈ ఉద్దేశము కొరకే ఇందులో నమోదు చేసుకున్న ప్రతి బిడ్డ రక్షణ మరియు ఆశీర్వాదం కోసం 1985 నుండి యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో యౌవన భాగస్థుల పధకం నిర్వహించబడుతుంది.

పిల్లలు, యేసుతో యౌవన భాగస్థులుగా చేర్చబడుట ద్వారా వారి కొరకు ప్రార్థనా గోపురములో వారికి 25 సంవత్సరముల వయస్సు వచ్చేవరకు లేక వారికి వివాహమయ్యే వరకు రోజుకు ఒకసారి ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రార్థన 1 దినవృత్తాంతములు 4:10లో యబ్బేజు చేసిన ప్రార్థనకు ఆధారముగా కాపుదల, ప్రవచనాత్మక జ్ఞానము మరియు జీవితములో కాపుదల ఉండుట కొరకే:

  • ఈ లోకములో నున్న దుష్టుని నుండి దైవీక కాపుదల (యోహాను 17:15)
  • తమ చదువులో ప్రకాశించుటకు కావలసిన దైవీక జ్ఞానము (యెషయా 54:13)
  • వారు తమ జీవితములో వృద్ధిపొందునట్లుగా కావలసిన దైవీక అభివృద్ధి (కీర్తనలు 115:14)
పుట్టిన రోజు నుండి 25 సంవత్సరముల వయస్సు వరకు ఎవరైనను, ఏ వయస్సులోనైనను యౌవ్వన భాగస్థుల పధకములో భాగస్థులుగా చేరవచ్చును.

డాక్టర్. పాల్ దినకరన్‌గారు మరియు వారి కుటుంబ సభ్యులు యౌవ్వన భాగస్థుల కొరకు జీవిత కాలములో ఒక్కసారైనను వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. వారి జన్మదినమున, ప్రార్థనా గోపురము నుండి ప్రార్థనా యోధులు వారికి ఫోన్ చేసి ప్రార్థిస్తారు. దేవుని వాగ్దానము కలిగిన సర్టిఫికేట్‌ను ప్రతి యౌవ్వన భాగస్థులు పొందుకుంటారు.


యౌవన భాగస్థులు ఇచ్చే సమర్పణలు ప్రతిరోజు 24 గంటలూ ప్రార్థనలు, ఆదరణ, ఆలోచన, శిక్షణ కొరకు యేసు పిలుచుచున్నాడు పరిచర్యను సంప్రదించే లక్షలాది మంది విరిగిన హృదయం కలిగిన ప్రజలకు సేవ చేయుటకు అయ్యే ఖర్చుల కొరకు ఉపయోగించబడును. ఒక యౌవన భాగస్థుడు లేక వారి తరపున ఇవ్వబడిన కానుక, లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదము కొరకు ప్రభువు దానిని ఆశీర్వదించి, హెచ్చించాలని మేము ప్రార్థించెదము. ఆయన ప్రజలకు అనుగ్రహించుచున్న ఆశీర్వాదాలన్నిటిని ప్రతి యౌవన భాగస్థునిపై ఉంచుట ద్వారా, అతను/ఆమె వారి జీవితంలో 1000 రెట్లు ఆశీర్వాదాలను పొందుకొని ఆనందించునట్లుగా చేయును గాక (ద్వితీయోపదేశకాండము 1:11)

ఈ పరిచర్యకు వ్యక్తిగతంగా మీరే సహకారాన్ని అందించినప్పుడు లేక ఈ పరిచర్యకు సహాయపడడానికి మీ పిల్లలను యౌవన భాగస్థుల పధకములో నమోదు చేసుకున్నప్పుడు, 1 దినవృత్తాంతములు 4:10 వ వచనములో యబ్చేజు ప్రార్థన ప్రకారం ప్రభువు మీ పిల్లలను కూడ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసియున్నాడు.   

  • బుద్ది మరియు జ్ఞానాన్ని కలిగించు ఆశీర్వాదాన్ని అందించుట కొరకు
  • ఈ లోకంలోని ప్రతి కీడు నుండి కాపుదల మరియు భద్రతను కల్పించుట కొరకు
  • ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదకరమైన భవిష్యత్తును అందించుట కొరకు

ప్రార్థనా గోపురములలో ఉన్న ప్రార్థనా యోధులు ప్రతి రోజు, యౌవన భాగస్థులుగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఈ వాగ్దాన వచనమును వారి జీవితాలలో నెరవేర్చాలని ప్రార్థిస్తారు. అదేవిధంగా, దినకరన్ కుటుంబము వారు కూడ యౌవన భాగస్థులు ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తారు.

ఈ పధకము ద్వారా జీవితములో ఆశీర్వదింపబడిన అటువంటి ఒక భాగస్థురాలి సాక్ష్యం ఇక్కడ చూడండి:

 

విస్తారమైన దేవుని దయ మరియు మనుష్యుల దయ 

þ నేను యౌవన భాగస్థురాలను, 2012లో, నేను నా పదవ తరగతిలో 10/10 శాతం మార్కులను సాధించాను. మరియు మెడిసన్ చదవాలని ఆశించాను. కనుక, నేను ఇంటర్ మీడియేట్‌లో బైపిసి తీసుకొన్నాను (2012-&2014 బ్యాచ్). చివరి పరీక్షలలో నేను 958/ 100 మార్కులు సాధించాను. కానీ, ఎమ్‌సెట్ ప్రవేశ పరీక్షలలో మార్కులు తగ్గిపోయినవి. అందులో నాకు 89/160 మార్కులు వచ్చినవి. ఏదైన ప్రవేట్ కాలేజీలో నాకు మెడికల్ సీటు వస్తుందనియు అది కూడ సందేహమే అనియు నేను అనుకొన్నాను. కౌన్సిలింగ్‌కు వెళ్లినప్పుడు, అక్కడ కేవలం ఒక్క సీటు మాత్రమే మిగిలి ఉంది మరియు అది దేవుడే నాకు ఇచ్చాడని నేను గ్రహించాను. అది నేను కలలు కనిన కాలేజీ, అయితే, నేను ప్రార్థించిన దానికంటె దేవుడు నా జీవితములో నాకు అత్యధికముగా అనుగ్రహించి ఈ అద్భుతమును నా పట్ల జరిగించాడు. నేను ఎమ్‌బిబియస్ చేశాను (2014-2020 బ్యాచ్).


నా మెయిల్స్‌కు వెంటనే జవాబు పంపించుచు, నా కొరకు ప్రార్థన చేసిన డాక్టర్. పాల్ దినకరన్‌గారికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రములు.
 

- మహిత లంపిముఖి, రాజమండ్రి.