నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు దేవుని యొక్క వాగ్దానమును మన కొరకు స్వీకరించడం ఎంతో ఆనందం. మనము మనకు ఇవ్వబడిన వాగ్దానము ఇంకను చూడక మునుపు, ఈ రోజు దంపతుల ఎస్తేరు ప్రార్థన బృందమును ప్రారంభించిన, 8వ సంవత్సరము వార్షికోత్సవమును జరుపుకుంటున్న దినము. మా నానమ్మ స్టెల్లా దినకరన్గారు మరియు దంపతులు కలసి ప్రార్థించి, దేవుని సేవ చేయు నిమిత్తము ఈ పరిచర్యను ఏర్పాటు చేసియున్నారు. కనుకనే, మీరు కూడా ఈ పరిచర్యలో పాల్గొని, ప్రార్థన చేయుచూ, సహకారమందించుచూ, నిరంతరాయముగా విస్తరించులాగున చేయవచ్చును. కాబట్టి, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 140:13వ వచనమును దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. ఆ వచనము, "నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు'' అను వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. నా ప్రియులారా, ఎల్లవేళల, దేవుని సన్నిధిలో నివసించుట మరియు ఎళ్లవేళల దేవుని సానిధ్యమును అనుభూతి చెందుట ఎంత గొప్ప ధన్యత కదా. ఊహించండి, ఎల్లవేళల అటువంటి ఆనందము మీలో కలిగియున్నప్పుడు ఏలాగున ఉంటుందో కదా. తద్వారా, ఏదియు కూడా మీ హృదయములో ఉన్న శాంతిని బ్రద్ధలు చేయలేదు. మనము అందరము దాని కోసము ఎదురు చూస్తుంటాము కదా. కనుకనే, ఈ వచనము చెబుతుందిలా, "యథార్థవంతులు అట్టి ఆశీర్వాదమును స్వీకరించెదరు.'' ఆలాగుననే, నేడు మనము ప్రభువును అడుగుదాము, 'ప్రభువా, మమ్మును యథార్థవంతులైన ప్రజలుగా చేయుము, తద్వారా, ఎల్లవేళల, నీ సన్నిధిలో నివసించునట్లుగా మమ్మును మార్చుమని '' అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు మిమ్మును యథార్థతతో నింపుతాడు.
కనుకనే, నా ప్రియులారా, యథార్థవంతులు ఎవరు? అందుకే బైబిల్ నుండి కీర్తనలు 1:2వ వచనములో మనము చూచినట్లయితే, "యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు'' అని చెప్పబడిన ప్రకారముగానే, వారు దేవుని వాక్యమును ధ్యానించుటలోను మరియు ప్రేమించుటలోను, ఇంకను దివారాత్రము దేవుని మాటను వినుటకు ఇష్టపడుచుండేవారు అని తెలియజేయబడియున్నది. యథార్థవంతులు వారి శరీరాశలను త్యజించి, దేవుని దృష్టికి ఏది యుక్తమైనదో దానినే జరిగించువారై యున్నారు. అప్పుడప్పుడ, పాపపు ఇచ్ఛలను మన శరీరములోనికి చొరబడుతూ ఉంటాయి. కానీ, ఇవి నాకు అక్కర లేదు, దేవుని కొరకు పవిత్రమైన కార్యములు చేయాలి అన్నట్లుగా భావించు చుండువారు మాత్రమే దేవునికి యథార్థవంతులై ఉన్నారు. కేవలం దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమును జరిగించుటకు మాత్రమే వారు ఎంపిక చేసుకొనబడేవారు. దేవునికి అవిధేయులము కాజాలము అనుకునేవారు. దేవునికి అవిధేయులము కావడం మా హృదయాన్ని గాయపరుస్తుంది. ఇంకను మనము ఎల్లవేళల, ఆయన చిత్తమును ఆలకించుచూ, ఆయనకు యథార్థంగా ఉంటూ, విధేయులనుగా ఉంటాము అని అంటుంటారో అటువంటివారు నిజంగా యథార్థవంతులుగా ఉంటారు.
నా ప్రియులారా, ఎవరైతే, త్యాగపూరితముగా వారి నష్టములోను మరియు కొదువలోను దేవునికి ఇచ్చేవారుగా ఉంటు ఉంటారో, ఎవరైతే సంతోషముగా దేవునికి ఇచ్చేవారిగా ఉంటారో, వారు యథార్థవంతులైన ప్రజలు. చివరిగా ఎవరైతే, ఎల్లవేళల దేవునికి కృతజ్ఞతులై లేక వందనస్థులుగా ఉంటారో, అత్యంత దయనీయమైన పరిస్థితులలో కూడా నిరంతరాయముగా దేవునికి వందనాలు తెలియజేయువారుగా ఉంటారో వారి విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ప్రభువు ఇంకను మాకు మేలు చేస్తాడు అని భావిస్తారో వారు యథార్థవంతులు. నా ప్రియులారా, ఈ రోజు అట్టి యథార్థవంతులుగా ఉండడము కోసమై మనము ఆయనను అడుగుదామా? తద్వారా, నిరంతరాయముగా ఆయన సన్నిధిలో నివసించవచ్చును. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు ఇట్టి ఆశీర్వాదమును మీకిచ్చి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ సన్నిధిలో యథార్థవంతులు నివసిస్తారని ఇచ్చిన వాగ్దానానికి వందనాలు. దేవా, మేము ప్రతిరోజు నీతో దగ్గరగా నడుస్తూ జీవించాలని కోరుకుంటున్నాము. ప్రభువా, మమ్మును యథార్థవంతులనుగాను, హృదయంలో పరిశుద్ధంగాను, ఆత్మలో విధేయులముగాను మరియు త్యాగంలో ఆనందంగా ఉండునట్లుగా చేయుము. దేవా, శరీరాశలను విడిచిపెట్టి, నీ దృష్టిలో సరైనదాన్ని ఎంచుకోవ డానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము ప్రతి సమయంలోనూ నీకు కృతజ్ఞతతో ఉండటానికి మరియు లేని సమయాల్లో కూడా సంతోషంగా నీకు ఇవ్వడానికి మాకు నేర్పుము. దయచేసి దేవా, మేము రాత్రింబగళ్లు నీ వాక్యంలో ఆనందించడానికి మరియు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మరియు జీవించడానికి మాకు సహాయం చేయుము.ప్రభువా, మా హృదయంలో నీవు ఉంచిన శాంతిని ఏదియు కదిలించనివ్వకుండా చేయుము. దేవా, మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నివసించాలను కుంటున్నాము. ప్రభువా, అటువంటి హృదయమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, నిన్ను వెదకునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, ఎల్లవేళల నీ వాక్యమును పఠనము చేయుటకును, వాక్యమును స్వీకరించునట్లుగాను, మేము నీ వాక్యమును వినుటకు కృపను చూపుము. యేసయ్యా, మా పాపమును విడిచి పెట్టి, మా యెదుట మేము సరిగ్గా ఉన్నామా? అని మేము ఎంపిక చేసుకొనువారముగా ఉండునట్లుగా చేయుము. దేవా, మేము నీతిమంతులుగా జీవించాలన్న కోరికను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ చిత్తమును, నీ ప్రణాళికను మా జీవితము పట్ల పరిపూర్ణమగునట్లుగా కృపను దయచేయుము. దేవా, మేము ఎల్లప్పుడు నీ యెదుట కృతజ్ఞత కలిగి ఆనందించునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీకును, మరియు పేదలకును, అక్కర్లల్లో ఉన్నవారికి ఇచ్చువారలనుగా మమ్మును మార్చుము. దేవా, నీ హృదయము మమ్మును బట్టి ఆనందించునట్లుగా మేము శ్రేష్టమైనది నీకు సమర్పించునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.