నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి పరమగీతము 2:4 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను'' అని తెలియజేయుచున్నది. నేడు దేవుడు తన విందుశాలకు మిమ్మును తీసుకొని రానై యున్నాడు. మనము ఒక వివాహ విందునకు వెళ్లియున్నప్పుడు, తల్లిదండ్రులు తన కుమార్తె లేక కుమారుని యొక్క వివాహమును వేడుకగా జరుపుకొనుచుండగా, మా అతిధులకు మంచి విందును వడ్డించాలి అని వారు అనుకుంటారు కదా. శ్రేష్టమైన బిర్యాని మరియు శ్రేష్టమైన తీపి పధార్థములు, ఇంకా శ్రేష్టమైనవి వివాహమునకు వచ్చువారికి వడ్డించాలని వారు అనుకుంటారు. అనేక సందర్భాలలో క్రొత్త క్రొత్త వంటకాలు అక్కడ మనకు కనబడుతుంటాయి. అక్కడ విభిన్నమైన తినుబండారాలు మనకు కనబడతాయి. వారు ఆ విందుకు వచ్చిన వారందరు కూడా ఆనందించాలని కోరుకుంటారు. కొన్నిసార్లు వంటవారు వచ్చి, ఏమని చెబుతారంటే, మేము మీ కుమార్తె లేక కుమారుని వివాహమునకు క్రొత్త ఉత్పత్తిని తీసుకొని వచ్చియున్నాము అని చెబుతారు. ఆ వివాహమునకు వచ్చినవారందరు కూడా ఇది శ్రేష్టమైన వివాహముగా ఉన్నది, మంచిగా భోజనము చేశాము అని చెప్పుకుంటారు. ఈ లోకపరమైన తల్లిదండ్రులు ఇతరుల ఆనందము కొరకై వారి పిల్లల వివాహము కొరకు అంతగా శ్రద్ధ వహించినవారిగా ఉన్నప్పుడు, అయితే, మీ పరలోకపు తండ్రి మరి ఇంక ఎంతగా శ్రద్ధ వహిస్తాడో చూడండి. మీరు యేసుప్రభువు వధువుగా అనుసంధానమై యున్నారు. అవును, మీరు ఆయనతో ఏకశరీరముగా ఉంచబడుటకై మీరు ఏర్పాటు చేయబడియున్నారు. కనుకనే, ఆయన తన ప్రేమ ధ్వజము ను ఆయన మీ మీదికి పైకి ఎత్తుతాడు. విందుశాలకు ఆయన మిమ్మును తీసుకొని వస్తాడు. ఇంకను, మీరు సమస్తమును విడిచిపెట్టి, 'ఒంటరిగా జీవించు' అని ఆయన మీతో చెప్పడు, ఆలాగుననే, 'నా నిమిత్తము శ్రమపడుతూ ఉండండి ' అని చెప్పడు. దానికి బదులుగా 'నా యొక్క విందుశాలకు రమ్మని' మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తాడు. నా ప్రియ స్నేహితులారా, అందుకు బదులుగా, ఆయన, ' నా యొక్క ప్రేమను ఆనందించు, నా ప్రేమను ఆనందించు ' అని చెబుతాడు.
నా ప్రియులారా, అయినప్పటికిని మనలను మనము ఉపేక్షించుకొని, ఆయన సిలువనెత్తుకొని ప్రతిదినము యేసును వెంబడించవలసి ఉంటుంది. మనము ఈ లోకానికి లేదు, కాదు అని చెప్పాలి. లోకములో ఉన్న దుష్ట సంబంధ బాంధవ్యాలకు లేదు మరియు కాదు అని మనము చెప్పగలగాలి. మనలను మనము పవిత్రులనుగా ఉంచుకొనగలగాలి. అయితే, అది శ్రమ కాదు, యేసు ప్రేమను కలిగియుండుట అదియే మనకు మార్గము. అది ప్రభువు యొద్ద నుండి విందుశాల అను ఆశీర్వాదమును ఆనందించునది. ప్రతి ఉదయమును ఆయన కృప వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నదని వాక్యము చెబుతుంది. మా యింటిలో ఉదయకాల అల్పాహారమునకు నేను వచ్చిన ప్రతిఫర్యాయమును, ఈ రోజు ప్రత్యేకమైన అల్పాహారము ఏమిటి అని అడుగుతాను. అందుకు నా భార్య ఈలాగున చెబుతుంది,'ఈ రోజు పూరీలు.' అందుక నేను చెబుతాను, 'పూరీ డే అంటే చాలా మహిమవంతమైన గ్లోరీ డే ' అని చెబుతాను. తదుపరి రోజు ఏమో ఇడ్లీ, ఆ తర్వాత రోజు దోసేలు, ఆ తదుపరి రోజు రోటీ, కొంతమందికి రోటీ ప్రతి రోజు కావాలి. ఆలాగుననే, దేవుడు మీకు ప్రతిరోజు అనుగ్రహిస్తాడు. అయితే, వాటితో పాటు కూడా మీరు నూతన కనికరమును కూడా పొందుకుంటారు. నిన్నటి దినము భోజనముతో ఆయన మిమ్మును పోషించడు. ఆయన కనికరము ప్రతి ఉదయమున నూతనముగా పుడుతుంది. ఎందుకనగా, అపవాది ప్రతిరోజు నూతనమైన దాడులను ఉత్పత్తి చేస్తుంటాడు. కనుకనే, మనము దానిని జయించి, నూతనమైన ఔన్నత్యముగల స్థానమునకు చేరుకోవడానికి దేవుడు కనికరమును కూడ విందువలె మన కొరకు ఉత్పతి చేయుచున్నాడు. కనుకనే, భయపడకండి, ప్రభువు మిమ్మును ప్రేమించుచున్నాడు. ఆయన విందును మీకు అనుగ్రహించుచున్నాడు. మీ హృదయమును కలవరపడనీయ్యకండి.
నా ప్రియులారా, ఒకవేళ, నేడు మీరు అరణ్యముగుండా నడుస్తున్నారేమో? ఎండిపోయిన స్థలముగుండా నడుస్తున్నారేమో? విందుకోసమే మీరు వేచియున్నారేమో? అయితే, ప్రభువు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, 'నా బిడ్డాలారా, మీరు అడిగినదానికంటె మీకు అధికముగా జరిగించుచున్నాను. మీకు అవసరమైన దానికంటె మీకు అధికముగా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. మీరు పట్టజాలనంతగా ఆశీర్వాదములను ఆకాశపు వాకిళ్లు తెరచి, మీ మీద కుమ్మరించెదను' అని చెబుతాడు. నా స్నేహితులారా, అట్టి ఆశీర్వాదములు ఇప్పుడే యేసు నామమున మీ మీదికి రావాలని నేను ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు మీకు అనుగ్రహించు ఆశీర్వాదములను బట్టి, మీరు ఎంతగానో నవ్వుతూ, నవ్వుతూ, ఉండిపోతారు. మీ జీవితములో ఇప్పుడే అది ఆరంభించాలని ఆజ్ఞాపించుచున్నాను. బైబిల్‌లో అబ్రాహాము మరియు శారా బిడ్డను ప్రసవించే వయస్సు దాటిపోయినప్పటికిని, తర్వాత దేవుడు వారికి బిడ్డను ఇచ్చినప్పుడు, వారు ఎంతగానో నవ్వియున్నారు. శారా నవ్వుతూ కనినందున, నవ్వు అను పేరుతో ఇస్సాకు అని పేరు పెట్టి పిలిచారు. అవును, నా ప్రియులారా, నేడు మీరు ఇటువంటి ఆశీర్వాదములను కలిగి ఉంటారు. ప్రత్యేకంగా మీ శత్రువుల యెదుట ఆయన మీకు విందు భోజనపు బల్లను సిద్ధము చేస్తాడు. అపవాది యెదుటను మరియు దుష్టప్రజల యెదుటను, ఇంకను మిమ్మును తప్పుపట్టి, మీ యెదుట నుండి సమస్తమును లాగివేసుకున్న చెడ్డప్రజల యెదుటను కూడా, దేవుడు మీకు విందును అనుగ్రహించును. దేవుడు మీరు ఆ విందును ఆనందించునట్లుగా చేస్తాడు. దేవుడు తన విందు చేత మిమ్మును ఘనపరుస్తాడు. యేసు నామమున మీ యొద్దకు అది ఇప్పుడే రావాలని ఆజ్ఞాపించుచున్నాను. అది మీ యొద్దకు సమృద్ధిగా అధికముగా కలిగియుందురు గాక. మీకు కూడా ఇలాగున జరుగును గాక. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. విన్‌స్టన్ జేమ్స్ డానియల్ గురించి మీతో చెప్పాలని కోరుచున్నాను. అతని తండ్రిగారు కారుణ్యలో పూర్వపు విద్యార్ధి. కనుకనే, తన కుమారుని కారుణ్యలో విధ్యార్థిగా అతడు చేర్పించాడు. విన్‌స్టన్ కారుణ్యలో బి.టెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని చదువుచున్నాడు. మేము నడిపించుచున్న కారుణ్య విశ్వవిద్యాలమునకు అతడు రాగానే, దేవుడు అతనికి జీవితములో సానూకూల దృక్పథాన్ని అనుగ్రహించాడు. కానీ, అక్కడ అధ్యాయపక బృందమంతటి నుండి గొప్ప సహకారాన్ని అతడు అనుభూతిని చెందాడు. కారుణ్య వ్యవస్థ నిజమైన లోకాన్ని ఎదుర్కొని పైకి లేవనెత్తబడునట్లుగా అతనికి సహకరించినది. అతడు ప్రభువైన యేసుతో అనుసంధానమైయ్యాడు. దేవుని సన్నిధిలో సమయమును గడుపుతున్నాడు. దేవుడు తన కోసము పోరాడతాడు అని నేర్చుకున్నాడు. అతడు ఆయన చిత్త ప్రకారము జీవించుచు ఆయనలో విశ్రమించుచుండగా, దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అతని చివరి సంవత్సరములో ఉండగానే, క్యాంపస్‌లో సాబ్రరీ కార్పొరేషన్‌లో అతనికి ఉద్యోగము వచ్చినది. అతనికి సంవత్సరమునకు 13.5 లక్షల రూపాయల జీతము ఇచ్చే ఉద్యోగము అతనికి వచ్చినది. అతడు తనలో దేవుని వెలుగును కలిగియుండి బయటకు వెళ్లాడు. నా ప్రియ స్నేహితులారా, నేడు దేవుడు మీకు అటువంటి ఆశీర్వాదమును అనుగ్రహించును గాక. ఎందుకంటే, ఆయనకు మీ పట్ల ప్రేమను బట్టి, ఆయన మీకు ఈ విందును అనుగ్రహించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రియమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాఉ. దేవా, మమ్మును నీ విందు స్థలానికి తీసుకువచ్చి, మా మీద నీ ప్రేమ ధ్వజమునుఉంచినందుకు వందనాలు. ప్రభువా, మా అరణ్యంలో మరియు అలసటలో, నీ నూతన వాత్సల్యమును, ఆనందం మరియు సమృద్ధితో నిండిన భోజనపు బల్లను నీవు సిద్ధం చేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు దాచిపెట్టే దేవుడు కాదు, కానీ మేము అడగగలిగే లేదా ఊహించగల దానికంటే అత్యధికంగా మా ఆశీర్వాదాలలో ఆనందించే తండ్రివి గనుగనే, మేము ఎండిన మరియు ఒంటరి మార్గాల్లో నడుస్తున్నప్పుడు కూడా, మా శత్రువుల సమక్షంలో కూడా నీవు మా ముందు విందును సిద్ధం చేయగలవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ ప్రేమలో విశ్రాంతి తీసుకోవడానికి, నీ వాగ్దానాలలో ఆనందించడానికి మరియు నీ కృప యొక్క సంపూర్ణతను పొందడానికి మాకు సహాయం చేయుము. తండ్రీ, నీ యొక్క ప్రతి ఆశీర్వాదము మా యొద్దకు వచ్చునట్లుగా చేయుము. దేవా, మాకు విందును అనుగ్రహించుము, మాకు పట్టజాలని ఆశీర్వాదమును కలుగజేయుము. ప్రభువా, మేము నీ ప్రణాళికకు మమ్మును అప్పగించుకొనుచున్నాము, దేవా,ఈ రోజు మా జీవితంలో నీ దయ, ఘనత మరియు నవ్వుల విందు ప్రారంభమగునట్లుగా చేయుమని యేసు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.