నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 11:30 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు'' అని లేఖనము సెలవిచ్చుచున్నది. కనుకనే, జ్ఞానముగలవారు ఇతరుల నిత్యత్వము కొరకు వారిని రక్షించెదరు. ఆత్మల రక్షణ కొరకు పని చేయువారు అంటే, ప్రభువునకు ఎంతో ఇష్టము. అందుకే బైబిల్‌లో, "బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతి మార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు'' అని చెప్పబడినట్లుగానే, ఆత్మలను రక్షించువారు ఎంతగానో ప్రార్థన పరులై యుండాలని చార్లెస్ స్పర్జన్ తెలియజేసియున్నాడు. ఒక ఆత్మను రక్షించుటకు ముందుగా మనము క్రీస్తును పొందుకొనువారమై యుండాలి. క్రీస్తును మనము ఎలా పొందుకొనగలుగుతాము? అనుదినము ప్రార్థనకు ఒక నియమాక సమయమును మనము కలిగియుండునప్పుడు, ప్రభువు మన యందు ఎంతగానో సంతోషిస్తాడు. మొదటిగా మనము సత్యమునందు జీవించువారమై ఉండాలి. ఇంకను మీ కొరకు మీరు పనిచేయడము లేదు కానీ, ప్రభువు కొరకు పని చేయుచున్నారు అని మీరు జ్ఞాపకముంచుకొనవలెను. ప్రభువు లేకుండా మీరు ఏదియు కూడా చేయజాలరు.
మన ఆత్మీయ తండ్రియైనటువంటి సహోదరులు డి.జి.యస్ దినకరన్‌గారు ఎప్పుడు నాతో ఈలాగున చెబుతూ ఉంటారు, 'ఇవాంజెలిన్, పరిచర్య చేడానికి వెళ్లుటకు ముందుగా ప్రార్థన చేయకుండా, ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు. వీలైనట్లయితే, నీవు ఉపవాసము ఉండి ప్రార్థన చేయాలి' అని చెబుతారు. అది నేను ఈ రోజుకు కూడా పాటించుచున్నాను. ప్రియులారా, మనము కూడా ఆలాగున చేసినప్పుడు, ఇతరులకు మనము దీవెనకరముగా ఉంటాము. ఉదారణంగా, 'ఖాళీ పాత్రలు ఎక్కువగా శబ్ధము చేస్తాయి' అని ఒక సామెత కలదు. ప్రార్థనలు లేకుండా, మనము ఎన్ని వాక్యాలు చెప్పినా ఊరకనే కొన్ని మాటలు మనము అరిచినట్లుగా ఉంటుంది. కానీ, ప్రార్థనతో మనము అనేక ఆత్మలను రక్షించగలుగుతాము. అందుకే బైబిల్ గ్రంథములో ఈలాగున చెప్పబడియున్నది, "నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము '' అని తెలియజేయుచున్నది. కనుకనే, ధారాళముగా ఇతరులకు ఇవ్వండి, ఇతరులకు పోషణ కలుగజేయువారు, వారు కూడా పోషింపబడతారు. ఇతరుల యొద్ద పుచ్చుకొనుట కంటె, వారికి ఇచ్చుట ఎంతో శ్రేష్టము అని యేసయ్య సెలవిచ్చియున్నాడు. కనుకనే, నేటి నుండి మీరు ఇచ్చుటకు నేర్చుకొన్నప్పుడు, దేవుడు మిమ్మును దీవిస్తాడు.
నా ప్రియులారా, ఒకడు ధారాళముగా ఇచ్చువాడు ఎంతగానో అభివృద్ధి పొందుకుంటాడు. మరియొకడు తన చేతిని బిగబట్టి, లేమిని కలిగి ఉంటాడు. కనుకనే, మనము మంచి చేయుటలో ఎంత మాత్రము విసిగిపోకూడదు. ఎల్లప్పుడు మనము మంచిని చేస్తూనే ఉండాలి. అప్పుడు సరైన సమయములో మీరు పంటను నిశ్చయముగా కోసెదరు. కనుకనే, మీరు విడిచిపెట్టకండి స్నేహితులారా, మంచి కార్యములను చేయడము కొనసాగించండి. అందుకే బైబిల్‌లో, "నీతిమంతులు ఇచ్చు ఫలము జీవ వృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు'' అని తెలియజేయుచున్నది. ఇంకను యాకోబు 5:20వ వచనమును చదివినట్లయితే, " పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను'' ప్రకారము అతడు చేసిన అనేక పాపములు కప్పివేయును. ప్రియ స్నేహితులారా, ప్రభువు కొరకు పనిచేయుటకు కొనసాగిస్తూ ఉండండి. నిత్యజీవము కొరకై అనేక ఆత్మలను సమకూర్చినప్పుడు ప్రభువు మిమ్మును జీవవృక్షమువలెను, ఫలించు వృక్షమువలె మిమ్మును చేయును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ కొరకు నిలబడడానికి మేము ఎంతో బలహీనంగా ఉన్నాము, కనుకనే మా బలహీనత యందు నీ బలము సంపూర్ణమగునట్లు చేయుము. దేవా, మేము జీవవృక్షము వలెమారునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. యేసయ్యా, నీవు ఈ లోకములోనికి సమృద్ధిగల జీవమును ఇవ్వడాని కొరకై వచ్చియున్నావు, కనుకనే, మాలో ఉన్న బలహీనతను తొలగించి, నీ యొక్క సమృద్ధియై జీవమును మాకు అనుగ్రహించుము. యేసయ్యా, నీ జీవము మా మీద సంపూర్ణమైన రీతిలో దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, ఇతరులకు జీవ వృక్షములను ఇవ్వడానికి మమ్మును పిలిచినందుకు నీకు వందనాలు. దేవా, నీ రాజ్యానికి అనేక ఆత్మలను నడిపించగలిగేలా నీతిలోను మరియు జ్ఞానంలో నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, ప్రార్థనలో నమ్మకంగా, నీ సత్యంలో పాతుకుపోయి, ప్రేమలో సమృద్ధిగా ఉండటానికి మాకు నేర్పుము. దేవా, మా జీవితం ఇతరులను ఉత్తేజపరచునట్లుగాను మరియు నిన్ను మహిమపరచునట్లుగా ఉండుటకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితంలో నీవు తగిన కాలంలో పంటను తీసుకొని వస్తావని మేము గుర్తెరిగి, మేలు చేయడంలో ఎప్పుడూ అలసిపోకుండా, నిరీక్షణతో ముందుకు సాగడానికి మమ్మును బలపరచుము. ప్రభువా, మమ్మును నీ నామాన్ని గొప్పగా చేయు ఫలవంతమైన జీవవృక్షముగా మార్చుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.