నా ప్రశస్తమైన స్నేహితులారా, నేడు బైబిల్ నుండి ప్రభువు వాగ్దానముతో మీకు శుభములు తెలియజేయుటలో నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఆ వాగ్దాన వచనము ఇలాగున చెబుతుంది, "నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు'' (సామెతలు 23:18). ప్రకారం దేవుడు మిమ్మును నిశ్చయముగా ఆశీర్వాదిస్తాడు. ఇది ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దాన వచనమై ఉన్నది. కాబట్టి, చింతించకండి. నిశ్చయముగా మీకు ముందుగతి రానే వస్తుంది.
నా ప్రియులారా, నేడు మీరు సుదీర్ఘకాలముగా ఆశీర్వాదములు మీ యొద్దకు వచ్చు నిమిత్తము వేచియున్నారేమో? మీరు ప్రార్థన చేయుచున్నారు, మీరు విశ్వసించుచున్నారు, మీరు దశమభాగముగా కానుకలు సమర్పించుచుండవచ్చును, మీరు ఇతరుల నిమిత్తము ప్రార్థిస్తుండవచ్చును, మీరు బీదలైన వారి కొరకు సహాయము చేయుచుండవచ్చును. యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా మరియు సీషా పరిచర్య నిమిత్తము కానుకలు సమర్పించుట ద్వారా ఒకవేళ మీరు ప్రజల నిమిత్తమై సేవను కొనసాగించుచుండవచ్చును. మాతో కలిసి ప్రార్థనా గోపురములో ఇతరుల కొరకై ప్రార్థన చేయుట ద్వారా, సేవా పరిచర్యలో మీరు పొందియున్న అద్భుత కార్యములను సాక్ష్యములుగా పంచుకొనుట ద్వారా లేదా మీరు కలిగియున్న సర్వస్వాన్ని ప్రభువు సేవలో సమర్పించుచుండవచ్చును.
అయినప్పటికిని, నా ప్రియులారా, ఇంకను మీలో కొందరి ప్రార్థనా విన్నపములకు జవాబు రాలేదని మీరు తలంచుచుండవచ్చును. కానీ, ఈ రోజు అటువంటి మిమ్మును చూచి ప్రభువు సెలవిచ్చుచున్నాడు, 'మీ నిరీక్షణ భంగము కానేరదు. మీ కొరకు నేను కలిగియున్న ప్రణాళికలను నేను ఎరుగుదును, మీకు మేలును మరియు నిరీక్షణను కలిగించు ప్రణాళికలు మాత్రమే. మీకు కీడు చేయునవి కావు. మీకు భవిష్యత్తును మరియు నిరీక్షణను కలిగించునవి మాత్రమే. ' కనుకనే, మీరు భయపడకండి.
నా ప్రియులారా, నేడు మీరు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తుండవచ్చును. కనుకనే, ఇట్టి ఆశీర్వాదము మీ భవిష్యత్తు మీద ప్రకటించుట కొరకు మాత్రమే, నేను ఈ రోజున మీతో కలిసి ప్రార్థన చేయగోరుచున్నాను. పరిశుద్ధాత్ముడు, ఇప్పుడే మీ జీవితములో సమస్తమును పరిపూర్ణము చేయునట్లుగా మీ మీదికి వచ్చుచున్నాడు. మీ కుటుంబములో సమస్తమును పరిపూర్ణము చేయుటకు, మీ యొక్క మనస్సులో సమస్తమును పరిపూర్ణము చేయుట కొరకు, మీ ఆత్మలోను, మీ జీవితములోను, మీ యొక్క బాంధవ్యములలోను, ఇప్పుడే మీ జీవితములో ఇట్టి అద్భుతము జరుగుతుందన్న విశ్వాసము కలిగినవారై ఉండునట్లుగా ప్రార్థన చేయుదమా? అవును, మీ ఆశ భంగము కానేరదు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా మీకు నిశ్చయముగా, ముందుగతి రానే వస్తుంది, మీ ఆశ భంగము కాకుండునట్లుగా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ వాగ్దానానికి సంపూర్ణమైన విశ్వాసం మరియు కృతజ్ఞతతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, మా ఆశ భంగము కానేరదని నీవు మా పట్ల వాగ్దానము చేసినందుకై నీకు వందనాలు. దేవా, మా జవాబును పొందలేని ప్రతి ప్రార్థన విన్నపమును నీ ప్రేమగల చేతులలోనికి అప్పగించుచున్నాము. ప్రభువా, మమ్మును మరియు మా కుటుంబాన్ని, మా సంబంధాలను మరియు మా జీవితాంతమును గురించిన సమస్తమును నీవు పరిపూర్ణం చేయగలవని మేము నమ్ముచున్నాము. దేవా, దయచేసి మమ్మును నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము మరియు మా మేలు కొరకు మాత్రమే ఉద్దేశించిన నీ ఉన్నత ప్రణాళికలను విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా చేతుల పనిని మరియు మా సేవను నీకు సంపూర్ణముగా సమర్పించుచున్నాము, నిశ్చయముగా నీవు మా చేతి పనిని మరియు మా సేవాపరిచర్యను ఆశీర్వదించుము. దేవా, నీ యొక్క అద్భుతాలు మా జీవితంలోనికి ప్రవహించునట్లు చేయుము. యేసయ్యా, నీ యొక్క శక్తివంతమైన నామంలో, మేము నీలో ఉన్న సమృద్ధియైన ఆశీర్వాదాలను కోరుచుచున్నాము మరియు పొందుకొనగలమని మేము నమ్ముచున్నాము. దేవా, నీ యందు మేము కలిగియున్న మా నిరీక్షణ భంగము కానేరదని మేము నమ్ముచూ, సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.