నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు అద్భుత కార్యములు జరుగు దినము. ఎందుకనగా, ఆయన అద్భుతములను జరిగించుచున్నాడు. ఆయన అద్భుతాల ద్వారా మనతో మాట్లాడతాడు, తన శక్తిని మరియు ప్రేమను మన పట్ల బయలుపరుస్తాడు. ప్రత్యేకంగా, ఈ రోజు యేసు పిలుచుచున్నాడు పరిచర్య లో ప్రార్థనా అకాడమీ, ప్రార్థన శిక్షణ తరగతులను ప్రారంభించిన దినము. నేడు ఇది 9వ వార్షికోత్సవమును జరుపుకొనుచున్నది. అనేకమంది ప్రభువును తెలుసుకొనుటకు ఈ పరిచర్యలో శిక్షణను పొందియున్నారు. ఇంకను అనేకమంది ఇతరులకు శిక్షణను ఇచ్చుటకు లేవనెత్తబడియున్నారు. కనుకనే, నిరంతరాయంగా ఈ పరిచర్య నిమిత్తము ప్రార్థించండి. దేవునికే మహిమ కలుగును గాక. 

నా ప్రియులారా, నేటి దినమున వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 31:14 నుండి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ వచనము, ‘‘...నా జనులు నా ఉపకారములను తెలిసికొని తృప్తినొందుదురు.’’ అవును, నా ప్రియులారా, దేవుడు మనలను దీవించినప్పుడు, మనము వాటిని చేపట్టుకొనజాలము. తన ప్రజలను ఏలాగున దీవించవలెనో, దేవునికి ఎవరు కూడా చెప్పనవసరము లేదు. ఇంకను ఎప్పుడు తన ప్రజలను దీవించవలెనో, ఆయనకు ఎవరు సూచించనవసరము లేదు. ఎందుకనగా, ప్రభువు తన ప్రజలను గురించి జాగ్రత్త వహించుటకు యెరిగియున్నాడు. ఆయన వారిని ఆశీర్వదించినప్పుడు, వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని వాక్యము తెలియజేయుచున్నది. మీరు ఇంతకాలము వేచియున్నారు కనుకనే, ఆశీర్వదింపబడు సమయము ఖచ్చితముగా మీ యొద్దకు వస్తుంది. ఆయన మిమ్మును సమృద్ధియైన ఆశీర్వాదములతో నేడు నింపుచున్నాడు. మీరు వేచియున్నదానికి ఆయన మీకు తప్పకుండా ప్రతిఫలమును అనుగ్రహించుచున్నాడు. కనుకనే, మీ జీవితము, ఆలాగుననే మీ హృదయము మరియు ఆత్మ సంపూర్ణముగా దేవుని మేలులతో నింపబడి ఉంటుంది. మీరు ఇక దేని కొరకు ఎదురు చూస్తు వేచి ఉండనవసరము లేదు. ఆ రీతిగా మా జీవితాలలో మాకు అనుభూతి కలిగిస్తుంది. దేవుడు అత్యంత సమృద్ధిగా మమ్మును ఆశీర్వదించాడు అని మేము ఎల్లప్పుడు తృప్తి కలిగియుంటాము. ఇంకను ప్రభువును మేము ఏమి అడగాలి? ఆ రీతిగా దేవుని ఆశీర్వాదము మన మీదికి వస్తుంది. ఆలాగుననే, ఒక బావిగా దగ్గర ఉన్న స్త్రీతో ఆయన ఈలాగున చెప్పాడు, ‘‘ఇదిగో,  అమ్మా, ఈ యొక్క భూమి మీద నీటి కొరకై దాహము కలిగి నీవు ఎదురు చూస్తున్నట్లయితే, నీవు నిరంతరాయంగా దప్పికను కలిగి ఉంటావు. కానీ, యేసు, నా యందు విశ్వాసముంచు వాడెవడును ఇక మీదట ఎన్నటికిని దప్పికగొనడు. జీవజలముల ఊటలను వానికి ఇచ్చెదను అని సెలవిచ్చియున్నాడు.’’ అటువంటి సంతృప్తి మన జీవితములోనికి నేడు దిగివస్తుంది. మన జీవితాలలో ఇక మీదట దేని కొరకు కూడా అత్యాశను కలిగి ఉండము. 

ఇటువంటి సమృద్ధియైన ఆశీర్వాదమును పొందుకొని యున్న గోలోతజమ్ అను ఒక సహోదరుని యొక్క సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. అతని తండ్రి చనిపోయాడు. అతడు చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. తన తల్లి అతనిని పెంచడానికి ఎంతగానో బాధపడినది. అటువంటి సమయములో తన పొరుగువారి యింటిలో యేసు పిలుచుచున్నాడు మాస పత్రిక కనుగొని దానిని చదివారు. ప్రభువును గురించి తెలుసుకున్నాడు. ప్రభువును గట్టిగా పట్టుకున్నాడు. అతడు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో యౌవన భాగస్థుడుగా చేరాడు. ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువును తనతో కూడా మోయుచున్నాడు. ఎటువంటి పరిస్థితులలో కూడా మా తండ్రి డాక్టర్. పాల్ దినకరన్‌గారికి ఉత్తరములు వ్రాయుచుండేవారు. అతనికి చాలా గొప్ప ఎదురు చూపు ఉండేది. తన పాఠశాలలో తన తరగతిలో తనకు 76 శాతము మార్కులు ఉన్నతంగా పొందుకున్నాడు. అదియే రికార్డుగా ఉన్నది. అయితే, అతడు దానిని దాటి వెళ్లాలనుకున్నాడు. అతడు ప్రభువుకు ప్రార్థించాడు. పరీక్షలు వ్రాశాడు. మహా అద్భుతమైన రీతిలో 77 శాతము మార్కులను పొందుకున్నాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. తన డిగ్రీని పూర్తి చేసుకొనునట్లుగా చేశాడు. దేవుడు అద్భుతమైన ప్రభుత్వ ఉద్యోగముతో ఆశీర్వదించాడు. అతడు ఆ ఉద్యోగములో కూడా ఆ రీతిగా పని చేశాడు. దేవుడు అతనిని మాస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేయుటకు కృపను చూపాడు. అతడు ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా, అతడు ప్రార్థనా గోపురమునకు వెళ్లాడు, అక్కడ ప్రార్థనా యోధులు ఈ విధంగా ప్రార్థించి, ఈలాగున ప్రవచించారు, దేవుడు మీకు అనుకూల జీవిత భాగస్వామిని దయచేస్తాడు, అత్యంత సమృద్ధిగా దీవిస్తాడని ప్రవచించారు. ఆ సంవత్సరములోనే అతనికి అద్భుతంగా వివాహము జరిగింది. దేవుడు అతనికి నలుగురు బిడ్డలను అనుగ్రహించాడు. వారందరు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో యౌవన భాగస్థుల పధకములోను మరియు కుటుంబ ఆశీర్వాద పధకములో భాగస్థులుగా చేర్చబడ్డారు. ఈ రోజు అతడు, నాకు 40 సంవత్సరముల వయస్సు, ఇంకను దేవుడు ఒక పాఠశాలకు ప్రాధానోపాధ్యాయుని స్థాయికి నన్ను హెచ్చించాడు అని అతడు తెలియజేశాడు. ఇప్పుడు నా క్రింద 50 పాఠశాలలు ఉన్నాయని తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో ఈలాగున జరిగిన ఒక గొప్ప అద్భుతం. 

అవును, నా ప్రియులారా, దేవుడు మిమ్మును కూడా నేడు ఉన్నత స్థానమునకు పైకి లేవనెత్తుతాడు. మీ జీవితము అధిక సమృద్ధితోను, ఉపకారములతో నింపుతాడు. అదియుగాక, ఎన్నటికి దాహము గొనకుండా, జీవజలములతోను మరియు ఏ మేలు కొదువ కాకుండా, సమృద్ధితో మిమ్మును నింపుతాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఇప్పుడే మా జీవితములో నీ ఉపకారములను మేము పొందుకొనునట్లుగా చేయుము. మేము వృద్ధి పొందునట్లుగా చేయుము. దేవా, మాకు ఏ మేలు కొదువ లేకుండా చేయుము, మంచి తనము మా జీవితములోనికి, పరిచర్యలోనికి, దేహములోనికి, భవిష్యత్తులోనికి, కుటుంబములోనికి వర్థిల్లుతను పొందుకొనునట్లు చేయుము. ప్రభువా, నీ ఉపకారములను మంచి రుూవులతో మా హృదయములను నీవు తృప్తిపరచినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీ సమృద్ధియైన ఆశీర్వాదాలకు మరియు అపరిమితమైన ప్రేమకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు సమస్త మేలులను  అనుగ్రహించువాడవు మరియు మేము నీ పరిపూర్ణ సమయమును నమ్ముచున్నాము. యేసయ్యా, నీవు మా పట్ల వాగ్దానం చేసినట్లుగానే, మా హృద యాన్ని మరియు జీవితాన్ని నీ అనుగ్రహంతో నింపుము. దేవా, మాకు ఏ మంచి విషయంలోనూ లోటు రాదని నమ్ముతూ, విశ్వాసంతో నీ కొరకు వేచి ఉండటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము మరల న్నడును దప్పికగొనకుండా మా ఆత్మను నీవు ఇచ్చు జీవజలంతో సంతృప్తిపరచుము. దేవా, ఈ లోకసంబంధమైన విషయాల కొరకు ఆశగల ప్రతి జాడను తొలగించి, మమ్మును నీలో సంతృప్తిపరచుము. దేవా, మా జీవితం నీ మంచి తనంతో పొంగిపొర్లునట్లుగా చేయుము. మరియు నీ కృపకు సాక్ష్యంగా మేము జీవించునట్లుగా చేయుము. యేసయ్యా, మా జీవితాన్ని నీ చేతులలోనికి అప్పగించుచున్నాము, ఎందుకంటే, మా ఆశీర్వాదాలు దారిలో ఉన్నాయని మాకు తెలుసు కనుకనే, నేడే మా జీవితములో అద్భుతాలను అనుభవించే అనుభూతిని పొందుకొనునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఘనతగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.