నా ప్రియ స్నేహితులారా, ఈ దినము నిరీక్షణ కలిగిన దినముగా ఉన్నది. కనుకనే, మన పట్ల దేవుడు నూతనమైన కార్యములను జరిగిస్తాడన్న నిరీక్షణను ఈ దినమున కలిగియుండండి. మనము దాని ద్వారా జీవించెదము. ఈ రోజున వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 78:53వ వచనము ప్రకారం దేవుడు మనలను నడిపించే అనుభవము ద్వారా మనలను జీవింపజేయుచున్నాడని చెప్పబడియున్నది. ఆ వచనము, "వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచి వేసెను'' ప్రకారం నేడు దేవుడు మనము కూడా భయపడకుండా, మనలను కూడా సురక్షితంగా నడిపించాలని మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, భయపడకండి.
ఇశ్రాయేలీయుల ప్రజలు ఏ విధంగా ఎర్ర సముద్రము యెదుట నడిపంచబడ్డారో ఈ లేఖనము మనకు తెలియజేయుచున్నది. ఈ వచనం ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం యెదుట నిలబడి, ఎటువంటి మార్గం లేకుండా చిక్కుకున్నట్లుగా చెప్పబడియున్నది. వారు దానిని దాటి వెళ్లలేక చుట్టబడి, పట్టబడియున్నట్లుగా అనిపించినది. మరి యొక వైపున వారి శత్రువులు వారిని నాశనము చేయుటకు వస్తున్నారు. కనుకనే వారు ముందుకు వెళ్లడానికి ఎర్ర సముద్రము ఒక పెద్ద ఆటంకముగా ఉండెను. ఆ రీతిగా నేడు మీ యెదురుగా ఏ మార్గము లేకుండా అనేక పెద్ద ఆటంకములు ఉన్నట్లుగా మీకు కనిపిస్తుండవచ్చును. 'నేను ముందుకు వెళ్లడానికి మార్గమే లేదు' అని మీరనుకోవచ్చును. కానీ, దేవుడు ఇక్కడ ఏమి చేస్తున్నాడో చూడండి. ఆయన దాటిపోజాలలేని ఆ యొక్క మార్గమును ఆయన వారి కొరకు అద్భుతమైన రీతిలో తెరువజేయుచున్నాడు. ఆయన దాటలేని ఆ మార్గాన్ని అద్భుతంగా తెరిచి, 'ఈ మార్గము గుండా వెళ్ళు' అని చెబుతాడు.
నా ప్రియులారా, దేవుడు మన గొప్ప సవాళ్లగల చోటకు మనలను నడిపిస్తాడు, తద్వారా ఆయన ఒక అద్భుతం చేయగలడు. అవును, మూయబడిన మార్గము మహా అద్భుతంగా మీ కొరకు తెరువబడుతుంది. అసాధ్యమైన మార్గము తెరువబడుతుంది. ఇశ్రాయేలీయులకు ఆటంకముగా ఉన్న ఎర్ర సముద్రం వారి యెదుట అద్భుత మార్గంగా మారింది. అందుకు ఆయన స్వయంగా ఎర్ర సముద్రము వైపున వారిని నడిపించాడు. వారి శత్రువులకు, అది నాశన స్థలముగా మారింది. వారు ఇశ్రాయేలీయులను సముద్రంలోకి వెంబడించగా, నీళ్ళు మూయవేయబడి, వారిని ముంచెత్తాయి. ఒకవేళ మీరు కూడా ఆటంకాల మధ్యలో నడుస్తున్నారేమో? ఇటువంటి ఆటంకము వైపు దేవుడు ఎందుకు నడిపించాడని మీరు అనుకోవచ్చును, దేవుడు ఎందుకు నన్ను ఆలాగున నడిపించాడని మీరు చెప్పవచ్చును. ఇదిగో ఇందు కోసమే. కనుకనే, మహా అద్భుతంగా ఆ ఆటంకమును తెరువజేయు నిమిత్తమే. అంతమాత్రమే కాదు, శత్రువు అదే ఎర్ర సముద్రము గుండా, మిమ్మును వెంటాడడము కోసము, సముద్రము మీ కొరకే అని మూయబడుతుంది. సముద్రములాంటి ఆటంకాలను మ్రింగివేయునట్లు దేవుడు చేస్తాడు. అది మీరు ముందుకు వెళ్లడానికి తెరువజేయుచున్న ది. అది మీ శత్రువుల కొరకు అయితే, వినాశనకరముగా ఉంటుంది.
ఆ విధంగానే, బైబిల్ నుండి ఉదాహరణ హామాను మరియు మొర్దెకై గురించి జరిగిన సంఘటన చూద్దాం. పర్సియా సామాజ్య్రములో హామాను అనే వ్యక్తి, చాలా గొప్ప అధికారి. ఇంకను దుష్టుడైన వాడుగా ఉండెను. ప్రజలను చంపడము కోసమై ఉరి తీయ్యబడుట అనే శిక్షావిధిని అక్కడ ఏర్పాటు చేసియున్నాడు. ప్రజలు అక్కడ ఉరి తీయబడి, చంపబడేవారు. తాను ద్వేషించిన మొర్దకై అను వ్యక్తిని చంపడము కొరకు ప్రత్యేకంగా ఈ చట్టమును ఏర్పరచాడు. అయితే ఏమి జరిగింది? దేవుడు మొర్దకైని భద్రపరచి యున్నాడు. దేవుడు మొర్దకైని హెచ్చించియున్నాడు. హామాను ఏదైన సృష్టించాడో, దేవుడు తాను సృష్టించిన ఉరికంబము మీద తాను వ్రేలాయదీయ్యబడి, ఉరి తీయ్యబడి చంపబడ్డాడు. హామాను స్వయంగా సంసిద్ధము చేసిన, ఉరి కంబము మీదనే హామానుకు దేవుడు శిక్షవేసాడు. ఆలాగుననే, నా ప్రియులారా, దుష్టులు తమ స్వంత కుయుక్తి పన్నాగముల మీదనే శిక్ష పొందుకుంటారు. కానీ, మీరైతే, ముందుకు వెళ్లడాని కొరకు మీకు ఆటంకముగా ఉన్న మార్గములు అద్భుత విధంగా తెరువబడుట మాత్రమే కాదు, మీరు హెచ్చించబడతారు. నేడు మనము ఈ ఆశీర్వాదమును స్వీకరించుదామా?నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ ఆటంకములను తొలగించి, మీ శత్రువులను నాశనము చేసి, మిమ్మును ఘనపరచును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నూతన ప్రారంభానికి దేవుడిగా ఉన్నందుకు వందనాలు. ప్రభువా, ఈ రోజు, మార్గం లేదని అనిపించే చోట నీవు మా కొరకు ఒక మార్గాన్ని తయారు చేస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు ఇశ్రాయేలీయుల కొరకు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినట్లుగానే, నేడు మా సవాళ్లను అధిగమించి మమ్మును సురక్షితంగా నడిపించుము. ప్రభువా, మా యెదుట ఉన్న ఆటంకములను అధిగమించడానికి మరియు ప్రతి అవరోధాన్ని అద్భుత మార్గాలుగా మార్చడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా పట్ల దుష్టుల పన్నాగములను వారిపైకి తిప్పి, నీ బలమైన హస్తంతో మమ్మును రక్షించుము. ప్రభువా, నీవు మొర్దెకైని గౌరవించినట్లుగానే, నీ సమయములో మరియు నీ మహిమ కొరకు మమ్మును హెచ్చించుము. దేవా, మమ్మును విజయమార్గములోనికి నడిపించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.