నా అమూల్యమైన స్నేహితులారా, నేడు దేవుని వాగ్దానమేదనగా, "అందుకు వారు యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయ దేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నదనిరి'' (మత్తయి 2:5). ఈ వచనములో ఇది చిన్న గ్రామమైన బేత్లెహేమును గురించి వ్రాయబడియున్నది. యేసు అక్కడ జన్మించియున్నాడు. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. అట్టి గ్రామము నుండి ఆయన ప్రకాశించుటకు ప్రారంభించాడు. ఈ రోజున మీరు దేవునికి బేత్లెహేమై యున్నారు. మీలో నుండి పరిపాలన విధానము బయలు వెడలునై యున్నదని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఈ లోక ప్రజలకు మీరు కాపరిగా ఉండి, పరిపాలనము చేసి, వారిని దేవుని బిడ్డలుగా దేవుని చెంతకు తీసుకొని రానై యున్నాడు. నేడు దేవుడు మిమ్మును పరిపాలన అధికారిగాను మరియు కాపరిగా ఉంచాలనియు మీ పట్ల కోరుచున్నాడు. ఈ రోజున మీరు అటువంటి వ్యక్తులుగా మీరు తయారు చేయబడు నిమిత్తమై, మీ జీవితాలను యేసు హస్తాలకు అప్పగిస్తారా? ఆలాగున చేసినట్లయితే, మీరు అల్పమైనవారు కారు.
అవును, బైబిల్‌లో 2 కొరింథీయులకు 3:18లో ఈలాగున చెప్పబడియున్నది, పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు, ఆయన మిమ్మును పరిశుద్ధాత్మలోనికి రూపాంతరపరుస్తాడు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మరియు ఆయన స్వరూప్యమును కలిగి ఉంటారు. యేసు పరిపాలకుడు అయ్యి ఉన్నాడు. ఆయన మరణము మీదను, పాపము మీదను, లోకపరమైన శాపము మీదను అధికారము కలిగియున్నాడు. దురాత్మ శక్తుల మీదను, చెడ్డ ప్రజల మీదను ఆధిపత్యమును కలిగినవాడై యున్నాడు. మరియొక వైపున సహాయమును కోరి, తన యొద్దకు వచ్చేవారికి జాగ్రత్త వహించే కాపరిగా ఉన్నాడు. ఆయన బిడ్డల కొరకు జాగ్రత్త వహించాడు. యౌవన బిడ్డలను ప్రేమించాడు. రోగులను స్వస్థపరచాడు, పాపులను ఆయన క్షమించాడు, చనిపోయినవారిని తిరిగి లేపాడు. ఆకలి గొనియున్నవారికి ఆహారమును అనుగ్రహించాడు. తన శిష్యుల కొరకు పోరాడి వారికి విడుదలను అనుగ్రహించాడు. జీవమార్గమునకు కావలసిన వారికి ఆయన బోధించియున్నాడు. మనమందరము జీవించగలుగునట్లుగా, సరైన సమయమునకు ఆయన తన ప్రాణమును పెట్టియున్నాడు. ప్రజలందరికి ఆయన కాపరిగా ఉన్నాడు, అవును, ఆయన మనకు దేవుడు. అదే సమయములో ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. నేడు మిమ్మును కూడా అటువంటి వారినిగా చేయగోరుచున్నాడు.
ముత్తుకిృష్ణన్‌ను గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇక్కడ చెప్పబడియున్నది. ఆ సహోదరి యొక్క తండ్రి రైతుగా ఉన్నాడు, తల్లి గృహిణిగా ఉండెను. వారికి యేసును గురించి ఏ మాత్రము కూడా తెలియదు. తన కుటుంబములో ఇంజెనీరింగు విద్యను అభ్యసించు మొట్టమొదటి వ్యక్తి ముత్తుక్రిష్ణన్ మాత్రమే. మహా అద్భుతంగా ఇంజెనీరింగు విద్య కొరకు ఆ సహోదరునికి కారుణ్యలో ప్రవేశము లభించినది. అయితే, అతడు ప్రవేశము పొందు సమయమునకు ఇంగ్లీషు అంతగా రాదు, సరిగ్గా సంభాషణ కూడా చేయలేడు. కానీ, అతడు కారుణ్యలోనికి ప్రవేశించగానే, నాలుగు సంవత్సర కాలములలోనే, తన జీవితమంతా రూపాంతరపరచబడుతుందని చెప్పబడెను. ప్రతి ఉదయకాలమున, అసెంబ్లీకి వారు సమకూర్చబడినప్పుడు గానీ, అధ్యాపక బృందం గానీ, ప్రజలతో వారు మాట్లాడుచుండేవారు. ప్రార్థనా బృందములుగా, సమూవీక ఆరాధన, సమాలోచన తరగతులు, ఇవన్నియు కూడా స్వచ్ఛందముగా నిర్వహించబడుచున్నాయి. అవి అతనికి ప్రార్థనకు సహకరించాయి. అవి అతనిని బీదలైన సమాజిక ప్రజలను చేరుకోవడానికి సహాకరించాయి. అతని యొక్క కన్నుల దృష్టి, దేవుని ప్రేమ వాస్తవికత వైపు తెరువబడ్డాయి.
యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో మేము శక్తి సేవా కూటములను నిర్వహించినప్పుడు, అతడు అక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. తనతో కూడా ఉన్న విద్యార్థుల మధ్యలో ప్రేమను క్రియలలో చూపించే, కొందరిని అతడు స్నేహితులుగా కనుగొన్నాడు. వీటన్నిటిని వలన అతడు చాలా బాగుగా చదువుకోగలిగాడు. అతనిలో ఉన్న భయమంతా అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయినది. యిర్మీయా 29:11 వ వచనము ప్రకారము దేవుడు అందమైన భవిష్యత్తును అతని కొరకు నిర్మాణము చేశాడు. బి.ఇ.,లో అతడు అత్యుత్తమమైన మార్కులతో మొదటి తరగతులలో ఉత్తీర్ణుడయ్యాడు. అతనికి ఐరోపా దేశములోను ఉద్యోగము వచ్చినది. ఆలాగుననే, అమెరికాలో కూడా ఉద్యోగము వచ్చినది. అతడు భారత దేశము వెలుపల అనేక దేశములలో పని చేశాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా అతని సంభాషణ మాధ్యమంగా ఆంగ్ల భాషనే మాట్లాడాడు. ఈ రోజు అతడు ఐరోపా దేశములో భద్రతా విభాగానికి సాంకేతిక శ్రాస్త విధానమునకు సంబంధించిన ఉద్యోగములో నార్డిక్ అను కంపెనీలో అతడు పని చేయుచుండెను. ఆలాగే అతని భార్య స్మిత. ఆమె కూడా కారుణ్యలో ఎమ్‌సిఎలో పట్టభద్రురాలయ్యెను. కాలేజిలో ఉండగానే ఉద్యోగ అవకాశమును పొందుకొనెను. ఆమె కూడా ఫిన్‌లాండ్ దేశములో పని చేయుచుండెను. ఆమె మేనేజర్‌గా ఉద్యోగము చేయుచుండెను. దేవుడు ఆమెను ఘనపరచియున్నాడు. వారికి ఇద్దరు ప్రియమైన కుమార్తెలు ఉండెను. ఆలాగే వారి దేశములో ఉన్న ప్రజలకు దేవుని ప్రేమను తీసుకొని వస్తున్నారు. అవును, దేవుడు వాగ్దానము చేసినట్లుగానే, నిజంగానే దేవుడు వారిని పరిపాలకులుగాను, కాపరిగాను చేసియున్నాడు.
నా ప్రియ స్నేహితులారా, దేవుడు నేడు మీ ద్వారా కూడా ఆలాగుననే జరిగిస్తాడు. ఆయన మీ కొరకు ఆలాగున జరిగిస్తాడు. కనుకనే, మీ జీవితములను దేవునికి సమర్పించుకొనండి. నేను బలహీనుడను/బలహీనురాలనుగా ఉన్నాను, అని అనుకుంటున్నారా? నేను మంచిగా చదువుకోలేకపోవుచున్నాను, నేను సరియైన భాషను మాట్లాడలేకపోవుచున్నాను, నా జీవితములో క్రింది స్థాయిలో ఉన్నాను అని అనుకుంటున్నారా? సహోదరుడు ముత్తుక్రిష్ణన్ తన జీవితమును దేవునికి స్వాధీనము చేసినట్లుగానే, దేవుడు అతనిని కారుణ్యాలో ఉన్నతమునకు లేవనెత్తాడు గదా! కోయంబత్తూరులో ఉన్న కారుణ్య విశ్వవిద్యాలయములో అతనిని లేవనెత్తినట్లుగానే, అతని భార్య కూడా అక్కడనే దీవించబడినది. కారుణ్యలో వారి విద్య ముగిసిన తర్వాత, సరియైన సమయములో వారు ఏకమయ్యారు. దేవుడు వారిని అత్యుత్తున్నత స్థాయిలో వారిని నియామకము చేసియుంచాడు. దేవుడు ఆలాగుననే మీకును కూడా జరిగిస్తాడు. కనుకనే, మీరు కూడా మీ జీవితాలను దేవుని చేతులకు సమర్పించుకొన్నప్పుడు, ప్రజలను పరిపాలించు అధిపతిని మీలో నుండి వచ్చునట్లు ఆయన మిమ్మును చేస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నీ పరిపాలన మరియు కాపరిగా ఉండే కృపను మాలో నుండి వస్తుందని నీవు చేసిన వాగ్దానానికై నీకు వందనాలు. తండ్రీ, నీ బిడ్డలమైన మమ్మును కూడా ఉన్నతమునకు లేవనెత్తుము. ప్రభువా, మమ్మును పరిపాలకులనుగా, కాపరిగా చేయుము. దేవా, మా వృత్తిలోను, దేశములోను ఉన్నతమైన స్థాయికి మమ్మును లేవనెత్తుము. యేసయ్యా, నీ ప్రేమలోనికి మేము ఇతరులకు తీసుకొని వచ్చునట్లుగా మమ్మును నీవు వాడుకొనుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మును యేసు స్వరూపంలోనికి మార్చుము. దేవా, పాపం, భయం మరియు ప్రతి ఆటంకమును జయించి, నీ అధికారంలో నడిచే పరిపాలకునిగా మమ్మును మార్చుము. దేవా, యేసు చేసినట్లుగానే ఇతరులకు ప్రేమ, శ్రద్ధ మరియు నడిపింపును చూపుతూ, అవసరంలో ఉన్నవారిని మేపడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము బలహీనంగా భావించినప్పుడు మమ్మును నీ పరిశుద్ధాత్మ శక్తిచేత బలపరచుము మరియు ఇతరులకు సేవ చేయుటకు నీ జ్ఞానము మరియు ధైర్యముతో మమ్మును నింపుము. దేవా, ఇతరులు నీలో జీవమును పొందగలిగేలా, యేసు చేసినట్లుగా నిస్వార్థంగా త్యాగం చేయడం మాకు నేర్పించుము. ప్రభువా, మమ్మును పైకి లేవనెత్తుము, నీ మహిమ కొరకు మమ్మును ఉపయోగించుకొనుమని మా జీవితాన్ని నీ చేతులలోనికి అప్పగించుచున్నాము. దేవా, బేత్లెహేము వలె మా జీవితాలను కూడా మార్చుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.