నా ప్రియ స్నేహితులారా, దేవుడు తన కృప అంతటిని మీలో సమృద్ధిగా చేయాలని కోరుకుంటున్నాడు. నేడు ఈ వాగ్దానం మనకు బైబిల్ నుండి 2 కొరింథీయులకు 9:8 లో వ వచనము ఇవ్వబడినది. ఆ వచనము, " అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.'' అవును, దేవుడు మీరు అన్నిటిలోను తగినంతమట్టుకు సంతృప్తి కలిగి ఉండాలని ఆయన మీ పట్ల కోరుకుంటున్నాడు. తమిళ అనువాదంలో, ఆ వచనములో ఇలాగున చెబుతుంది, "మీరు ప్రతిదానిలో పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.'' రెండవది, మీరు ఉత్తమమైన ప్రతికార్యము చేయుట యందు సమృద్ధిగా ఉండాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు, అప్పుడు ఆయన కృప అంతయు మీలో సమృద్ధిగా నిత్యము నిలిచి ఉంటుంది.
నా ప్రియులారా, మునుపటి వచనంలో చూచినట్లయితే, 2 కొరింథీయులకు 9:7వ వచనములో ఇలాగున చెబుతుంది, "సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.'' అవును, మీరు మీ జీవితాన్ని యేసుక్రీస్తు ఉద్దేశ్యం కొరకు ఉత్సాహముగా ఇచ్చినప్పుడు, మీ సమయాన్ని, ప్రయత్నాలను దేవుని చిత్తం కొరకు ఇచ్చినప్పుడు మరియు మీరు మీ ఆర్థిక వనరులను - ప్రభువు సేవ కొరకు ఉత్సాహముగా ఇచ్చినప్పుడు, దేవుడు తన కృపను మీలో సమృద్ధిగా నింపుతాడు. ఈ కృప సమృద్ధిగా ఉన్నప్పుడు, మీరు ప్రతి సత్‌క్రియలలోను సమృద్ధిగా ఉంటారు. తద్వారా, మీరు దేవుని చిత్తాన్ని సమృద్ధిగా చేయగలరు మరియు యేసువలె మీరు పరిపూర్ణులు కాగలరు. అపవాది మీలో ఎన్నడును, ఏ లోటును కనుగొనలేదు. మీ స్వంత హృదయం మిమ్మును ఎన్నటికిని నిందించదు లేదా మిమ్మల్ని అపరాధ భావనకు గురిచేయదు.
నా ప్రియ స్నేహితులారా, మన దేవుడు పరిపూర్ణత కలిగిన దేవుడు. అందుకే మత్తయి 5:48 వ వచనములో, యేసు ఇలాగున అంటున్నాడు, " మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.'' మానవులముగా, మనం దేవుని పరిపూర్ణతను పొందలేము. కానీ ప్రేమ, పవిత్రత, న్యాయం, ఇవ్వడం, సేవ చేయడం మరియు శ్రమలలో దేవుని విశ్వసించడంలో మరియు ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడంలో మనము పరిపూర్ణంగా ఉండాలని యేసు మనలను కోరుచున్నాడు. యేసు శ్రమల ద్వారా పరిపూర్ణుడయ్యాడు, మరియు నేడు బాధపడేవారిని విడిపించే శక్తి ఆయనకు కలదు. ఈ లోక శోధనల మధ్య మనలను పరిపూర్ణులుగా చేయు శక్తి కూడా ఆయనకు కలదు. కాబట్టి, మనం యేసును ఘనపరచాలి మరియు ఈ పరిపూర్ణత కొరకు ఆయనను విశ్వసించాలి. మీరు ఇళ్ళు, ఆస్తులు వంటి ఈ లోక వస్తువులపై నమ్మకం ఉంచకుండా, కృపను అనుగ్రహించే దేవుని యందు నమ్మకం కలిగి ఉండుట ద్వారా పరిపూర్ణతను పొందినప్పుడు మాత్రమే, మీ కొరకు సమస్తమును పరిపూర్ణం చేయబడుతుంది. మేము ఇశ్రాయేల్ దేశములో ప్రార్థనా గోపురమును నిర్మించాలనుకున్నప్పుడు, మేము ఒక భవనం కొనవలసి వచ్చింది. కానీ, మా దగ్గర కావలసినంతగా నిధులు లేవు. అయితే, యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా ఆశీర్వదించబడిన వారికి తమ శక్తికొలది ఇవ్వాలని మేము ప్రకటించాము. ప్రజలు త్యాగపూరితంగా అనేకమంది ఇచ్చారు. ముగింపు తేదీకి ముందు మాతో పాటు ఉపవాసం ఉన్న ఒక కుటుంబం ఎనిమిది సంవత్సరాలుగా తమ ఇంటిని అమ్మడానికి ప్రయత్నించారు. ఆ రోజు ఉదయం, ఒక కొనుగోలుదారుడు వచ్చి అడ్వాన్స్ ఇచ్చాడు. వారు మా దగ్గరకు పరిగెత్తు కుంటూ వచ్చి, మేము దీనిని ఇశ్రాయేల్ ప్రార్థనా గోపురమునకు కానుకగా ఇవ్వాలను కుంటున్నాము అని అన్నారు. ప్రభువు వెంటనే నాకు, 'ఈ డబ్బంతయు, ఈ ప్రార్థనా గోపురమునకు మూలధనం' అని చెప్పాడు. ఆశ్చర్యకరంగా, నేను దాని గురించి ప్రార్థించగానే, 10 నిమిషాలలోనే, బ్యాంకు నుండి ఫోన్ వచ్చింది. ఇంకను మాకు అవసరమైన నిధులను అందించింది. ప్రభుత్వ అనుమతులన్నియు ఇప్పుడే వచ్చాయని మరొక ఫోన్ కాల్ వచ్చింది. సరిగ్గా 12 గంటలకు, ఒప్పందం పూర్తయింది మరియు ఇశ్రాయేల్‌లో ఒక ప్రార్థన గోపురము స్థాపించబడినది. అవును, నా ప్రియులారా, తనను నమ్మి తన రాజ్యం కొరకు త్యాగం చేయుచున్న వారికి దేవుడు ఇచ్చే పరిపూర్ణత ఇదియే. కాబట్టి, నేడు నా ప్రియులారా, మీరు మీ హృదయాన్ని, మీ కానుకలను మరియు దేవుని పని చేయడానికి, మీ ప్రయత్నాలను త్యాగపూర్వకంగా ఇవ్వడం ద్వారా పరిపూర్ణులైనప్పుడు, మీరు ఈ లోకంలో ఇచ్చే ప్రతిదానికి నూరు రెట్లు మరియు నిత్యజీవమును కూడా పొందుకుంటారు.
రెండవదిగా, ప్రతి మంచి కార్యములోను మీరు సమృద్ధిగా ఉంటారని బైబిల్‌లో ఈలాగున చెబుతుం, సామెతలు 3:27-28 వ వచనముఓ చూచినట్లయితే, "మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండ వెనుకతియ్యకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.'' ఆలాగుననే, ఎవరైనా అవసరంలో మీ దగ్గరకు వచ్చినట్లయితే, మీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే, దానిని ఇయ్యకుండా వెనుకకు తీసుకొనకండి. ఇంకను మత్తయి 5:14-16వ వచనములలో ఇలాగున చెబుతుంది, "మనుష్యులు మీ స్రత్కియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు'' అని చెప్పినట్లుగానే, చీకటిలో ఉన్నవారికి వెలుగును తీసుకురావడానికి మీరు పిలువబడియున్నారు.
నా స్నేహితులారా, మీరు ప్రతిదానిలోను పరిపూర్ణులుగా కావాలనియు దేవుడు మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. ఏలాగనగా, పవిత్రతలో పరిపూర్ణులుగాను, దేవుని పరిచర్యకు ఇవ్వడంలోను మరియు ఇతరులకు యేసును ప్రకటించడంలోను మరియు మీరు ఉత్తమమైన ప్రతికార్యములలోను, మేలు చేయుటలోను సమృద్ధిగా ఉంటారు, పరిచర్య ద్వారా పేదలను పరామర్శిస్తారు. అప్పుడు దేవుడు తన కృపనంతటిని మీలో సమృద్ధిగా వర్థిల్లింపజేస్తాడు. మరియు యేసు ఎల్లప్పుడు మీతో ఉంటాడు. ఇటువంటి గొప్ప కృపతో నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక!
ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును అన్నిటిలోను సంతృప్తిపరచిన నీ సమృద్ధియైన కృపకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మేము ఉత్సాహంగా ఇచ్చువారుగా ఉండడానికి మరియు మా జీవితాన్ని, సమయాన్ని మరియు వనరులను నీ రాజ్యం కొరకు ఆనందంగా అర్పించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, ఉత్తమమైన ప్రతికార్యములలో మేము సమృద్ధిగా ఉండి, నీ పవిత్రత మరియు ప్రేమలో నడవడానికి నీ కృప మాలో సమృద్ధిగా ఉండునట్లుగా చేయుము. దేవా, నీవు పరిపూర్ణుడవైనట్టుగా మమ్మును కూడ పరిపూర్ణులనుగా చేయుము. యేసయ్యా, యథార్థ హృదయంతో మేము నిన్ను గూర్చి ప్రకటించడంలో లోకానికి వెలుగుగా ప్రకాశించేలా మమ్మును బలపరచుము. దేవా, అవసరంలో ఉన్నవారికి మేలు చేయుటకు దాచకుండా, అది మా శక్తిలో ఉన్నప్పుడు పనిచేయడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా హృదయంలో నుండి ప్రతి దోషారోపణను తొలగించి, నీ యెదుట మమ్మును నిందారహితంగా ఉండునట్లుగా చేయుము. దేవా, మా శ్రమలలో మరియు సవాళ్లలో నిన్ను విశ్వసించుటకు మాకు నేర్పుము. ప్రభువా, మేము నిన్ను మరియు నీ దైవీకమైన కార్యములకు సంపూర్ణంగా మమ్మును అప్పగించుకున్నప్పుడు మాకు నూరు రెట్లు నీ యొక్క ఆశీర్వాదాలను మాకు దయచేయుము. ప్రభువా, మాకు చాలినంతగాను మరియు నిత్య జీవమును పొందుకొనునట్లుగాను మమ్మును నీలో పరిపూర్ణంగాను మరియు ఎల్లప్పుడు నీ కృపలో నిలిచి ఉండునట్లుగా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.