హలో నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీకందరికి శుభములు తెలియజేయడం నాకెంతో సంతోషంగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 5:24వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' ప్రకారం స్నేహితులారా, మనము దేవుని మాట విని, వాటిని విశ్వసించాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు. మనము అనేకసార్లు ఆయన మాటను వింటాము. కానీ, ఆయన మాటలను విశ్వసించడం ఎంతో కష్టతరముగా ఉంటుంది. నేడు మీరేదైనా అద్భుతము కొరకు వేచియున్నారేమో? ఇంకను ఎంతో గొప్ప నష్టాన్ని ఎదుర్కొంటున్నారేమో? అంధకారము మీ జీవితాన్ని ఆవరించియున్నదేమో? ఎప్పుడు నిరాశ, నిస్పృహతో ఉన్నారేమో? మీలో విశ్వాసము కొదువై పోయినదేమో? దేవుని విశ్వసించడం కష్టతరముగా మారినదేమో? అయినప్పటికీ, నా స్నేహితులారా, మనం ఆయన వాక్యాన్ని విని, విశ్వసించాలని ఎంచుకున్నప్పుడు, మనకు నిత్యజీవం, ఆనందం, శాంతి మరియు విజయంతో నిండిన జీవితం మనకు వాగ్దానం చేయబడుతుంది.

తన సాక్ష్యమును పంచుకున్న జానెట్ అను యౌనస్థురాలి యొక్క జీవితమును మనము చూచినట్లయితే, కళాశాలలో ఆమె చదువుకొనుచుండెను. తన జీవితమంతయు అంధకారమై పోయినదనియు మరియు తను నిస్పృహలో ఉన్నదని చెప్పారు. కళాశాలలో చదువుకుంటున్నప్పుడు తను ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నదని తెలియజేసెను. అటువంటి పరిస్థితులలో, చెన్నైలో జరుగుచున్న అద్భుత ఉపవాస కూడికకు నాతో కూడా వస్తావా? అని తన తల్లి అడిగింది. నాకు ఆసక్తి లేదు, నేను నీతో రాను అని ఆ అమ్మాయి చెప్పెను. అందుకు తన తల్లి జానెట్‌తో, 'నీవు నాతో వచ్చినట్లయితే, నీ జీవితము ఎంతగానో మారుతుంది' అని ఆమెతో చెప్పెను. తన తల్లి ఎంతగానో అడగడాన్ని బట్టి, ఆమె తన తల్లితో కూడా ఆమె ఆ ఉపవాస కూటమునకు వెళ్లినది.

ఆ ఉపవాస కూటములో ఆమె కూర్చుని దేవుని వాక్యాన్ని వింటుండగా, జీవితములో నేను ఎంతో ఒంటరితనము అనుభవిస్తున్నాను, నా జీవితము మారుతుందా? అని ఆలోచిస్తూ కూర్చుని ఉండెను. నేను ఎన్నో సమస్యలను గురించి ఆలోచించి, వీటికి అంతము ఎక్కడ ఉన్నది? ప్రార్థనా సమయములో మా తండ్రి డాక్టర్. పాల్ దినకరన్‌గారు ప్రార్థన చేస్తుండగా, ఆయన ప్రజల పేర్లు పిలుచుచూ, వారి సమస్యలను తెలియజేయడం ప్రారంభించారు. జానెట్ తన మనస్సులో ఈలాగున, 'ఎంతో మంది పేర్లను పిలుచుచున్నారు, నా పేరు కూడా పిలుస్తారా?' అని అనుకుంటుండెను. వెంటనే మా తండ్రిగారైన డాక్టర్. పాల్‌దినకరన్, 'జానెట్' అంటూ ఆ సమయములో జానెట్ అని ఆమె పేరును పిలిచారు. అంతమాత్రమే కాదు, "నీ జీవితములోని అంధకారము నిన్ను విడిచివెళ్లిపోతుంది. నీవు విడుదలను పొందుకుంటున్నావు'' అని చెప్పారు. ఆ సమయములోనే, తన హృదయములో సమాధానమును పొందుకొనెను. మరుసటి రోజు కళాశాలకు వెళ్లినప్పుడు, అంతా మారిపోవడం గమనించింది. తన జీవితము నుండి అంధకారము తొలగించబడినది. ఆ సమ

అవును, నా ప్రియ స్నేహితులారా, అనేకసార్లు మనము కూడా ఆయన వాక్యమును వింటాము మరియు ఆయనను గురించి తెలుసుకుంటాము. కానీ, మనకున్న సమస్యలను మరియు నిరాశ, నిస్పృహలను బట్టి విశ్వసించలేకపోవుచున్నాము. విశ్వసించడం ఎంతో కష్టతరముగా ఉంటుంది. కానీ, నా ప్రియులారా, దేవుని వాక్యమును మీరు వింటుండగా, యేసు మీ దేవుడు అని మీరు విశ్వసించుచుండగా, ఆయన మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. అవును, మీ కొరకు మరణించి, సమాధిని గెలిచి, తిరిగి లేచిన దేవుని ఆలాగున మీరు నమ్ముచుండగా, మీరు నిత్యజీవాన్ని కలిగి ఉంటారు. మీ జీవితములో ఉన్న అంధకారమంతయు తొలగించబడుతుంది. మీ జీవితములోని దుఃఖమంత సంతోషంగా మార్చబడుతుంది. మీ అనారోగ్యాలన్నియు ఇప్పుడే స్వస్థపరచబడతాయి.

అవును, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు కేవలం దేవుని యొక్క వాక్యమును వినడం మాత్రమే కాదు, సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని విశ్వసించండి. మీ కొరకు ఆయన మరణించాడని నమ్మండి. ఆయన తిరిగి లేచి, సజీవుడై యున్నాడని మీరు విశ్వసించండి, మీరు నిత్య జీవమును కలిగి ఉంటారు. ఈ భూమి పైన కూడా, యేసయ్యతో సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. ఈ సంతోషాన్ని మనము కూడా పొందుకుందామా? యేసయ్యను నమ్మడం ద్వారా పొందుకుందామా? నేడు మీరు దేవుని వాక్యమును విని, ఆయన మాటల యందు నమ్మకముంచినప్పుడు నిత్యజీవమును మీరు పొందుకొని, నేటి వాగ్దానము ద్వారా దీవించబడుదురు గాక.

ప్రార్థన:
ప్రియమైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము, నిన్ను విశ్వసించునప్పుడు, మా హృదయములో ప్రవేవించు ఆనందము కొరకై నీకు వందనాలు. ప్రభువా, మేము నీ యందు విశ్వాసముంచునప్పుడు మా అంధకారమంతయు మరియు వేదన, శ్రమలు, అనారోగ్యాలు తొలగించబడుటకు మాకు కృపను దయచేయుము. దేవా, అంధకారముతో నిండియున్న మా జీవితములోనికి నీ వెలుగును ప్రకాశింపజేయుము. ప్రభువా, ఈ రోజు మేము నీ వాక్యమును వినడము మాత్రమే కాకుండా, నీవే మాకు నిత్యజీవము అని నమ్ముటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. యేసయ్యా, నీవు మా కొరకై మరణించి, తిరిగి లేచిన దేవుడవు, నిన్ను మరియు నీ శక్తిని నమ్ముచున్నాము, మా దుఃఖాన్ని సంతోషంగా మార్చుము. దేవా, మేము నీ యొక్క సమృద్ధి జీవమును పొందుకొనునట్లుగా చేయుము. నీ యొక్క ఆనందముతో నింపుము. ప్రభువా, నీ సన్నిధిలో ఎల్లప్పుడు నీతో ఉండుటకు, నిత్యజీవము అను వరమును పొందుటకు మమ్మును సిద్ధపరచి, మేము నీ మాటలు వినడం మాత్రమే కాదు, నీవు జీవముగల దేవుడని, మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించి, మా కొరకు తిరిగి లేచిన దేవుడని మేము హృదయపూర్వకంగా నమ్ముచున్నాము. దేవా, మా బాధలను ఆనందంగాను మరియు మా కష్టాలను విజయవంతంగా మార్చగల నీ శక్తిని మాకు దయచేసి, నీ సమృద్ధిగల జీవమును మరియు పొంగిపొర్లుతున్న ఆనందాన్ని మేము అనుభవించునట్లు చేయుమని యేసుక్రీస్తు విజయవంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.