నా ప్రియమైన స్నేహితులారా, నేడు మనలను యేసు ఎక్కడకు తీసుకొని వెళ్లినను, చిన్న బిడ్డలు తల్లిదండ్రులను వెంబడించినట్లుగానే, ఆయనను అనుసరించుటకు మనకు ఆనందముగా ఉంటుంది. ఆయన మనలను ఉత్తమమైన మరియు ఉన్నతమైన స్థానమునకు నడిపిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హెబ్రీయులకు 6:14వ వచనము ప్రకారం దేవుడు మనలను నేడు దీవెనకరమైన మార్గములో నడిపిస్తాడు. ఆ వచనము, "...నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును...'' అని చెప్పబడిన ప్రకారం మనలను విస్తరింపజేయుట ఇది దేవుని యొక్క హ ృదయమై యున్నది. మనలను ఎల్లప్పుడూ ఆశీర్వదించడానికి మరియు అభివృద్ధి చెందాలని తలంచుచున్నాడు. అందుచేతనే, ఈ విశ్వాన్ని ఆయన సమృద్ధిగా సృష్టించి, ఏదెను తోటలో మానవుని ఉంచి యున్నాడు. సమస్తమును ఎంతో సౌందర్యవంతముగా ఉండెను. ఆ తోటలో పక్షుల గానములు, ఉదయకాలపు సూర్య ప్రకాశము, జలప్రవాహములు, ఆ యొక్క నది ఒడ్డులను, సారవంతమైనవిగాను మరియు ఫలభరితమైనదిగా చేయుచున్న విధానమును, దేవుడు అలాగే పనిచేస్తాడు. ఆయన అన్నిటినీ చక్కగా చేస్తాడు. ఆ రీతిగానే, దేవుడు సౌందర్యవంతమైన కార్యములను చేయుటకు సమర్థుడు. కాబట్టి, మీరు కూడ ఆయన సృష్టిలో ఆనందించాలని ఆయన కోరుచున్నాడు.
నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున మిమ్మును ఆశీర్వదించుటకును, మిమ్మును వర్థిల్లింపజేయుటకు ఆయన మీ జీవితములోనికి రావాలని కోరుచున్నాడు. కాబట్టి, నేడు మిమ్మును మీరు అనుర్హులనుగా చేసుకొనకండి. కనుకనే, ఆయన ప్రేమను బట్టి మీరు ఆయన ఆశీర్వాదములకు అర్హులే. ఆయన మీ కొరకై కలిగి ఉన్న ప్రేమ అది. ఆయన ఎంతగానో మిమ్మును ప్రేమించుచున్నాడు. కనుకనే, నేడు మీరు ఆయన ప్రేమను పొందుకొనుటకు మీ హృదయాలను దేవునికి సమర్పించుకొనండి.
సుమిత్ అను వ్యక్తి ఎమ్ఎన్‌సి కంపెనీలో చిన్న వయస్సు నుండి ఉద్యోగమును చేయుచున్నాడు. ఒక బహుళజాతి కంపెనీలో స్టాక్ ఇన్‌చార్జ్‌గా పనిచేయుచున్న వ్యక్తి. అతడు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో యౌవన భాగస్థుల పధకములో ఒక సభ్యునిగా ఉన్నాడు. అతడు 3 సంవత్సరములుగా పదోన్నతి కొరకు ఎదురు చూచుచుండెను. అతడు వృద్ధి పొందడానికి వేచియుండెను. అంతమాత్రమే కాదు, ఎన్నో ప్రయత్నములను చేసియున్నాడు. అయినప్పటికిని, ఇటువంటి పరిస్థితులలో, చివరిగా లక్నోలో నిర్వహించబడిన యేసు పిలుచుచున్నాడు కూటములో అతడు పాల్గొన్నాడు. అక్కడ అతడు, "ప్రభువా, ఈ రోజు నాకు పదోన్నతి ఇవ్వాలి, నీవు నేడు ఏదైన ఒక కార్యమును నా జీవితములో జరిగించుమని'' విశ్వాసంతో నింపబడిన హృదయంతో, అతను ఇలాగున మొఱ్ఱపెట్టాడు. ఆయన ఆశీర్వాదముల కొరకు అతడు పోరాడుచుండెను. ఇందులో ఈ కూటము ముగిసిన తర్వాత, చివరిగా నేను అతని కొరకు వ్యక్తిగతంగా ఎంతో భారముగా ప్రార్థించాను అని అతడు చెప్పాడు. అద్భుతంగా, ఆ రాత్రి తన కంపెనీ నుండి అతనికి ఈమెయిల్ వచ్చినది. ఆ మెయిల్‌లో, 'సుమిత్, నీకు శుభాభివందనాలు, నిన్ను బ్రాంఛ్‌కి అధ్యక్షుని పదవిలో, నీకు పదోన్నతిని కల్పించాము' అని ఆ మెయిల్‌లో ఉన్న సారాంశమును తెలియజేశాడు. అతడు ఎంతగానో నిర్ఘాంతపోయాడు, సంతోషముతో గంతులు వేయుచుండెను. ప్రభువు, ఈ విధంగా, ' నా ప్రార్థనను ఆలకించాడు, వందనాలు యేసయ్య అని చెప్పాడు.' ఆలాగుననే, నేడు ప్రభువు నన్ను ఆశీర్వదించాడు, నన్ను వృద్ధిపొందింపజేసాడు. ఈ రోజు ఎమ్‌కామ్‌కి ధరఖాస్తు చేసుకొని, ఇంకను వృద్ధికరమైన విధానములో ప్రభువు నన్ను నడిపించుచున్నాడు అని తన సాక్ష్యమును అతడు తెలియజేశాడు. నేడు నా ప్రియ స్నేహితులారా, నేడు మనము కూడా ప్రభువును అడుగుదామా? ఇది మీ వంతు, ఆలాగుననే, నేడు మీరు కూడా, దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన మిమ్మును నిశ్చయముగా, ఆశీర్వదించి, విస్తరింపజేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నీవు మమ్మును ప్రేమించినందుకై నీకు వందనాలు. దేవా, నీవు ఈ రోజు మమ్మును దీవించి, వృద్ధిపొందింపజేయబోవుచున్నందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మమ్మును చుట్టుముట్టిన నీ అంతులేని ప్రేమకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, నేడు నీవు మమ్మును ఆశీర్వదించి, విస్తరింపజేయాలని కోరుకొనుచున్నాము. ప్రభువా, ఈ రోజు, నీవు మా కొరకు సిద్ధపరచిన అభివృద్ధిని పొందడానికి మా హృదయాన్ని తెరువజేయుము. దేవా, మా చేతుల కష్టార్జితమును నీవు విస్తరించి మరియు మేము చేయుచున్న ప్రతిదానిలో మేము అభివృద్ధి పొందుకొనునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. యేసయ్యా, మా కుటుంబాన్ని, మా విశ్వాసాన్ని మరియు మా పిలుపును నీ శక్తి క్రింద మమ్మును బలపరచుము. దేవా, నేడు మా కుటుంబములోను మరియు మా వ్యక్తిగత ఆర్థిక స్థితిని వృద్ధిపొందునట్లుగా చేయుము మరియు అనుదినము మేము నీతిగా జీవించునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము ఊహించగలిగిన దానికంటే అత్యధికంగా మమ్మును ఆశీర్వదిస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, ఈ రోజు మేము నీ యొక్క ఆశీర్వాదమును మరియు అభివృద్ధి కృతజ్ఞతతో మరియు విశ్వాసంతో అంగీకరించుచున్నాము. దేవా, నేడు మేము కోల్పోయినవన్నిటిని మాకు మరల దయచేయుమని యేసు కృపగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.