నా ప్రియమైన స్నేహితులారా, నేడు శుభ శుక్రవారమున మీకందరికి నా ప్రేమ పూర్వక శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 3:26వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును'' ప్రకారం మీ కాలు చిక్కుపడకుండునట్లుగా ఆయన మిమ్మును కాపాడుచున్నాడు. ఇంకను బైబిల్ నుండి కీర్తనలు 16:8వ వచనములో చూచినట్లయితే, "సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, ఆయన మన కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక మనము కదల్చబడము. మరియు కీర్తనలు 46:5వ వచనములో చూచినట్లయితే, "దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు'' అని బైబిల్‌లో చెప్పబడియున్నది. మనం కదలబడటం లేదా కదిలించబడటం దేవుడు కోరుకోడు. కానీ, దేవుడు ఇలా అంటున్నాడు, "పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు'' అవును, నా స్నేహితులారా, దేవుడు తన కృపను మరియు ఆయన మీతో చేసిన సమాధాన విషయమైన నిబంధనను కాపాడుతాడు. కాబట్టి, మీరు ఎటువంటి స్థితిలో కూడా ఎన్నటికిని తొలగించబడరు. దేవుడు మీ పక్షాన ఉంటాడు, కాబటి,్ట మీరు ఎన్నటికిని కదిలించబడరు. మీరు నిత్యము ఆయనతో నిలిచి ఉంటారు.
బైబిలు కూడా ఇలా ప్రకటించుచున్నది, "కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?'' అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. నేటికిని, బైబిల్‌లో ఈలాగున వాగ్దానం చేయుచున్నది, "ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు.'' ఎందుకంటే, దేవుడు మీ పాదములకు ఆజ్ఞాపిస్తాడు. ఆలాగుననే, " ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును'' అని తెలియజేయుచున్నది మరియు ప్రభువు ఇలాగున అంటున్నాడు, " నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నా దూతను నీకు ముందుగా పంపుదును.'' అవును, ఆయన దారిలో మిమ్మును కాపాడి, ఆయన మీ కొరకు సిద్ధపరచిన స్థలానికి మిమ్మును తీసుకువస్తాడు. అవును, దేవుడు మీ కొరకు, మీ జీవితానికి, మీరు ఆశీర్వదించబడటానికి ఒక మార్గాన్ని సిద్ధపరచాడు. ఎందుకనగా, ప్రభువు మీ పక్షాన ఉన్నాడు మరియు మీరు ఆయన ప్రణాళిక నుండి ఎన్నటికిని దూరంగా ఉండరు. దేవుని ప్రేమించేవారికి, ఆయన ఉద్దేశం ప్రకారం పిలువబడేవారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి. కనుకనే, దేవుడు మీ కొరకు సిద్ధపరచిన అడుగుజాడలలో మీరు నడిచినప్పుడు, మీరు ఆయనను ప్రేమించినప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు మరియు మిమ్మును నడిపించడానికి మీరు ఆయన కొరకు వేచి ఉన్నప్పుడు మరియు మీరు దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి జీవించినప్పుడు, అన్ని విషయాలు సమకూడి మేలుకే జరుగుతాయి. మీ జీవితంలోని అన్ని రోజులలో మంచితనం మరియు కృపాక్షేమములు మిమ్మును వెంబడిస్తాయి. ఎందుకంటే మీరు అభివృద్ధి చెందడానికి దేవుని కృప మీలో సమృద్ధిగా ఉంటుంది. అందుకే బైబిల్‌లో కీర్తనలు 23:6 వ వచనములలో చూచినట్లయితే, "నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను'' అని చెప్పినట్లుగానే, నిశ్చయంగానే, దేవుని యొక్క కృపాక్షేమములు మీ బ్రదుకు దినములన్నియు వెంబడించును. కాబట్టి మీ హృదయాన్ని కలవరపడనీయకండి. ఇది మీ కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానం.
ఒక శక్తివంతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుచున్నాను. సహోదరి శాంతి మార్గరెట్ చాలా కాలంగా గర్భాశయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుచుండెను. శస్త్రచికిత్స లేకుండా దానిని బాగుచేయలేమని వైద్యులు తెలియజేసి, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ, కొంత సమయం తర్వాత, ఆమె కొంచెము దూరం కూడా నడవలేకపోయెను. ఆలాగుననే, ఏ పని కూడా చేయలేకపోయెను. ఆ నొప్పి భరించలేనిదిగా ఉండెను. మరియు ఆమె ఇంట్లో అన్ని పనులు తాను మాత్రమే చేయవలసి వచ్చినది తద్వారా, ఆమె ఎంతో బాధపడెను. ఒకరోజు, ఆమె యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము సంప్రదించినప్పుడు, ప్రార్థన యోధులలో ఒకరు ఎంతో పట్టుదలతోను మరియు భారముతో ప్రార్థించి, "దయచేసి యేసు పిలుచుచున్నాడు గోపురము నుండి ప్రార్థించి ఇచ్చిన ఈ ప్రార్థన నూనెను మీరు బాధింపబడిన స్థలములో రాయండి అని చెప్పారు.'' ఆమె నూనె రాసుకున్న అరగంటలోపున దేవుడు ఆమెను సంపూర్ణంగా స్వస్థపరిచాడు. దేవుడు ఆ ప్రార్థనలను ఆలకించి ఆమెను బ్రతికించాడు! ఆమె కుటుంబ ఆశీర్వాద పధకంలో భాగస్థురాలిగా చేరింది మరియు ఆమె పిల్లలను యేసు పిలుచుచున్నాడు యౌవన భాగస్థుల పధకములో భాగస్థులనుగా నమోదు చేసుకున్నారు. మరియు దేవుడు వారి కుటుంబ జీవితాన్ని మరల నిర్మించాడు. అవును, నిజంగా, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ కుడిపార్శ్వమున ఉన్నాడు గనుకనే, మీరు ఎన్నటికిని కదిలించబడరు. కాబట్టి, నేడు మీరు ఆయన సిలువ శ్రమలను తలంచుకుంటూ, మీరు ఆయనను విశ్వసించి, ఇతరులకు ఆశీర్వదకరముగా ఉండడానికి పరిచర్యలో ఆయనతో నిలబడండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు మా జీవితాలలో మాకు నిత్య సహాయకుడిగాను మరియు మార్గదర్శిగాను మా పక్షమున ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయచున్నాము. దేవా, మా పాదములు ఎన్నడును కదలదనియ్యవని నీవు వాగ్దానం చేసినట్లుగానే, కాబట్టి మా అడుగులు స్థిరపరచినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, పర్వతాలు తొలగినను మరియు మెట్టలు తత్తరిల్లినను, నీ కృప మమ్మును విడిచిపోకుండా, నీ సమాధాన విషయమైన నిబంధన ఎన్నటికిని మమ్మును విడిచిపోకుండా ఉండునట్లుగా సహాయము చేయుము. దేవా, నీవు మా మధ్యలో ఉన్నావు. కాబట్టి, మేము ఎన్నటికిని కదల్చబడకుండా, మా పాదములను నీవు సిద్ధపరచిన మార్గంలో మమ్మును నడిపించడానికి మరియు కాపాడడానికి దయచేసి నీ దేవదూతను మాకు ముందుగా పంపించుము. ప్రభువా, నీ నిరంతర ప్రేమలో మేము స్థిరంగా నిలిచి ఉండునట్లుగాను, మా బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములు మా వెంట వచ్చునట్లుగా కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.