నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 33:3వ వచనమును మన ధ్యాననిమిత్తము తీసుకొనబడినది. ఆ వచనము, "నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును'' అన్న వచనం ప్రకారం "నాకు మొఱ్ఱపెట్టుము, సర్వశక్తిగల దేవుడనైన నేను మీకు జవాబిచ్చెదను'' అని సెలవిచ్చుచున్నాడు. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానముగా ఉన్నది. అవును, దేవునికి సమస్తమును సాధ్యమే. గనుకనే, నేడు మీరు ఆయనకు మొఱ్ఱపెట్టినట్లయితే, అందుకే యేసు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "నా నామమున మీరు ఏదైనా అడగండి. నేను దానిని జరిగించెదను.'' అవును, "మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరు నా నామమున అడగండి మరియు ఆ రీతిగానే, అడిగిన ప్రతివారు కూడా పొందుకొనెదరు'' అని ప్రభువైన యేసు మిమ్మును చూచి సెలవిచ్చుచున్నాడు. ఎందుకనగా, 'యేసు నామమున ప్రతి మోకాలు వంగుతుంది' మరియు యేసు నామమున ప్రతి దయ్యము, ఇంకను దురాత్మలు కూడా పారిపోతాయి. అవును, మీరు యేసు నామమున అడిగినప్పుడు, మీ హృదయమును సంతోషముతో నింపబడుతుంది.
కనుకనే, నా ప్రియులారా, ఈ రోజుననే ఆయనను అడగండి. యేసు నామములో మాకు అవసరమైన ప్రతి ఆశీర్వాదములు మరియు ప్రతి అక్కరలన్నియు కూడా సంధించబడవలెనని అడగండి. ఇంకను మీరు ఒక పట్టికను వ్రాసుకొని అడగండి. మీరు జరిగించిన పాపములు ఏవైనను సరే, మీ ఆత్మలో మరియు శరీరములో ఉన్న బలహీనతలు ఏవైనను సరే, వాటిని ముందుగా ఒక పట్టికగా వ్రాసుకొనండి, ప్రభువు మీకు ఇచ్చిన అధికారముతో ఇలాగున చెప్పండి, 'ప్రభువా, యేసు నామమున, అనగా, నీ నామమున మేము శుద్ధీకరించబడుచున్నాము, ఇంకను, ఆలాగుననే మా పాపములు క్షమించబడియున్నవి' అని ధైర్యంగా చెప్పండి. ఆలాగుననే, 'ప్రభువా, యేసు నామములో మరల ఈ పాపములను మేము చేయకుండా, మాకు శక్తిని దయచేయుము' అని అడగండి. అప్పుడు దేవుడు మీ ప్రార్థనలకు తప్పకుండా జవాబును అనుగ్రహిస్తాడు. యేసుప్రభువు నిశ్చయముగా, మీ మొఱ్ఱలకు ఉత్తరమిస్తాడు, ఆయన మిమ్మును శుద్ధీకరిస్తాడు, ఇంకను ఆయన మీ శాపములను మరియు పాపములను మీలో నుండి తొలగిస్తాడు. తద్వారా, ఈ రోజున మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా ఆయన సకల ఆశీర్వాదములను మీకు అనుగ్రహిస్తాడు.
ఇక్కడ బెంగళూరు నుండి ఒక సహోదరి నిషా యొక్క సాక్ష్యమును మనము చూడగలము. ఆమెకు జీతము ఎంతో తక్కువగా ఉండెను. కనుకనే, ఆమె తన ఉద్యోగమునకు రాజీనామ చేశారు. నూతనంగా ఆమెకు ఏ ఉద్యోగము కూడ దొరకలేదు. అనేక ఇంటర్వ్యూలలో కూడా వారు తిరస్కరించబడడము జరిగినది. తనకు నిరాంతరాయంగా ఎదురగుచున్న ఈ ఓటమిలు ఆమెకు ఒత్తిడిని కలిగించాయి. కానీ, ఆమె ఈలాగున అనుకున్నారు, 'ఇక నాకు భవిష్యత్తు లేదు, నా పని అంతమైపోయినది.' అటువంటి సమయములోనే, ఆమె యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును సందర్శించారు. ఆమె ఇతరులకు సేవలందించుటకు తనను తాను సమర్పించుకొని, స్వచ్ఛంద సేవకురాలిగా ప్రార్థనా గోపురములో పని చేయుటకు ప్రారంభించెను. ఇంకను, యేసు పిలుచుచున్నాడు యూట్యూబ్ ఛానల్‌ను వీక్షించుటకు మొదలు పెట్టారు. ఈ ఛానల్‌ను వీక్షించుచున్నందుకు మీకు నా ధన్యవాదాలు. ఆలాగుననే, ఒకరోజు ఆమె నా కార్యక్రమమును యూట్యూబ్ ఛానల్ ద్వారాను వీక్షించుచుండగా, నేను ప్రవచనాత్మకమైన శక్తి ద్వారా ఈ రీతిగా మాట్లాడాను. అదేమనగా, "మీరు కోల్పోయిన ఆశీర్వాదాలకు ప్రతిగా మీరు రెండింతలుగా ఆశీర్వదింపబడతారు'' అని చెప్పాను. ఇది ఆమెను నూతనపరచబడుటకు మానసిక స్థ్యైరమును ఇచ్చినది. ఇంకను ఈ మాటలు ఆమెలో ఒక నూతన ఆత్మవిశ్వాసాన్ని కలిగించినది. కొన్ని దినములలోనే, ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగము లభించినది. గతములోకంటే, రెండింతల జీతముతో ఆమె ఒక నూతన ఉద్యోగమును పొందుకొనెను. నా ప్రియులారా, నేడు ఆలాగుననే, యేసు మీకు కూడా జరిగిస్తాడు. కనుకనే, మీరు ఆయనకు మొఱ్ఱపెట్టండి, ఆయన మీకు జవాబును అనుగ్రహిస్తాడు. నేడు మీరు గ్రహింపలేని మరియు గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రార్థనా ఆలకించు మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నేడు నీ యొక్క వాగ్దానాన్ని నమ్ముకుని మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువైన యేసయ్యా, అన్ని నామాలకు మించిన నీ నామానికి మొఱ్ఱపెట్టుచున్నాము, దయచేసి మాకు జవాబును దయచేసి, మేము గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను మాకు తెలియజేయుము. దేవా, మా జీవితాలను నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. యేసయ్యా, నేడు మా పాపములన్నిటిని ఒక పట్టిక వేసుకొని నీ యొద్దకు వచ్చుచున్నాము. యేసయ్యా, మా పాపములన్నిటిని నేడు నీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా కడిగివేయుము. ఇకను మేము ఎటువంటి పాపమును చేయకుండా మాకు తగిన బలమును దయచేయుము. దేవా, నేడు నీవు మా పాపములను క్షమించి, కడిగివేసి, మమ్మును నూతన సృష్టిగా మార్చుము. ప్రభువా, మా సంతోషము పరిపూర్ణమగునట్లుగా మేము అడుగు సమస్తమును మాకు దయచేయుము. దేవా, మా పాపాలను క్షమించి, మమ్మును శుద్ధులనుగా చేసి, నీ నీతితో నడవడానికి మాకు శక్తిని అనుగ్రహించుము. దేవా, నీ నామంలో, ప్రతి అవసరాన్ని తీర్చమని మరియు మా ప్రతి భారాన్ని మరియు మా యొక్క ప్రతి శాపాన్ని తొలగించి, నీ యొక్క సమృద్ధికరమైన ఆశీర్వాదాలు మా జీవితంలో పొంగిపొర్లునట్లుగా చేయుము. దేవా, మా హృదయాన్ని ఆనందం, శాంతి మరియు నీ శక్తివంతమైన అధికారంపై విశ్వాసం ఉంచునట్లుగా మమ్మును నీ యొక్క విశ్వాసముతో నింపుము. దేవా, యేసు నామంలో, ప్రతి బంధకాల సంకెళ్లను బ్రద్ధలు చేసి, మమ్మును స్వతంత్రులనుగా చేయుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.