నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ఒక అద్భుతమైన గొప్ప దినముగా ఉండబోవుచున్నది! నేటి నుండి మన జీవితములో అద్భుత కార్యములు, సూచక క్రియలు, మహాత్కార్యాలను మనము చూడబోవుచున్నాము. ఎందుకనగా, ఆయన వాక్యమును ధ్యానించుటకు ఎంతో వాంఛతో మనము ఇక్కడ ఉన్నాము. అందుకే నేటి వాగ్దానముగా యెషయా 43:7 వచనమును బైబిల్ నుండి ఎన్నుకొనబడినది. ఆ వచనము, "నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే'' అన్న వచనం ప్రకారం అవును, ఇది మనలను దేవుడు బలపరచే వాస్తవికతయై యున్నది. ఈ కృప కొరకై దేవునికి వందనాలు. ఎందుకనగా, తన నామమున ఆయన మిమ్మును పిలిచియున్నాడు.

నా ప్రియ స్నేహితులారా, మనము దేవునిచేత ఎన్నుకొనబడియున్నాము, తన కొరకు ఆయనచే మనము పిలువబడియున్నాము. తద్వారా, మనము ఆయనను ఎరిగియున్నాము. అనేకమంది ఆయనను కనుగొనలేదు, కానీ, మనము ఆయనను ఎరుగుదుము. దేవుని యొక్క గొప్ప సంతోషమును, శాంతి, మన హృదయములో మనము ఎరిగియున్నాము. అనేకమందికి అటువంటి అనుభూతి కలుగుట లేదు. వారు దాని కొరకు జీవితకాలమంతా ఎదురు చూస్తూ ఉంటారు. అట్టి పిలుపును బట్టి మనము దేవుని చేత వినియోగింపబడుచున్నాము. ప్రచంఢమైన ప్రకృతి శక్తులతో సేవా పరిచర్యలోనే మాత్రము కాకుండా, జీవితములో విభిన్న కోణాలలో ఆ పిలుపును బట్టి మనము పరలోకమునకు చేరుకోగలుగుచున్నాము. పరలోకమున ఆయన ప్రక్కన మనము ఉండుటకు పిలువబడియున్నాము. హల్లెలూయా! నేడు దేవుడు మన జీవితాలను ఆ విధంగా సౌందర్యవంతముగా చేస్తాడు. తన మహిమ కొరకు మనలను తీర్చిదిద్దాడు. కనుకనే, ఆయనను లోతుగా తెలుసుకునే గొప్ప ఆధిక్యత మనకు కలదు. ప్రపంచంలో అనేకమంది శాంతి మరియు ఆనందం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, మన హృదయాలలో దేవుని ఆనందం మరియు శాంతిలో గల సంపూర్ణతను అనుభవించడానికి మనము పిలువబడుట మాత్రమే కాదు, మనము ఆశీర్వదించబడియున్నాము. కనుకనే, మీ హృదయాన్ని కలవరపడనీయ్యకండి.

నా ప్రియులారా, ఈ వచనము చెబుతుందిలా, "నా నామమున పిలువబడియున్నవారు,'' సర్వశక్తిగల దేవుని యొక్క శక్తివంతమైన గొప్ప నామమున మనము పిలువబడియున్నాము. కాబట్టి, నేడు మీరు మీ తలల మీద ఆయన నామమును కలిగియున్నారు. ఊహించండి, ఎవరి మీదనైనను, రాజుగారి పేరు ఉన్నట్లయితే, రాజుగారు ఒక ప్రత్యేకమైన పని మీద వానిని పంపించినట్లయితే, 'వారు, రాజాజ్ఞ వలన నేను ఇక్కడ ఉన్నాను' అని చెప్పినప్పుడు, వారు సామాన్యమైన వ్యక్తి అయినప్పటికిని, రాజు గనుకనే వానిని గుర్తించినట్లయితే లేక పంపించినట్లయితే, అందరు కూడ అతనికి భయపడతారు. అవును, మనము కూడ అటువంటి అధికారమును కలిగియున్నాము. ప్రతి మోకాళ్లు ఆయన నామమున వంగునట్లు చేయు అధికారము అదియే. అవును, భూమిక్రింద ఉన్న ప్రతిమోకాళ్లు కూడా, పాతాళమందున్న ప్రతి మోకాళ్లు కూడా ఆయన నామమున వంగుతాయి. ఆ నామమును బట్టి, దేవునికి వందనములు. అటువంటి గొప్ప నామమును కలిగియున్నాము. మనము ఆయన మహిమ బయలుపరచు నిమిత్తము సృజింపబడియున్నాము. కనుకనే, మీరు దేనికిని భయపడకండి.

నా ప్రియులారా, పై వచనము ఈలాగున చెబుతుంది, 'దేవుని మహిమ కార్యాలు మన జీవితములో ప్రత్యక్షపరచబడులాగున మనము సృజించబడ్డాము.' దేవుడు ఏదైన కార్యమును జరిగించినట్లయితే, అద్భుతంగా ఉంటుంది కదూ! మీ జీవితములో మహిమవంతమైన కార్యాలు ఆ రీతిగా ప్రణాళిక చేయబడ్డాయి. మీరు ఇందులో నిలిచి ఉండునట్లుగా, మీ జీవితాన్ని ఆయన మహిమ కొరకు సమర్పించుకొని, 'ప్రభువా, నా ద్వారా నీ యొక్క బలీయమైన కార్యాలను జరిగించుము' అని చెప్పండి. ఇంకను ఆయన హస్తములో ఒక సైనిక భటుని వలె ఉండండి. సైన్యాధిపతి ఆజ్ఞ ప్రకారం పరుగులెత్తుచున్న ఒక సైనికుడివలె ఉండండి. నేను ఈ విధంగా జీవించడం నేర్చుకున్నాను, నిరంతరం ఆయన చిత్తానికి లోబడి ఉన్నాను. నేను ఆయనతో, 'ప్రభువా, నీ చిత్తము నా జీవితములో నెరవేరును గాక, నా జీవితములో నెరవేరును గాక' అని చెప్పుచున్నాను. మరియు ప్రతి క్షణం నేను ఆయనను స్తుతిస్తాను, ప్రతి అద్భుతాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని మరియు ప్రతి అవకాశాన్ని తీసుకొని వచ్చినది దేవుడు అని గుర్తించుటకు నేర్చుకున్నాను. ఇది నా జీవనశైలిగా మారింది-ఆయన మహిమ కొరకు సృష్టించబడిన వ్యక్తిగా జీవించడం, ఆయన గొప్ప కార్యాలకు జీవముగల సాక్ష్యంగా నిలబడి ఉండుటకు నేను నేర్చుకున్నాను. దేవుని ద్వారా ఈ కార్యము మరియు దేవుని ద్వారా ఈ అద్భుతము జరిగియున్నది. దేవుని ద్వారా ఈ స్థలములో వినియోగింపబడుచున్నాను. ఆయన మహిమ కొరకు సృజించబడిన హృదయాలను కలిగినవారుగా ఉండండి.

నా ప్రియులారా, ఈ కృపకు, ఆయన నామముతో పిలువబడే ఆధిక్యత కొరకు మరియు ఆయన మహిమ కొరకు ఉపయోగించబడే ఘనత కొరకు మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. ఈ రోజు మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి, మరియు మీరు దేవుని మహిమాన్వితమైన చర్యగా మారతారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ అద్భుతమైన నామముతో మమ్మును పిలిచినందుకు మరియు నీ మహిమను ప్రత్యక్షపరచడానికి మమ్మును సృజించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మా జీవితంలో నీవు చేయుచున్న ప్రతి పనిని మేము విలువైనదిగా భావిస్తున్నాము మరియు నీవు మా మీద ఉంచిన పిలుపుకు ఎంతో విలువనిచ్చుచున్నాను. మా జీవితం కొరకు నీ ప్రణాళికలు మరియు ఉద్దేశాలను నెరవేర్చడం ద్వారా ఈ పిలుపును గౌరవించడంలో మాకు సహాయం చేయుము. ప్రభువా, మా హృదయంలో నిన్ను ఉన్నతంగా ఉంచాలని మరియు మేము చేయుచున్న ప్రతి పనిలో నిన్ను మహిమపరచాలని కోరుకుంటున్నాను. దేవా, నీ మహిమాన్వితమైన కార్యాలు మా జీవితంలో బయలుపరచునట్లు చేయుము. మరియు మా కొరకు ఉద్దేశించిన ఉద్దేశములన్నియు నెరవేరునట్లు కృపను దయచేయుము. ప్రభువా, మేము చేపట్టే ప్రతి కార్యములోను ముందుకు కొనసాగునట్లుగాను మరియు నీ మహిమ కొరకు ప్రకాశవంతంగా ప్రకాశించేలా మమ్మును అనుమతించుము. ప్రభువా, మేము యేసును ప్రతిబింబించునట్లుగాను మరియు ఈ లోకానికి నీ మంచితనాన్ని వెల్లడి చేయునట్లుగాను మమ్మును నీ ప్రేమగల పాత్రగా ఉపయోగించుకొనునట్లుగా మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, నీ సన్నిధిని మా మీద ప్రసరింపజేయుము మరియు మేము మాట్లాడే మరియు చేయుచున్న ప్రతిదానిలో నీ మహిమను ప్రతిబింబించే వారినిగా మమ్మును మార్చుము. ప్రభువా, నేడు నీ నామమ మహిమ కొరకు మమ్మును ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుచు యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.