నా అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 1:19వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను'' ప్రకారం, దేవుడు మీ నిమిత్తము జ్ఞానాత్మను కలిగియున్నాడు. ప్రత్యక్షత గల ఆత్మను ఆయన నిమిత్తము కలిగియున్నాడు. ప్రత్యక్షత అను మాటకు మరొక అనువాదములో స్పష్టమైన మనస్సు లేక నిబ్భరమైన మనస్సు అని తెలియజేయబడుచున్నది. ఈ లోకములో మనకు అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. నా చదువులకు సంబంధించి, నేనేమి చేయాలి? నాకు యెదుట 3 భాగములుగా ఉన్నాయి. అవి, ఒకటి నా వివాహము, ఉద్యోగము, నా యొక్క కుటుంబము, గృహము ఎక్కడ నిర్మాణము చేసుకోవాలి? నాకెన్నో మార్గములు తెరువజేయబడుచున్నవి. నేను దేనిని చేపట్టుకోవాలి, ఏది నా పట్ల సఫలీకృతము అవుతుంది? ఏది నాకు భద్రతను ఇస్తుంది? కుటుంబ సమేతముగా, భద్రతను మరియు విజయమును పొందుకొనుటకు ముందుకు వెళ్లునట్లుగా ఏ మార్గమును నేను చేపట్టుకొని ముందుకు సాగిపోవాలి? నా యొక్క కుమార్తెను/కుమారుని మంచి మార్గములో ఏలాగున నడిపించాలి? తద్వారా వారికి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఉండాలి అని మన జీవితములో ఇలాగున మన మార్గమునకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు మనలో ఉండవచ్చును.
నా ప్రియులారా, ఇందునిమిత్తమును దేవుడు తన జ్ఞానమును మరియు మార్గదర్శకత్వాన్ని చూపించే ఆత్మను మనకు అనుగ్రహించుచున్నాడు. నేడు మీ మనస్సులో ఎంతో స్పష్టంగా ఆయన ప్రణాళిక ప్రకారం, మీరు ఎంపిక చేసుకోవలసిన మార్గమును ఆయన మిమ్మును నడిపించును. మీరు ఆ మార్గమును చేపట్టుకొనియున్నప్పుడు, మీరు వర్థిల్లెదరు. ఎందుకనగా, ఆయన చిత్తప్రకారము మీరు వర్థిలాలని ఉన్నది గనుకనే, యేసు మీతో కూడా నడుస్తాడు. అన్నిటిలోను మిమ్మును వర్థిల్లజేస్తాడు.
మీనాక్షి అను ఒక సహోదరి తన యొక్క బలమైన సాక్ష్యమును మాతో ఇలాగున పంచుకొని యున్నారు. 2009వ సంవత్సరములో ఆమెకు సంజయ్‌తో వివాహము జరిగింది. అతని ద్వారా ఆమె యేసును గురించి తెలుసుకున్నారు. తన జీవితాన్ని ఆమె యేసునకు సమర్పించుకున్నది. దేవుని శాంతి ఆమె హృదయమును నింపియున్నది. దంపతులుగా 2013వ సంవత్సరములో ఔరంగబాద్‌లో మేము నిర్వహించిన ఒక కూటమునకు పాల్గొన్నారు. దేవుడు ఆమె భర్తతో మాట్లాడియున్నాడు. సంపూర్ణమైన సేవ కొరకు దేవుడు అతనిని పిలిచియున్నాడు. అతడు తన ఉద్యోగమును విడిచిపెట్టాడు. యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో చేరాడు. అతడు ప్రార్థనా యోధునిగా పనిచేశాడు. ఆమె మా నాన్నగారు వ్రాసిన 'పరిశుద్ధాత్మ వరములు' అను పుసక్తమును చదువుచుండెను. ఆ పుస్తకమును చదువుచుండగా, పరిశుద్ధాత్మ కొరకు ఎంతగానో ఆమె తృష్ణ కలిగియుండెను.
2017వ సంవత్సరములో ఔరంగబాద్‌లో మేము నిర్వహించిన ప్రవచనాత్మకమైన సదస్సునకు వారు పాల్గొన్నారు. అక్కడ నేను పరిశుద్ధాత్మ అభిషేకముతోను మరియు దైవీకమైన వరములతోను దేవుడు ప్రజలను నింపాలని ప్రార్థించుచున్న సమయములో, ఆమె అన్యభాషలైన నూతన భాషలను పొందుకున్నారు. ఆమె ఏమి మాట్లాడుచున్నారో ఆమె ఆత్మలో అర్థము చేసుకోగలుగుచున్నారు. ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. దేవుడు ఆమెకు అనేక వరములను బయలుపరచడం ప్రారంభించాడు. ఆమె భర్త ప్రార్థనా గోపురమునకు యజమానిగా పదోన్నతిని పొందియున్నాడు. ఈ రోజు వారిద్దరు కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రకారం ప్రార్థనా గోపురములో సేవలను అందించుచున్నారు. ఆమె కుటుంబ ఆశీర్వాద పధకములో భాగస్థులయ్యారు. వారి బిడ్డలు యౌవన భాగస్థుల పధకములో భాగస్థులుగా చేర్చబడ్డారు. తద్వారా, వారి పిల్లలు చదువులలో వర్థిల్లుచున్నారు. అవును, నా ప్రియులారా, నేడు మీరు కూడా ఇటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనండి. మీరు కూడా కుటుంబ ఆశీర్వాద పధకములో భాగస్థులుగా నమోదు చేసుకున్నప్పుడు, దేవుడు మీ కుటుంబాన్ని నడిపించుకొనుటకు తగిన జ్ఞానమును మీకు అనుగ్రహిస్తాడు. అందుకు కావలసిన నడిపింపును మీకు దయచేస్తాడు. మార్గదర్శకత్వం గల మనస్సును మరియు జ్ఞానముగల ఆత్మను మీకు అనుగ్రహించి, మిమ్మును నడిపించినప్పుడు, మీరు ప్రభువులో బలపరచబడి, వర్థిల్లతను పొందెదరు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా పరమ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతోను, వరములతోను మమ్మును నింపుము. దేవా, మా కుటుంబమంతయు నీ నడిపింపు ద్వారా వర్థిల్లునట్లు చేయుము. యేసయ్యా, నీ యొక్క జ్ఞానమును మరియు ప్రత్యక్షతలను మాకు అనుగ్రహించి, మమ్మును నీ సేవాపరిచర్య కొరకు వాడుకొనుము. దేవా, మా హృదయాన్ని స్పష్టతతో మరియు దృఢమైన మనస్సుతో నింపడానికి మేము నీ పరిశుద్ధాత్మను కోరుతూ నీ యొద్దకు వచ్చుచున్నాము. ఇప్పుడే మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మతోను మరియు వరములతోను మమ్మును నింపుము. దేవా, మా చదువు, భవిష్యత్తు లేదా కుటుంబంలో మేము ఎదుర్కొనే ప్రతి నిర్ణయంలో దయచేసి మమ్మును నడిపించుము. ప్రభువా, మా వర్థిల్లతకు మరియు శాంతికి దారితీసే మార్గాన్ని గుర్తించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, మేము నీ చిత్తమును జరిగించుటకు మాకు కావలసిన నీ యొక్క జ్ఞానమును మరియు ప్రత్యక్షతలను మాకు అనుగ్రహించుము. ప్రభువా, మాతో నడువుము మరియు నీ పరిపూర్ణ జ్ఞానంతో నింపి, మమ్మును నడిపించుము. దేవా, మా కుటుంబాన్ని సరైన మార్గములో నడిపించి, ఆశీర్వదించుము మరియు మేము నిన్ను అనుసరిస్తున్నప్పుడు మా అడుగులను స్థిరంగా నీలో నిలిచి ఉండునట్లుగా కాపాడుము. ప్రభువా, మేము నీతో సురక్షితంగా మరియు భద్రంగా ఉండునట్లుగాను మరియు మమ్మును ఆధ్యాత్మికంగాను మరియు భౌతికంగాను అభివృద్ధి చెందునట్లు చేయుదువని నమ్ముచు సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.