నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మిమ్మును పలకరించడం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ రోజు యిర్మీయా గ్రంథములోని ఒక శక్తివంతమైన వాగ్దానాన్ని మనము ధ్యానించబోవుచున్నాము. బైబిల్ నుండి యిర్మీయా 1:5వ వచనములో దేవుడు ఈలాగున చెబుతున్నాడు, "గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని'' ప్రకారం అవును, ప్రియ స్నేహితులారా, మీ తల్లి గర్భములో రూపింపబడమునుపే ప్రభువు మిమ్మును ఎరిగియున్నాడు. మీరు పుట్టకముందే మిమ్మును ప్రతిష్ఠించియున్నాడు. కనుకనే, మీరు భయపడకండి.

నా ప్రియులారా, బహుశా, 'నా జీవితములో ఏ ఉద్దేశము లేదు అని అంటున్నారేమో? నా భవిష్యత్తులో నాకు ఏమి చేయాలని నాకు తెలియలేదు. నా జీవితానికి ఒక ప్రణాళిక అంటు ఉన్నదా? అని ఆలోచిస్తూ ఉండవచ్చును. నా బలహీనతలన్నిటిని బట్టి, లేక నాకున్న సమస్యలన్నిటిని బట్టి, నేను ఎదుర్కొనే సవాళ్లను బట్టి, జీవితములో విజయవంతమైన కార్యములను చేస్తానో, లేదో అని మీరు అనుకుంటూ నిరుత్సాహముతో ఉన్నారేమో?' ప్రియ స్నేహితులారా, ప్రవక్తయైన యిర్మీయా జీవితాన్ని చూచినట్లయితే, ప్రభువు ఈ వాగ్దానము ఇచ్చినప్పుడు దేవునితో యిర్మీయా, "అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదనెను.'' అయితే, " యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు'' (యిర్మీయా 1:6-8)లో చెప్పబడియున్నది.

అవును నా ప్రియ స్నేహితులారా, అనర్హుడని భావించడంలో యిర్మీయా ఒక్కడే కాదు. దేవుడు పిలిచినప్పుడు, మోషే కూడా అదే కార్యాన్ని తెలియజేశాడు, "అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండియైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పెను'' ఆలాగుననే, గిద్యోను కూడా, "నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను'' అందుకు యెహోవా, " అయిన నేమి? నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను.'' కాబట్టి, దేవుడు వారికి తోడుగా ఉన్నందున, వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారని మనము బైబిల్‌లో చూడగలము.

అవును నా ప్రియులారా అదే దేవుడు నేడు మీతో కూడా ఉన్నాడు, 'నేను చిన్నవాడను, నేను ఎలా మాట్లాడాలో నాకు తెలియదు' అని చెప్పకండి. ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియలేదు,' అని అనకండి. ఈ కంపెనీని ఎలా ప్రారంభించాలో నాకు తెలియలేదు, నేను ఎలా చదవాలో నాకు తెలియలేదు. ఈ కుటుంబ జీవితము ఎలా ఎదుర్కోవాలో తెలియదు, నా బంధువులను నా జీవితములో ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు' అని అంటున్నారా? అయితే, ఇటువంటి పరిస్థితిలో, ప్రభువు మిమ్మును చూచి, " మీరు భయపడవద్దు, నేను మీతో ఉన్నాను, నేను మిమ్మును విడిపించెదను'' అని అంటున్నాడు. కాబట్టి, మీ తల్లి గర్భములో మీరు రూపింపబడకమునుపే, ఆయన మిమ్మును ఎరిగి ఉన్నాడు, మీరు ఏమి చేయబోవుచున్నారో ఆయనకు తెలుసు. మీ జీవితము కొరకు ప్రణాళికను సిద్ధపరచియున్నాడు, మీ సవాళ్లు అన్నిటి మధ్యలో కూడా, ప్రభువు మీతో కూడా ఉన్నాడని ధైర్యము తెచ్చుకొనండి. ఎటువంటి పరిస్థితిలోనైన ఆయన మిమ్మును రక్షిస్తాడు.

కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడే మీరు మీ అడుగును ముందుకు వేయండి. సాహసముతో ముందడుగు వేయండి. మీ జీవితములో మీరు గొప్ప కార్యములు చేయుటకు ప్రభువు మీకు సహాయము చేస్తాడు. మీరు గొప్ప కార్యములు మీ జీవితములో జరుగుట మీరు చూచెదరు. తల్లి గర్భములో పడకముందే ఆయన మనలను ఎరిగియున్నాడన్న వాగ్దానమును నమ్మి ఆయనకు వందనాలు చెల్లిద్దాము. గొప్ప కార్యాలు చేయడానికి ఆయన మనలను ప్రతిష్టించియున్నాడు. ఈ వాగ్దానమును మనము పొందుకుందాము. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ ముందున్న అవకాశాలు నిరుత్సాహంగా అనిపించినా వాటిని స్వీకరించండి. ఇది కొత్త వెంచర్ అయినా, వ్యక్తిగత సవాలు అయినా లేదా కష్టమైన నిర్ణయమైనా, గొప్ప విషయాలను సాధించడంలో మీకు సహాయం చేసేందుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడని నమ్మండి. ఆయన ఉనికితో, మీరు ఊహించిన దానికంటే విజయాలు మరియు అభివృద్ధిని మీరు చూడగలరు. ఈ వాగ్దానానికి మిమ్మును సమర్పించుకొనండి మరియు ఆయన ఎల్లప్పుడూ మీతో ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన మీరు రూపింపబడకముందు నుండి తెలుసు మరియు ఒక ప్రణాళిక కొరకు మిమ్మును ప్రత్యేకపరచి యున్నాడు మీరు ఎన్నడును ఒంటరి వారు కాదు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము తల్లిగర్భములో రూపింపబడమునుపే నీవు మమ్మును ఎరిగి యున్నావని మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మా జీవితానికై నీవు ఒక ప్రణాళికను సిద్ధపరచి యున్నావు, మేము ఒంటరిగా నడవడము, నీ ప్రణాళిక కాదు, మా జీవితములో మా ప్రతి అడుగు, నీవు మాతో నడుస్తున్నావనియు, మేము నమ్ముచున్నాము. మా బలహీనతలలో కూడ నీవు మాతో కూడ పరిపూర్ణముగా నడుస్తున్నావని మేము గుర్తెరిగియున్నాము. దేవా, మేము నీ బలమును ఈ రోజు పొందుకొనునట్లు చేయుము. మాకు ఎదురగుచున్న ప్రతి సవాళ్లును ఎదుర్కొనుటకు నీ బలమును మాకు దయచేయుము. ప్రభువా, మేము ఎక్కడ ప్రారంభించాలో, తెలియక భయపడుచున్న, మా జీవితములో నీ జ్ఞానమును, ధైర్యమును, బలమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, నేడు మేము నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించుటకును, ఉన్నత శిఖరములను అధిరోహించడానికి, కుటుంబాలను సిద్ధపరచుటకు, మాకు విరోధముగా పనిచేయుచున్న శత్రువులను ధైర్యముగా ఎదుర్కొనుటకు మాకు నీ సహాయమును దయచేయుమము. దేవా, నీ చిత్తమును జరిగించడానికిని మరియు నీ ప్రణాళికను చేయడానికి, ముందడుగు వేయుటకు సహాయము చేయుము. దేవా, నేడు మా సవాళ్ల అన్నిటి నుండి మమ్మును విడిపించి, మా జీవితములో ఉన్నతముగా మమ్మును హెచ్చించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.