నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 7:8వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును'' ప్రకారం ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనము. మనము తట్టునప్పుడు, దేవుడు ద్వారము తెరువజేసి, మనకు జవాబును అనుగ్రహించువాడై యున్నాడు. ఎలీషా యొర్దాను దాటవలసి వచ్చినప్పుడు, నీరు అత్యున్నతమైన వేగముతో పొంగిపొర్లుతూ ప్రవహిస్తున్నట్లుగా ఉండెను. కానీ, అతడు అయితే, తన పై వస్త్రమును తీసుకున్నాడు. అతడు నీటిని కొట్టియున్నాడు. "ఏలీయా దేవుడు ఎక్కడ? ఏలీయా దేవుడు ఎక్కడ? ఉన్నాడు'' అని చెప్పినప్పుడు, నీళ్లు వెంటనే తెరవజేశాడు. అతడు నది నీళ్లగుండా వెళ్లియున్నాడు. ఈ రోజున కూడా, 'ప్రభువైన యేసు ఎక్కడ?' అని మనము అడుగుచున్నప్పుడు, యేసు యొక్క నామములో ఈ యొక్క ద్వారము తెరువబడును గాక, ఈ యొక్క మార్గము తెరవజేయబడును గాక. పరలోకము ఆకాశము తెరవబడుతుంది అని చెప్పినప్పుడు, అది ఆలాగున తెరువబడుతుంది. యేసయ్య ఈలాగున సెలవిచ్చుచున్నాడు, " నేనే ద్వారము '' కాబట్టి, 'యేసు అను ద్వారము లేక తలుపుగా ఉండియున్న నా ద్వారా నడుచువాడు, జీవమును మరియు పచ్చిక బయళ్లును కనుగొనును.' అవును, యేసు మన కొరకు ద్వారమును సంసిద్ధము చేసియున్నాడు. అయితే, మనము ఆయన ద్వారా మాత్రమే నడవవలెను. యేసు నామమున తప్పకుండా అడగాలి. అప్పుడే, మనకు అవన్నియు అనుగ్రహింపబడును.
నా ప్రియులారా, నేడు యేసు నామమున మనము అడగవలసి ఉన్నది. కనుకనే, ఈ రోజు మీరు ఆయనను అడుగుట కొరకే వచ్చియున్నారు. అడగండి, మీరు పొందుకొనెదరు. తద్వారా, మీ యొక్క సంతోషము పరిపూర్ణమగుతుంది. అవును, అపవాది అన్ని తలుపులకు తాళము వేస్తుంటాడు. కానీ, బైబిల్‌లో యెషయా 45:2,3వ వచనములను చూచినట్లయితే, "నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుపగడియలను విడగొట్టెదను. పేరుపెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనేయని నీవు తెలిసికొనునట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అవును, అపవాది మూసివేయబడిన తలుపులన్నిటిని దేవుడు తెరవజేయుటకు ఆయన మీకు ముందుగా వెళ్లుచూ, మీ యొక్క వంకర మార్గములను సరాళము చేస్తాడు. ఇది మన ప్రభువైన యేసు యొక్క హృదయమై యున్నది. మీరు ఐశ్వర్యమును కలిగి ఉండాలని కోరుచున్నాడు మరియు ఆయన మీరు నిధులను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన యొక్క జ్ఞానపు నిధులను, తన యొక్క నీతి అను ఐశ్వర్యమును ఈ ఆశీర్వాదములన్నిటితో కూడా మనకు కలుపబడుట జరుగుతుంది. అందుకు యేసు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, 'మొదటగా ఆయన నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడవన్నియు మీకు అనుగ్రహింపబడుట జరుగుతుంది.' పరలోకపు ద్వారము నొద్ద తట్టుచున్నదేమిటి? నీతి కలిగి జీవించుట. దేవుని చిత్తమునకు లోబడి, నీతిమంతులుగా జీవించినప్పుడు, ద్వారము తెరువబడుతుంది. యేసు సిలువలో వెల వెచ్చించి యున్న ఆశీర్వాదములన్నియు మీకు అనుగ్రహింపబడును గాక.
ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యము కలదు. గోపాల్ మరియు సహోదరి శాంతి. గోపాల్ కోయంబత్తూరుకు చెందిన ఒక పదవి విరమణ చేసిన కండక్టర్. అతడు భయంకరమైన అలసట చేత బాధింపబడుచుండెను. ఆలాగుననే, ఎన్నో అనారోగ్య సంబంధమైన సమస్యలతో పోరాడుచున్నాడు. అయితే, వైద్యులు ఎన్నో పరీక్షలు జరిగించారు. అతని యొక్క శ్వాస కోస నాళము అనేది ఆటంకపరచబడియున్నది. చాలా కొవ్వు నిల్వలు అక్కడ పేరుకొని పోయినది. అతని గుండె కూడ మంచి స్థితిలో లేదు. అతనికి అక్కడ వైద్యము చేయలేకపోయారు. కనుకనే, వారు మరొక స్థలమునకు సిఫార్సు చేశారు. వైద్యము చాలా ఖరీదైనదిగా ఉండెను. పరీక్ష వెంబడి పరీక్ష చేయవలసినదిగా సూచించుచున్నారు. పరిస్థితి చాలా దయనీయముగా ఉన్నది. అతడు ఏ మాత్రము కూడా నడవలేకపోతున్నాడు. అతని దేహము నలుపు రంగులోనికి మారిపోతుంది. గది నుండి మరొక గదిలోనికి వెళ్ళాలంటే, ప్రాకుతూ, దొర్లుతూ వెళ్లవలసిన పరిస్థితి వచ్చినది. చివరిగా అతని కుటుంబ సభ్యులు అతనిని బేతెస్ద ప్రార్థన కేంద్రమునకు మోసుకొని తీసుకొని వచ్చారు. ప్రార్థన యోధులు అతని కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు. ఆ తర్వాత, అతడు ఆశ్చర్యపోవునంతగా తదుపరి రోజున చాలా శక్తి మరియు బలము అతనికి వచ్చినట్లుగా అనుభూతి కలిగినది. రోజులు గడిచాయి, అతడు బలవంతుడయ్యాడు. వైద్యులు అతనిని మరల పరీక్ష చేయడం జరిగింది. ఆ తర్వాత, వారు ఈలాగున అంటున్నారు, మీ శ్వాస నాళములలో ఎటువంటి సమస్య కూడా లేదు. ఆలాగే ఎటువంటి శస్త్ర చికిత్స అవసరం లేదు. నూరు శాతము ఆరోగ్యముగా బాగున్నారు. ఈ రోజు అతడు ప్రార్థన గోపురమును సందర్శించి, ఇతరుల కొరకు ప్రార్థించుచున్నాడు. దేవుడు అతని ప్రార్థనలకు జవాబును అనుగ్రహించియున్నాడు. అతడు నీతి కలిగి నడుచుకొని యున్నాడు. ఇంకను అతనికి ద్వారము తెరువజేయబడినది. నా ప్రియులారా, దేవుడు మీకును ఆలాగుననే జరిగిస్తాడు. మీరు అడగండి, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.:
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మేము అడిగినప్పుడు, మాకు దొరుకునట్లుగాను మరియు మేము తట్టినప్పుడు తలుపు తెరవబడుతుంది అనే నీ యొక్క వాగ్దానానికై నీకు వందనాలు. దేవా, మేము ప్రార్థించుచున్న ఈ సమయములో మా యొక్క నీతిని చూడుము, దయచేసి, మా బంధకముల నుండి మమ్మును విడిపించుము, ద్వారములు తెరజేయుము, మా ఆత్మలను తెరవజేయునట్లుగా చేయుము. దేవా, యేసు నామమున మా జీవితములో నిన్ను చూచునట్లుగాను, నీ సన్నిధిని అనుభూతి చెందునట్లుగా చేయుము. ప్రభువా, ఏదైతే, మా జీవితములో ఇప్పుడు బంధింపబడియున్నదో దానిని ఇప్పుడే, ప్రభువా, నీవు తాకి, యేసు నామమున మమ్మును స్వస్థపరచుము. దేవా, ఇప్పుడే, మా యొక్క ప్రతి అవయములకు జీవము కలుగునట్లుగా చేయుము, మా ఊపిరితిత్తులు, శ్వాసనాళము, గుండె మరియు కాళ్లు స్వస్థపరచబడునట్లుగా చేయుము. దేవా, మా రోగ శయ్యమీద నుండి మమ్మును లేవనెత్తుము. ప్రభువైన యేసు, నీవే ద్వారము. కాబట్టి, నీవు మా కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదాల వైపు మమ్మును నడిపించుము. దేవా, ఈ రోజు, మేము విశ్వాసంతో తట్టుచున్నాను, నీవు మా యెదుట తలుపు తెరుస్తావని నమ్ముచున్నాము. ప్రభువా, మా యొక్క ప్రతి ఇనుప గడియలను పగులగొట్టి, మా జీవితంలోని ప్రతి వంకర మార్గాన్ని సరిచేయుము. ప్రభువా, నీవు మా కొరకు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును మాకిచ్చి మరియు నీతి సంపదలను మా ఆత్మలోనికి కుమ్మరించుము. దేవా, మేము మొట్టమొదట నీ రాజ్యాన్ని వెదకడానికి మరియు ప్రతిరోజు నీ నీతిలో జీవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా విశ్వాసాన్ని ఘనపరచి మరియు మా ఆశీర్వాదానికి మూయబడిన ప్రతి తలుపును ఇప్పుడే తెరువబడునట్లుగా చేయుము. దేవా, నేడు మేము అడుగుచున్నాము, మా సంతోషము పరిపూర్ణము చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.