నా ప్రియమైన స్నేహితులారా, నేటి దిన వాగ్దానమునకై మీకు స్వాగతం. దేవుడు మీ కొరకు ఒక గొప్ప అపురూపమైన అద్భుతకరమైన ఆశీర్వాదమును దాచి యుంచాడు. నేడు యేసు పిలుచుచున్నాడు మహోత్సవముల పరిచర్య 54వ వార్షికోత్సవమును జరుపుకుంటున్నది. భారత దేశము మరియు విశ్వవ్యాప్తంగా బహిరంగా అనేకమైన ప్రార్థనా మహోత్సవములను నిర్వహించాము. లెక్కలేనంతగా ప్రజల జీవితాలు దేవుని ద్వారా రక్షింపబడ్డాయి. పరిచర్య ఇంకను కొనసాగుచునే ఉన్నది. కాబట్టి, నాతో కలిసి ప్రభువుకు వందనాలు చెల్లించండి. ఇతరుల కన్నీరు తుడిచి వేయుచున్న ఈ యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో నిరాంతరాయంగా భాగస్థులుగా ఉండండి. దేవుని దీవెనలను పొందుకొనండి.

నా ప్రియులారా, ఈ రోజు దేవుడు మీ కన్నీటినంతటిని తుడిచి వేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా, బైబిల్ నుండి జెకర్యా 2:10వ వచనములో ఏమని చెబుతుందంటే, "సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును; సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.'' అవును, ఇది పాటలు పాడి సంతోషించే సమయం. ఎందుకనగా, దేవుడు మనతో నివసించడానికి ఆయన మన మధ్యకు వస్తున్నందున సంతోషముగా ఉండి పాటలు పాడే సమయం ఇది. ఆయన సన్నిధిని మీ గృహములో మీరు చూచెదరు. మీ ఇంట్లో, మీ కార్యాలయంలో మరియు మీరు ఎక్కడికి వెళ్లినా ఆయన సన్నిధిని మీరు అనుభవిస్తారు. మీరు ఎక్కడ వాహనమును నడుపుతున్నా, ఈ క్షణం నుండి, ఆయన మీతో ఉంటాడని మరియు మీ హృదయంలో నివసిస్తానని మీ పట్ల ఆయన వాగ్దానం చేయుచున్నాడు. కాబట్టి, నేడు మీరు ఎవరు లేరని భయపడకండి, ఆయన మీతో నివసించుచున్నాడని మరువకండి.

యేసు ప్రభువు జక్కయ్య వైపు చూచాడు. 'జక్కయ్య నేడే మీ యింటికి రావలసి యున్నదనియు, నీవు వచ్చి, నన్ను మీ యింటికి తీసుకొని వెళ్లుము అని చెప్పాడు.' యేసు అతని యింట ఒక అడుగు పెట్టగానే, జక్కయ్య హృదయములో ఆనందించడము ప్రారంభించాడు. తనకు ఏమి జరుగుతుందో అతనికి తెలియలేదు. కుటుంబ సభ్యులందరి దగ్గరకు పరుగులు పెడుతూ, సంతోషించాడు. తద్వారా, తనకు ఉన్న ఆస్తినంతటిని బీదలకు ఇచ్చుటకు, అతని హృదయము మార్పు చెందింది. అంతమాత్రమే కాదు, జక్కయ్య జీవితం మార్చబడినది. యేసు మీ హృదయము మధ్యలోనికి వచ్చియున్నప్పుడు, ఈలాగున జరుగుతుంది. అదే అధ్యాయము, జెకర్యా 2:5 లో చూచినట్లయితే, "నేను దాని చుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు'' ప్రకారం, దేవుడు మీ హృదయాన్ని తన మహిమవంతమైన సన్నిధితో నింపుతాడు. ఆయన మీ జీవితం ద్వారా తన మహిమను ఇతరులకు ప్రత్యక్షపరుస్తాడు.

నా ప్రియులారా, ఆయన మహిమ కార్యాలు మీ ద్వారా ఘనపరచడానికి సిద్ధమా? ప్రత్యేకంగా స్త్రీలు ఇప్పుడు ఎవరైతే, ఒంటరిగా ఉన్నారో? వారు, 'ప్రభువా, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవ్వరు లేరు ప్రభువా, నేను ఎవరి యొద్దకు వెళ్లలేన'' అని అంటున్నారా? అయితే, 'సీయోను కుమారీ, సంతోషించి, ఆనందించుము, దేవుడు మీ మధ్య నివాసము చేయనై యున్నాడు' అని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. మగ్దలేని మరియకు చేసినట్లుగానే, ఆమె దేవుని వెదకి, ఆయనను తన హృదయములోనికి అంగీకరించినది మరియు ఆయనను ఆనందపరచినది. కనుకనే, యేసు ఎల్లప్పుడు ఆమెతో కూడా ఉన్నాడు. ఆమె మధ్యన ఉండి ఆమెను ఆనందింపజేశాడు. అవును నా ప్రియులారా, నేడు అదే సంతోషము మీ యొద్దకు దిగివస్తుంది. నేడు మనము అటువంటి సంతోషమును స్వీకరిద్దామా? మనము ఆయనను మన యింటికి జక్కయ్య వలె ఆహ్వానిద్దామా? ఆలాగుననే మీరు ఇప్పుడే మరియ మరియు జక్కయ్య వలె దేవుని వెదకినట్లయితే, నిశ్చయముగా, జక్కయ్యను వెదకి వచ్చి, అతని యింటిలో నివసించినట్లుగానే, నేడు ఆయన మీ మధ్యన నివసించి, మీకు ఆనందాన్ని కలుగజేస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు సమీపంలో ఉన్నావని తెలిసి కృతజ్ఞతతో నింపడిన హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నీవు మా మధ్యలో నివసించి మా కన్నీటిని తుడిచివేస్తానని నీ వాగ్దానానికి వందనాలు. యేసయ్యా, మా జీవితాన్ని నీ రక్తము ద్వారా కడిగి రూపాంతరపరచుము. దేవా, మా జీవితము సమస్యలతో నిండియున్నవి, సహవాసము కొరకు విచారము మరియు మోసములోనికి మేము వెళ్లిపోవుచున్నాము. దేవా, ఎటువంటి ఆదరణ మాకు లేదు. నీవే మా ఆధారణ మరియు ఆధారము. కనుకనే, ప్రభువా, నీ మహిమాన్వితమైన సన్నిధితో మా హదయాన్ని నింపుము మరియు నీ రక్షణ ప్రాకారముతో మమ్మును ఆవరించుము. దేవా, మాలో ఉన్న ఒంటరితనం మరియు నిరాశ సమయాలలో నీవు ఎల్లప్పుడూ మాతో ఉన్నావని మాకు గుర్తు చేయుము. ప్రభువా, నిత్యము నీవు మా మధ్యన నివసించి, మాలో దుఃఖాన్ని తొలగించి, ఆనందాన్ని అనుగ్రహించుము. దేవా, మాకు సంబంధించినవన్ని పరిపూర్ణం చేస్తానని నీ వాగ్దానానికై మేము సంతోషించుచున్నాము. ప్రభువా, నీ మహిమను మా జీవితంలో ప్రకాశింపజేయుము, మా ప్రతి పరిస్థితిని నీ ఉద్దేశ్యం కొరకు మార్చుము. ప్రభువా, మా హదయాన్ని నీకు అప్పగించుచున్నాము, దయచేసి మాలో నివసించి, మాకు ఆశ్రయంగా ఉండి, మమ్మును నీ మార్గములో నడిపించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.