నా ప్రియలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి జకర్యా 9:12 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను'' అను లేఖనం ద్వారా నేడు మీకు రెండంతలుగా ఆశీర్వాదాలను అనుగ్రహిస్తానని ప్రభువు మీకు సెలవిచ్చుచున్నాడు. ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనమై యున్నది. నా స్నేహితులారా, ఒకవేళ మీ జీవితములో అన్నియు కూడా లయమై పోయినట్లుగా ఉన్నవేమో? మీ పరిశుద్ధత పతనమై పోయినదని మీరు అనుకుంటున్నారేమో? మీ పవిత్రమైన జీవితమును కోల్పోయామని మీరు అనుకుంటున్నారేమో? మీ ఆర్థికమును కోల్పోయినట్లుగా, మీ కుటుంబ సభ్యులను కోల్పోయినట్లుగా, మీ ఉద్యోగమును, మీ యింటిని, ఘనతను, పేరును కోల్పోయినట్లుగా, సమస్తమును మీరు కోల్పోయి ఉన్నట్లుగా అనుకుంటున్నారా? యోబునకు సంభవించినట్లుగానే, అతడు సమస్తమును కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, ఇల్లు బ్రద్ధలైపోయినది. ఆస్తి అంతయు తీసుకొని వెళ్లిపోయారు, ఘనత లేదు, అవమానము, రోగము, అన్నియు కూడా అతని నుండి వెళ్లిపోయాయి. వీధిలో, దుమ్ము బూడిదలో కూర్చుని చిల్లపెంకుతో గోకుంటు ఉండిపోయాడు. అందరి యెదుట అవమానముతో జీవించాడు. అతడు ఎంతో ఘనత వహించిన వ్యక్తి. ఎంతో దీవెనకరమైన వ్యక్తి, అంతటి వర్థిల్లత కలిగిన వ్యక్తి అతడు. అయినను అవన్నియు కూడా గతించిపోయాయి. కేవలము ఒక్క క్షణములోనే, అవన్నియు కూడా నాశనమై పోయాయి. ఎందుకనగా, దుష్టుని యొక్క దాడి వలన, దేవుని సన్నిధిని కూడా అతడు కలిగి ఉండలేకపోయాడు. అతడు దేవుని సన్నిధి కొరకు మొఱ్ఱపెట్టాడు. దేవుడు అంతకుముందు అతనికి ఎంతో సన్నిహితంగా ఉండెను. అయినప్పటికిని జవాబు లేదు. అతడు దేవుని సన్నిధిని పూర్తిగా కోల్పోయాడు. ఇంకను యోబు, ' నేను దేవుని ఎక్కడ కనుగొనగలను, నాకు తెలియజేసినట్లయితే, బాగుండును ' అని దుఃఖించాడు.

నా ప్రియులారా, ఒకవేళ ఇప్పుడు మీరు కూడా అటువంటి పరిస్థితుల గుండా వెళ్లుచున్నారేమో? అయితే, అటువంటి మిమ్మును చూచి, దేవుడు సెలవిచ్చుచున్నాడు, " నేను మిమ్మును రెండంతలుగా మరల పునరుద్ధరింపజేస్తాను. మీ బ్రద్ధలైన ప్రతి స్థితిలో నుండి మిమ్మును పైకి లేవనెత్తెదను. మిమ్మును బలముగా నిలుచులాగున చేయుదును. మిమ్మును రెండింతలుగా నింపెదను. మీరు కోల్పోయినవన్నియు కూడా మీకు రెండింతలుగా తిరిగి వచ్చును'' అని అంటున్నాడు. అవును, యేసు దాని కొరకు సిలువలో క్రయధనముగా తన ప్రాణమును చెల్లించాడు. ఎందుకంటే, మీరు రెండింతలు కలిగియుండునట్లుగా ఆయన తనను సిలువకు అప్పగించుకున్నాడు. నా ప్రియులారా, ఈ రోజు యోబువలె మీరు ఉన్నారేమో? మీరు యేసుతో కూడా భాగస్థులై యున్నారు. యోబు వలె మీరు మాతో నిలిచి ఇతరుల కొరకై ప్రార్థన చేయుచున్నారు. కనుకనే, ప్రభువునందు ఆనందించండి.

ఆలాగున సహోదరి వనిత సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. సహోదరి వనిత, 1995వ సంవత్సరములో ఆమెకు వివాహము జరిగినది. 19 సంవత్సరములుగా ఆమెకు బిడ్డలు లేరు, ఆమె ఎంతగానో దుఃఖము మరియు అవమానముతో పీడింపబడెను. ఆమెకు ఎటువంటి వైద్యము కూడ ఆమెకు సహాయపడలేదు. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆమె మరియు భర్త వారిద్దరు కూడా సమస్త నిరీక్షణను విడిచిపెట్టారు. అటువంటి సమయములో కోయంబత్తూరులో ఉన్న బేతెస్ద ప్రార్థనా కేంద్రమునకు వారు వచ్చారు. ఆమె యొక్క సహోదరి, ఆమెను మరియు పుట్టబోయే బిడ్డను Äౌవన భాగస్థుల పధకములో భాగస్థులనుగా నమోదు చేసెను. ఆమె అప్పటికి ఇంకను గర్భము దాల్చలేదు. కానీ, గర్భము దాల్చక ముందే ఆ విధంగా పుట్టబోయే ఆ బిడ్డను ఆ పధకములో నమోదు చేసుకున్నారు. సహోదరి వనిత, బేతెస్ద ప్రార్థనా కేంద్రములో ఉపవాసము ఉండి ధ్యానగదిలో ప్రార్థన చేసికొనియున్నారు. ఆ తర్వాత ఆమె, 'ప్రభువా, నేను మరల బిడ్డతో మాత్రమే ఇక్కడకు వస్తాను ' అని ఒప్పందము చేసుకున్నారు. ఇంకను యేసు పిలుచుచున్నాడు టి.వి. కార్యక్రమమునకు స్పాన్సర్‌గా వారు కానుకలు సమర్పించారు. ఆ టి.వి. కార్యక్రమములో నేను వారి కొరకు ప్రార్థన చేశాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ మరుసటి నెలలో ఆమె గర్భము ధరించినది. వైద్యులు నీకు ఇప్పుడు కవల పిల్లలు అని చెప్పారు. దేవునికి స్తోత్రములు. ఆమె ఒక కుమారునికి, కుమార్తెకు జన్మనిచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియులారా, దేవుడు రెండింతలుగా మీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అందుకొరకే యేసు క్రయధనమును చెల్లించాడు. మీరు నీతిగా జీవించియున్నారు, యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ఇతరుల కొరకు ప్రార్థించియున్నారు కనుకనే, నేడు మీరు కోల్పోయిన వాటిని రెండింతలుగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి, మీరు భయపడకండి, ధైర్యముగా దేవుని యొద్దకు రండి, ఆయన మీరు కోల్పోయిన వాటన్నిటిని రెండింతలుగా మీకు దయచేసి, నేటి వాగ్దానము ద్వారా మీ బంధకములన్నిటి నుండి మిమ్మును విడిపించి, రెండంతలుగా దీవించును గాక.

ప్రార్థన:
కనికరము కలిగి మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము కోల్పోయిన వాటన్నిటిని మరల మాకు దయచేయుము. ప్రభువా, మా వ్యాపారములోను, మా మరియు మా పిల్లల చదువులలోను, వ్యాపారములలోను, ఉద్యోగములోను మాకు రెండింతలు ఆశీర్వాదాలను అనుగ్రహించుము. యేసయ్యా, నీ నామమున మా శరీరములో రెండింతల బలమును అనుగ్రహించుము. దేవా, మేము స్వస్థతను పొందుకొనునట్లు మా శరీరములను చేయుము. ప్రభువా, సంతానము లేని మాకు రెండింతలుగా సంతానమును దయచేసి, మా కుటుంబములో రెండింతల ఆనందమును కలిగియుండునట్లు మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మేము రెండింతలుగా పొందుకొనునట్లు చేయుము. యేసయ్యా, నీ పునరుద్ధరణకు సంబంధించిన నీ యొక్క వాగ్దానాన్ని నమ్ముతూ, మేము విశ్వాసంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, మేము మా జీవితంలోని ప్రతి బ్రద్దలైన భాగాన్ని, ప్రతి నష్టం మరియు ప్రతి కన్నీటిని చూచి, మాకు రెండంతలుగా దీవెనలు కలుగజేయుము. దేవా, మా శరీరములో వ్యాధులను ముట్టి మాకు స్వస్థత రెట్టింపుగా దయచేయుము. ప్రభువా, బలహీనమైన మా ప్రతి గుంట నుండి మమ్మును పైకి లేవనెత్తి, కోల్పోయిన మా బలాన్ని మరల పునరుద్ధరించుము. యేసు, ఈ ఆశీర్వాదం కొరకు వెల చెల్లించినందుకు, మా కొరకు ఈ నిరీక్షణను భద్రపరచినందుకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీ ప్రేమ మరియు విశ్వసనీయతలో మేము స్థిరంగా నిలబడటానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.