నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:8వ వచనమును వాగ్దానముగా తీసుకొనబడినది. ఆ వచనము, "నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును'' ప్రకారం నేడు దేవుడు నీ కొట్ల మీదకు, గోదాముల మీదకు తన ఆశీర్వాదమును పంపిస్తాడు. గోదాము అని అనగా, అది ఆహార పదార్థములను నిల్వ ఉంచే ప్రాంతము. మరియు మీ పంటను, కోతను నిల్వ ఉంచే ఒక ప్రాంతము. ఆలాగుననే, మీ హృదయము ఒక గోదాముగా ఉన్నది. మీ హృదయములో మీరు యేసును నిల్వ ఉంచుచున్నారు. కాబట్టి, దేవుడు మీ హృదయమును ఆశీర్వదించును. మీరు ఇన్ని రోజుల పాటు యేసు మీరు మోసియుండగా, ఇంకను మీ యొక్క కుటుంబము కూడా ఒక గోదాము. అందుకే లేఖనములో చూచినట్లయితే, "ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు యేసునందు విశ్వాసముంచినప్పుడు, మీ యింటి వారందరును రక్షింపబడెదరు.కనుకనే, మీరు యేసునందు విశ్వాసముంచినప్పుడు, యేసును మోసుకొనుచు ఉండునటువంటి కుటుంబముగా, మీ కుటుంబము కూడా ఉంటుంది. మీ కుటుంబములో ఉన్న వారందరు కూడ యేసును తమ హృదయములో మోయు వారందరుగా ఉందుదురు.

ఆలాగుననే, నా ప్రియులారా, యేసును ప్రజల చెంతకు తీసుకొని వెళ్లడానికి, మీరు మీ యొక్క కానుకలను సమర్పించుచున్న సేవా పరిచర్య కూడా ఒక గోదాము వంటిది. అక్కడ అది యేసు నివసించు ప్రాంతము. ప్రార్థన గోపురములు, యేసు నివాసముండు ప్రాంతము. సభలు నిర్వహించబడుచున్న ప్రాంతాలలో యేసు వచ్చి, ప్రజల హృదయాలను నింపుచున్నాడు, మాద్యముల ద్వారా, పత్రికల ద్వారా, సామాజిక మాద్యమముల ద్వారా, ఇంకను మేము పంపించు ఉత్తరముల ద్వారా, యేసు ప్రజల హృదయములను నింపుచున్నాడు, మీరు ఈ పరిచర్యకు సహకారము అందించుచుండగా, యేసు యొక్క గోదాములను మీరు నింపుచున్నారు. కనుకనే, దేవుడు మీ గోదాముల మీదకు ఆశీర్వాదములను ఆజ్ఞాపించును. ఎందుకనగా, మిమ్మును ఆశీర్వదించు యేసును మీరు తీసుకొని వచ్చుచున్నారు. బైబిల్‌లో గలతీయులకు 3:13 వ వచనమును చూచినట్లయితే, "క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను '' ప్రకారం మనము దేవుని ఆశీర్వాదములను స్వీకరించునట్లుగా, యేసు మన నిమిత్తము శాపమై యున్నాడు. మనము యేసును మన హృదయాలలోనికి స్వీకరించినప్పుడు, ఇంకను యేసును మనము మన కుటుంబాలలోనికి తీసుకొని వచ్చినప్పుడు, యేసు పిలుచుచున్నాడు పరిచర్యల ద్వారా, అర్పణ మరియు ప్రార్థనల ద్వారా లక్షలాది మందికి యేసును తీసుకొని వచ్చినప్పుడు, యేసును మనము చేపట్టి, ఆయన రాజ్యంలోకి విత్తినప్పుడు, మనం యేసును కలిగి ఉన్న ప్రతిదానిపై దేవుడు ఆశీర్వాదమును పంపుతాడు.

అప్పుడు నా ప్రియులారా, మీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, మీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది, మీ పరిచర్య ఆశీర్వదింపబడుతుంది, మీ ఉద్యోగము, చదువులు, వ్యాపారము, ఇతరులతో మీ యొక్క బాంధవ్యము ఆశీర్వదింపబడి ఉంటుంది మరియు సామాజిక జీవమును ఆశీర్వదింపబడుతుంది. మీరు చేయదలచిన ప్రతిదానిని కూడా దేవుడు ఆశీర్వదించును. మీ యెడల అన్యాయపు చర్యలు జరిగించినప్పటికిని, మీరు చేయుదానిని దేవుడు ఆశీర్వదించును. యోసేపు యొక్క పాపము ఏమియు లేనప్పటికిని అతడు చెరసాలలో వేయబడ్డాడు. కానీ, దేవుడు అతనితో కూడా వెళ్లాడు. దేవుడు అతని యొక్క చేతి పనిని ఆశీర్వదించియున్నాడని మనము చూస్తున్నాము. కనుకనే, చెరసాల నాయకుడు అందరికంటెను ఇతనిని అధికారిగా చేసినట్లుగా మనము చూడగలము. ఇది నేడు మీ కొరకైన దేవుని ఆశీర్వాదము.

కాబట్టి, నా ప్రియులారా, మీరు అన్ని విషయములలో యేసును మీతో కలిగి ఉంటుండగా, మీరు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములను స్వీకరించెదరు. కనుకనే, మీరు ఏదైన ఒక కార్యము చేయుటకు ముందుగా ప్రార్థన చేయండి. చెప్పండి, " ప్రభువా, నేను చేయబోవుచున్న కార్యమునకు, నీవే కేంద్ర స్థానములో ఉండండి.' మీరు ఏదైనను వంట చేయకముందు కూడా, మీరు కాల్‌కు జవాబు ఇచ్చే ముందు కూడా, మీరు ఎవ్వరినైనను స్వీకరించుటకు తలుపు తెరచుటకు ముందు కూడా, మీరు చదువుటకు ముందు కూడా, పని చేయుటకు ముందు కూడా, కనీసం మీరు బైబిల్ చదువుటకుగాని, ప్రార్థించండి, " యేసయ్యా, ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదములను ఈ కార్యము మీదికి పంపించుము'' అని చెప్పినప్పుడు, మీరు చేయు సమస్తము కూడా ఆశీర్వదింపబడుతుంది, మీరు వర్థిల్లత పొందెదరు. దేవుడు ఇటువంటి గొప్ప కృపను మీకు అనుగ్రహించును గాక, యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు మీరు కానుకలు పంపించే ముందు కూడా, దైవాశీర్వాదముల కొరకు ప్రార్థించండి. అది వెళ్లి లక్షలాది మందిని తాకుతుంది. దేవుని ఆశీర్వాదములు మీ మీదికి దిగివస్తుంది. దేవుడు మిమ్మును దీవించను గాక.

ఆలాగుననే, అద్భుతమైన ఒక సాక్ష్యమును మనము ఇక్కడ చూడగలము. నామకల్ నుండి, ఒక చిన్న గ్రామము నుండి సహోదరి చిత్ర ఈ సాక్ష్యమును పంచుకున్నారు. ఆమె వ్యవసాయము చేసుకునే ఒక కుటుంబము. కానీ, ఆమె ఎప్పుడు కూడా వర్షాల కొరకు కనిపెట్టుకొని ఉండేవారు. తద్వారా, వారి యొక్క పంటలు బాగా ఎదగాలని ఎదురు చూస్తుంటారు. ఇలాగుండగా, 2018వ సంవత్సరములో, ఆమె భయంకరమైన కరువును ఎదుర్కొన్నారు. ఎంతో దుఃఖమును అనుభవించెను. పంటలు అస్సలు పండలేదు. వారు
ఆ ఖర్చులను సంధించుట కొరకు ఎంతగానో బాధపడ్డారు. నాగలితో కూడా దున్నడము కొరకైన ధనము. పని వారికి కావలసిన వేతనములు ఇచ్చుటకు ధనము లేకుండా ఎంతో ఇబ్బంది పడ్డారు. అటువంటి సమయములోనే యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము నుండి ప్రార్థన యోధులైన వారు, వారి గృహమును సందర్శించారు. వారు అచ్చట ప్రార్థించారు. 'ప్రభువా, ఏ కీడు నీ బిడ్డల యొద్దకు నీవు రానియ్యకండి. వారు కన్నీటితో విత్తము వేసియున్నారు, సంతోషగానముతో పంట కోయునట్లుగా చేయుము, వారి అంగలార్పునంతటిని, కూడా ఆనందముగా మార్చండి' అని ప్రార్థించారు. 2019వ సంవత్సరము వచ్చినది, వర్షములు కురిసాయి. ఆ యొక్క భూమి ఎంతగానో మంచిగా సాగు చేయబడినది. వారు వేరుశెనగలు పండించుచుండిరి. వారు కోతకోసమై సంసిద్ధమగుచుండగా, వాతావరణ సూచనగా, తుఫాను సంభవించబోవుచున్నది అని తెలియజేశారు. వారు ఎంతగానో భయపడ్డారు, ఒక తుఫాను గానీ వచ్చినట్లయితే, పండిన వేరుశెనగ పంట అంతయు కొట్టుకొనిపోయి, నాశనమవుతుంది అని తలంచి, మరల వారు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు కాల్ చేసి, ప్రార్థించుకున్నారు. ప్రార్థనా యోధులు వారి కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు, ఆ వర్షము ఆగిపోయినది. మరల ఎటువంటి తుఫాను కూడా రాలేదు. కానీ, ఎండ తీవ్రత వారి మీదికి రావడము జరిగినది. వెరుశెనగల కొరకు వారు కోరుకున్న వాతావరణం అదియే. వారికి సమృద్ధియైన పంట లభించినది. వారి బాధలు, నొప్పులు సమస్యలన్నియు కూడా తొలగించబడ్డాయి. మంచి ఆదాయము కూడా రావడము జరిగినది. వారు విత్తనము వేసినప్పుడు మరియు వ్యవసాయము చేసిన ప్రతి ఫర్యాయము కూడా ప్రతిసారి ప్రార్థన గోపురమును సంద్రించేవారు. తద్వారా కుటుంబము వర్థిల్లతను పొందియుండెను. పని వారు కూడా ఆశీర్వదింపబడ్డారు. ఇతరుల కొరకు ప్రార్థించునట్లుగా దేవుడు మమ్మును ఆశీర్వదించియున్నాడు. కాబట్టి, నా ప్రియులారా, నేడు మీరు కూడా ఈలాగున దేవుని సన్నిధిలో ప్రార్థించండి, నేటి వాగ్దానము ద్వారా దీవెనలు పొందండి. ప్రార్థనా గోపురము ద్వారా మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మీ గోదాములను కూడా ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా పంటలను సాగు చేయు కొరకు ప్రార్థిస్తున్నాము, దయచేసి, మాతో కూడా నిలిచి ఉండుమయ్యా. మా వ్యక్తిగత జీవితాలకు నీవు ప్రభువుగా ఉండుము, తండ్రీ, మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదిస్తానని నీవు ఇచ్చిన వాగ్దానానికి మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాము. దేవా, మా హృదయాన్ని, మా కుటుంబాన్ని, మా ఉద్యోగాన్ని మరియు మేము చేయు ప్రతిదానిని నీ చేతులలోనికి అప్పగించుచున్నాము. ప్రభువైన యేసు, మా హృదయంలో మరియు ఇంట్లో నివసించి, మా వ్యక్తిగత జీవితాన్ని నీ సన్నిధితోను మరియు శాంతితోను నింపుము. ప్రభువా, నీ యొక్క దైవీకమైన అనుగ్రహం, పని, చదువులు మరియు సంబంధాలపై ఉండునట్లుగాను, విజయం మరియు శ్రేయస్సును తీసుకొని వచ్చునట్లుగా చేయుము. దేవా, నీవు యోసేపును కష్టాలలో ఆశీర్వదించినట్లుగానే, మా కష్ట పరిస్థితుల్లో కూడా మమ్మును ఆశీర్వదించుము. ప్రభువా, మేము మా కానుకలు మరియు ప్రార్థనలను ఇతరులకు ఆశీర్వాదకరముగాను, నీ సేవాపరిచర్యకు సమర్పించునట్లుగా సహాయము చేయుము. దేవా, అవి జీవితాలను తాకి, అనేకులను నీ రాజ్యానికి తీసుకొని వచ్చునట్లుగా కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మా గోదాములు సమృద్ధిగా పొంగిపొర్లునట్లుగాను, మమ్మును ఇతరులకు ఆశీర్వాదంగా ఉండునట్లుగా చేయుమని సమస్త మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.