నా మూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 9:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు; కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు'' ప్రకారం దేవుని వెదకువారిని ఏ మాత్రము కూడా విడిచిపెట్టువాడు కాడు. ఈ రోజున మీరు ఆయనను వెదకుచున్నారు. కనుకనే, నిశ్చయముగా మీరు విడువబడరు.
మగ్దలేని మరియ యేసును వెదకెను. తెల్లవారుజామున యేసును మృతమైన వ్యక్తిగా ఆయనను పాతిపెట్టిన ఆ ఖాళీ సమాధిని చూడడానికి వెళ్లినది. ఆమె కేవలము యేసు యొక్క మృత దేహమును మాత్రమే వెదకుచుండెను. ఆ రోజు తెల్లవారుజామున యేసు ముందుగానే లేచియున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన చనిపోయిన మృత దేహము మరల సజీవముగా లేచినది. తిరిగి లేచియున్న యేసుగా మరియు పునరుత్థానుడైన యేసుగా ఆయన ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను చూచి, ఆయన ఇలాగున అంటున్నాడు, ' మరియా, భయపడకుము, మృతుడైన వ్యక్తిగా నీవు నా కోసము వెదకుచున్నావు, కానీ సజీవునిగా మరియు శక్తిగలవానిగా నేను నీ యెదుట ప్రత్యక్షమవుచున్నాను' అని ఆమెతో చెప్పాడు. నా స్నేహితులారా, మీరు మృతుడైన యేసును వెదకడం లేదు. మీరు జీవముగల యేసును వెదకుచున్నారు. నేడు మీరు ఆయనను జీవముగల యేసుగా ఎరిగియున్నట్లయితే, యేసుప్రభువు మిమ్మును ఎన్నటికిని విడువడు. మీరు ఆయనను వెదకుచున్నప్పుడు, ఆయన మీ జీవితములో ప్రతి ఆశీర్వాదమును మీకు దయచేస్తాడు. కనుకనే, మీరు ఆయన నీతిని వెదకండి. అప్పుడవన్నియు కూడా మీకు అనుగ్రహింపబడును. ఆలాగుననే, మీరు మీ పూర్ణ హృదయముతో ఆయనను వెదకినప్పుడు, ఆయన మీకు సన్నిహితముగా ఉంటాడు.
నా ప్రియులారా, మీరు ఆయనను వెదకినప్పుడు, ఆయన మీ జీవితంలోని ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. వేకువనే ఆయనను వెదకువారు కనుగొంటారు. "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును '' అని చెప్పబడినట్లుగానే, మానవుని సహాయము వెదకిన తర్వాత, లేక ధనమును లేక లోకములో ఉన్నవాటన్నిటిని వెదకిన తర్వాత కాదు, మీరు ఆయనను వెదకకూడదు. మొట్టమొదట మీరు ఆయనను వెదకండి. అప్పుడవన్నియు మీకు కూడా అనుగ్రహింపబడతాయి.
ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని మీ పట్ల కోరుచున్నాను. యతీష్ అను ఒక సహోదరుడు ఉండెను. అతడు తన తండ్రిని కోల్పోయాడు. అతడు తన తల్లి మరియు సహోదరునితో కర్నాటకలో నివసించుచుండెను. కరోనా తర్వాత భయము అతని ప్రాణమును పట్టుకున్నది. ఎందుకంటే, ఆర్థికంగా అతడు తనకు కలిగిన సమస్తమును కోల్పోయాడు. 'నాకు వివాహము కావాలి, నేను ఒక స్వంత యింటిని కట్టుకోవాలి, నా జీవితములో నేను ఎలాగున ముందుకు సాగిపోవాలో నాకు తెలియలేదు. నాకంటూ, ఏమియు లేదు ' అన్న భయముచేత పూర్తిగా అతడు నింపబడ్డాడు. తద్వారా, అతడు దేవుని ద్వేషించాడు. మరియు యేసును మరి ఎక్కువగా ద్వేషించుటకు మొదలు పెట్టాడు. యేసు నామము పలుకగానే, అతనికి ఎంతో కోపము వస్తుండేది. అటువంటి సమయములో అతనికి వివాహము జరిగినది. అతని భార్య పేరు గీత. ఆమె తన కుటుంబాన్ని యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పధకములో నమోదు చేసుకొనెను. మరియు వారి పిల్లలను కూడా యౌవన భాగస్థుల పధకములో భాగస్థులనుగా చేర్చెను. ఒకరోజు, ఆమె తన భర్తతో, "మనము కోయంబత్తూరులో ఉన్న బేతెస్ద ప్రార్థనా కేంద్రమునకు వెళ్దాము'' అని చెప్పెను.
ప్రార్థనా ఆశీర్వాదములను అనుభూతి చెంది, ఆనందించడానికి ప్రార్థనకు నిలయంగా ఉన్న బేతెస్ద ప్రార్థనా కేంద్రము సౌందర్యవంతమైన వివిధ ప్రార్థనా స్థలములతో నిండియున్న ప్రాంతము అది. బేతెస్ద ప్రార్థనా కేంద్రం కారుణ్య విశ్వవిద్యాలయం సమీపంలోని అందమైన పర్వతాలతో చుట్టుముట్టబడియున్న ఆశీర్వాదమునకు మరియు ప్రార్థనల ప్రదేశం. మీరు అక్కడ బస చేయవచ్చును, ప్రార్థించవచ్చును మరియు దీవెనలు పొందుకొనవచ్చును. దేవుని సన్నిధిని అనుభవించాలని కోరుకునే వారికి ఇది ఒక పవిత్ర స్థలం అని గీత తన భర్తయైన యతీష్‌తో చెప్పెను. మనము అక్కడకు వెళ్లినట్లయితే, మన జీవితములో సమస్యలు తొలగించబడతాయి మరియు మనకు సమాధానము కలుగుతుంది అని చెప్పెను. యతీష్ దర్శనీయ ప్రదేశంగా భావించి, అక్కడకు వెళ్లేందుకు అతడు అంగీకరించాడు. అతడు అక్కడకు వెళ్లిన వెంటనే, దేవుని సన్నిధి అతనిని నింపినది. అక్కడున్న ప్రార్థనా యోధులు అతని కొరకు, తన భార్య మరియు పిల్లల కొరకు ఎంతో భారముతో ప్రార్థించగా, దైవీకమైన శాంతి సమాధానము అతని హృదయములోనికి వచ్చి అతనిని నింపినది. అతడు దేవునితో అనుసంధానించబడిన అనుభూతిని పొందుకున్నాడు.
ఆ తర్వాత వారు తిరిగి యింటికి వెళ్లారు. అప్పటి వరకు నెలకు అతనికి 30,000 రూపాయల మాత్రమే జీతము వచ్చేది. కానీ, బేతెస్ద ప్రార్థనా కేంద్రము నుండి తిరిగి వెళ్లిన తర్వాత, అతని జీతము 50,000 రూపాయలుగా పెంచబడినది. ఆ తర్వాత అతనికి నెలకు 50 వేల రూపాయలు జీతము వచ్చుచుండెను. అంతమాత్రమే కాదు, అతని భార్యకు కూడా ఉద్యోగము లభించినది. 80 వేల రూపాయల జీతముతో కూడా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దాదాపుగా నాలుగు రెట్లుగా దేవుడు వారిని వృద్ధిపొందింపజేశాడు. అయినప్పటికిని రెండు సంవత్సరములు తర్వాత, మరల కుటుంబ సమేతముగా వారు బేతెస్ద ప్రార్థనా కేంద్రమునకు వెళ్లారు. 3 రోజులు పాటు అక్కడే బస చేసి, ప్రార్థనలోను మరియు దేవుని సన్నిధిలో ధ్యానము చేయుచు గడిపారు. తద్వారా, దేవుడు వారికి వ్యాపారమును ప్రారంభించడానికి ఒక మంచి ఆలోచనను అనుగ్రహించాడు. వారు కర్ణాటకకు తిరిగి వెళ్లి, ఒక వ్యాపారమును ప్రారంభించారు. ఈరోజు వారు చేయుచున్న వ్యాపారములో 30 మంది అతనితో కూడా పని చేయుచున్నారు. దేవుడు వారిని వర్థిల్లింపజేసి మరియు ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చాడు.
నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీకును కూడా ఆలాగుననే జరిగిస్తాడు, ఆయన మిమ్మును విడిచిపెట్టడు, ఎడబాయడు. మీరు మీ నమ్మకమును ఆయన మీద ఉంచినప్పుడు, మీరు ఆయనను వెదకినప్పుడు మీరు అదనపు ఆశీర్వాదాలను అనుభవిస్తారు. ఆయన మీకు సమీపముగా ఉంటాడు మరియు ఆయన మీ జీవితంలోని సమస్తమును కూడా పరిపూర్ణం చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సజీవుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము నిన్ను మా హృదయపూర్వకంగా వెదకుటకు మా సహాయము చేయుము. ఎందుకంటే నీవు సజీవుడవు, శక్తివంతంగా మరియు దయతో నింపబడి ఉన్నావు. కనుకనే, దేవా, నీవు మమ్మును ఏ మాత్రము విడిచిపెట్టవని తెలిసి నీ మీద నమ్మకం ఉంచుచున్నాము. ప్రభువా, నీవే మా ఆశ్రయం, అన్నింటికంటే మాకు సహాయం మరియు బలం. గనుకనే, మేము నీ యొద్దకు వచ్చినప్పుడు, నీవు మా యొద్దకు వచ్చి, మమ్మును నీ సన్నిధితో నింపుము. యేసయ్యా, మేము మొదట నీ రాజ్యాన్ని మరియు నీతిని వెదకునట్లుగాను నీ అదనపు ఆశీర్వాదాలతో మా జీవితాన్ని నింపుము. ప్రభువా, ఈరోజు మేము నీ ముందుకు తీసుకొని వచ్చే ప్రతి అవసరాన్ని దయచేసి పరిష్కరించుము. మరియు ఎల్లప్పుడూ నిన్ను శ్రద్ధగాను మరియు వేకువనే వెదకడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ విశ్వసనీయతకు మరియు నీ సన్నిధితో మమ్మును నింపుము. యేసయ్యా, మా మృతమైన జీవితాలను నీ పునరుత్థానపు శక్తితో నింపి మమ్మును ఆనందముతో నింపుము. దేవా, మాకు సంబంధించినవన్నియు నీవు పరిపూర్ణంగా అనుగ్రహించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.