నా అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 కొరింథీయులకు 8:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే'' ప్రకారం మీరు యేసును లోతుగా ప్రేమించుచున్నారని నాకు తెలుసు. నేడు మీరు ఆయనను వెంబడించడాని కొరకై ఎంతో త్యాగము చేసియున్నారు మరియు చేయుచున్నారు. సకలమైన బెదిరింపుల మధ్య కూడా మీరు ఆయనను ప్రేమించుచున్నారు, మీ నిరుత్సాహములన్నిటి మధ్యలో కూడా మీరు ఆయన పరిచర్యకు సమర్పించుకున్నారు. మీ ఆటంకములన్నిటి మధ్యలో కూడా, మీరు ప్రార్థన గోపురముల మధ్యలో గానీ మరియు ఇతర ప్రదేశముల మధ్యలో గానీ, మీరు ఇతరుల నిమిత్తము ప్రార్థించియున్నారు. ప్రభువును ప్రేమించడానికి మీరు ఎంతగానో త్యాగము చేసియుండవచ్చును కదా! మీ కొరకై ప్రాణమును పెట్టినవాడు ఆయన. మీరు మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుట ద్వారా ప్రేమించుచున్నారు. కనుకనే, నిశ్చయముగా మీరు దేవునిచేత ఎరుగబడియున్నారు. మిమ్మును ఎరుగుట మాత్రమే కాదు, ఆయన మీ మార్గములను కూడా ఎరిగియున్నాడు. మీ త్యాగములను ఆయన ఎరిగియున్నాడు మరియు మీ యొక్క ఓర్పును, వినవిధేయతలను ఆయన ఎరిగియున్నాడు. కనుకనే, ఆయన మీ జీవితములో సంకల్పించినవాటన్నిటిని కూడా నెరవేర్పులోనికి తీసుకొనివచ్చును. ఆయన మీ కోసమే ఏయే ప్రణాళిక చేసియున్నాడో వాటన్నిటిని ఆయన ఎరిగియున్నాడు. మీ యెడల ఆయనకున్న ఉద్దేశములన్నిటిని తప్పకుండా మీ పట్ల నెరవేరుస్తాడు. కనుకనే, భయపడకండి.

వీరార్ అను ప్రాంతము నుండి సహోదరులు పాల్ సింగ్ బ్రాహ్మణి ఈలాగున తాను పొందుకున్న నమ్మశక్యం కాని ఒక గొప్ప సాక్ష్యమును తెలియజేశారు. వారికి ముగ్గురు బిడ్డలు ఉన్నారు. వారు, రవీంద్ర, అరుణ మరియు కల్పన. అతని యొక్క భార్య పేరు కేసర్. అతడు చెప్పులు కుట్టే పనిచేస్తుండేవాడు. అతడు ఒక చిన్న షాపు (అంగడిని)నిర్వహించుచుండెను. 22 సంవత్సరములుగా వారు ఒక అద్దె యింటిలో నివాసము చేయుచుండెను. వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో బీదగాను, కొరతగాను ఉండినది. అంతమాత్రమే కాదు, ఆర్థికంగా వారు ఎంతగానో బాధపడ్డారు. అయితే, గత 10 సంవత్సరాలుగా యేసును కనుగొన్న తర్వాత, వారు యేసును విడువకుండా వెంబడించుచుండిరి. వారు యేసయ్యను ఎంతగానో ప్రేమించారు. గత 7 సంవత్సరాలు వారొక సొంత గృహమును పొందుకొనుట కొరకు ప్రయత్నించుచుండెను. ఇట్టి గొప్ప ఆశీర్వాదము పొందుకొనలేక ఎంతో నిరుత్సాహమును చెందారు. వారు ఏ పనిని తలపెట్టినను, అ పని విఫలమగుచుండెను. ఇటువంటి సమయములో వారు యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పధకములో భాగస్థులుగా నమోదు చేసుకున్నారు. ప్రతి నెల వారు యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు సహకారమును అందించుచున్నారు.

2020వ సంవత్సరములో వారు యేసు పిలుచుచున్నాడు కార్యక్రమమును వీక్షించుచుండగా, నేను వారి కుమార్తెను పేరు పెట్టి పిలిచాను. కానీ, తండ్రి మాత్రమే కుటుంబ ఆశీర్వాద పధకములో సభ్యునిగా ఉన్నాడు. అయితే, నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడి, వారి కుమార్తె పేరును పిలిచియున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా ఏమని చెప్పియున్నాడో తెలుసా? 'కల్పనా, దేవుడు మీకు ఒక సొంత గృహమును అనుగ్రహించుచున్నాడు. దేవుడు మీ యొక్క గృహమును నిర్మాణము చేస్తాడు.' ఇది ఎంత మహాద్భుతమైన ప్రవచనము కదా. దేవుడు ఆ యొక్క ప్రవచనమును, ప్రార్థనను ఆలకించియున్నాడు. మరుసటి సంవత్సరములోనే, నూతనంగా నిర్మాణము చేయబడిన ఎత్తైన గోపురము వంటి ఒక భవనములో 14వ అంతస్థులో వారికి ఒక సౌందర్యవంతమైన గృహములో వారికి నివాసము లభించినది. నిర్మాణకులు వారికి కొరకు అన్నట్లుగా ఒక క్రొత్తగా గృహమును నిర్మాణము చేయులాగున దేవుడు కృపను చూపించాడు. అక్షరాల ప్రవచనము ప్రకారం జరిగింది. ఈ రోజు వారు ఒక సొంత గృహమును కలిగియున్నారు. నా ప్రియులారా, దేవుడు వారిని ఎరిగియున్నాడు. ఆలాగుననే, దేవుడు మిమ్మును కూడా ఎరిగియున్నాడు. మీ నిమిత్తమై ఆయన దాచియుంచిన ఆశీర్వాదములను ఆయన ఎరిగియున్నాడు. ఎందుకనగా, మీరు ఆయనను ప్రేమించుచున్నారు. కనుకనే, ఆయన యెడల మీకున్న ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు. కాబట్టి, మీ ప్రేమను ఆయన విలువైనదిగా గుర్తించి మీకు తగిన దీవెనలు ఆయన మీ పట్ల కుమ్మరిస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ పట్ల మాకున్న లోతైన ప్రేమను నీవు గుర్తించినందుకై నీకు వందనాలు. యేసయ్యా, మేము విశ్వాసంతో చేయుచున్న ప్రతి త్యాగాన్ని మరియు వేయుచున్న ప్రతి అడుగును చూసి మాకు తగిన ప్రతిఫలమును దయచేయుము. యేసయ్యా, మాలో భయం మరియు నిరుత్సాహ సమయంలో కూడా నీవు మా హృదయాన్ని మరియు నీ పట్ల మాకున్న ప్రేమను అర్థం చేసుకొని, మమ్మును ముందుకు కొనసాగునట్లు చేయుము. దేవా, మేము నీలో ముందుకు సాగి వెళ్లడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, మేము నిన్ను వెండించడానికి మమ్మును బలపరచుము మరియు నీ సన్నిధితో మా ఆత్మను పునరుద్ధరించుము. దేవా, నీవు మాతో ఉండి, మా క్లిష్ట పరిస్థితులలోను మాకు సహనమును ఇచ్చి, మా యొక్క ప్రతి సవాలులో కూడా మమ్మును సున్నితంగా నడిపించుము. ప్రభువా, మా మార్గం స్పష్టంగా లేనప్పుడు కూడా నీ ప్రణాళికలను విశ్వసిస్తూ వినయంగా ఉండేందుకు మాకు నేర్పించుము. దేవా, మా జీవితంలో నీవు మా పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని నీవు తప్పకుండా నెరవేరుస్తావని తెలిసి నీ ప్రేమ మాలో ధైర్యాన్ని నింపునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, నీవు మా కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదాలను నీవు కలిగి ఉన్నావని పూర్తిగా నమ్ముచూ, మేము నీ చిత్తానికి లోబడి నడుచుకొనునట్లుగాను, మా ప్రేమకు తగినట్లుగా ఆశీర్వాదాలను మా మీద కుమ్మరించుము మరియు ఆ ఆశీర్వాదాల వైపు మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.