నా ప్రశస్తమైన స్నేహితులారా, ప్రభువు మిమ్మును గమనించుచున్నాడు. ఆయన మిమ్మును జాగ్రత్తగా గమనిస్తూ, మీ ఆత్మను కాపాడుచున్నాడు. ఆయన మీ మార్గములను కాపాడుతాడు మరియు మీకు తండ్రిగా ఉన్నాడు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 1:6వ వచనములో ఈలాగున సెలవిచ్చుచున్నది, "నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును'' ప్రకారం నేడు మీ మార్గములన్నియు ఆయనకు తెలియును. ఇంకను మీరు ఎలాగున నడుస్తున్నారో, ఎలాగున తడబడుతున్నారో, లేదా మీరు ఎలా కష్టాలను ఎదుర్కొంటున్నారో కేవలం ఆయన గమనించడం మాత్రమే కాదు. బైబిల్‌లో మనకు నిరీక్షణను కలిగిస్తుంది, 'నీతిమంతుని నడత స్థిరపరచబడుతుంది' అన్న వాక్యము ద్వారా ఆయన మనలను గమనించువాడు, మనకు సూచనలను తెలియజేయువాడు, ఆయన మనలను కాపాడుతాడు, మనకు ఉపదేశిస్తాడు, మనకు సలహా మరియు సమాలోచనను ఇస్తాడు మరియు ఆయన తన దృష్టిని మన మీద ఉంచి, మనలను తన మార్గములో నడిపిస్తాడు, ఆయన మన కొరకు సిద్ధపరచిన స్థలమునకు మనం చేరుకునేలా నిర్థారిస్తాడు. కనుకనే, ఈ వాగ్దానం కీర్తనలు 32:8 మరియు నిర్గమకాండము 23:20 అను ఈ వచనములన్నియు కూడా ఈ సంగతులను తెలియజేయుచున్నవి.
అయితే, నా ప్రియులారా, ఇంకను ఆయన ఏమని చెబుతున్నాడనగా, " అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను'' అని చెప్పెను. నా ప్రియులారా, ఈ ఆశీర్వాదము కేవలం మీకు మాత్రమే కాదు, ఇది మీ యొక్క బిడ్డలకును మరియు మీ పిల్లపిల్ల తరములకు వెంబడించును. బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 115:12-14వ వచనము వరకు తెలియజేయబడినది. మీరు దీనిని చదువుచుండగా, మీరు ఇశ్రాయేలీయులుగా దేవుని చేత పిలువబడి ఉండి ఉన్నప్పుడు, ఆహరోను వలె మీరు ఆయనను సేవించుటకు మీరు ఏర్పరచుకొనబడిన వారిగా ఉండి ఉన్నప్పుడు, మీరు కుటుంబ సమేతముగా దేవునికి భయపడువారిగా ఉండినప్పుడు, దేవుడు మిమ్మును మరియు మీ పిల్లలను వృద్ధి కలుగుజేయువాడై ఉన్నాడు, నీతిమంతుని ప్రవర్తనను లేక అడుగులు యెహోవా చేత నియమింపబడినదిగా ఉంటుంది. బైబిల్‌లో కీర్తనలు 112 :1-2వ వచనముల ప్రకారం " యెహోవాను స్తుతించుడి యెహోవా యందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు'' ప్రకారము, మీరు దేవుని యందు భయభక్తులు కలిగియుండి, పరిశుద్ధతలో నడుచుకొనుచున్నప్పుడు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అని వ్రాయబడియున్నది. ఇది నేటి దినమున మీ కొరకై దేవుని వాగ్దానమై యున్నది.
నేను మీతో ఒక సాక్ష్యమును పంచుకోవాలని కోరుచున్నాను. సహోదరి వసంతి మరియు తన భర్త అరుణాచలం అను దంపతులకు కుమారుడు కలిగియుండిరి. ఆ కుటుంబమంతటిలో సహోదరి వసంతి మాత్రమే ప్రభువును ఎరిగియుండెను. ఆమె తన కుమారుని యేసు పిలుచుచున్నాడు యౌవన భాగస్థుల పధకములో భాగస్థునిగా చేర్పించెను. దేవుడు ఆమె కుమారుని ఆశీర్వదించుటకు ప్రారంభించాడు. భర్త ఉద్యోగమును కోల్పోయాడు. ఆర్థికపరమైన సమస్యలు వచ్చాయి. అయినను, ప్రభువు ఆ యొక్క కుమారుని ఆశీర్వదించాడు. అతడు విద్యలో బాగుగా రాణించాడు. ఇంకను కళాశాల విద్యను ముగించక మునుపే, తనను ఇంటర్వ్యూ చేసిన వివిధరకములైన 6 కంపెనీలలో అతనికి ఉద్యోగ అవకాశము లభించడం జరిగినది. అతడు ఒక కంపెనీతో ప్రారంభించి, అందులో రెండు సంవత్సరాలు పనిచేయుటకు కొనసాగించాడు.
అయితే, తాను స్వంతగా విద్యుత్త్ శక్తి పరికారాల వ్యాపారమును ప్రారంభించుటకు పరిశుద్ధాత్ముడు అతనిని శక్తివంతునిగా చేశాడు. ఇప్పుడు అతడు అనేకమందికి ఉద్యోగాలు ఇచ్చే వ్యాపార వేత్తగా ఉన్నాడు. తనతో కూడా చదువుకున్న వారు కూడా, తన దగ్గర ఉద్యోగము చేయుచున్నారు. అతడు తన పని కొరకు అంతర్జాతీయంగా వెళ్లుచూ పని చేయుచుండెను. అతనికి వివాహమైనది. ఇప్పుడు అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. నిశ్చయముగా, ఆ యొక్క కుమారుడు కూడా, యౌవన భాగస్థుల పధకములో భాగస్థుడుగా ఉన్నాడని నేను నమ్ముచున్నాను. అవును, నా ప్రియులారా, నీతిమంతుల మార్గములు ప్రభువు ఎరిగి ఉన్నాడు, ఆయన వారిని గమనించువాడు, ఆయన వారి అడుగులను నిర్దేశించువాడు యున్నాడు. నీతిమంతులను మరియు వారి యొక్క పిల్లలను దేశములో బలవంతులగునట్లుగా వృద్ధిపొందిస్తాడు. దేవుడు నేడు మీకును మరియు మీ పిల్లలకు ఇట్టి ఆశీర్వాదమును అనుగ్రహించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, మమ్మును జాగ్రత్తగా చూస్తున్నావనియు, మా అడుగులను నిర్దేశించినందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, నీవే మా మార్గదర్శివి, మా రక్షకుడివి, మరియు అవసరమైన సమయాలలో నీవు మాకు ఎల్లప్పుడూ సహాయం చేయువాడవు. తండ్రీ, ఇట్టి కృప మా మీదికి వచ్చునట్లుగా వేడుకొనుచున్నాము. దేవా, ఈ యొక్క నీతిమంతులై ఆత్మలుగా మేము ఉండునట్లుగా మాకు కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా దైనందిన జీవితములో ప్రతిదానిని గమనించుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మమ్మును నీతివంతమైన మార్గములో మమ్మును నడిపించుము. దేవా, మమ్మును ఆశీర్వాదకరమైన స్థలమునకు తీసుకొనివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా బిడ్డలు, దేశములో బలవంతులగునట్లుగా మమ్మును మరియు మా పిల్లలను వృద్ధిపొందించుము. ప్రభువా, మా మార్గాలు నీ యెదుట నీతిమంతులుగా ఉండునట్లుగాను మరియు నీవు సిద్ధపరచిన స్థలమునకు మమ్మును నడిపించుము. ప్రభువా, మమ్మును మరియు మా పిల్లలను, మా పిల్లల పిల్లలను నీ దైవీకమైన కృపతో ఆశీర్వదించుము. దేవా, నీ యెదుట మేము పవిత్రత మరియు భయభక్తులతో నడవడానికి మరియు నీ దైవీక సలహాపై నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును వృద్ధిపొందించుము మరియు మా తరాలను భూమిలో బలవంతులనుగా చేయుము. దేవా, నీ సన్నిధి మాకు ముందుగా వెళ్లి మాకు విశ్రాంతి మరియు శాంతిని అనుగ్రహించుము. యేసయ్యా, నీ ప్రేమతో మమ్మును ఆవరించునట్లుగాను, మరియు నీ నీతిమంతమైన హస్తములతో మమ్మును ఆదరించుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.