నా ప్రియమైన స్నేహితులారా, నేడు మీరు ప్రభువునందు ఆనందించండి. మీ హృదయమును సంపూర్ణ సంతోషముతో ఉండునట్లుగా నేటి వాగ్దానమును మీతో పంచుకోవాలని నేను మీ పట్ల కోరుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 8:35వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, ‘‘నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును’’ ప్రకారము మీరు ఆయనను కనుగొన్నప్పుడు, మీరు జీవమును కనుగొంటారు, అప్పుడు దేవుని కటాక్షము మీకు కలుగుతుంది. కాబట్టి, ధైర్యముగా ఉండండి. మా జీవితాలలో దేవుని కటాక్షము నిజంగా అపారమైనది, అపరిమితమైన ఆశీర్వాదాలను దేవుడు మాకు అనుగ్రహించియున్నాడు. ఆయన కృప ద్వారా, మేము ఇతరులను ఆశీర్వదించడానికి మరియు ప్రతిఫలంగా ఆశీర్వాదాలను పొందుకొనడానికి మరియు మమ్మును శక్తివంతంగా వాడుకొనుటకు, ప్రభావవంతమైన స్థలములో ప్రభువు మమ్మును ఉంచియున్నాడు. అంతేగాక, కష్టమైన మరియు క్లిష్టమైన పరిస్థితులలో మా కొరకు ప్రార్థించే మరియు మమ్మును ప్రోత్సహించు నిమిత్తము మాకు ప్రేమగల తల్లిదండ్రులను మరియు మాకు సహాయాన్ని అందించే ఒక మంచి కుటుంబాన్ని ఆయన అనుగ్రహించియున్నాడు. ఇంకను మా జీవితంలోని ప్రతి అంశంలోనూ ఆయన అపారమైన ప్రేమ మరియు శ్రద్ధను మాకు గుర్తుచేయుచూ, ఆయన ప్రతి కార్యాలను విఫులంగా ఎలా క్రమబద్ధీకరిస్తాడనేది అపురూపమైనదిగా ఉన్నది.
నా ప్రియులారా, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలలో జోక్యం కలుగజేసుకొని, వారి జీవితాలలో అనేక సమస్యలను తీసుకొనివస్తుంటారు. కానీ, మా జీవితములో మా తల్లిదండ్రులు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవుడు తనకు భయపడే మరియు విధేయత గల బిడ్డను మాకు అనుగ్రహించాడు మరియు మా ఇంటిలో ఉన్న వారు మాకు సహాయం చేయడానికి మరియు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆయన ఏర్పాటుగా అద్భుతమైన ప్రజలను మాకు అనుగ్రహించియున్నాడు. అదనంగా, మా కార్యాలయంలో ప్రభువును ప్రేమించేవారు మరియు ఆయన కొరకు తమ వంతు కృషి చేయుచూ, పని చేయుచున్న ఒక గొప్ప బృందం మాకు కలదు. దేవుడు మాకు మంచి ఆరోగ్యం, బలం మరియు ఆర్థిక ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుగ్రహించియున్నాడు. మేము వివిధ పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడల్లా, వాటి ద్వారా మాకు సహాయం చేయడానికి దేవుడు అద్భుతంగా ఎవరో ఒకరిని మా యొద్దకు పంపుతాడు. గృహములలోను మరియు రోడ్లపై జరిగే ప్రమాదాల గురించి మేము విన్నప్పుడు కూడా ఆయన ప్రతి కీడుల నుండి మమ్మును రక్షించుచున్నాడు. ఇంకను మా జీవితంలో మనకున్నదంతయు దేవుని అనుగ్రహమే. దేవుని అనుగ్రహముతో మేము ఆవరించబడియున్నాము. మరియు మేము ప్రతిదానిలో దానిని అనుభూతిని చెందుచున్నాము. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, కొన్ని ఫర్యాయములు మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పని సందర్భాలు ఎన్నో ఉండవచ్చును. కానీ నేటి వచనంలో చూచినట్లయితే, దేవుడు ఇలాగు తెలియజేయుచున్నాడు, ‘‘ దేవుని కనుగొనేవాడు, జీవమును కనుగొనును.’’ దేవుడు తనను కనుగొనడానికి దాగుడుమూతలు ఆడుతున్నాడా? కాదు నా ప్రియులారా, మన పాపాలు, చింతలు మరియు సందేహాలు మాత్రమే దేవుడు మనకు కనబడకుండా దాచిపెడుతున్నాయి. అయితే, వీటన్నింటి కంటే మనం ప్రభువును వెదకినప్పుడు, మనం ఆయనను కనుగొంటాము. ఎందుకంటే, మనం ఆయనను మన పూర్ణ హృదయముతో వెదకినట్లయితే, మనం ఆయనను కనుగొంటాము. కనుకనే, నేటి నుండి మీరు కూడా ఆయనను మీ పూర్ణ హృదయముతో వెదకండి ఆయన నుండి అనుగ్రహమును కనుగొంటారు. దేవుడు మీకు అలాంటి దయగల జీవితాన్ని నేడు ఇవ్వాలని నేను మీ పట్ల కోరుచున్నాను. కాబట్టి, నేటి నుండి దేవుని కటాక్షము మీ మీద ఉంచుబడును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కరుణా కటాక్షము కలిగియున్న మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. మా ప్రియ ప్రభువా, నీ కటాక్షము మీ మీద ఎల్లప్పుడు ఉండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, ఈరోజు మేము నీ సన్నిధిలో మరియు నీవు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మేము నీ యందు సంతోషించుచున్నాము. ప్రభువా, మా హృదయాన్ని ఆనందంతో నింపుతూ, మా జీవితానికి నీవు చేసిన అపారమైన ఉపకారానికి మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మమ్మును ప్రభావవంతమైన స్థలములలో ఉంచి, ప్రతిఫలంగా ఆశీర్వాదాలు పొందుకుంటూ ఇతరులను ఆశీర్వదించడానికి మమ్మును అనుమతించునట్లు చేయుము. ప్రభువా, మమ్మును ఆశీర్వదించిన ప్రేమగల తల్లిదండ్రుల కొరకు మరియు ప్రోత్సాహమును ఇచ్చే కుటుంబాన్ని మాకు ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మా కుటుంబ సభ్యులు మాకు అండగా నిలబడి, మా కొరకు ప్రార్థిస్తూ, మాకు తోడు మరియు నీడగా ఉంటూ మమ్మును ఆదరించునట్లు చేయుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి విషయాలలోను నీ యొక్క క్రమబద్దీకరణను మరియు సమృద్ధిగా ఉన్న నీ యొక్క ప్రేమ మరియు సంరక్షణను మాకు గుర్తు చేయుము. దేవా, ఆరోగ్యం, బలం మరియు ఆర్థిక స్థిరత్వం యొక్క అనుగ్రహమును నీవు మాకిమ్ము. ప్రభువా, నేడు నీవు మా పట్ల చూపించు కటాక్షము మరియు అనుగ్రహించు ఆశీర్వాదాలు నిజంగా ఎంతో అద్భుతమైనవి. ప్రభువా, మా ప్రతి కీడుల నుండి మమ్మును రక్షించి మరియు మా జీవితంలో నీ కటాక్షమును ఎల్లప్పుడు గుర్తించి, నీకు కృతజ్ఞతలు చెప్పడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా చుట్టు , మా కుటుంబము మరియు మాకు కలిగినదంతటి చుట్టు నీ కటాక్షము ఆవరించి ఉండునట్లుగా కృపను చూపుము. దేవా, అన్నిటికంటే ఎక్కువగా మేము నిన్ను వెదకుచున్నప్పుడు, మేము నిన్ను కనుగొని, నీవు వాగ్దానం చేసిన అనుగ్రహాన్ని పొందుకొనుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీవు మాకు అందించాలనుకుంటున్న ఆదరణ గల జీవమును మేము కనుగొనునట్లు చేయుమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.