నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మిమ్మును చూచుట నాకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రభువు బలమైన తన సన్నిధిచేత మిమ్మును ఆదరించును గాక. మనము ఆయన సన్నిధిని ఆనందించనై యున్నాము. ఆయనలో మనము ధైర్యముగాను మరియు సమాధానముగాను ఉండగలుగుచున్నాము. ప్రియులారా, మనందరము కలిసి, ఆయన వాగ్దానాలలో ఆశ్రయం పొందుదాం మరియు ఆయన గొప్పతనంలో ఆనందిద్దాం. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 77:14వ వచనములో ఈ విధంగా సెలవిచ్చుచున్నది, "ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొనియున్నావు'' ప్రకారం నేడు దేవుడు మీ జీవితములో ఆశ్చర్యకార్యాలను చేయుటకు సిద్ధముగా ఉన్నాడు.
నా ప్రియ స్నేహితులారా, అవును, దేవుడు మన జీవితములో ఆశ్చర్యకార్యాలను చేయుటకు మనలను ఎంపిక చేసుకున్నాడు. ఎందుకు ఆలాగున చేసుకొనియున్నాడు? తద్వారా, ఆయనే స్వయంగా మన చుట్టు ఉన్న ప్రజలకు తన గొప్పతనాన్ని తెలియపరచాలని అనుకున్నాడు. ఆయన అందరి మధ్య మిమ్మును సజీవ సాక్ష్యముగా ఉంచుటకు ఎంపిక చేసుకున్నాడు. మీ తరగతి వారి మధ్యలో మరియు మీ యొక్క పొరుగువారి మధ్యలో, మీ యొక్క కుటుంబములో, ఆలాగే మీ ఉద్యోగములో కూడా, ఆయన మీ జీవితములో బలమైన అద్భుత కార్యములు జరిగించుట ద్వారా మిమ్మును ప్రజల యెదుట సాక్ష్యముగా మారుస్తాడు. తద్వారా, ఎవ్వరు కూడా ప్రశ్నించలేరు. వారు మిమ్మును చూచి, 'నిశ్చయముగా, దేవుడు మీతో కూడా ఉన్నాడని' అంటారు. కనుకనే, ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, అందుకొరకే అన్నట్టుగా దురదుష్టవశాత్తు మన జీవితములో కొదువ వస్తుంది. మన జీవితములో ఏదో ఒక సమస్య వస్తుంది. అయితే, భయపడకండి, దేవుడు అట్టివాటి మధ్యలోనే ఆశ్చర్యకార్యాలను జరిగించుటకు మనలను ఎంపిక చేసుకుంటాడు. అందువలన, మనము ప్రజల యెదుట సాక్ష్యులముగా ఉండగలము. దేవుడు బలమైన కార్యములను జరిగించును. ఒక సహోదరి వచ్చి, ఈలాగున సాక్ష్యమిచ్చియున్నది. ఆమె తన సాక్ష్యమును ఈలాగున చెప్పెను. తన వివాహ జీవితములో ఎన్నో సంవత్సరములుగా ఆమెకు బిడ్డలు లేరు, తన కుటుంబ సభ్యులు తనను లక్ష్యముగా ఉంచుకొని, అన్ని సమస్యలకు ఆమె కారణము అని చెప్పేవారు, వారి కుటుంబమునకు ఉన్న పేరునకు కలిగిన అవమానమునకు ఆమె కారణము అని చెప్పి, ఆమె మీద నింద వేశారు. తమ కష్టాలన్నింటికి ఆమెనే కారణమని ఆరోపించారు. ఆలాగుననే, నిరంతారయంగా ఆమెను కించపరచుచూ వచ్చిరి. తన యొక్క కుటుంబ సభ్యులు కూడా ఆమెను అవమానపరచారు. కనుకనే, ఆమె ఎంతగానో ఏడుస్తూ ఉండిపోయెను. బిడ్డలు లేని కారణము కంటెను మరి ఎక్కువగా నిందారోపణ వలన ఎంతగానో రోధించాను అని తెలియజేసెను.
ఆ సమయములో యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును గురించి ఎవరో ఆమెకు తెలియజేశారు. నా ప్రియులారా, ఆమె అక్కడకు వచ్చి, ప్రార్థన చేయించుకున్నప్పుడు, అదే సంవత్సరములో ఆమె గర్భమును ధరించినది. ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వడము మాత్రమేకాదు, ఇద్దరు బిడ్డలకు ఆమె జన్మనిచ్చినది. ఆమె ఆ యొక్క యిద్దరి బిడ్డలను యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా కూటములో వేదిక మీదికి తీసుకొని వచ్చి, లక్షలాదిమంది ప్రజల యెదుట ఎంతో సంతోషముగా తన సాక్ష్యమును తెలియజేసెను. ఒకవేళ ఆమె ఇద్దరు ముగ్గురు చేత నిందారోపణను ఎదుర్కొని ఉండవచ్చునేమో? కానీ, లక్షలాది మంది ప్రజల యెదుట దేవుడు ఆమెను ఆశ్చర్యంగా మార్చి యున్నాడు. దేవుడు ఆమెతో కూడా ఉన్నాడని అందరు చూచునట్లుగా ఆమెకు కనుపరచాడు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియమైన స్నేహితులారా, ఆమె పట్ల ఆశ్చర్యకార్యాలను జరిగించిన అదే దేవుడు నేడు మీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుకనే, మీరు కూడా జీవముగల సాక్ష్యంగా ఉండటానికి సిద్ధంగా ఉండండి! దేవుడు మీతో ఉన్నాడు మరియు ఆయన మీ యొక్క ప్రతి శోధనలను తన మహిమ కొరకు విజయవంతంగా మారుస్తాడు. కాబట్టి, నేడు మీరు ఆయనను నమ్మండి మరియు ఆయన గొప్పతనాన్ని మీ ఊహకు మించిన మార్గాల్లో మీరు చూడగలుగుతారు. ఆయన మీ జీవితములో గొప్ప ఆశ్చర్యకార్యాలను చేస్తాడు. కనుకనే, నేడు మీ జీవితములో మీరు సాక్ష్యముగా ఉండడానికి సంసిద్ధముగా ఉండండి. మీ జీవితాలను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ జీవితములో ఆశ్చర్యకార్యాలను జరిగించి, మిమ్మును అనేకమంది యెదుట సాక్షిగా నిలబెట్టి, ఈ వాగ్దానము ద్వారా ఆయన మీతో ఉన్నాడని కనుపరచుకొనుటకు మిమ్మును ఘనపరచును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, మా జీవితములో కూడా నీ యొక్క ఆశ్చర్యకార్యములను అంగీకరించుచున్నాము. ప్రభువా, మేము నీ కొరకు వేచియున్నాము. మరియు మా మధ్యలో ఒక అద్భుతమైన మరియు ఆశ్చర్యకార్యములను జరిగించుము. దేవా, మా శరీరములో జీవమును కలుగజేయుము. మా చదువులలోను పునరుత్ధానమును దయచేయుము. దేవా, నీ యొక్క బలమైన శక్తి మాలోనికి ప్రవహించునట్లు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితంలో అద్భుతంగా పనిచేసే అద్భుతాల దేవుని మేము కలిగి ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, నీ వాగ్దానాలపై మేము నమ్ముకముంచుచున్నందున మా హృదయాన్ని ధైర్యం మరియు సమాధానముతో నింపుము. ప్రభువా మేము ఎదుర్కొనే ప్రతి శోధనను నీ గొప్పతనానికి మరియు శక్తికి సాక్ష్యంగా మార్చుము. ప్రభువా, నీవు మాతో ఉన్నావనియు మరియు ఇతరులు చూడగలుగునట్లుగా మా ద్వారా నీ మహిమను వెల్లడిపరచుము. దేవా, దయచేసి నీవు మా పనిలో ఉన్నారని తెలుసుకుని సవాళ్ల సమయంలో స్థిరంగా ఉండటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ సమయం మరియు మా జీవితం కొరకు నీ ప్రణాళికపై నమ్మకం ఉంచడానికి మా విశ్వాసాన్ని శక్తివంతం చేయుము. దేవా, మా చుట్టూ ఉన్నవారికి నీ ప్రేమ, దయ మరియు విశ్వసనీయతకు మమ్మును సజీవ సాక్ష్యంగా మార్చుము. ప్రభువా, నీ అద్భుతాలు మాలో ప్రకాశించినట్లుగాను మరియు నీ నామమునకు మహిమ కలుగజేయునట్లుగా, మేము ప్రతి సవాలును నీ చేతులలోనికి అప్పగించుచున్నాము. ప్రభువా, మా విజయం కొరకు మేము నిన్ను నమ్ముచున్నాము, మా పట్ల అద్భుత ఆశ్చర్యకార్యములను జరిగించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.