నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనకందరికి తెలిసిన ఒక వాగ్దానమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వాగ్దానము బైబిల్ నుండి కీర్తనలు 23:3వ వచనమును మనము చూచినట్లయితే, "నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు'' ప్రకారం ఈ రోజు ప్రభువు మీ ప్రాణమునకు సేదదీరుస్తాడని జ్ఞాపకముంచుకొనండి.
నా ప్రియులారా, మీరు, 'ప్రభువునకు వ్యతిరేకముగా నేను పాపము చేశాను' అని అంటున్నారేమో? తద్వారా, మా హృదయము అపరాధ భావముతో నింపబడియున్నది, నేను నా పరలోకపు తండ్రిని బాధపరచానన్న బాధతో నింపబడియున్నాను. ఆయనకు వ్యతిరేకముగా పాపము చేశాను, తద్వారా నేను దేవుని సన్నిధానమును అనుభవించలేకపోవుచున్నాను, దేవుడు నా మీద కోపముగా ఉన్నాడు' అని అంటున్నారా? వీటన్నిటి ద్వారా మీ జీవితము బ్రద్ధలై పోయి ఉండవచ్చును.
అయితే, బైబిల్‌లో భక్తుడైన దావీదు జీవితమును చూడండి. దావీదు అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు, దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు, అతడు అపరాధ భావముతో నింపబడియున్నాడు, 'ఈ పాపము వలన నీ కుమారుడు చనిపోతాడు' అని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, అతని హృదయము బ్రద్ధలు చేయబడి ఉంటుంది. తద్వారా దేవుని యొద్దకు తిరిగి ఎలా రావాలో నాకు తెలియలేదని దావీదు తన మనస్సులో తలంచుకొని ఉంటాడు.అంతమాత్రమే కాదు, అతడు క్షమాపణ కొరకు వేడుకున్నాడు. మరొకసారి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. దేవుడు అతని ప్రాణమునకు సేదదీర్చాడు. అతడు తన దేశాన్ని పరిపాలిస్తూ, గొప్ప కార్యాలు చేయసాగాడు. తద్వారా, ప్రభువు అతనికి సహాయము చేశాడు. ఇంకను అతడు గొప్పగా హెచ్చింపబడ్డాడు.
అదేవిధముగా నా ప్రియ స్నేహితులారా, దావీదువలె ప్రభువు నేడు మీ ప్రాణమునకు సేద దీరుస్తాడు. ప్రభువు యొద్ద మీ పాపములను బట్టి క్షమాపణ అడగండి, మీ పాపములన్నిటిని ఆయన సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు, తన రక్తముతో ఆయన మిమ్మును శుద్ధీకరిస్తాడు. మీ జీవితమును నూతనపరుస్తాడు. ఈ రోజు నుండి ప్రతి దినము నీతిమార్గములలో మిమ్మును నడిపిస్తాడు, ఆయన నామమును బట్టి, ప్రతి శోధన నుండి మిమ్మును జయింపజేస్తాడు. ముందుగా మిమ్మును నీతిమార్గములో నడిపింపజేస్తాడు. ఆ సమర్పణ చేయడానికి మీరు సిద్ధముగా ఉన్నారా? ప్రభువు మీ ప్రాణమును సేద దీర్చాలని అనుకుంటున్నారా? అయితే, ఇప్పుడే ఆయన యొద్ద క్షమాపణ కోరినప్పుడు, ఆయన మీ ప్రాణమును సేద దీరుస్తాడు. నీతిమార్గములో మిమ్మును నడిపింపజేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, అపరాధభావంతో బరువెక్కిన హృదయంతో నీ ముందుకు వస్తున్నాము. యేసయ్యా, మా పాపములను బట్టి, క్షమాపణ నిమిత్తము మేము నీ యొద్దకు వచ్చియున్నాము. మా పాపములను క్షమించమని కోరుచున్నాము. న్నాను. దేవా, మేము పాపం చేసి వెనుదిరిగాను, కానీ ఈరోజు, మా జీవితాన్ని నీకు తిరిగి అప్పగించుచున్నాము. యేసయ్యా, నీ అమూల్యమైన రక్తముతో మమ్మును కడిగి శుద్ధులనుగా చేసి మా ఆత్మను పునరుద్ధరించుము మరియు మా ప్రాణమునకు సేదదీర్చుము. దేవా, మా ప్రతి శోధనలను జయించడానికి మాకు సహాయం చేయుము. ఇంకను మమ్మును నీతి మార్గంలో నడిపించుము. ప్రభువా, మా రక్షకుడవైన నీకు దగ్గరగా జీవించాలని మేము కోరుచున్నాము. కాబట్టి నీ సన్నిధిని మరోసారి మేము అనుభూతి చెందునట్లుగా మా హృదయాన్ని మరియు ఆత్మను పునరుద్ధరించుము మరియు మా పాపాన్ని విడిచిపెట్టడానికి మాకు బలాన్ని దయచేయుము. ప్రభువా, క్షమాపణ కోరుచున్న మమ్మును శుద్ధీకరించండి, మా ప్రాణమును సేదదీర్చుము. దేవా, మా నుండి అపరాధ భావమును తొలగించి, మమ్మును నూతనపరచుము, నీ సంబధాన్ని పున:రీకరించుము, ఈ రోజును నుండి నీతిమార్గములో మమ్మును నడిపింపజేయుము. మేము ఎల్లప్పుడు సరియైన కార్యాలు చేయునట్లుగా మమ్మును మార్చుము. వెనుకకు తిరిగి చూడకుండా, పరిశుద్ధమైన నీతిగల మార్గములో ముందుకు సాగునట్లుగా నూతన జీవితమును నేడు మాకు అనుగ్రహించి, మమ్మును దీవించుమని యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.