నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎజ్రా 8:22 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును...'' ప్రకారం, దేవుని హస్తము ఈ రోజున మీ పక్షమున మేలు చేయుట కొరకు వేచి ఉన్నది. కాబట్టి, ఉత్సహించి, ప్రభువునందు ఆనందించండి.

నా ప్రియులారా, కొంతమంది ఈలాగున అంటుంటారు, " నాకు అన్ని కీడుగానే జరుగుచున్నాయి, వ్యాపారము నష్టముగానే ఉన్నది. ఆలాగుననే, వాతావరణము, సంబంధాలు అన్నియు కూడా నాకు చెడుగానే ఉన్నాయి. బంధుత్వములో కూడా చెడుగానే ఉన్నది, ఇంకను దేనిని ముట్టుకున్నను అన్ని నాకు ఓటమిగానే ఉన్నవి'' అని అంటున్నారా? లేదు స్నేహితులారా, దీనిని మీరు జ్ఞాపకము ఉంచుకొనండి. దేవుడు మంచివాడు, ఎల్లవేళల ఆయన మన పట్ల మంచివాడుగా ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడు మనకు మేలు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇంకను యెహోవాను ఆశ్రయించువారికి, ఆయనను వెదకువారికి సమస్తమును మేలుకరముగానే జరుగుతాయని వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. అందుకే బైబిల్‌లో రోమీయులకు 8:28వ వచనములో చెప్పబడినట్లుగానే, "దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము'' ప్రకారం, ఆయన ఉద్దేశము ప్రకారము పిలువబడినవారికి కూడా సమస్తమును మేలు కొరకే జరుగుతుంది. ఆలాగుననే, మీరు ఆయనను వెదకుచూ ఉండగా, "ప్రభువా, నీవు లేకుండా మేము ఏమియు కూడా చేయలేము, నాకు సహాయము చేయుము. అదేవిధంగా, రెండవదిగా, నేనేమి చేయాలో నాకు నేర్పించుము. మూడవదిగా, నేను చేయుచున్న ప్రతిదానిలో కూడా నీ చిత్తమును సంపూర్తి చేయుటకు తగిన శక్తిని మాకు అనుగ్రహించుము. నాల్గవదిగా, సాధ్యమైనంతగా ఎక్కువ మందికి నీ యొక్క మేలులను మేము పంచుకొనునట్లు మాకు కృపను దయచేయుము'' అని చెప్పి, మీరు ఈ నాలుగు విషయాలలో కూడా మీరు దేవుని వెదకుచుండగా, మీకు మేలు చేయుటకై దేవుని హస్తము మీతో కూడా ఎల్లప్పుడు ఉంటుంది. ఈ రోజు మొదలుకొని దైవాశీర్వాదములు మీ జీవితములో బహుగా విస్తరించును గాక. మీ హృదయమును కలవరపడనీయ్యకండి.

ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. రాధ అను ప్రియమైన సోదరీ, ఆమె యేసును ఎరుగని కుటుంబములో ఉండెను. మధురై పట్టణములో ఆమె నివసించుచుండెను. 12వ తరగతి వరకు ఆమె చదువుకున్నది. ఆ సమయములో ఆమె ఎంతో వ్యాధిగ్రస్థురాలిగా ఉండెను. ఆమె కళాశాలలో ప్రవేశము పొందియున్నప్పుడు, తన యొక్క బలహీనత ఎంతో ఎక్కువగా మారిపోయింది. ఆమె ఏ పని కూడా చేయలేకపోవుచుండెను. టెలివిజన్ ద్వారా ఆమె యేసు పిలుచుచున్నాడు పరిచర్యను గురించి తెలుసుకొనెను. ఆలాగుననే, యేసు పిలుచుచున్నాడు Äౌవన భాగస్థుల పధకములో చేరిన భాగస్థులను యేసు ఆశీర్వదించుచున్నాడు అన్న సంగతిని ఆమె గుర్తించినది. ఆమె యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు సందర్శించినది. వెంటనే ఆమె Äౌవన భాగస్థుల పధకములో సభ్యురాలుగా చేరెను.

దేవుడు అప్పటి నుండి ఆమె చదువులను ఆశీర్వదించాడు. నేను టెలివిజన్‌లో ప్రార్థన చేయుచున్న ప్రత్యక్ష ప్రసారములో పాల్గొనెను. ఆమె యొక్క గొంతు నొప్పి సంపూర్ణంగా స్వస్థతను పొందుకున్నారు. తన యొక్క సమస్యలన్నియు కూడా ఆమె విడిచిపెట్టి వెళ్లిపోయినవి. దేవుడు ఆమెకు ఎంఫీల్‌ను సంపూర్తి చేసుకునే కృపను దయచేశాడు. ఇంకను ఆడిటర్ యొక్క ఆఫీసులో ఆమెకు దేవుడు ఒక చక్కటి ఉద్యోగమును అనుగ్రహించాడు. ప్రతి నెలా అనేక లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదముల కొరకై ఈ పరిచర్యకు సహకరిస్తున్న భాగస్థురాలుగా మారిపోయారు. దేవుడు ఆమెకు అద్భుతమైన భాగస్వామిని మరియు ఇద్దరు బిడ్డలను కూడా అనుగ్రహి ంచాడు. మన దేవుని యొక్క హస్తము సమస్తము ఆమె పట్ల మేలు జరిగించుట కొరకు ఉండి ఉన్నది. అవును, నా ప్రియమైన వారలారా, మన దేవుని ఆశ్రయించు వారికందరికి మరియు వెదకువారికి దేవుని హస్తము మేలుకరముగా ఉంటుంది. కాబట్టి, నేటి నుండి మీరు కూడా ఆయనను ఆశ్రయించండి మరియు ఆయనను వెదకినట్లయితే, నిశ్చయముగా, మీ జీవితములో కూడా సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. కాబట్టి నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు లేకుండా మేము ఏమియు చేయలేమని అంగీకరిస్తూ ఈ రోజు మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో మేము ఏమి చేయాలో మాకు నేర్పించుము. ప్రభువా, మేము చేపట్టే ప్రతిదానిలో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మమ్మును బలపరచుము. దేవా, మా జీవితంలోని సవాళ్ల ద్వారా మాకు మార్గనిర్దేశం చేయుము, అన్ని విషయాలు మేలు కొరకు సమస్తమును సమకూడి జరుగునట్లు కృపను చూపుము. ప్రభువా, నీ ప్రేమపూర్వకమైన హస్తాన్ని మా మీద ఉంచుము మరియు మా జీవితంలోని ప్రతి ప్రాంతాన్ని ఆశీర్వదించుము. యేసయ్యా, మేము నీ హస్తముల క్రింద సురక్షితముగా ఉన్నామని గుర్తించి మా హృదయం కలత చెందకుండా శాంతితో నింపబడునట్లు చేయుము. దేవా, నీ మంచితనాన్ని మరియు మేలులను మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో పంచుకోవడానికి మాకు శక్తిని దయచేయుము. ప్రభువా, మా మీద నిత్యము ఉన్న నీ యొక్క ప్రేమను మరియు సంరక్షణను మా మీద కుమ్మరించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.