నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు వాగ్దానము బైబిల్ నుండి నెహెమ్యా 2:8వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను'' ప్రకారం ఈ సందేశమును చదువుచున్న మీలో ప్రతి ఒక్కరి మీద దేవుని కరుణా హస్తము దిగివస్తుంది. ఈ వచనము ప్రకారము, నెహెమ్యాగారి యొక్క కధ భాగమును నేను చదువుచున్నప్పుడు, నెహెమ్యా రాజు యొద్దకు వెళ్లినప్పుడు, ఎందుకు నీ ముఖము విచారముగా ఉన్నది అని రాజు అతనిని ప్రశ్నించడము జరిగింది. నెహెమ్యా, హృదయములో ఎంతో వేదన, భారముతో నిండి ఉండెను. అందుకే అతని ముఖము ఎంతో విచారముగా ఉండెను. వెంటనే తన విచారమును మరియు భారమునంతటిని అతడు రాజుతో పంచుకున్నాడు. అదేమనగా, "నా దేవుని పట్టణము, ఆలయము అన్నియు కూడా విరిగిపోయి, కూలిపోయి ఉండగా, నేను ఎలాగున సంతోషముగా ఉండగలను?'' అని అడిగాడు.
వెంటనే, ఆ రాజు అందుకు జవాబుగా, "నేను ఏమి చేయాలని నీవు కోరుకుంటున్నావు?'' అని అడిగాడు. నెహెమ్యా వెంటనే, రాజునకు కొన్ని విజ్ఞప్తిలను తెలియజేసినప్పుడు, రాజు ఆ విజ్ఞప్తిలను అంగీకరించాడు. అవి సులభతరమైనవి కావు గానీ, పడిపోయిన ప్రాకారములను మరల కట్టుటకు ఇతడు విజ్ఞప్తి చే శాడు. దేవుడు అతనితో ఉన్నాడు గనుకనే, ఇదంతయు జరిగినది. దేవుని యొక్క కరుణా హస్తము అతనిపైన ఉన్నది. కాబట్టి, రాజు తన దయను నెహెమ్యా మీద కనుపరుచాడు. అదేవిధముగా, నేడు మీ చుట్టు ఉన్నవారందరి యొక్క దయను మీరు పొందుకొనబోవుచున్నారు. ప్రభువు మీతో కూడా ఉన్నాడు. దేవుని యొక్క కరుణా హస్తము మీకు తోడుగా ఉన్నది. మీరు దయను పొందుకుంటారు. అసాధ్యమైన పరిస్థితులలో కూడా దేవుడు మీతో కూడా ఉన్నప్పుడు, అవన్నియు మీకు సాధ్యమవుతాయి.
నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయానికి, నా అండర్ గ్రాడ్యుయేట్ చదువులు పూర్తి చేసుకొని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే మధ్యలో అనేక సంవత్సరాల కాల వ్యవధి వచ్చినది. ప్రవేశ పరీక్ష కొరకు సిద్ధపడి చదువుకొనుటకు ఎంతో కష్టతరముగా ఉండేది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన తర్వాత కూడా, నా కుటుంబానికి దూరంగా ఎక్కడికి వెళ్లి చదువుకోవాలో అనేక ప్రశ్నలు, విచారములు నాకు ఉండేవి. కానీ, దేవుని కరుణా హస్తము నాకు తోడుగా ఉన్నది. కాబట్టి, చెన్నై పట్టణములోనే ఒక మంచి విశ్వవిద్యాలయములోనే నాకు సీటు దొరికినది. ఒక మంచి విశేషమైన విశ్వవిద్యాలయములో నాకు సీటు దొరికి, అక్కడ నేను పీజీ చేయడానికి దేవుడు కృపను చూపించాడు. అది కేవలము దేవుని కరుణ మరియు కృపయై ఉంటున్నది. అదేవిధముగా, నా ప్రియులారా, నేడు దేవుడు మీ యెడల తన కృపను చూపించాలని మీ పట్ల కోరుచున్నాడు. దేవుని కృప మాత్రమే కాదు. కానీ, మీ చుట్టు ఉన్నవారి కూడా వారి కూడా అనుకూలంగా ఉంటుంది. కనుకనే, నేడు మీరు ఇటువంటి దేవుని హస్తము మీ మీదికి దిగి రావాలంటే, మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ఆయన మీ మనవిని ఆలకించి, ఆయన మీకు తన కృపను చూపించి, నేటి వాగ్దానము ద్వారా ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియ ప్రభువా, మా జీవితంపై నీ దయగల హస్తం మా మీద ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, ఈ రోజు, నీవు మాకు పోషకుడివని మరియు మార్గదర్శివని గుర్తెరిగి, మా భారములన్నింటిని నీ మీద విడిచిపెట్టుచున్నాము. ప్రభువా, మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ నీ దైవీకమైన కృపను మమ్మును ఆవరించునట్లుగా చేయుము. దేవా, మాకు అసాధ్యం అనిపించే తలుపులను తెరిచి, ఏదీ లేని చోట ఒక మార్గాన్ని మా కొరకు ఏర్పరచుము. దేవా, దయచేసి నీవు ఎల్లప్పుడూ మాతో ఉన్నావని తెలుసుకుని మా హృదయాన్ని నీ యొక్క శాంతి మరియు విశ్వాసంతోను మమ్మును నింపుము. ప్రభువా, నీ దృష్టిలో మాత్రమే కాకుండా మా చుట్టూ ఉన్నవారిలో కూడా మా పట్ల దయను పొందుకొనునట్లుగా చేయుము. దేవా, మా జీవితంలోని ప్రతి అంశాన్ని తాకుతూ నీ ఆశీర్వాదాలు పొంగిపొర్లునట్లుగా చేయుమని యేసు క్రీస్తు అతిశ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.