నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు దేవుడు మీకు ఇవ్వబోయేది మీరు అంగీకరించడానికి మీరు ఈ సందేశమును చదువుచున్నందుకు నేను ఎంతగానో ఆనందించుచున్నాను. మరియు అన్నిటికంటె అవి మీకు చాలినంతగా ఉంటుంది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 107:9 వ వచనమును మనకు ఇవ్వబడినది. ఆ వచనములో చూచినట్లయితే, అందులో ఇలాగున చెప్పబడియున్నది, "ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు'' ప్రకారము, నేడు దేవుడు మీ ఆశగల ప్రాణమును తృప్తిపరచాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, ప్రభువు ఎల్లప్పుడు మిమ్మును తృప్తిపరచు దేవుడుగా ఉన్నాడు. కనుకనే, నేడు ఆయన మనలను సంపూర్ణమైన మేలులతో నింపుతాడు, మనకు ఇక ఏ మేలును కొదువై ఉండదు.

నా జీవితములో నేను ఎలాగున దేవుని ఆశీర్వాదాలను అనుభవించినది చూచినట్లయితే, ఆయన ఆశీర్వాదాలు మనం మన స్వాధీనము కట్టుపరుచుకోలేనంత విధంగా పొంగిపొర్లుతాయి. ఆయన నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు, నేను దేవుని సన్నిధిని భరించలేకపోయాను లేదా నా స్వాధీనములో నన్ను నేను కట్టుపరచుకోలేకపోయాను. నేను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఎంతో ఆనందమును అనుభవించాను. అంతమాత్రమే కాదు, నా జీవితములో ఏదో ఒక సంతృప్తిని అనుభవించాను. అవును, నా ప్రియులారా, ఆలాగుననే, ప్రభువు మనలను ఆశీర్వదించినప్పుడు లేదా మనకు ఏదైనా అనుగ్రహించినప్పుడు అది కొలవలేనంత విస్తారముగా ఉంటుంది. అది మహాత్తరమైనదిగా, అది సమృద్ధితో నింపబడి ఉంటుంది మరియు ఆ ఆశీర్వాదాలు అన్నిటికంటే అత్యధికముగా ఉంటుంది.

ఆలాగుననే, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణించుచున్నప్పుడు, వారు ఆకలితో మరియు దాహంతో ఉండిరి. కానీ, వారు దేవుని వైపు తిరిగి ఆయన ను అడిగినప్పుడు, ఆయన వారి మొఱ్ఱలను ఆలకించి, వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు. తద్వారా, ప్రభువు వారికి ఆకాశమును నుండి సిద్ధపరచిన మన్నాను పంపించాడు. ఇంకను వారి కొరకు రుచికరమైన ఆహారం మరియు బండ నుండి మధురమైన నీరు ప్రవహించునట్లుగా చేశాడు. ఆలాగుననే, కానా అను ఊరిలో జరిగిన వివాహంలో కూడా, ప్రభువు ఇంతకు ముందు ఎన్నడును ఎవ్వరు కూడా రుచి చూడని మధురమైన ద్రాక్షారసాన్ని పంచిపెట్టునట్లుగా చేశాడు. ఆలాగుననే, ప్రభువు మనకు ఎప్పుడు ఏమి ఇచ్చినను సరే, ఏమి జరిగించినను సరే, అది అత్యంత రుచికరమైన, మధురమైన మరియు మేలుకరమైనదిగాను, అత్యంత సంతృప్తికరమైన యీవిగాను ఉంటుంది. కనుకనే, అటువంటి మధురమైన దాని కొరకు మనము ఆయన వైపు చూస్తూ, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటూ, ఆయనను అడగాలి. అప్పుడు ఆయన నిశ్చయముగా, మీకు సమస్తమును ఇచ్చి, మిమ్మును తృప్తిపరుస్తాడు.

నా ప్రియులారా, అనేకసార్లు, మనం ఆయనతో కూడా ఉంటాము. కానీ, మనము ఆయనను ఏమియు కూడా అడగము. బదులుగా, మనం ఈ లోకము వైపు మరియు లోకములో ఉన్న వారి వైపు చూస్తాము. కానీ, మనం ఆయనను అడిగినప్పుడు, ఆయన మనకు అత్యంత మధురమైనదానిని అనుగ్రహిస్తాడు. మనం ఆయనపై ఆధారపడటం నేర్చుకునేలా ఆయన మనలను ఎడారి మార్గము గుండా తీసుకొని వెళ్తాడు. అప్పుడు మీ చుట్టూ మీకు వేరే ఏమియు కనిపించకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకను మీరు మీ ఆహారం కొరకు యేసు వైపు చూచునట్లుగా చేస్తాడు. అటువంటి సమయములో ఆయన మనకు దేవుని అడగాలనియు మరియు ఆయన మీద మాత్రమే మనము ఆధారపడాలని మనకు బోధిస్తాడు. మరియు మనం అలాగున చేసినప్పుడు, ఆయన మనకు అత్యంత మధురమైన మరియు రుచికరమైనదానిని మనకు అనుగ్రహిస్తాడు. నా ప్రియులారా, ఈ రోజు, ఆ మధురమైన విషయం మన యొద్దకు వస్తుంది. ఎందుకంటే మీరు ప్రభువు కొరకు కనిపెట్టుకొని ఉన్నారు గనుకనే, ఆయన తప్పకుండా మీ అవసరతలన్నిటిని తీర్చి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా మిమ్మును తృప్తిపరచి, దీవిస్తాడు.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము దాహంతో నిండిన హృదయంతో మరియు ఆకలితో ఉన్న ప్రాణముతో నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, ఆకలిగొనిన మా ప్రాణములను సంపూర్ణముగాను మరియు సమృద్ధిగాను తృప్తిపరచుము. ప్రభువా, నీవు ఇశ్రాయేలీయులకు ఆహారం ఆకాశము నుండి మన్నాను పంపించి, వారికి బండ నుండి మధురమైన నీటిని పంపించినట్లుగానే, నేడు మా ప్రతి అవసరాన్ని నీ పరిపూర్ణ మార్గంలో తీరుస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, మా చుట్టూ ఉన్న ఈ లోకము వైపు కాకుండా నీ వైపు మాత్రమే చూచుటకు మాకు నేర్పించుము. ప్రభువా, మాకు కావలసిన వాటన్నిటిని మేము ఎంతో సహనముతో నీ కొరకు కనిపెట్టుకొని ఉండుటకును మరియు నీ సముఖములో ధైర్యంగా అడగడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవు మాకు ఉత్తమమైనదానిని అనుగ్రహిస్తావని మేము విశ్వసించుచున్నాము. ప్రభువా, మా జీవితం నీ మధురమైన మరియు సంతృప్తికరమైన ఆశీర్వాదాలతో నింపబడునట్లుగా చేయుము. దేవా, మా ప్రతి అవసరతల నిమిత్తము మేము ప్రతిరోజు నీ మీద ఆధారపడునట్లుగాను మరియు నీవు అనుగ్రహించు ఆనందాన్ని పొందుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, ఈ రోజు మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉండునట్లుగా, నీ సన్నిధిలో ప్రార్థించి సమస్తమును పొందుకొనునట్లుగా మా హృదయాలను ఆయత్తపరచుము. ప్రభువా, ఎంతో మధురమైనది మరియు ఏదో ఒక గొప్ప కార్యము మాకు సమీపముగా వస్తుందని మేము నమ్ముచున్నాము. ప్రభువా, ఆశగల మా హృదయమును నీవు మేలుతో నింపుము మరియు ఆకలి గొనిన మా ప్రాణమును తృప్తిపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత మధురమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.