నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువైన యేసు నామమున ఆయనకు మొఱ్ఱపెట్టుకుందాము. ఆయన మన మొఱ్ఱ ఆలకించి, కనికరముతో మనకు అద్భుతములను జరిగించబోవుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 14:11వ వచనమును కనుగొనబడిన వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, "బలములేని వారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు;'' అని చెప్పబడిన ప్రకారం ఆసా తన దేవుడైన యెహోవాకు ఇలాగున మొఱ్ఱపెట్టాడు, "యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమును బట్టియే యా సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నా ము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొంద నియ్యకుము అని ప్రార్థించెను.'' కనుకనే, బలహీనులకు, శక్తిహీనులకు సహాయం చేయుటకు దేవునికంటె నిజంగా మరెవరు కూడా ఈ లోకములో లేరు. ఎందుకంటే, ఆయన వారి పట్ల కనికరముతో నింపబడి మరియు ఆయన వారికి ఎంతో సమీపముగా ఉండెను. కనుకనే, ఆయన వారికి సమీపముగా వచ్చి, వారిని మోయుచూ, వారి కొరకు సమస్తమును జరిగించాడు.

నా ప్రియులారా, ఒకవేళ ఈరోజు, మీరు కూడా అలాంటివారుగా ఉండి ఉండవచ్చును, ఒక పెద్ద పరీక్ష లేదా కఠినమైన సబ్జెక్టు ముందు శక్తిహీనులై, ఉత్తీర్ణత సాధించడానికి లేదా ఎక్కువ మార్కులు పొందడానికి కష్టపడుచుండవచ్చును. లేదా ఒకవేళ నేడు మీరు ప్రభావవంతమైన మరియు బలవంతులైన వ్యక్తులపై మీరు కోర్టు కేసులో పోరాడుతుండవచ్చును. మీరు తీవ్రమైన పోటీ పరీక్షలను ఎదుర్కొంటూ, మీ చుట్టూ చూస్తూ, మేము ఇంత గొప్ప వ్యక్తులపై లేక ఇంత గొప్ప పరీక్షలను వ్రాసి ఎలా విజయమును సాధించగలము? మేము ఎంతో బలహీనులముగా ఉన్నాము అని ఆలోచిస్తుండవచ్చును. అయితే. ఇప్పుడు మనము దేవునికి మొఱ్ఱపెడదాము. ఆయన బలములేనివారికి ఎంతో సమీపముగా ఉన్నాడు. కనుకనే, నేడు ఆయన మీకు సమీపముగా ఉండి, మీకు తగినంత శక్తిని అనుగ్రహిస్తాడు. నేడే, దేవునికి మీరు మొఱ్ఱపెట్టండి! ఆయన బలములేనివారికి ఎంతో సమీపముగా ఉన్నాడు. కాబట్టి, బలహీనులైన మీకు ఆయన సమీపముగా ఉంటూ, మీకు సహాయం చేస్తాడు మరియు బలవంతుల మీద ఆయన మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన కృప మీ జీవితములో మీకు చాలినంతగా ఉంటుంది.

ఆలాగుననే, నా జీవితములో చూచినట్లయితే, నేను ఎమ్.బి.ఏ చదువుకునే దినములు నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చినది. ఇది నేను విద్యను అభ్యసించు తొలి దినములలో జరిగింది. నా తరగతిలో ఎంతో మంది అనుభవజ్ఞులైన వ్యక్తులు ఉన్నారు, కొందరు 40 ఏళ్లు పైబడిన వారు, మరి కొంతమంది 50 ఏళ్లు పైబడిన అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. వారు సొంత వ్యాపారాలు కలిగిన వ్యవస్థాపకులు లేదా పెద్ద కంపెనీలలో నిర్వాహకులుగా ఉండేవారు. తరగతి చర్చల సమయంలో, వారు పరిపాలన, ఆర్థికం మరియు నిర్వహణలోని వివిధ రంగాలలో వారి అనుభవాలను గురించి మాట్లాడుకునేవారు. నేను దానిని తలంచినప్పుడు, నాకు చాలా భయముగా అనిపించినది! నేను ఒక విద్యార్థిగా ఉన్నంత మాత్రాన నాకు అనుభవ జ్ఞానం పరిమితంగానే ఉండేది. నేను వాళ్ళతో ఎలా పోటీ పడగలను? అని ఆలోచిస్తూనే ఉంటాను.

ఆ తర్వాత తుది ప్రదర్శనకు (ప్రెజెంటేషన్) సమయం వచ్చింది. నేను కూడా వారి వలె నిలబడి ప్రదర్శనను (ప్రెజెంటేషన్) ఇవ్వవలసిన సమయము వచ్చినది. అలాంటి అనుభవజ్ఞులైన నిపుణులతో నేను ఎలా పోటీ పడగలను? కాబట్టి, నేను సహాయం కొరకు ప్రభువును మాత్రమే అడిగాను. "ప్రభువా, నేను వారి ప్రదర్శనలతో ఎలా పోటీపడగలను? ఇది చాలా కష్టం!'' అని దేవునికి మొఱ్ఱపెట్టాను. అప్పుడు అద్భుత రీతిగా, నా హృదయంలో ఒక గొప్ప సమాధానము నింపబడినట్లుగా నేను భావించాను. ఎలా సిద్ధం కావాలో మరియు ఏ వివరాలను చేర్చాలో ప్రభువు నాకు ఒక్కొక్కటిగా సున్నితంగా నిర్దేశిస్తున్నట్లు నేను గ్రహించాను. అది తలంచి, నా హృదయం ఉప్పొంగింది మరియు నేను నమ్మకంగా ముందుకు వెళ్లి ప్రదర్శనను (ప్రెజెంటేషన్) చేశాను. దేవుని దయవలన, ఆ(ప్రెజెంటేషన్)ప్రదర్శనలో నాకు పూర్తిగా ఎ+ గ్రేడ్ వచ్చింది! నా ప్రదర్శన (ప్రెజెంటేషన్) ద్వారా టీచర్‌ని కూడా ఆకట్టుకున్నది. అవును, నా ప్రియులారా, దేవుడు మీరు ఏ పరిస్థితినైనా జయించడానికి మీకు సహాయం చేస్తాడు. మీరు అత్యంత బలవంతులైన వ్యక్తులతో తలపడినప్పుడు కూడా, ఆయన మీ ద్వారా తన శక్తిని కనుపరుస్తాడు. కనుకనే, నేడు మీరు కూడా ఎటువంటి పరిస్థితులలో ఉన్నను సరే, మీరు సహాయము కొరకు దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు, నిశ్చయముగా, బలహీనమైన మీ పరిస్థితులను మార్చి, మీకు సహాయము చేసి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ రోజు మేము నీ నామము ద్వారా మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, ఎందుకంటే, నీవు మాత్రమే శక్తిహీనులకు సహాయం చేయగలవు మరియు బలహీనులను ఉద్ధరించగలవు. ప్రభువా, కనుకనే, నీవు కనికరముతో నింపబడి ఉన్నందున, మా మీద నీ కనికరమును చూపించి, మాకు సమీపముగా వచ్చి, ఈ పోరాటములో మమ్మును మోయుచు, మా సవాళ్ల యెదుట మేము బలహీనులమని భావించుచున్నాము. కానీ, దేవా, నీవు బలవంతుడివి, కనుకనే, మా బలహీనతలో నీ బలం పరిపూర్ణంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, పోరాటములతో నిండిన మా జీవితములో సమాధానం, దిశానిర్దేశం మరియు దైవిక విశ్వాసాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, బలవంతుల మీద మాకు విజయం ఇవ్వగలవని మేము నమ్ముచున్నాము. దేవా, మాకు చాలినంతకంటే అత్యధికమైన నీ కృపతో మమ్మును నింపుము. ప్రభువా, మా మొఱ్ఱను విని ఈ రోజు మా జీవితములో అద్భుతాలు జరిగించుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.