నాకు అమూల్యమైన స్నేహితులారా, దేవుడు మీకు స్నేహితునిగా ఉండాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, యేసు మిమ్మును ప్రేమించి మరియు తన స్నేహితునిగా పిలవాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిల్ నుండి నేటి వాగ్దానముగా యోహాను 15:14వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు'' అని చెప్పబడిన ఆ రీతిగా మనకు తెలియజేయుచున్నది. ఆ విధంగానే, బైబిల్‌లో సామెతలు 17:17వ వచనములో చూచినట్లయితే, "నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును'' అన్న వచనము ప్రకారము నిజమైన స్నేహితుడు ఎట్టి పరిస్థితిలోను మనలను ప్రేమిస్తాడు. కనుకనే దిగులు చెందకండి.

అవును, నా ప్రియులారా, మీ యొక్క గాఢాంథకారపు వేళలలో కూడ మీరు యేసు యొక్క ప్రేమను అనుభూతి చెందునట్లు చేస్తాడు. కారణము, యేసు మిమ్మును ప్రేమించుచున్నాడు. మీరనుకోవచ్చును, "నాకు స్నేహితులే లేరు? అన్నట్టుగా, ఎవ్వరు నాకు సహాయమును, సహకారము అందించుటకు కోరుకొనుట లేదు, ఎవ్వరు కూడ నిశ్చయత కొరకు నాతో ఉండగోరుట లేదు అని మీరు ఆ రీతిగా రోధిస్తున్నారేమో? నాతో, నా పక్షమున మాట్లాడడానికి ఎవ్వరు కూడ లేరు నాకు నేర్పించడానికి ఎవ్వరు లేరు, నాకు ధనము విషయములో సహాయము చేయడానికి ఎవ్వరును లేరు అని అంటున్నారా? అయితే, నా ప్రియులారా, మీకు సహాయము చేయడానికి స్నేహితులు ఎవ్వరు కూడ లేకపోవచ్చును. అయితే, నా ప్రియబిడ్డా, నేను మీకు స్నేహితునిగా ఉంటాను, నీవు నాకు స్నేహితుడవు. ఎందుకనగా, నా వాక్కు ప్రకారము, సమస్తమును, చేయుచున్నావు గనుక. భయపడకండి' అని చెబుతున్నాడు.

అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. శ్రీ ప్రభాకర్ రావు, అతి చిన్న వయస్సులోనే, 18 సంవత్సరాలలోనే, భారత సైన్యములో సైనికునిగా సేవలందించుటకు చేరాడు. వారికి వివాహమైనది. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆకస్మాత్తుగా తన భార్యకు క్యాన్సర్ సంక్రమించినది. ఆమె చనిపోయినది. కానీ, శ్రీ ప్రభాకర్ రావుకు ఎటువంటి ఆదరణ కలుగలేదు. అతనికి ప్రియమైన భార్యగా, స్నేహితురాలిగా ఉన్న భార్య ఆలాగున మరణించినది. వెంటనే అతడు మధ్యపానమును సేవించుటకు ప్రారంభించాడు. ఎంతగానో ఒత్తిడికి లోనయ్యాడు. ఆలాగుననే, ధూమపానము సేవించుటకు ఆరంభించాడు. ఎటువంటి ఆదరణ అతడు పొందలేకపోయాడు. తద్వారా అతని ఆరోగ్యము క్షీణించడము ప్రారంభించినది. అతనికి బైపాస్ ఆఫరేషన్ కూడ జరిగినది. అతనికి పాక్షికంగా పక్షవాతము వచ్చినది.

అయితే, తన కుమార్తెలకు తగిన జీవిత భాగస్వాములను చూడడము కొరకు తనకు ఎవ్వరు కూడ సహాయము చేయలేదు. అటువంటి సమయములోనే వారి నగరములలోనే, గుంటూరు ప్రాంతములో యేసు పిలుచుచున్నాడు మహా సభలు ఏర్పాటు చేయబడ్డాయి. అతడు ఆ కూటములకు పాల్గొన్నాడు. ప్రార్థన జరుగుచున్న సమయములో అక్కడ ఉండి ఉన్న లక్షలాది మంది ప్రజల మధ్యలో వారి పేరు పెట్టి పిలిచియున్నాను. పరిశుద్ధాత్మ ఆలాగున నా ద్వారా పలికించాడు. " ప్రభాకర్ రావు, ప్రభాకర్ రావు, నీవెక్కడ ఉన్నావు? వేదిక మీదికి పరుగెత్తుకొని రండి, మీ యొక్క భుజములో ఏదో ఒక సమస్య ఉన్నది. ఇక్కడ అనేకమంది ప్రభాకర్‌రావు ఉంటారు అని మీరు అనుకుంటున్నారు కదా? కానీ, ప్రత్యేకంగా మీకు భుజములో ఒక సమస్య ఉన్నది. దేవుడు మిమ్మును తాకుచున్నాడు. రూపాంతరపరుస్తున్నాడు. ఆయన తన పరిశుద్ధాత్మను మ మీద ఉంచుచున్నాడు'' అని చెప్పాను. వెంటనే అతడు వేదిక మీదికి పరుగున వచ్చాడు, నేను అతని కొరకు ప్రార్థించాను. దేవుడు అతనిని పరిపూర్ణముగా స్వస్థపరచాడు. అతని దుర్ వ్యసనాలు అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయాయి. అతడు విడుదల పొందుకున్నాడు. అనేక లక్షలాది మందికి ఆశీర్వాదకరముగా ఉండునిమిత్తము యేసు పిలుచుచున్నాడు టి.వి. కార్యక్రమమునకు అతడు స్పాన్సర్ చేశాడు. ఇంకను చర్మ వ్యాధితో ఉన్న తన కుమార్తెను దేవుడు స్వస్థపరచి యున్నాడు. దేవుడు ద్వారములను తెరువజేశాడు. తన కుమార్తె కొరకు సంబంధాలు పరుగున వచ్చాయి. ముగ్గురు కుమార్తెలకు వివాహము జరిగింది. అతని దుఃఖమంతయు ఆనందమయముగా మార్చబడినది. దేవునికే మహిమ కలుగును గాక.

అవును నా ప్రియులారా, " నీవు నా స్నేసితుడవు '' అని దేవుడు మిమ్మును చూచి సెలవిచ్చుచున్నాడు. మీ హృదయాన్ని యేసు కొరకు తెరచి, " ప్రభువా, నా జీవితాన్ని, హృదయాన్ని నీ వైపు మరల్చచున్నాను'' అని చెప్పండి. మీ జీవితాన్ని ఆయన స్వాధీనములోనికి తీసుకొనునట్లు చేయండి. ఆలాగున చేసినప్పుడు, దేవుడు మీలోనికి వస్తాడు. మిమ్మును తన స్నేహితునిగా మార్చుకుంటాడు. దేవుడు మిమ్మును దీవించును గాక. మీరు సమస్తమును రెండింతలుగా తిరిగి పొందుకొందురు గాక. దేవుడు మిమ్మును ఆశీర్వదించి, కుటుంబములుగా సంపూర్ణ సంతోషములతో నిర్మాణము చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఎల్లప్పుడు నీవు మాకు నమ్మదగిన స్నేహితునిగా ఉన్న యేసు యొక్క ఈ వర్ణించలేని వరమును మాకు ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు మమ్మును నీ స్నేహితునిగా ఎంచుకున్నందుకు మేము వందనాలు తెలియజేయుచున్నాము. దేవా, మేము ఇప్పుడు నీకు మా హృదయాన్ని తెరచుచున్నాము. దయచేసి నీ సన్నిధితో మమ్మును నింపుము మరియు మా జీవితాన్ని స్వాధీనం చేసుకొనుము, తద్వారా మేము నీ ఆజ్ఞలను అనుసరించునట్లుగాను మరియు నీ మార్గంలో నడుచునట్లుగా నీవు మాచేతిని పట్టుకొని నడిపించుము. ప్రభువా, ప్రతి ఒంటరి అనుభూతి నుండి మమ్మును విడిపించుము, మా మనస్సును పునరుద్ధరించుము మరియు ప్రతిరోజు నీలో ఎదుగుచున్న నిన్ను మా పక్కనే ఉండే అనుభూతిని చెందడానికి మాకు సహాయం చేయుము. దేవా, మునుపెన్నడూ లేని విధంగా నీ స్వరాన్ని విని, నీ అద్భుతాలను అనుభవించునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, మమ్మును నీ స్నేహితులనుగా ఆదరించినందుకు మరియు నీలో మాకు నూతన ప్రారంభాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.