నా ప్రియ సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 2:7 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను'' ప్రకారం మీ పనులన్నిటిని ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ప్రభువు ఇశ్రాయేలీయులు చేసిన పనులన్నిటిలోను వారిని ఆశీర్వదించెను. అవును, అదేవిధముగా, దేవుడు మీ చేతి పనులన్నిటిని ఆశీర్వాదిస్తాడు. ఇశ్రాయేలీయులు వేసే ప్రతి అడుగులో కూడా ప్రభువు వారికి తోడుగా ఉంటూ, వారిని నడిపించాడు. వారికి సంబంధించిన విషయములన్నిటిలో కూడా ప్రభువు వారిని వర్థిల్లింపజేసియున్నాడు. ప్రభువు మిమ్మును ఎంతగానో ప్రేమించుచున్నాడు గనుకనే, మీరు చేయు ప్రతి పనిలోను కూడా ప్రభువు మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపిస్తాడు. నా జీవితములో చూచినట్లయితే, నేను ప్రభువు దీవెనలు పొందుకున్న ప్రతిసారీ, నా భర్తగారితో ఇలాగున చెబుతాను, 'ప్రభువు నన్ను ఎంతగానో ప్రేమించుచున్నాడు, యేసయ్య నన్ను ఎంతగానో ప్రేమించుచున్నాడు.' వెంటనే, ' ప్రభువు నన్ను కూడా ఎంతగానో ప్రేమించుచున్నాడు. నిన్ను ప్రేమించుట కంటె నన్ను ఇంకా మరి ఎక్కువగా ప్రేమించుచున్నాడు' అని నా భర్తగారు చెప్పేవారు. అదేవిధముగా, ప్రభువు ఇశ్రాయేలీయులను దీవించుటలో ఆనందించి, సంతోషించాడు. వారు వేసిన ప్రతి అడుగు కూడా ప్రభువు గమనిస్తూ, వారికి తోడుగా ఉండి, వారిని అరణ్యములో కూడా నడిపించాడు. అందుకే బైబిల్ మలో చూచినట్లయితే, కీర్తనలు 139:3,4వ వచనములలో దావీదు భక్తుడు కూడా అదే అంటున్నాడు, "నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి యున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది '' ప్రకారం, ఇంకను దావీదు, 'తెరచిన పుస్తకమువలె నీవు నా హృదయమును చదువుచున్నావు, నా ప్రయాణము ఆరంభించకముందే, నేను వేయు ప్రతి అడుగు నీకు తెలిసియున్నది అని అంటున్నాడు.' కనుకనే, దేవునికి మన నడక, పడక అన్నియు తెలుసు. ఇంకను అన్నిటిని ఆయన పరిశీలించియున్నాడు. కనుకనే, దిగులుపడకండి.

నా ప్రియ స్నేహితులారా, నేను ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నానో, ప్రభువుకు తెలియదు అని మీరు అనకండి. ప్రియులారా, ఆయన మీ గురించి అన్నిటిని తెలుసుకొని, పరిశీలించియున్నాడు. మన జీవిత ప్రయాణము ఆయనకు ఎంతగానో తెలిసియున్నది, కనుకనే, మనము ఆయన యందు ఎంత నమ్మిక కలిగి ఉండాలి కదా! ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో ప్రయాణించుచున్న కాలమంతా ప్రభువు వారిని కాపాడుతూ వచ్చాడు. వారి జీవితములలో ప్రభువు యొక్క ప్రమేయమును ఇది ఎంతో స్పష్టముగా తెలియజేయుచున్నది. అందుకే, కీర్తనలు 90:17వ వచనములో చూచినట్లయితే, "మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము'' ప్రకారం అవును, నా ప్రియులారా, ప్రభువు మీ చేతి పనులన్నిటిని ఆయన స్థిరపరుస్తాడు.

యేసు పిలుచుచున్నాడు సిబ్భంది అయినటువంటి సహోదరి రమ్య ప్రసన్న యొక్క సాక్ష్యమును మీతో పంచుకోవాలని మీ పట్ల కోరుచున్నాను. ఆమెను 13 సంవత్సరములు మాతో పనిచేశారు. ఒకసారి ఆమె యొక్క చిన్న కుమారుడైన అభిలాష్‌కు జ్వరము వచ్చినది. ఆ జ్వరము 101 డిగ్రీల వరకు వెళ్లిపోయినది. రోజు తర్వాత రోజు అది ఇంక భయంకరముగా పెరిగిపోవుచుండెను. అతనికి వాంతులు, కడుపునొప్పి కూడా వచ్చినది. ఎటువంటి ఆహారము కూడా ఆ పిల్లవాడు తీసుకొనలేకపోయాడు. రెండు రోజులుగా మూత్రమునకు కూడా వెళ్లలేకపోయాడు. కాబట్టి, ఆ పిల్లవాని అవయవములన్నిటిలో కూడా ఆ సంక్రమణ (ఇన్ఫెక్షన్) వ్యాపించినది. వాని మూత్రపిండాలకు, గుండెకు మరియు ఊపిరి తిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ వ్యాపించినది. ఆ సహోదరి ఆ పిల్లవానిని నాలుగు హాస్పిటల్ల్‌కు తీసుకొని వెళ్లినది. ఆ పిల్లవాడు 2 గంటలలోనే మరణిస్తాడని వైద్యులు చెప్పారు. చివరిగా, ఆ పిల్లవానిని మరొక హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లుచుండగా, నా భర్తగారు ఆ సహోదరికి కాల్ చేసి, ఆ చిన్న బాబును గురించి ఎంతో భారముతో ప్రార్థించారు. అభిలాష్‌ను గురించి ఈ విధంగా ప్రవచించారు, "ఈ బాబు అనేక సంవత్సరాలు దీర్ఘాయువు చేత జీవిస్తాడు, అతడు ఒక దేవుని ప్రవక్తగా జీవించబోవుచున్నాడు అని చెప్పారు. ''

ఆ తర్వాత, వైద్యులు ఆ పిల్లవానికి ఒక శస్త్రచికిత్స చేయాలి, ఆ శస్త్రచికిత్స ద్వారా ఒక చేతిని తొలగించాలని అని చెప్పారు. అయితే, నా భర్తగారు చేసిన ప్రార్థన శక్తి వలన, ఇక శస్త్ర చికిత్స అవసరము లేదని చెప్పారు. దేవుడు ఇచ్చిన మాట చొప్పున, అభిలాష్ ఎంతో త్వరితముగా కోలుకొని, సాధారణ స్థితికి వచ్చి, స్వస్థతను పొందుకొనియున్నాడు. నా భర్తగారు చేసినటువంటి బలమైన ప్రార్థన ద్వారా ప్రభువు ఆ పిల్లవానిని తాకి పరిపూర్ణమైన విడుదలను అనుగ్రహించాడు. ఈ రోజు నా కుమారుడు ఎంతో ఆరోగ్యముగా ఉన్నాడు అని సహోదరి రమ్య చెబుతున్నారు. ఏ చేయిని అయితే, వైద్యలు తొలగించాలని చెప్పారో, అదే చేతితో, ఈరోజు ప్రార్థన గోపురములో నూనె పోయుచూ, పరిచర్య చేయుచున్నాడు. ఒకరోజు ప్రభువు నా కుమారుని ప్రవక్తగా వాడుకుంటాడు అని తన తల్లి చెప్పెను. 12 సంవత్సరాలా అభిలాష్ ప్రార్థన గోపురమునకు వచ్చేవారికి నూనెను పంచుతూ, పరిచర్య చేయుచున్నాడు. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక! నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ గురించి కూడా పట్టించుకుంటున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ చేతి పనులన్నిటిలోను మిమ్మును ఆశీర్వదించి స్థిరపరుస్తాడు. మీ ప్రార్థనలన్నిటికిని ప్రభువు మీకు జవాబును అనుగ్రహిస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువైన యేసయ్యా, నీవిచ్చిన మాట చొప్పున నీ బిడ్డలైన మమ్మును ఆశీర్వదించుము. దేవా, నీ మహిమార్థమైన నీ యొక్క పనిచేయుచున్న లేక సేవ చేయుచున్న హస్తాలను దృష్టించి, మమ్మును ఆశీర్వదించుము. దేవా, మేము చేయుచున్న ప్రతి పనిలోను నీ యొక్క దీవెనలను కలుగజేయుము. ప్రభువా, మా యొక్క వ్యాపారమును, ఉద్యోగమును, మా కుటుంబములో ఏ పని చేయుచున్నను, ఇతరుల కొరకు మేము చేయుచున్న ఏ పనినైనను సరే, మా పనిని ఆశీర్వదించి, వర్థిల్లింపజేయుము. దేవా, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించినప్పుడు, వారికి ఎటువంటి కొదువ లేదు కదా, ఆలాగుననే, మేము ఎవ్వరి దగ్గరకు వెళ్లకుండా, మమ్మును కూడా ఆశీర్వదించుము. దేవా, మా ఆశీర్వాదములకు ఉన్న ప్రతి అడ్డంకులను తొలగించి, ఈ రోజు మమ్మును దీవించుము. మాకును మరియు ఇతరులకు మధ్య ఒక వ్యత్యాసమును కనుపరచుము. ప్రభువా, మేము వేయుచున్న ప్రతి అడుగు మరియు మేము మోయుచున్న ప్రతి భారం నీకు తెలుసు. కనుకనే, ప్రభువా, మా అవసరాలను నీవు ఎల్లప్పుడూ గుర్తెరిగియున్నావని మేము విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, తెరచిన పుస్తకము వలె మా హృదయాన్ని చదివి, అది ప్రారంభించే ముందు మా మార్గాన్ని నడిపించుము. దేవా, ఇశ్రాయేలీయులపై ఉన్నట్లుగానే నీ అనుగ్రహం మా మీద ఉంటునట్లుగా మాకు నీ కృపను చూపుము. దేవా, మేము ఈ రోజు ఎదుర్కొనే ప్రతి పనిలోనూ మమ్మును బలపరచి, స్థిరపరచి, ఆశీర్వదించుము. ప్రభువా, నీవు మా ప్రార్థనలన్నింటికి జవాబును దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.