నా అమూల్యమైన స్నేహితులారా, దేవుడు మీ జీవితమును అధికమైన సంతోషముతో నింపబడవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 4:7వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "వారి ధాన్యద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషము కంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి'' ప్రకారం నేడు మీ హృదయములో సంతోషమును నింపుచున్నాడు. మీరు తృప్తి నొందునంతగా, ఆయన ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పింపిస్తాడని వాగ్దానము చేయుచున్నాడు. మీ జీవితములో సమస్తమైన ఆశీర్వాదములను అనుగ్రహించుట ద్వారాను మరియు మీ హృదయములో మరి ఎక్కువైన సంతోషము, ఈ లోకపరమైన వాటిని అనుగ్రహించుట దానికికంటే మించినది. అట్టి సంతోషము పరిశుద్ధాత్మ ద్వారా మీకు వస్తుంది. అవును, ఆయన మీరు ఈ లోక ఆశీర్వాదాలను మరియు ప్రభువైన పరిశుద్ధాత్మ వచ్చు పరలోకపు ఆశీర్వాదాలు మీలోనికి రావాలని మీ పట్ల ఆశించుచున్నాడు. అట్టి ఆశీర్వాదాలను మీరు కలిగి ఉండుట గొప్ప సంతోషకరమై యున్నది కదా. ఈ రోజే ఈ ఆశీర్వాదము మీకు మరియు మీ కుటుంబము మీదికి వచ్చును గాక.
అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. శ్రీ. విల్సన్ మరియు శ్రీమతి మైథిలి. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2004వ సంవత్సరము నుండి వారు ఒక వ్యాపారమును చేయుచున్నారు. అయినప్పటికిని వ్యాపారము మందగించినది. తద్వారా, ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. విల్సన్ అప్పులు తీసుకోవడం ప్రారంభించాడు. అతని భార్య ప్రభుత్వములో ఉద్యోగము చేయుచూ, ఆమె ఉన్నతమైన స్థితిలో ఉండెను. కానీ, వ్యాపారములో నష్టము రావడము ద్వారా ఆమె తన కార్యాలయములో ఋణము తీసుకొని ఆలాగుననే తన వ్యాపారమును కొనసాగించుచుండెను. కానీ, తర్వాత, పెద్ద నష్టము రావడము జరిగినది. అతడు వ్యాపారాన్ని విడిచిపెట్టాడు. అతడు ఏదో ఒక ఉద్యోగములో పనిచేయాలని అనుకున్నాడు. భార్య తాను ఉద్యోగము చేయుచున్న స్థలములో ఋణమును తీసుకొని, తీర్చలేనందున, ఆమె ఉద్యోగమును కూడ కోల్పోవడము జరిగింది. వారి జీవితములో అత్యంత క్లిష్టమైన పరిస్థితికి చేరుకున్నారు. తద్వారా, తమ ఇద్దరు కుమార్తెలకు తినడానికి ఏమియు లేదు. వారికి అప్పు ఇచ్చిన వారు కూడ వారి వెంటపడ్డారు. వారు ఇంటి బయట తాళము పెట్టి, లోపలనే ఉండిపోయేవారు. బ్రతకడము కంటే, చనిపోవడమే మేలు అని వారు అనుకున్నారు.
అటువంటి ఈ క్లిష్ట పరిస్థితిలలో ప్రయాణిస్తున్నప్పుడు, ఒకరోజు యేసు పిలుచుచున్నాడు టి.వి. కార్యక్రమమును చూస్తున్నారు. కార్యక్రమములో నేను, అధికమైన ఋణములతో ఉన్నవారి కొరకును మరియు ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థించాను. ఈ ప్రార్థన బాధపరచిన వారి ఆత్మలకు ఎంతో నెమ్మదిని కలిగించింది. ప్రార్థన తర్వాత, గొప్ప సమాధానమును వారు అనుభవించారు. మరియు యేసు వారికి సహాయము చేస్తాడను గొప్ప నిరీక్షణ వారి హృదయములోనికి వచ్చినది.
కనుకనే, వారు యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు వెళ్లారు. వారి యొద్ద కొద్ది మొత్తము ధనముతోనే వారి యొక్క ఇద్దరు కుమార్తెలను యేసు పిలుచుచున్నాడు Äౌవ్వన భాగస్థుల పధకములో భాగస్థులనుగా చేర్చించారు. అదే రోజున తన యొక్క భర్త విల్సన్‌కి మరొకరి యొద్ద నుండి కాల్ రావడం జరిగింది. ఆ వ్యక్తి తన భర్తతో ఏమి చెప్పాడంటే, మేము మీకు 15,000 రూపాయలు ఇవ్వవలసి ఉన్నది, వచ్చి మా దగ్గర నుండి తీసుకొని వెళ్లండి అని చెప్పారు. అత్యంత్య ఋణమును కలిగియుండి కూడ వీరు మొదట యేసునకు ఇచ్చినందున, ఆయన అదే దినము వీరికి డబ్బు కూడ రావడం ద్వారా వారికి ఒక సూచనను చూపించాడు. తద్వారా, వారు ఎంతగానో సంతోషించారు, ఆనందించారు. ఆ తర్వాత తన భర్తకు ఉద్యోగము లభించినది. ప్రభుత్వ ఉద్యోగమును కోల్పోయిన భార్యకు మరల ఉద్యోగము వచ్చినది. ఈ రోజు వారు ఆర్థికపరంగా ఎంతో సురక్షితంగా ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహము జరిగించబడినది. ఆమె మరియు ఆమె యొక్క భర్త చెన్నైలో స్థిరపడ్డారు. వారు ఎంతో మంచి ఆనందమయమైన జీవితమును జీవించుచున్నారు. రెండవ కుమార్తె కూడ వివాహము జరిగించబడినది, ఆమె దుబాయ్‌లో స్థిరపడినది. దేవుడు వారి జీవితాలలో సంతోషాన్ని ఉంచాడు. ఈ శ్రమల ద్వారా వారు యేసును కనుగొని యున్నందున వారికి మరి ఎక్కువగా సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, అదే యేసు నేడు మీకు సహాయము చేస్తాడు. తన పేదరికము ద్వారా మనము ఐశ్వర్యవంతులనుగా చేయుట కొరకు ఆయన ఎంతగానో బీదవాడయ్యాడు. యేసు పేదరికరము మరియు దారిద్య్రము గుండా వెళ్లియున్నాడు. అయితే, ఈ రోజు ఆయన రాజులకు రాజు, ఆయన మీ పేదరికము నుండి మరియు ఆర్థిక సమస్యల నుండి మిమ్మును బయటకు తీసుకొని వస్తాడు. ఆయన మీ కోసము ఆలాగుననే సమస్తమును జరిగిస్తాడు. కనుకనే, మీరు యేసునందు నిరీక్షణ ఉంచండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకపు తండ్రీ, నీ ప్రేమపూర్వక వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, నీ సన్నిధిలో మాత్రమే ఆనందం యొక్క సంపూర్ణత ఉంటుంది. కనుకనే, మా నిస్సహాయత మధ్య, మేము నీ సహాయం కొరకు మొరపెట్టుకుంటున్నాము. ఎందుకంటే నీవు మమ్మును రక్షించగలవు మరియు మేము కోల్పోయిన వాటిని పునరుద్ధరించగలవు. ప్రభువా, విజయం సాధించి, మా హృదయంలో ఎక్కువ ఆనందాన్ని పంచగలిగే శక్తిని ఇవ్వగల నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపాలని మేము హృదయపూర్వకంగా వేడుకుంటున్నాము. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో, అక్కడ స్వాంతంత్య్రము, నిరీక్షణ, సంపూర్ణమైన ఆనందం మరియు సమాధానము ఉన్నాయని నీ వాక్యం చెబుతుంది. కనుకనే ప్రభువా, మేము మా జీవితాన్ని, మా ప్రయత్నాలను, మా ఆర్థిక వ్యవహారాలను మరియు మా సంబంధాలను నీ ప్రేమగల హస్తములలోనికి అప్పగించుచున్నాము. దేవా, మా ప్రతి వంకర మార్గాన్ని సరాళంగా మార్చగల నీ సామర్థ్యాన్ని పూర్తిగా నమ్ముచున్నాము మరియు మా జీవితంలోని ప్రతి ప్రాంతాన్ని నీ పరిపూర్ణమైన ఆశీర్వాదాలతో మరియు పొంగిపొర్లుతున్న ఆనందంతో నింపబడునట్లు చేయుము. దేవా, మేము ఇతరులకు ఆశీర్వదకరముగాను మరియు నీ నామమునకు ఘనతను కలిగించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీవు మా జీవితంలో ఒక మంచి పనిని ప్రారంభించినందుకై నీకు వందనాలు చెల్లించుచు యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.