నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. అవును మన దేవుడు మహోన్నతుడై ఉన్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 8:37 వచనములో ఈ విధంగా వ్రాయబడియున్నది. ఆ వచనము, "అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మనలను ప్రేమించుట ద్వారా మనము అన్నిటిలోను అత్యధికమైన విజయమును పొందుకొనుచున్నాము. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, ఈ వచనాన్ని మునుపటి వచనంతో కలిపి చదువుదాం, రోమీయులకు 8:36,37వ వచనములను చూద్దాం, "ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడినవారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము '' అని చెప్పబడినట్లుగానే, అవును, ప్రియ స్నేహితులారా, మీరు అనేకమైన శ్రమలు మరియు కష్టాలను ఎదుర్కొంటున్నారేమో? మీకు బిడ్డలు లేరేమో? అన్నిటి యందు నిరీక్షణ కోల్పోయారేమో? ఎల్లప్పుడు సమస్యలు, ఒకదాని వెంబడి ఒకటి వస్తున్నాయామో? అయినను మనలను ప్రేమించిన దేవుని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నామని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది.
ఇంకను బైబిల్లో చూచినట్లయితే, 1 దినవృత్తాంతములు 29:11వ వచనము ప్రకారము, "యెహోవా, భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొనియున్నావు'' అను వచనము ప్రకారము మనము ఎల్లప్పుడు అంత గొప్ప స్నేహితుని కలిగియుంటున్నాము స్నేహితులారా. ఇంకను బైబిల్లో చూచినట్లయితే, 1 దినవృత్తాంతములు 29:11వ వచనమును చూచినట్లయితే, " ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే. ప్రభువు మనతో ఉండడము మనకు ఎంత ధన్యకరమైన జీవితము కదా నా స్నేహితులారా. నేడు మీరు కూడా యేసును మీలో కలిగియున్నప్పుడు, మీకు సమస్త ఆశీర్వాదములు కలిగియున్నట్లే. మీ జీవితములో నిరీక్షణ అంతటిని కోల్పోయారేమో, అయ్యో! నేను జీవితాంతమునకు వచ్చియున్నాను. నాకు ఇక బిడ్డలు పుట్టరు, నాకు పదోన్నతి కలుగదు, జీవితములో ఏ ఆశీర్వాదము కలుగలేదని మీరు వీటన్నిటిని గురించి చింతించుచున్నారేమో? ఆశీర్వాదాలు మీకు అందనంత దూరంలో ఉన్నాయని మీరు భావించవచ్చును మరియు మీ హృదయం ఆందోళనతో నింపబడి ఉండవచ్చును. కానీ, నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీరు దేవుని హత్తుకొని ఉండాలని నేను మిమ్మును ప్రోత్సహించుచున్నాను, అప్పుడు మీరు మీ జీవితంలో నిశ్చయంగా అన్నిటిలోను అత్యధికమైన విజయమును పొందుకుంటారు.
నా జీవితములో కూడా నేను సమస్తమును కోల్పోయాను. నా మొదటి బిడ్డను మరియు రెండవ బిడ్డను నేను కోల్పోయాను. ఆ తర్వాత, దేవుడు నన్ను ఆశీర్వదించి, నాకు అద్భుతమైన బిడ్డలను అనుగ్రహించాడు. నా కుమారుడైన పాల్ దినకరన్ ద్వారా, దేవుడు నన్ను అత్యధికముగా ఆశీర్వదించాడు. ఏంజల్ ఎంతో దీవెనకరముగా ఉండేది. ఇప్పుడు కూడా నా యొక్క బిడ్డలు, మనవళ్లు, మనరాళ్లు ఎంతో దీవెనకరముగా ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక.
అవును, నా ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మీరు కూడా దేవుని గట్టిగా పట్టుకొనండి. ఆయనను హత్తుకొని ఉన్నప్పుడు, మీరు అత్యధికమైన విజయమును పొందినవారుగా ఉంటారు. ప్రభువు మీతో ఉండి, మీకు అన్నిటిలోను విజయమును అనుగ్రహిస్తాడు. కనుకనే, ప్రార్థించి, ప్రభువు యొక్క అత్యధికమైనటువంటి ఆశీర్వాదములను ఇప్పుడే పొందుకోవాలనగా, మీరు మీ జీవితాలను దేవుని హస్తాలకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ ఓటమిలన్నిటిలోను మరియు మీరు కోల్పోయిన వాటన్నిటిలోను దేవుడు మీకు అత్యధికమైన విజయమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మహోన్నతుడవైన మా ప్రేమగల పరలోకందున్న తండ్రీ, మేము కృతజ్ఞతతో మరియు నమ్మకంతో నింపబడిన హృదయంతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, ప్రతి శోధన మరియు కష్టాలలో, నీ ప్రేమ ద్వారా అన్నిటిలోను మేము అత్యధికమైన విజయమును పొందుకుంటామని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవే మాకు బలం, మాకు ఆశ్రయం మరియు మా జీవితంలోని ప్రతి ఆశీర్వాదానికి ఆధారం. ప్రభువా, మా మేలు కొరకు నీవు సమస్తమును చేయగలవని మేము నమ్ముచున్నాము. తండ్రీ, మేము మా చింతలను, మా పోరాటాలను మరియు మా భారాలను నీ బలమైన చేతులకు అప్పగించుచున్నాము. తండ్రీ, మేము అనేకమైన వాటిని గురించి చింతించుచున్నాము. మాకు సంతానమును దయచేయుము, మా వివాహ జీవితములో ఏ దీవెనలు పొందుకోలేదు, ఉద్యోగములో ఎటువంటి దీవెన పొందుకోలేదు. కనుకనే, దేవా, నీ పాదములను గట్టిగా పట్టుకొని యుండగా, నీ బలమైన హస్తమును మా మీద ఉంచుము, మాకు నూతన జీవితమును దయచేసి, నీ యొద్ద నుండి అత్యధిమైన విజయమును పొందుకొనునట్లుగా మమ్మును మార్చుము. దేవా, నీ శక్తి మరియు మహిమ మా జీవితాన్ని ఏలునట్లుగా మాకు కృపను అనుగ్రహించి, మమ్మును ఉన్నత ఎత్తులకు హెచ్చించుము. ప్రభువా, మేము చేయుచున్న ప్రతి పనిలో నీ శాంతి, ఏర్పాటు మరియు దైవీకమైన అనుగ్రహంతో మమ్మును దీవించుము. ప్రభువా, మేము నిన్ను గట్టిగా పట్టుకొనుటకు సహాయము చేయుము, మేము నీవు మమ్మును ఎన్నడును విడిచిపెట్టవని మేము గుర్తించునట్లుగా కృపను దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.