నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహెజ్కేలు 36:10వ వచనమును మనము కనుగొనగలము. ఆ వచనము, " మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని విస్తరింపజేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరల కట్టబడును'' అన్న వచనము ప్రకారము నేడు ఆయన మిమ్మును విస్తరింపజేయాలని మరియు మీ పాడైపోయిన పట్టణములను మరల కట్టించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. ఈ రోజు ఈ వాగ్దానము మీ మీదికి వచ్చుచున్నది. దేవుడు మీ మీద ప్రజలను వృద్ధిపొందింపజేయుచున్నాడు. బైబిల్‌లో ఇటువంటి వాగ్దానము ఎవరికి చెప్పబడియున్నది? ఇశ్రాయేలీయుల ప్రజలు వేరొక దేశముచేత అణచివేయబడుచూ, వారికి బానిసగా లోబడి జీవించుచున్న దినములలో వారు ఇతర జనాంగముల చేత పట్టబడిన జనాంగముగా వారు ఆ రీతిగా బానిసగా కొనిపోబడినప్పుడు, ప్రజలు వారిని చూచి, 'ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరై యున్నారు? మీరు ఏమి కారు, మీరు ఆలాగున వ్యర్ధముగా పడియున్నవారే చూడండి' అని వారు ఇశ్రాయేలీయులను చూచి ఎగతాళి చేశారు. కానీ, దేవుడు బానిసగా ఉన్న ఇశ్రాయేలీయులను చూచి, ' నా ప్రజలు ' అని చెప్పుచున్నాడు. కాబట్టి, నేడు మీరు ఈ రోజున అటువంటి పరిస్థితులలో ఉన్నారేమో? కానీ, మీ హృదయమును కలవరపడనీయ్యకండి.
నా ప్రియులారా, మీరు ఈ రోజు అలాంటి స్థితిలో ఉండవచ్చును, ఇతరుల క్రూరమైన మార్గాలకు మీరు లోబడి, మిమ్మును మీరు కాపాడుకోలేక శక్తిహీనులుగా అందరిచేత విడిచిపెట్టబడ్డారేమో? మిమ్మును గమనిస్తూ, మీ కోసం, మీ పక్షమున మిమ్మును కాపాడుటకు శక్తిమంతుడైన దేవుడుగా ఒక వ్యక్తి ఉన్నాడు. కనుకనే, భయపడకండి. మీరు ఈ అధ్యాయాన్ని చదివినట్లయితే, 'వారు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎగతాళి చేయడానికి వారికి ఎంత ధైర్యం? వారు నా ప్రజలు' అని అంటున్నాడు. ఆయన ప్రతీకారము తీర్చుకొనుటకు సమయము కొరకు ఆయన వేచియున్నట్లుగా మనము చూడగలము.
నా ప్రియ స్నేహితులారా, మా తాతగారు మరియు బామగారి యొక్క ఏకైక కుమార్తెయైన ఏంజల్‌ను కోల్పోయి ఉన్న సమయములో, వారికి సంతానము లేనట్లుగానే, ఎంతగానో బాధపడ్డారు. వారు ఎంతగానో ప్రేమించిన ప్రియమైన కుమార్తెను కోల్పోయారు. వారు ఆదరణ లేనివారుగా ఆ సమయములో జీవించారు. అయితే, ప్రజలు వారిని చూచి, 'వారు దేవుని చిత్తమును వెంబడించుట లేదు, అందుకే దేవుడు వారికి ఈ శిక్షను కలుగజేశాడని వారిని ఎగతాళి చేస్తున్నవారు అనేకమంది ఉన్నారు. వారు కళశాలను నిర్మాణము చేసిన వారి ప్రణాళిక అంతయు తప్పు, అందుచేతనే దేవుడు వారిని శిక్షించాడు అని చెప్పారు.' అంతమాత్రమే కాదు, ప్రజలు వారిని ఎగతాళి చేసి, వారి హృదయాన్ని బ్రద్ధలు చేశారు. అయినప్పటికిని, ఆ సమయములో వారు ప్రభువును వెంబడించులాగున దేవుడు వారి మీద సవాలు విసిరాడు. తద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు వారిని శక్తిమంతులనుగా చేశాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారిని అవధులు లేకుండా నింపియున్నాడు. పరిశుద్ధాత్మ వారిని శక్తివంతం చేసి, వారిని కొలత లేకుండా నింపాడు. వారికి తెలియకుండానే వారు ఉదయకాలముననే నవ్వుచుండెను. ఆత్మ బలంతో, అవును ప్రభువా, మేము నిన్ను వెంబడిస్తాం' అని ధైర్యంగా చెప్పగలిగారు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, ఈ రోజు అదే స్థలములో దేవుడు ప్రజలను వారి మీద వృద్ధిపొందింపజేసియున్నాడు. ఈ రోజు వారి ద్వారా అభివృద్ధి పొందియున్న మరియు వారి ద్వారా పెంచబడిన ఆత్మీయ పిల్లలు లెక్కలేనంతగా విస్తరించియున్నారు. అదే కళాశాళ ద్వారా పెంపెందించబడినవారు లెక్కకు మించియున్నారు. అదే పాడైపోయిన స్థలములో దేవుడు ఎంతగానో పునర్నుర్మాణము జరిగించియున్నాడు. సేవను మరియు విశ్వవిద్యాలయమును పెంపెందింపజేశాడు. అంతమాత్రమే కాదు, అనేకమంది హృదయాలలో ఆయన రాజ్యమును నిర్మాణము చేశాడు. అదేవిధముగా, నేడు దేవుడు మీ మీద ప్రజలను విస్తరింపజేయుచున్నాడు. మీ పాడైన నగరములు నివాస య్యోగములగునట్లుగా చేస్తాడు. మీ పాడైన పట్టణములు తిరిగి నిర్మాణము చేయబడతాయి. కాబట్టి, ఈ వాగ్దానము కొరకు మనము దేవునికి వందనములు చెల్లిద్దాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మా మీద ప్రజలను విస్తరింపజేయుటకై నీకు వందనములు. మేము అనేకమందిని కలిగియుండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా ద్వారా అనేకమంది లేవనెత్తబడునట్లుగాను మరియు మమ్మును ప్రేమించుటకు అనేకమంది మాకు యీవుగా దయచేయుము. ప్రభువా, నీవు మా జీవితాలను మరియు మా ఆస్తిని మరియు మా సరిహద్దులను పునర్నిర్మాణం చేయుము. దేవా, నీవు మా జీవితంలో ఆశీర్వాదాలను విస్తరింపజేస్తావని నమ్ముతూ ఈరోజు ఈ వాగ్దానాన్ని మా స్వంతం చేసుకొనుచున్నాము. ప్రభువా, ఇశ్రాయేలీయులు అణచివేత మరియు అపహాస్యం ఎదుర్కొన్నట్లుగానే, మేము కొన్నిసార్లు శక్తిహీనంగా మరియు ఇతరుల మార్గాలకు లోబడి ఉండకుండా చేయుము, మా పక్షమున ప్రతీకారము చేయువాడవని మేము నమ్ముచున్నాము. దేవా, మేము కోల్పోయిన వాటిని పునరుద్ధరించడానికి పాడైన మా పట్టణములు మరల కట్టబడుటకును నీవు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము నీ యొక్క బలం మరియు అధికారత కొరకు అడుగుచున్నాము. దేవా, నిన్ను నమ్మకంగా అనుసరించడానికిని మరియు మా జీవితంలో పాడైన భూములను పునర్నిర్మించుము మరియు మా మీద నీ యొక్క ఆశీర్వాదాలను వృద్ధిపొందింపజేసి, నీ ఆత్మతో మా హృదయాన్ని నింపుము, నీ రాజ్యం మాలో వర్ధిల్లునట్లుగాను కృపను దయచేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.