నా ప్రియమైన స్నేహితులారా, సంవత్సరాంతము వస్తుండగా, నిరాంతరాయంగా దేవునికి వందనాలు చెల్లించుటకు గుర్తు చేయుచూ, మరియొక గొప్ప నూతన సంవత్సరం కొరకు ఎదురు చూద్దాము. దేవుడు మనలను స్థిరపరచాడు. నిరంతరాయంగా గొప్ప ఔనత్యమునకు ఆయన మనలను నడిపిస్తాడు. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 63:7వ వచనమును మనకు జ్ఞాపకము చేయుచున్నది, "నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను'' అన్న వచనం ప్రకారం మీరు ఈ వచనమును ప్రకటించుచుండగా, అది ప్రభువులో మీకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది.
నా ప్రియులారా, కనుకనే ఈలాగున చెప్పండి, 'ప్రభువా, నీవు నాకు ఒక మంచి సహాయకుడవు'అని ప్రకటించండి. ప్రభువు యొద్ద సహాయము అవసరమని ఇప్పుడు కూడా ప్రకటించండి. ఇప్పటికి కూడ మీరు నిరాశమయమైన పరిస్థితులలో ఉన్నట్లయితే, నా స్నేహితులారా, భయపడకండి. కీర్తనాకారుడు ఈలాగున చెబుతున్నాడు, 'ప్రభువా, నా కన్నులు కన్నీటితో నింపబడ్డాయి. నా హృదయము ఎంతో భారముతో నిండియున్నది. నేను ఎంతో గొప్ప బాధ గుండా వెళ్లుచున్నాను, '' అని తెలియజేసియున్నాడు. అయినప్పటికిని కీర్తనలు 77:11,12వ వచనములలో అతడు ఈలాగున అంటున్నాడు, "యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును'' అని కీర్తనాకారుడు చెబుతున్నాడు. ఇంకను, ' ప్రభువా, నా జీవితములో అద్భుత కార్యములన్నిటిని జ్ఞాపకము చేసుకుంటున్నాను, నీ యొక్క గొప్ప సన్నిధిని మరియు గొప్ప మహిమను, ఇంకను నిన్ను గూర్చిన అద్భుతమైన సంగతులన్నిటిని నేను జ్ఞాపకము చేసుకున్నప్పుడు నా హృదయము సంతోషిస్తుంది' అని తెలియజేశాడు. అవును నా స్నేహితులారా, నేడు మనము కూడ భయం మరియు ఆందోళన సమయాలలో, దేవుని గొప్ప సన్నిధిని, ఆయన జరిగించిన ఆశ్చర్యకార్యాలను మరియు ఆయన మహిమను మనం గుర్తుంచుకుందాం. కనుకనే, నేడు ఆయన గొప్ప కార్యాలను జ్ఞాపకము చేసుకొని, ఆయనను స్తుతించాలి.
నేను యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో గొప్ప ప్రణాళికను కార్య రూపముగా నెరవేరుస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను గురించి నేను ఎంతో ఆందోళన చెందిన సమయం నాకు గుర్తుంది. ఎన్నో కార్యాలు ప్రణాళికాబద్ధము చేయాలంటే, ప్రణాళికలు ఎంతో అవసరం. అవి పని చేస్తాయో? లేదో? అన్న ఆలోచన ఉంటుంది. మరియు అది విజయవంతం అవుతుందా? అని నేను ఆశ్చర్యపోయాను. నేను నన్ను ఇలా ప్రశ్నించుకుంటూనే ఉన్నాను, 'నేను ఏ చర్యలు తీసుకోవాలి? నేను ఇవన్నీ ఎలా సాధించగలను? అని లోతుగా నేను విచారిస్తుంటాను. వీటన్నిటిని ఎలా సంపూర్తి చేయగలను? ప్రభువా, నీవు నాకు సహాయము చేయాలి? అని నేను ప్రార్థిస్తుంటాను.' ఈలాగున నేను భయముతో ప్రార్థనలో నా హృదయాన్ని కుమ్మరిస్తూ, ప్రార్థించుచున్నప్పుడు, ఆకస్మాత్తుగా పరిశుద్ధాత్ముడు నాలో పని చేయడం ప్రారంభించాడు. ఆయన మెల్లని స్వరము నాకు ఈలాగున గుర్తు చేయుచున్నట్లుగా నేను భావించాను. 'నీ జీవితములో ఎన్నో కార్యములలో నేను నీకు సహాయము చేయలేదా? యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో చేసిన ఎన్నో ప్రణాళికలలో నేను నీతో కూడా ఉండలేదా? ప్రతి పరిచర్యలో నీతో కూడా ఉండి నిన్ను నడిపించాను. నేను నీతో కూడా వచ్చాను, నేను నీ కుటుంబము కొరకు ఎన్నో విషయాలలో నీకు సహాయము చేశాను. ఇంకను నీ కుటుంబమును సమృద్ధిగా ఆశీర్వాదించాను. కనుకనే, నేడు వీటన్నిటిని జ్ఞాపకము చేసుకొని, నాకు కృతజ్ఞతలు చెల్లించు, నన్ను స్తుతించినప్పుడు నేను నీ కొరకు ఆలాగున జరిగిస్తానని నీవు తెలుసుకుంటావు' అని చెప్పినప్పుడు వెంటనే, నన్ను నేను పరిశీలించుకొని, నాలో నేను రూపాంతరము పొందాను. అదేవిధముగా, దేవునిలో పరవశుడనై, 'ప్రభువా, నా పట్ల నీవు ఎన్ని కార్యములు జరిగించావు. నిన్ను బట్టి నా హృదయము ఆనందించుచున్నది,' అని ఆయనను స్తుతించుచు, ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొనుచు, ఆయనలో ఆనందించాను. నిజంగా స్నేహితులారా, మా ప్రాజెక్టులన్నిటిని కూడా దేవుడు అత్యంత సమృద్ధిగా ఆశీర్వదించియున్నాడు. నా ఊహకంటె మిన్నగా, ఎక్కువగా దేవుడు మా కార్యములన్నిటిలోను విజయమును మేము సాధించునట్లుగా చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, నేడు ఆయన బలీయమైన హస్తముతో మీకు ఆయన సహాయము చేయగలడు. కనుకనే, మీ హృదయము విచారించవలదు. ఎల్ల వేళల ప్రభువు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొనుచు, ఆయనకు స్తుతి గానము చేయండి. ఇంకను నేడు ఆయన హస్తము మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికిని మీకు సహాయము చేస్తుంది. కనుకనే, మీ హృదయం కలత చెందనివ్వవద్దు. బదులుగా, ప్రభువు మీ కొరకు చేసిన అన్ని గొప్ప కార్యాలను గుర్తుంచుకొని ఆనందంతో పాడండి. విశ్వాసంతో ఇలా ప్రకటించండి, " ప్రభువా, మా కొరకు కూడా నీవు గొప్ప కార్యాలు జరిగిస్తావు' అని చెప్పండి. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, ప్రభువులో ఆనందించడానికి కొన్ని క్షణాలు వెచ్చించండి. నేడు మీ జీవితంలో ఆయన విశ్వసనీయత మరియు శక్తివంతమైన కార్యములను గురించి మీరు ఆలోచించినప్పుడు మీ హృదయం ఆనందిస్తుంది. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు సహాయము చేసి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, ఈ సంవత్సరం పొడవునా నీ యొక్క మంచితనం మరియు విశ్వసనీయతకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మా అవసరమైన సమయాలలో మాకు సహాయం చేశావు, కనుకనే, నీ యొక్క మార్పులేని ప్రేమలో మేము నీలో ఆనందించుచున్నాము. ప్రభువా, నీ రెక్కల నీడలో మేము ఆదరణ, సమాధానము మరియు గొప్ప ఆనందాన్ని పొందుకొనునట్లుగా మాకు కృపను దయచేయుము. దేవా, మా కళ్లలో కన్నీళ్లు నిండినప్పటికిని, నీ బలమైన హస్తంతో మమ్మును ఉద్ధరించావు, ఇంకను మా జీవితంలో నీ యొక్క ఆశ్చర్య కార్యాలు మరియు అద్భుతాలను బట్టి మేము కృతజ్ఞతా హృదయంతో జ్ఞాపకము చేసుకొనుచూ, నిన్ను స్తుతించుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ శక్తి మరియు దయ చూపుతూ నీవు మా యొక్క ప్రతి సవాలులో మమ్మును నడిపించావు. ప్రభువా, నీవు మాకు ఆశ్రయం, మా బలం మరియు మాకు ఎల్లప్పుడూ ఉన్న సహాయం కొరకు మేము నిన్ను స్తుతించుచున్నాము. దేవా, మేము మా భవిష్యత్తును ఎదుర్కొంటున్నప్పుడు, నీవు మాకు నిత్యము సహాయంగా కొనసాగుతావనియు మేము విశ్వాసంతో ప్రకటించుచున్నాము. దేవా, మమ్మును మరింత ఉన్నత శిఖరాలకు నడిపించడానికి నీవు నమ్మదగినవాడని మేము గుర్తించి, మేము ఆనందముతో స్తుతిగానము చేయుటకు మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.