నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 54:14వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నీవు నీతిగలదానవై స్థాపింపబడుదువు.'' నేడు దేవుడు మీకు అనుగ్రహించు వాగ్దానము ఇదియే. ఆ వచనం ఇంకను ఈలాగున చెబుతుంది, "నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు'' అని వ్రాయబడియున్నది. ఈ లోకములో, భయం మన చుట్టూ మనలను ఆవరించి ఉంటుంది. మనం, మన ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు, పనిలో బాధలు అనుభవించుచున్నప్పుడు, ఉద్యోగమును కోల్పోయినప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు, మన పిల్లలు ఓటమి పాలైనప్పుడు, మన ఇంటిని విడిచి వెళ్లిపొమ్మని చెప్పినప్పుడు మనలో భీతి కలుగుతుంది. ఓహ్, ఈలాగున ఎన్నో భయాలు మనలను కమ్ముకుంటాయి. ఇవియు గాక, ఇంకను దుష్టుడైన అపవాది నుండి, దుష్ట ప్రజల నుండియు, ఇంకను శరీరేచ్ఛలు కలిగియున్న వారిని నుండి భయాలు కలుగుచుండవచ్చును. కొన్నిసార్లు, వివాహం జరుగుటకు ఆలస్యము కావచ్చును లేక వివాహము జరుగకపోవచ్చును; ఇంకను మీకు తగిన జీవిత భాగస్వామిని మీరు కనుగొనలేకపోవచ్చును. తద్వారా, భవిష్యత్తును గురించిన భీతి మీకు సంభవించవచ్చును. ఇంకను తమ భవిష్యత్తును గురించి భయాందోళనలు మనలో కలుగవచ్చును మరియు దుష్టుడైన అపవాది నుండి మరియు దుష్ట ప్రజల నుండి దౌర్జన్యమును ఎదుర్కొనవచ్చును.
కానీ బైబిలు ఇలాగున చెబుతుంది, "నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరాదు'' అని చెప్పినట్లుగానే, ఎన్నటికిని భయము, భీతి మీ దగ్గరకు రాకుండా మీకు దూరముగా ఉంటుంది. ఆలాగుననే, దేవుడు మిమ్మును నీతిమంతులుగా స్థిరపరచినప్పుడు, మీరు దేవుని బిడ్డలుగా మార్చబడినప్పుడు, మీరు భీతి నుండి కాపాడబడతారు. అప్పుడు, నీతి మీకు ముందుగా నడచును, ప్రభువు మీ వెనుక కావలివాడుగా ఉంటాడు. ఆలాగుననే బైబిల్‌లో యెషయా 58:8వ వచనములో, "స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును'' అని వాగ్దానం చేయబడినట్లుగానే, నేడు మీకు స్వస్థత త్వరగా లభిస్తుంది. ఇది నేడు దేవుడు మీ పట్ల చేయబడిన గొప్ప వాగ్దానం కదా. దేవుడు మిమ్మును నీతిమంతులుగా జీవింపజేస్తాడు మరియు ఈ లోకములో ఉన్న దుష్టసాంగత్యములు, దుష్టకార్యాలు, భయాన్ని మరియు దౌర్జన్యం తీసుకొని వచ్చుచున్న విషయాలు ఎన్నో ఉన్నప్పటికిని, యేసు మీలో నివసించినప్పుడు మరియు మీరు ఆయన ఉద్దేశములో నడిచినప్పుడు అవన్నియు కూడా మీ మీద ఎన్నటికి జయము పొందలేవు. కాబట్టి, నా ప్రియులారా, అనుదినము మీరు దేవుని వాక్యాన్ని చదవండి. వాక్యమును ధ్యానించండి. ఆ వాక్యము ప్రకారం నడవడానికి మీకు సహాయం చేయమని దేవుని అడగండి. ఇతరులను క్షమించండి మరియు వారి కొరకును మరియు అవసరంలో ఉన్నవారి కొరకు భారముతో ప్రార్థించండి. అందుకే, యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా కంప్యూటర్స్‌ను ఇతరుల కొరకు ప్రార్థించేవారికి అనుగ్రహించి, ఆ కంప్యూటర్స్ ద్వారా ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి యేసు పిలుచుచున్నాడు పరిచర్య మీకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. ఆలాగుననే, ప్రార్థన గోపురమునకు వచ్చి ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం ద్వారా, ఈ లోకములోని భీతి మరియు భయము మీ నుండి దూరముగా వెళ్లునట్లుగా చేసి, దేవుడు మిమ్మును కాపాడి సంరక్షిస్తాడు.
ఇక్కడ ఒక చక్కటి సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. ఇక్కడ నాగ్‌పూర్‌కు చెందిన సహోదరి లలిత, చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయింది. ఆమె నలుగురు తోబుట్టువులలో పెద్ద కుమార్తెగా ఉండెను. కనుకనే, ఆమె మిగిలిన వారిని చూసుకునే బాధ్యత ఆమెపై ఉంచబడెను. ఇంకను అతిత్వరలోనే, ఆమె తండ్రి కూడా మరణించాడు. తద్వారా, వారు అనాథలయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆమె తండ్రి కూడా చనిపోయాడు, వారు అనాథలయ్యారు. ఇరుగుపొరుగువారు వారిని నవ్వుచూ, మిమ్మును ఎవరు వివాహము చేసుకుంటారు? పరిహాసము చేసేవారు. తద్వారా, వారి హృదయాలు బ్రద్ధలు చేయబడి భారముతో నింపబడెను. మరియు వారు భీతితో, భయభ్రాంతులకు గురై, నిస్పృహలో జీవించారు. ఆలాంటి సమయంలో, ఆమె నాగ్‌పూర్‌లోని యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములో ప్రార్థన యోధులుగా చేరింది. ఆమె స్వయంగా భయభీతికి గురైనప్పటికిని, ఆమె తన జీవితాన్ని యేసుకు సమర్పించి ఇతరుల కొరకు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ప్రార్థించడానికి ప్రారంభించెను. ఆమెకు 40 సంవత్సరాలు మరియు ప్రజలు ఆమెను అపహాస్యము చేశారు. అప్పుడు, మేము ఢిల్లీలోని జాతీయ ప్రార్థనా గోపురమునకు వస్తున్నాము తెలుసుకొని, ఆమె మా సందర్శన సమయంలో నన్ను మరియు నా భార్య ఇవాంజెలిన్‌ను కలుసుకొన్నారు. మేము ఆమె మీద చేతులుంచి ఎంతో భారముతో ప్రార్థించాము, ఆమె జీవితములో దేవుని ఉద్దేశము యేసు నామంలో పనిచేయుటకు ప్రారంభమవుతుందని ప్రకటించాము. ఆరు నెలలలోనే, నాగ్‌పూర్ నుండే వివాహము నిమిత్తము ఒక మంచి సంబంధం వచ్చింది. జూన్ 2, 2023వ సంవత్సరమున ఆమెకు వివాహం జరిగింది. నేను, నా భార్య ఇవాంజెలిన్ కూడా వివాహం చేసుకున్న రోజు కూడా జూన్ 2 తేదీ. దేవుడు ఆమెను ఎంత అద్భుతంగా ఘనపరచాడు! ఆమె భర్త ఒక టూరిస్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు మరియు వారి జీవితం ఎంతో ధన్యమైనది. ఆమె ఇలాగున చెప్పింది, 'నేను నీతిమంతురాలిగా నడుచుకున్నాను మరియు ప్రార్థన గోపురములో ప్రజలకు సేవ చేశాను.' చూడండి, ఆమె ఇతరులకు సేవ చేయుటకు ద్వారా దేవుడు ఆమె కుటుంబ జీవితాన్ని స్థిరపరచాడు. నా ప్రియులారా, నేడు మీరు కూడా ఆ సహోదరి వలె ఇతరుల కొరకు పరిచర్య చేయుటకు మిమ్మును మీరు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా నేడు దేవుడు మీ కొరకు కూడా అలాగుననే జరిగిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా మీరు భయపడనక్కరలేదు, బాధించువారు మీకు దూరముగా నుందురు, భీతి మీకు దూరముగా ఉండును అది మీ దగ్గరకు రాకుండా చేసి, మిమ్మును ఆశీర్వదిస్తాడు.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన తండ్రీ, నీవు మమ్మును నీ యొక్క నీతిలో స్థిరపరచి, నీ పరిపూర్ణ చిత్తంలో మమ్మును నడిపిస్తావని మేము నమ్ముచున్నాము. దేవా, మా దగ్గరికి ఎలాంటి అపవాది శక్తులు, మా కుటుంబానికి, లేదా మా భవిష్యత్తుకు ఎటువంటి భయాందోళన లేదా నిస్ప ృహ మమ్మును తాకుకుండా చేయుము. ప్రభువా, ఎల్లప్పుడూ మమ్మును నీ యొక్క రక్షణ కేడెముతో కప్పి, నీకు మాకు ముందర నడుస్తూ, మా వెనుక కాపలాగా ఉండుము. దేవా, మేము మా జీవితంలోని ప్రతి గాయపడిన మరియు బాధపడిన భాగమును స్వస్థపరచుము మరియు కోల్పోయిన వాటిని మరల పునరుద్ధరించుము. ప్రభువా, మేము ఇతరులను క్షమించడానికి మరియు నీ ప్రేమ మరియు కృపలో నడవడానికి మమ్మును బలపరచుము. దేవా, అనుదినము మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మరియు నీ స్వరాన్ని విని, దాని ప్రకారం వెంబడించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము మా స్వంత పోరాటాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండటానికి మమ్మును వాడుకొనుము. దేవా, మమ్మును భయపెడుతున్న సమస్తమును మాకు దూరముగా పారిపోవునట్లుగా చేయుము మరియు నీవు సర్వశక్తిగల దేవుడవైన నీ యొక్క సమాధానమును మా జీవితాన్ని ఏలునట్లుగా చేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు అతి ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.