నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యాకోబు 1:12వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును'' అని ఈ వచనము మనకు తెలియజేయుచున్నది. నాకు తెలుసు మన జీవితములోనికి అనేకమైన శోధనలు రావడానికి దేవుడు అనుమతించువాడై యున్నాడు. యేసు ఈ లోకములో జీవించినప్పుడు, తన జీవితాన్ని సేవాపరిచర్యకు సమర్పించుకున్నప్పుడు, మొట్టమొదటిగా జరిగిన కార్యమేదనగా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను అపవాది చేత శోధింపబడుట కొరకై కొనిపోబడ్డాడు. సాతాను ఈ లోకపరమైన కోరికలతో, ఆయనను శోధించుటకు ప్రయత్నించాడు. కానీ, యేసు దేవుని యొక్క వాక్యము చేత మాట్లాడి సాతానును జయించాడు. సాతాను ఆయనను విడిచిపెట్టి వెళ్లిపోయెను. అవును స్నేహితులారా, మనము కూడా ఈ లోకాశలను బట్టి, అనేక ఫర్యాయములు అపవాది చేత శోధింపబడతాము. కానీ, దేవుని వాక్యమును బట్టి ఆయనకు వందనములు చెల్లించుదాము. మనము ప్రతి దినము దీనిని హత్తుకొని ఉందాము. బైబిల్‌ను ప్రతి రోజు చదవాలి. ఉదయకాలమునే బైబిల్ చదువుట ద్వారా అపవాది నుండి తప్పించుకొనుటకు ఆయన మార్గమును అనుగ్రహించును. ప్రజల ద్వారా, పరిస్థితుల ద్వారా, ధనము ద్వారా అపవాది మనలను శోధించుటకు ప్రయత్నించినప్పుడు, తప్పించుకునే మార్గమును దేవుడు మనకు చూపిస్తాడు. మనము అధికమైన విజయమును పొందినవారము అవుతాము. బైబిల్‌లో 1 కొరింథీయులకు 10:13వ వచనములో మనకు ఏమని తెలియజేయుచున్నదగా, "సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును'' ప్రకారం దేవుని వాక్యంతో, మనం స్థిరంగా నిలబడగలము మరియు అన్నిటికంటె అత్యధికంగా విజయమును పొందుకొనగలము.

అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు యేసును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నారు అని తెలుసుకొనునిమిత్తము అనేక ఫర్యాయములు శోధనలు మరియు శ్రమలు కలుగుతాయి. అయితే, ఆ శోధనల మధ్య ఆయన మీకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఈ లోకములో అన్నిటికంటె మిన్నగా ఆయన యందు నిరీక్షణ ఉంచునట్లుగా, మనము అనేకసార్లు శోధింపబడతాము. అవును, మీరు మీ కుటుంబము కంటె మరియు మీ స్థాయి, ధనము మరియు మీకు ఉన్నవాటికంటె ఎక్కువగా ప్రేమించుచున్నారో లేదో అని ఆయన మిమ్మును పరీక్షిస్తాడు. యేసు కొరకు మీరు కలిగియున్న ప్రేమను కనుగొనడము కొరకు వీటన్నిటిలో ఆయన మిమ్మును శోధిస్తాడు. శోధనకు నిలిచియుండువాడు ధన్యుడు అట్టివాడు దేవుని ద్వారా జీవకిరీటము స్వీకరిస్తాడు. అందుచేతనే మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడియున్నప్పుడు, రోమీయులకు 8:26వ వచనములో మనము చూచినట్లయితే, "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనముచేయుచున్నాడు'' ప్రకారం ప్రతి బలహీనతను అధిగమించే శక్తిని మీరు కలిగియుంటారు. యేసును ప్రేమించి, ఆయన యందు నమ్మిక కలిగి ఉండండి, ఆయన మిమ్మును జీవకిరీటముతో లేవనెత్తుతాడు.

ఒక ప్రియమైన సహోదరి శిరోమణి మించ్, దేవుని విశ్వసనీయతకు శక్తివంతమైన తన సాక్ష్యమును ఈ విధంగా తెలియజేసియున్నారు. భార్యభర్తలిద్దరు అంబికాపూర్‌లో ఉంటారు. వారికి ఇద్దరు బిడ్డలు, ఆమె ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగము చేయుచున్నారు. ఆమె యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో భాగస్థురాలు. 2008వ సంవత్సరములో 50 కిలోమీటర్ల దూరములో ఆమె బదిలీ చేయబడినది. భయంకరమైన ఆ దారిలో బస్సులో ఆమె ప్రయాణము చేయవలసి ఉంటుంది. కొంతదూరము ఆమె భర్త ఆమెను తోడుకొని వెళ్లుటకు వచ్చేవారు. తద్వారా ఆమెకు వెన్నెముకలోను మరియు నడుములోను కూడ తీవ్రమైన నొప్పి రావడం ఆరంభమైనది. ఆమె నొప్పితో ఎంతగానో ఏడ్చేవారు. విద్యార్దులకు బోధించడానికి నిలబడలేకపోయేవారు. కనీసము పండుకోలేకపోయేవారు. ఎంతగానో బాధపడ్డారు. ఆమె ప్రార్థన కొరకు ప్రార్థనా గోపురమునకు ఫోన్ చేశారు. ఒకరోజు యేసు పిలుచుచున్నాడు టి.వి. కార్యక్రమమును వీక్షించుచుండెను. అక్షరాల ఆమె ఏమైతే తన మనస్సులో తలంచెను. ఆమె అక్కర నిమిత్తము నేను ప్రార్థన చేసియున్నాను. దైవశక్తి ఆమె ముట్టి స్వస్ధపరచి, ఆ యొక్క నొప్పిని తొలగించివేసినది. అప్పుడు ఆమె, ' ప్రభువా, నాకు ఉద్యోగములో పదోన్నతి మరియు తనకు దగ్గరలోనే బదిలీ కూడా కావాలని ప్రార్థించెను.' తనతో ఉద్యోగము చేయువారందరు లంచము ఇవ్వడము ద్వారా వారు పదోన్నతిని పొందియున్నారు. అయితే, ఆమె నేను యేసును హత్తుకొని జీవించుచున్నాను అని అనుకున్నారు. యేసునందు మాత్రమే నమ్మిక ఉంచియున్నాను. మహా అద్భుతమైన రీతిలో దేవుడు ఆమె పదోన్నతిని మరియు బదిలీని కూడా అనుగ్రహించాడు. తన యింటిని 15 నిమిషాలు నడక దూరములో ఒక పాఠశాలలో బదిలీని అనుగ్రహించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము కదా! యేసునందు నమ్మికయుంచి, శోధనలో నిలిచియుండువారిని ఆ రీతిగా అద్భుతంగా ఆశీర్వదించువాడై యున్నాడు. నేటి వాగ్దానము ద్వారా నేడు ఇట్టి ఆశీర్వాదముతో దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, శోధనలలో స్థిరంగా ఉన్నవారు జీవ కిరీటాన్ని పొందుతారని నీ వాగ్దానానికై నీకు వందనాలు. ప్రభువా, సవాళ్లు ఎదురైనప్పుడు కూడా యేసుపై విశ్వాసం ఉంచే దయ మరియు బలాన్ని మాకు అనుగ్రహించుము. దేవా, మా ప్రతి బలహీనత మరియు శోధనలను అధిగమించడానికి నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము. ప్రభువా, నీ వాక్యానికి సమర్పించుకొని, దాని సత్యాలలో ఆశ్రయం మరియు జ్ఞానాన్ని కనుగొనడంలో మాకు సహాయము చేయుము. దేవా, మా కుటుంబం, స్థాయి లేదా ప్రాపంచిక ఆస్తుల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేలా మాకు సహాయం చేయుము. యేసయ్యా, మా ఉద్యోగములలో బదిలీ మరియు పదోన్నతిని మరియు మాకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించుము. ప్రభువా, మా ప్రతి శోధనలలో తప్పించుకోవడానికి నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తావని మేము తెలుసుకుని, నీలో స్థిరంగా నిలబడే ధైర్యాన్ని మాకు కృపను దయచేయుము. దేవా, మేము ఎదుర్కొనే ప్రతి శోధన ద్వారా నీ పట్ల మా భక్తి మరింత బలపడునట్లుగా చేయుము. ప్రభువా, నీ పరిపూర్ణ ప్రణాళికను విశ్వసించడానికి మరియు నీ కృప ద్వారా విజయంలో నడవడానికి మా హృదయాన్ని బలపరచుము. ప్రభువా, నీ ఆశీర్వాదాలతో మమ్మును పైకి లేవనెత్తి, మమ్మును సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.