నా ప్రశస్తమైన స్నేహితులారా, నేడు మా తండ్రిగారి జీవితములో అత్యంత ఒక గొప్ప దినముగా ఉన్నది. దేవుడు ఈ రోజున ఆయనను పాపము నుండి రక్షించి ఆయన తన జీవితమునకు ప్రభువై యున్నాడు. ఈ రోజున మీరు కూడా మీ జీవితమును ప్రభువునకు సమర్పించవచ్చును. దివంగత డి.జి.యస్. దినకరన్‌గారి ద్వారా దేవుడు గొప్ప కార్యములను జరిగించినట్లుగానే, ఆయన మీ జీవితములో కూడా లక్షలాది మందిని ఆశీర్వదించును గాక. కనుకనే, మీ జీవితమును కూడా యేసునకు స్వాధీనపరచుకోండి. దేవుడు నేడు తన ప్రేమతో మిమ్మును విడువక ప్రేమిస్తాడు. 

కనుకనే, నా ప్రియులారా, నేటి వాగ్దాన వచనమేమనగా, బైబిల్ నుండి యిర్మీయా 31:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను’’ అన్న వచనము ప్రకారం ఆయన ప్రేమ ఎన్నటికిని ఆగిపోదు. అందుకే బైబిల్‌లో యిర్మీయా 32:40 ఏమని చెబుతుందనగా, ‘‘ నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను’’ ప్రకారం ఆయన ఎల్లవేళల మిమ్మును ప్రేమించుచున్నాడు. మీరు ఏ విధంగా ఉన్నప్పటికిని సరే, ఆయన మిమ్మును ప్రేమిస్తాడు. మీరు ఎన్ని వైఫల్యము చెందిన, సాఫల్యతను చెందిన, ఆయన మిమ్మును ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ మిమ్మును లేవనెత్తును. మీరు ఆయనను ప్రేమించినప్పుడు, మీరు ఆయనకు సేవ చేసినప్పుడు, ఆయన నామమున మీరు ఇతరులను క్షమించి, ప్రజలకు సేవ చేసి, ప్రజలకు అందించినప్పుడు, ఆయన మీకు రెండింతలుగా అనుగ్రహించును. ఇది ఈ రోజున మీ కొరకైన దేవుని వాగ్దానమై ఉన్నది. అట్టి దైవాశీర్వాదములను ఈ రోజు మీ మీదికి రానివ్వండి. 

ఇవాంజెలిన్ మార్గెట్ ప్రభు అను ఒక సహోదరి యొక్క చక్కటి సాక్ష్యము ఇక్కడ ఉన్నది. ఆమె తాను పొందుకున్న సాక్ష్యమును ఈలాగున పంచుకున్నది. తన భర్త వ్యాపారములో నష్టాని పొందుకున్నాడు. 10 లక్షల రూపాయల ఋణము ఉన్నది. వివాహము జరిగిన 5 సంవత్సరముల వరకు కూడా వారు సంతానము కొరకు ఎంతగానో ఎదురు చూశారు. మరియు వారు తరచుగా ప్రార్థనా గోపురమును సందర్శించారు. తద్వారా, ప్రార్థనా యోధులు వారితో కలిసి ఎంతో భారముతో ప్రార్థించారు. అనేక ఫర్యాయములు వారు ప్రార్థనా గోపురమును సందర్శించారు. అయినప్పటికిని ఆమె ఏమని తలంచినది చూడండి, ప్రార్థనా గోపురములో ప్రార్థన యోధులు వలె నేను ఇతరుల కొరకు ఎందుకు ప్రార్థించకూడదు. స్వచ్ఛందముగా ప్రార్థనా యోధురాలిగా ఆమెకు సమయము ఉన్నప్పుడు ప్రార్థనా గోపురమునకు వెళ్లి ఆ విధంగా ప్రార్థించుచుండెను. మీరు కూడా ఆలాగున చేయవచ్చును. కుటుంబ సమేతముగా వారందరు వ్యాపార ఆశీర్వాద పధకములో భాగస్థులుగా చేరారు. ఇంకను తమ కుటుంబాన్ని ఆశీర్వాద పధకములో భాగస్థులనుగా చేర్పించారు. మేము ఉచితముగా ప్రభువునకు సేవలు అందించుచుండగా, అట్టి లక్షలాది మంది ఆశీర్వాదము కొరకు వారు కూడా ఈ సేవా పరిచర్యలకు సహకారము అందించారు. దేవుడు తన యొక్క ఒప్పందమును ఆశీర్వదించాడు. తద్వారా వారి వ్యాపారములో గొప్ప విజయము కలిగినది. మహా అద్భుతముగా, నూతనమైన ఆర్డర్‌లు వారికి రావడం జరిగినది. దేవుడు ఆ కుటుంబానికి ఔనత్యమును అనుగ్రహించాడు. తదుపరి సంవత్సరము ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. రెండింతలుగా ఆశీర్వాదమును పొందుకున్నారు. వారు ఈ రోజు పరిచర్యకు సహకారము అందిస్తూ, ప్రార్థనా గోపురములో వారు ఇతరుల కొరకు ప్రార్థన చేయుచు, ఇతరులకు సేవను అందించుచున్నారు. రెండింతలుగా వారు ఆశీర్వదింపబడియున్నారు కూడా. 

అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మిమ్మును అదేవిధముగా ఆశీర్వదించాలని మీ పట్ల కోరుచుచున్నాడు. కాబట్టి, నేడు యేసు ప్రేమను ఆనందించి, అనుభూతి చెందండి. ఆయనను ప్రేమించండి, ప్రజలకు సేవలు అందించుట ద్వారా ఆయనకు పరిచర్య చేయండి. మరియు అందుకు ప్రతిఫలంగా ఆయన పొంగిపొర్లుతున్న ఆశీర్వాదాలను మీ జీవితములో పొందుకొని అనుభవించండి! నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, ఎన్నటికి అపజయము పొందని నీ శాశ్వతమైన ప్రేమకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మమ్మును రక్షించినందుకు, మమ్మును లేవనెత్తినందుకు మరియు నిన్ను సేవించడానికి మమ్మును నీ పరిచర్యకు పిలిచినందుకు నీకు వందనాలు. దేవా, మా జీవితాన్ని మేము నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, బైబిల్‌లో నీ నమ్మకమైన సేవకుల ద్వారా నీవు చేసినట్లుగా, ఇతరులను ఆశీర్వదించడానికి మమ్మును ఒక పాత్రగా ఉపయోగించుకొనుము. ప్రభువైన యేసయ్యా, మేము నీ ఓటమి లేని మంచితనాన్ని నమ్ముచున్నాము. దేవా, విజయంలోనైన లేదా ఓటమిలోనైనా, నీ ప్రేమ నిత్యము నిలిచి ఉంటుందని మాకు తెలుసు. కనుకనే, దేవా, మేము నిన్ను లోతుగా ప్రేమించడానికి, నీకు నమ్మకంగా సేవ చేయడానికి మరియు నీవు మమ్మును క్షమించినట్లుగానే మేము కూడా ఇతరులను క్షమించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా జీవితంపై నీ ఆశీర్వాదాలలో రెట్టింపు భాగాన్ని కుమ్మరించుము, తద్వారా మేము నిన్ను మహిమపరచునట్లుగాను మరియు అవసరతలో ఉన్నవారికి వెలుగుగా ఉండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుటకు మాకు అట్టి కృపను దయచేయుమని  సమస్త మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నిత్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.