నా ప్రియ స్నేహితులారా, ఈ నూతన సంవత్సరములో దేవుడు మీతో కూడా ఉన్నాడు. బైబిల్ నుండి జెఫన్యా 3:17వ వచనములో ఈలాగు తెలియజేయుచున్నది. నేటి వాగ్దానముగా దేవుడు ఈలాగున చెప్పుచున్నది, "నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును...'' ప్రకారం, దేవుడు మిమ్మును రక్షించే బహు శక్తిమంతుడైన యోధుడు. అవును స్నేహితులారా, ఈ రోజున మీ జీవితములో ఉన్న సవాళ్లలన్నిటి మధ్యలో కూడా ప్రభువు మీతో కూడాను మరియు మీ మధ్యలోను ఉన్నాడని మీరు ఒప్పుకొనండి. సమస్యలు మాత్రమే మీ జీవితములో కనబడుచున్నవేమో? కానీ, అదృశ్యుడైన దేవుడు ఇంకను మీ జీవితములో మీతో కూడా ఉన్నాడు. మీరు ఆయనను అనుభూతి చెందలేకపోవుచున్నారేమో? మీరు ఆయనను చూడలేకపోవుచున్నారేమో? కానీ, ఆయన అంటున్నాడు, ఎల్లవేళల మీతో కూడా ఉన్నాను, మంచి సమయములలోను, సవాలు సహితమైన సమయములలోను కూడా నేను ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నాను, ' ప్రభువా, నీవు నాతో కూడా ఉన్నావని' చెప్పి దానిని మీరు ఒప్పుకున్నప్పుడు, దేవుడు మీ హృదయాన్ని సంతోషముతో నింపుట మీరు చూడగలరు.

ఆలాగుననే, నా ప్రియులారా, 'ప్రభువా, నీవు పరాక్రమమైన యోధుడవు, నాకు బలమైన సమస్యలు, ఆందోళనలు, సవాళ్లు ఉన్నాయి. కానీ, వాటిని పోరాడడానికి మీరు పరాక్రమము గల యోధుడవుగా ఉన్నావు, నీవు మమ్మును రక్షించే దేవుడవై యున్నావు, నీవు మాతో కూడా ఉన్నావు, నీవు మమ్మును రక్షించగల సమర్థుడవు.'

నా ప్రియులారా, 'యోధులు నాకు విరోధముగా వచ్చినప్పటికిని లేక నేను ఎవరికోసమైతే పని చేస్తున్నానో, వారికి నాకు సంబంధించిన అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికిని, నేను చేరుకోవలసిన లక్ష్యాలు అత్యంతంగా ఉన్నప్పటికిని, నేను అధిక మొత్తములో మార్కులు సాధిస్తున్నప్పటికిని, ఉన్నతమైన స్థలములకు లేవనెత్తబడినప్పటికి, నేనెంతగానో కార్యాలు చేయవలసి ఉండి ఉన్నప్పటికిని, నేను నీతో సన్నిహితమైన నడతను కలిగి యుండవలెనని అనిపించినప్పటికిని, ప్రభువా, దయచేసి, నన్ను రక్షించుము, నన్ను శక్తిమంతుడనుగా చేయుము' అని అటువంటి ప్రార్థన చేయుచుండగా, ఇంకను 'ప్రభువా, ఈలాగున నా కొరకు చేయడానికి నీవు నాతో కూడా ఉన్నావని చెప్పండి.' అప్పుడు, ప్రభువు మిమ్మును బట్టి ఆనందించును. ఆయన ప్రేమ మీ మీదికి వచ్చును. ఆయన మీ నిమిత్తము ఆనందగానము చేయును. ఆయన మిమ్మును బట్టి సంతోషిస్తాడు. ఆయన, "నా కుమారుడా, కుమార్తె, మీరు నా యందు నిరీక్షణ ఉంచారు. కనుకనే, నేను మీతో కూడా ఉన్నాను, బలమైన పరాక్రమముగల యోధునిగా నేను మీకు విజయమును ఇచ్చెదను. నేను మిమ్మును రక్షించెదను, ఇది మీ కొరకైన వాగ్దానము'' సెలవిస్తాడు. కనుకనే, నేడు మీరు యేసులో ఆనందించండి.

రూర్కెలా నుండి సహోదరి కవిత యొక్క చక్కటి సాక్ష్యమును మీతో పంచుకోవాలని నేను కోరుచున్నాను. ఈమె తల్లి ద్వారా సహోదరి కవిత యౌవన భాగస్థుల పధకములో భాగస్థురాలిగా చేర్చబడెను. ఆమె 10వ, 12వ తరగతి పరీక్షలలో ఉన్నత మార్కులు సాధించి విద్యాప రంగా ప్రతిభను కనబరిచింది. అయినప్పటికిని తన తండ్రి చనిపోయాడు. ఆమె గుండె బ్రద్ధలైపోయినది. ఆమెకు ఆర్థికపరంగా కష్టాలు వచ్చాయి. అయినప్పటికిని, నేను యౌవన భాగస్థురాలిని గనుకనే, దేవుడు నా జీవితములో అద్భుతమును జరిగిస్తాడన్న ఒక గొప్ప నిరీక్షణను కలిగి ఉండెను. నేను యౌవన భాగస్థురాలిని కనుకనే, 'ప్రభువా, నీవు నాకు సహాయము చేస్తావని నేను నమ్ముచున్నాను' అని ప్రార్థించినది. దేవుడు ఆమె విశ్వాసమును ఘనపరచి, ఎంతో ఆశ్చర్యవిధంగా, తన డిగ్రీ పరీక్షలలో 9.3 సిజిపిఎ 93 శాతము మార్కులను దేవుడు అనుగ్రహించాడు. ఆమె తన మాస్టర్ డిగ్రీని కూడా సంపూర్తి చేసుకొనెను. ప్రభుత్వ ఉద్యోగము కొరకు ఆమె ఫోటీ పరీక్షలు వ్రాసెను. ఆమెకు ఆరంభములో వైఫల్యాలు వచ్చినప్పటికిని, తదుపరి ఆమె తల్లిగారు ఆమెను యేసు పిలుచుచున్నాడు ఉద్యోగ ఆశీర్వాద పధకములో సుభ్యురాలిగా చేర్పించెను. ఆ తర్వాత, ప్రార్థన గోపురములో ఉపవాస ప్రార్థనా కూటములకు మరియు యూటర్న్ కూటములకు పాల్గొనుటకు ప్రారంభించెను. అప్పుడు దేవుని ఆత్మ ఆమె మీదికి దిగివచ్చెను. మహా అద్భుతంగా ఆమె ప్రభుత్వ ఉద్యోగమును సంపాదించుకొనెను. తద్వారా, వారి ఆర్థిక సమస్యలన్నియు కూడా అంతమై పోయినవి. ఆమె, వీటన్నిటిలో కూడా నాకు సహాయపడుటకు నాకు తండ్రి లేడు, కానీ, నా పరలోకపు తండ్రియైన యేసు నన్ను చక్కగా స్థిరపరచియున్నాడు అని తన సాక్ష్యమును తెలియజేసెను. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియులారా, సహోదరి కవిత జీవితములో దేవుడు అద్భుతము జరిగించినట్లుగానే, నేడు ప్రభువు మీకును ఆలాగుననే జరిగిస్తాడు. మిమ్మును రక్షించే శక్తివంతమైన యోధుడైన ఆయన మీలోను మరియు మీతోను కూడా ఉన్నాడు. కనుకనే, నేడు మీరు ఒంటరిగా ఉన్నారనియు, ఓటమిలను ఎదుర్కొంటున్నారని చింతించకండి, దేవుడు నేటి వాగ్దానము ప్రకారము మీతో కూడా ఉండి మిమ్మును రక్షించి, మీ పట్ల ఆనందించి, మిమ్మును పరవశింపజేయును గాక.

ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మంచి సమయాలలోను మరియు సవాళ్లులను ఎదుర్కొంటున్న రెండింటిలోనూ శక్తివంతమైన యోధుడవుగా ఎల్లప్పుడూ మాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మేము విశ్వాసంతో, నీవు మాతో ఉన్నావు అని ఒప్పుకుంటున్నాము మరియు నీ సన్నిధిలో మేము ఆనందాన్ని పొందుకొనునట్లుగా చేయుము. దేవా, మా కష్టాలు మరియు ఆందోళనలు నీకు తెలుసు, కానీ నీవు వాటన్నింటి కంటే బలవంతుడని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నేడు మేము ఎదుర్కొనే ప్రతి సవాలు నుండి మమ్మును రక్షించగల దేవుడవు నీవు. దేవా, మా జీవితంలోని దిగ్గజాలను అధిగమించడానికి మరియు ప్రతి కార్యములలోను నిరీక్షణను పొందుకోవడానికి మాకు అధికారమును అనుగ్రహించుము. దేవా, నీ యొక్క ఘనమైన ప్రేమతో మమ్మును ఆవరించుము మరియు నీ యొక్క ఆనందం మా హృదయంలో పొంగిపొర్లునట్లు చేయుము. ప్రభువా, నీ విఫలమైన వాగ్దానాలపై మేము విశ్వసిస్తున్నందున ఆనందగానంతో మా మీద సంతోషించుము. ప్రభువా, మా విజయం మరియు విడుదల కొరకు మా శక్తిమంతుడైన నీ మీద మేము సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఉన్నాము. దేవా, మా జీవితంలోని ప్రతి సమయములోను నీవు మాతో ఉండి మమ్మును కాపాడి సంరక్షించుమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.