నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మిమ్మును కలుసుకొని, దేవుని యొక్క వాగ్దానమును మీతో పంచుకొనుటకు నేను మీ పట్ల ఎంతగానో ఆనందించుచున్నాను. అవును ఇట్టి వాగ్దానమును మనమందరము కలిసి స్వీకరిద్దామా? ఆ వాగ్దానము బైబిల్ నుండి యోహాను 6:35లో చూచినట్లయితే, "అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు'' అని చెప్పబడిన ప్రకారం మనము అటువంటి జీవాహారమైన యేసు మనలోనికి ఆహ్వానిద్దాము, తృప్తిని పొందుకుందాము.

నా ప్రియులారా, 'లేస్' అను వ్యాపార ప్రకటనను మీరు చూచినట్లయితే, ఎవ్వరు కూడా ఒక్కటి మాత్రమే వీటిని తిన ఊరకుండరు మరియు ఒకటి తిన్న తర్వాత ఒక దాని వెంబడి మరొకటి తినాలని అనిపిస్తుందని అని ప్రకటిస్తారు. అంటే వారి ఆకలి ఎప్పటికిని తృప్తి చెందదు. ఈ లోకపరమైన వాటిని భుజించినట్లయితే, ఆలాగుననే ఉంటుంది. ఎంతో ధనమును మనము ఖర్చు చేసినట్లయితే, మనం సంపదను వెంబడించినట్లయితే, ఎంత డబ్బున్నా ఆ అంతర్గత ఆకలిని తీర్చదు; అది మనలను మరింత ఆరాటపడేలా లేక ఎక్కువగా కోరుకునేలా చేస్తుంది. ఈ లోకములో భోగేచ్ఛలను కలుపుకుంటే, తృప్తి లభించదు. మనము తినే భోజనము పట్ల ఎక్కువగా ఆకలి మరియు ఆపేక్ష ఉన్నట్లయితే, అది అప్పుడు కూడా మన కడుపునకు తృప్తిని కలిగించలేదు. కొంతమంది ఎప్పుడును తింటూనే ఉంటారు. వీటిని మనము గొప్ప భోగేచ్ఛలుగా ఆలోచిస్తాము. కాబట్టి, అవి ఎప్పటికిని మనకు తృప్తినివ్వవు. అయితే, అవి ఆకలిని మనకు కలిగిస్తాయి కానీ, మన ఆకలిని తీర్చలేవు.

కానీ, నా ప్రియులారా, ప్రభువునందు మనము పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఇటువంటి ఆనందము మనకు కలుగుతుంది. నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఇటువంటి ఆనందమును పొందుకున్నాను. నాకు 13 సంవత్సరముల వయస్సు ప్రాయంలో నేను పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు అతి చిన్న వయస్సులోనే ఎంతో వాంఛగా ప్రార్థించాను. అయితే, ఒక కూటములో మా నాన్నగారు ప్రార్థించుచున్నప్పుడు, ప్రభువు నన్ను కలుసుకొని, తన పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపినప్పుడు, నేను అక్షరాల నా హృదయములో దేవుని యొక్క పరిశుద్ధాత్మచేత నింపబడినప్పుడు తడిసిపోయాను. అంతమాత్రమే కాదు, చెప్పశక్యము కానీ ఆనందంతో నేను నింపబడ్డాను. ఆ తర్వాత 3 రోజుల వరకు ఎటువంటి ఆహారము కానీ మరియు పానీయము కూడా తీసుకోలేదు. ఎందుకంటే, పరిశుద్ధాత్మ నాలో పొంగిపొర్లుచుండెను. కారణము, నేను పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ ఆనందముతో నింపబడ్డాను. నా జీవితములో ఇదివరకు నేను ఎన్నుడును పొందుకోలేని సంతోషమును మరియు దేవుని ప్రసన్నతను ఆ రోజు నేను అనుభవించాను. ఆ రోజు వరకు అటువంటి దేవుని సన్నిధిని ఆనందించాను. నేటి వరకు ఆటువంటి గొప్ప దేవుని సన్నిధి ఆనందాన్ని నేను అనుభవించుచున్నాను. అది ఎల్లప్పుడు మనకు తృప్తినిస్తుంది. మరి ఎక్కువగా తృప్తినిస్తుంది.

కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు నేను మీకు చెప్పునదేమనగా, ఈ ఉదయకాలములో పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఉపదేశము చేయుచున్నాడు. బైబిల్ నుండి ఇవ్వబడిన ప్రతి వాక్యం మీ ఆత్మను నింపుతుంది మరియు మీ లోతైన ఆకలిని తీర్చి మిమ్మును తృప్తిపరుస్తుంది. "అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు'' అని చెబుతున్నాడు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, ప్రతి ఉదయము ఇట్టి వాక్కును మీరు అంగీకరించండి. ఆయన ఈ రోజు నుండి మీకు అనుగ్రహిస్తాడు. కనుకనే, మనము ఇట్టి ధన్యతను స్వీకరిద్దామా? ఆలాగుననే, నేడు మీకు తృప్తికరమైన జీవాహారమును పొందుకొనుటకు మీ హృదయాలను యేసునకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా దేవుడు ఇటువంటి గొప్ప ఆనందాన్ని మరియు సంతృప్తిని అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మాకు జీవాహారముగా ఉన్నందుకై నీకు వందనాలు. యేసయ్యా, జీవదాతయైన నీ వాక్కును మేము పొందుకొనునట్లుగాను మరియు ప్రతి ఉదయమున ఆ వాక్కులను మేము వినడానికి మాకు సహాయము చేయుము. దేవా, నీవు మాకిచ్చిన వాక్కును మేము చదువుచున్నప్పుడు, దానిని మా హృదయపూర్వకంగా అంగీకరించునట్లుగా చేయుము. ఇంకను ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మా హృదయాలను నింపుము. నేడు నీవు మాతో పంచుకున్న వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడుచున్నావన్న ఆనందముతో నీవు మా హృదయాలను తృప్తిపరచుము. తద్వారా, దేవా, గొప్ప నిరీక్షణ మరియు ఆనందము నేడు మాలో నింపబడునట్లుగా చేయుము. తద్వారా మాలో ఉన్న ప్రతి భయమును మా నుండి తొలగించుము. ప్రభువా, నీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మలో మమ్మును శక్తివంతులనుగా చేయుము. దేవా, మేము ఈ రోజు నీ చిత్తాన్ని జరిగించునట్లుగాను మమ్మును బలపరచుము. దేవా, మమ్మును నీ ఉపదేశము చేత నడిపించుము. యేసయ్యా, నీ ప్రేమలో మేము వేరుపారునట్లు చేయు ము. ప్రభువా, ఎల్లప్పుడు నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మును కలుసుకొని, మాకు నిజమైన సంతృప్తిని దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.