నా ప్రియమైన స్నేహితులారా, నేటి దినమున మీకు ప్రభువులో నిరీక్షణ కలదు. కాబట్టి, మీరు ఒంటరివారు కాదు. పరిస్థితి గుండా పోరాడి, మీకు నిరీక్షణను మరియు భవిష్యత్తును అనుగ్రహించడానికి మీకు ఇప్పుడు ఒక వ్యక్తి తోడుగా ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 తిమోతికి 1:7వ వచనములో ఆయన ఈలాగున సెలవిచ్చుచున్నాడు. ఆ వచనము, "దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు'' ప్రకారం దేవుడు మనకు పిరికితనముగల ఆత్మను ఇయ్యలేదు. అందుకే నా ప్రియులారా, దేవుడిచ్చు ఆత్మ పిరికితనముగలది కాదు, అది శక్తిగల ఆత్మయై ఉన్నది. కనుకనే, మీరు భయపడకండి.

నా ప్రియులారా, ఈ రోజు మీరు అడుగు ముందుకు వేయలేక, పరిస్థితులను చూచి భయపడుతూ మీరు ఉండి ఉన్నారేమో? ఒక ఫర్యాయము మేము సేవా పరిచర్య నిమిత్తము న్యూజిల్యాండ్‌నకు వెళ్లియున్నప్పుడు, ఒక పాష్టరుగారు ఆ కూటములు ముగిసిన తర్వాత, మమ్మును ఒక టవర్‌కు తీసుకొని వెళ్లారు. వాళ్ళు మాకు ఒక త్రాడు ఇచ్చి, దానితో భవనం మీద నుండి దూకమని ఆహ్వానించారు. అది భయానకమైనది, కానీ అది ఒక ఉత్కంఠభరితమైన అనుభవం. ఆ త్రాడును కట్టుకొనుట ద్వారా, మేము ఆ భవనము నుండి క్రిందికి దూకడానికి అవకావము ఉన్నది. అది చాలా బాగున్నది కానీ, అది చూడడానికి ఎంతో భయముగా ఉండెను. నేను కాలు పెట్టి అడుగు ముందుకు వేద్దామనుకున్నప్పుడు, నేను అంచున నిలబడి, క్రిందికి చూస్తున్నప్పుడు, నా కింద ఏమీ కనిపించలేదు. కనుకనే, నేను అడుగు ముందుకు వేద్దామనుకుంటే, నాలో నాకు చాలా భయము కలిగింది. ఆ అడుగు వేయడానికి సంకోచిస్తూ నా పాదం వణికింది. కానీ, నేను నా విశ్వాసపు అడుగు వేయవలసి వచ్చినది. ఇప్పుడు మీరు కూడా నా ప్రియులారా, అడుగు ముందుకు వేయడానికి, మీ క్రింద లేక మీకు ముందుగా ఏమి ఉన్నట్లుగా మీకు కనబడుతూ ఉండకపోవచ్చును. తద్వారా, అడుగు వేయడానికి మీరు ఎంతగానో భయడుతూ ఉండవచ్చును. వనరులు లేకపోవడం, సహకరించే ప్రజలు మీకు లేకపోవడం, మీకు ఎదురుగా ఉన్న దర్శనమును గురించి మీరు భయపడడము ఇలాగున మీలో మరి ఎన్నో విధములైన భయమును ఇప్పుడు మీరు కలిగి ఉండవచ్చును.

అయితే, 2008 వ సంవత్సరములో మా తండ్రిగారు కూడా ఇటువంటి పరిస్థితులోనే ఉండి ఉన్నారు. వారి తండ్రిగారు మరణించినప్పుడు, వారి తండ్రిగారు (మా తాతగారు) మరణించినప్పుడు కూడా, పూర్తిగా ఇదే భయము చేత నింపిబడి ఉండెను. మేము ఇన్ని సంవత్సరాలు పరిచర్య జరిగించి యున్న ఈ ప్రజల నిమిత్తమై ఎవరు జాగ్రత్త వహిస్తారు అని అనుకున్నారు. నేను ఈసేవా పరిచర్యను ఏలాగున కొనసాగించబోవుచున్నాను? అనేక సంవత్సరములుగా మా తండ్రిగారు దివారాత్రములు ప్రార్థన చేసియున్నారు. అయితే, 2008 మార్చి 14వ తేదీన ఇదే దినమున సేవలో అనేక సంగతులను గురించి దేవుడు మా తండ్రిగారికి ప్రత్యక్షతలను అనుగ్రహించాడు. ఆయన భయము అంతయు కూడా వెళ్లిపోయినది. ప్రభువు, " అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు '' అని సెలవిచ్చుచున్నాడు. ఆలాగుననే, మా సేవా పరిచర్యలో ఇందుకొరకై కృపను అనుగ్రహిస్తానని తెలియజేశాడు. తద్వారా, దేశము నిమిత్తము ప్రవచనము చెప్పుట కొరకు ఢిల్లీ జాతీయ ప్రార్థన గోపురము స్థాపించబడుట జరిగినది. ఆ తర్వాత, అతి త్వరలోనే దేశవ్యాప్తముగా అనేక ప్రార్థనా గోపురములు లేవనెత్తబడ్డాయి. అనేకమంది సేవలో ఇతరుల కొరకు ప్రార్థించునట్లుగా, లేవనెత్తబడి ఉన్నారు. మా తండ్రిగారు కూడా వివిధ రకాల దేశ నాయకులకు ప్రవచనము చెప్పడము జరిగింది. కారుణ్యలో దేవుడు గొప్ప దర్శనమును ఆయన గారికి అనుగ్రహించియున్నాడు.

మానవాళి సమస్యలకు సంబంధించిన నాలుగు ప్రాముఖ్యమైన కోణాలలో పరిష్కారములు కనుగొనడానికి, విశ్వవిద్యాలయములో ఆవిష్కరణ ఆరంభమైనది. ప్రపంచ వ్యాప్తమైన సంబంధ బాంధవ్యాలలో కలిగియుండునట్లుగా, మరి ఇంకను బలమును పుంజుకొని, విశ్వవిద్యాలయము ముందుకు సాగి వెళ్లుచున్నది. ఆ విశ్వవిద్యాలయము ఈ రోజున దేశములో ఎ++ అక్రిడిటేషన్ గుర్తింపు గలిగి, ఉన్నతమైన స్థాయిలో ఆధిక్యతతో నిలిచియున్నది. దేవుని యొక్క శక్తి ద్వారా బలపరచబడే ఒక్క క్షణము, దేవుడు ఇచ్చు ఇట్టి, ఆత్మతో అనేకమైన సంగతులు స్థాపించబడినవి.

నా ప్రియులారా, మనము ఇప్పుడే ఇటువంటి ఆత్మను స్వీకరిద్దామా? దేవుడు బలపరిచే శక్తి యొక్క ఆత్మ, ఒక్క క్షణం మన జీవితములో ఉన్న సమస్తమును మార్చివేసింది. ఆయన ఇచ్చే నూతన ఆత్మ ద్వారా ఎంతగానో స్థిరపడింది. ఈ శక్తిగల ఆత్మను ఇప్పుడే పొందుకుందాం! ఆలాగుననే, నేడు మీరు ఇటువంటి శక్తిగల ఆత్మను పొందుకోవాలనగా, మీరు దేవుని చేతులకు మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన మీకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మను అనుగ్రహించి మిమ్మును నేటి వాగ్దానముగా ద్వారా ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మాకు శక్తిగల ఆత్మను ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభువా, నీ బలమైన ఆత్మ చేత మమ్మును నింపుము. యేసయ్యా, నీ ప్రేమగల ఆత్మ, ఆదరించు ఆత్మచేత మమ్మును బలపరచుము, ఇంకను మా బలహీన సమయములో మమ్మును నీ శక్తిచేత బలపరచుము. దేవా, అడుగు ముందుకు వేయడానికి మమ్మును శక్తివంతులనుగా చేయుము. దేవా, మాలో ఉన్న భయములన్నిటిని తొలగించి, మా అక్కరలన్నియు నీ నామమున సంధించబడునట్లుగా చేయుము. దేవా, నీవే, మాకు ఓదార్పునిచ్చే దేవుడవు, మా బలం, మరియు నీవే మమ్మును నడిపించే దేవుడవు. ప్రభువా, మా బలహీనమైన క్షణాలలో, దయచేసి మమ్మును పైకి లేవనెత్తి మమ్మును నీ శక్తితో నింపుము. తండ్రీ, మాలో ఉన్న భయం మమ్మును వెనక్కి లాగినప్పుడు, ముందుకు అడుగు పెట్టడానికి మాకు ధైర్యం దయచేయుము. ప్రభువా, ఎవరూ మూసివేయలేని తలుపులు తెరిచి మమ్మును నీ యొక్క పరిపూర్ణ ప్రణాళికలోనికి నడిపించుము. దేవా, మేము విశ్వాసంలో ధైర్యంగా నడవడానికి నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు శక్తిని దయచేయుము. దేవా, మా జీవితంలోని ప్రతి ఆటంకమును తొలగించి, మా ప్రతి అవసరాన్ని నీ దైవిక ఏర్పాటు ద్వారా తీర్చుము. యేసయ్యా, మా హృదయాన్ని నీ యొక్క శాంతితో నింపుము మరియు నీవు మా జీవితం కొరకు ఉద్దేశించిన ప్రతిదానిలో మేము స్థిరపడునట్లుగా నీ కృపను మాకు దయచేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.