నా ప్రియ స్నేహితులారా మీకందరికి స్వాగతం,ఈ రోజు చాలా ప్రత్యేకమైన దినము. ఇది నా ప్రియమైన తల్లి శ్రీమతి ఇవాంజెలిన్ పుట్టినరోజు. ఆమె తన సొంత పరిచర్యతో కూడా, ఆమె కుటుంబంలోని ప్రతి ఒక్కరి కొరకు ఎంతో విశ్వాసంతోను మరియు భారముతోను ప్రార్థిస్తారు. మా జీవితాలలోని ఉన్న ప్రతి అంశాలను గురించి విజ్ఞాపన చేస్తారు. ఆమె ప్రేమ, విజ్ఞాపన ప్రార్థనలు మరియు విశ్వాసం ద్వారా నేడు మా పరిచర్య ఆ విధంగానే నిర్మించబడుతుంది. ఆమె జీవితం కొరకు మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ఈ అర్థవంతమైన దినమున, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 28:25 ద్వారా ప్రభువు మనతో ఇలాగున మాట్లాడుచున్నాడు, "పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును '' ప్రకారం మనము వర్థిల్ల వలెననగా, దేవుని యందు మనము నమ్మకము కలిగి ఉండాలి.

అవును, నా ప్రియులారా, ఎల్లప్పుడు, పేరాసగలవారు, కలహాలను రెచ్చగొట్టేవారు, వివాదాలు తీసుకొని వచ్చువారు మరియు సమస్యలను కలిగించేవారు ఉంటారు. కొన్నిసార్లు మీరు ఏదో ఒక పనిలో చక్కగా చేయుచున్నందు ఇలాగున కూడా జరుగుతుంది. లేదా బహుశా! మీరు కుటుంబంలో మంచి పేరు సంపాదిస్తున్నందున కూడా అలాగున జరుగుతుంది. బహుశా! మీరు ఆస్తి, భూమి లేదా దేవుని దయ ద్వారా వచ్చు గొప్ప ఆశీర్వాదాలను స్వాస్థ్యంగా పొందుతున్నందున కూడా ఇలాగున జరుగవచ్చును. తద్వారా, మీ జీవితంలో వ్యతిరేకత తలెత్తుతుంది. కానీ, వాక్యం ఏమి చెబుతుందని చూచినట్లయితే, "యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును'' అని వ్రాయబడి యున్నది. ఇశ్రాయేలీయులను చూడండి. చరిత్ర అంతటా, వారు శత్రువులచే చుట్టుముట్టబడ్డారు. అమాలేకీయులు, మిద్యానీయులు మరియు అమ్మోనీయులు నిరంతరం ఇశ్రాయేలీయుల మీద పోరాడటానికి లేచారు. మరిముఖ్యంగా ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుచున్నప్పుడు లేదా స్వాస్థ్యమును పొందుకొనుచున్నప్పుడు శత్రువులు వారికి విరోధముగా యుద్ధము చేశారు.

అవును, నా ప్రియులారా, ఈనాటికి కూడా మనం అదే నమూనాను చూచుచున్నాము. పాలస్తీనా, లెబనాన్, సిరియా మరియు ఇరాన్ నుండి వచ్చిన బృందాలు కలహాలను రేకెత్తించి ఇశ్రాయేలీయులకు కీడు కలిగించడానికి ప్రయత్నించుచున్నవి. కానీ, దేవుడు జరిగించే కార్యాలు ఎలా ఉంటాయి? ఆయన ఇశ్రాయేలీయులకు సంపూర్ణంగా విజయాన్ని అనుగ్రహిస్తాడు. సాంకేతికత, భద్రత, వ్యవసాయం మరియు మరెన్నో రంగాల్లో ఆయన వారికి ఉన్నతస్థాయికి అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. వారు ఏ పని చేసినా ప్రకాశిస్తారు. ఎందుకంటే, దేవుడు వారిని సమృద్ధిగా వర్థిల్లునట్లుగా చేస్తాడు. అంతేకాదు, వారు దాడికి గురైనప్పుడు దేవుడు వారి శత్రువుల సంపదను కూడా వారి చేతుల్లోకి అప్పగిస్తాడు. అవును నా ప్రియ స్నేహితులారా, మీకు కూడా ఇలాగుననే జరుగుతుంది. కలహాలకు మరియు వ్యతిరేకతకు భయపడకండి. ఇశ్రాయేలీయులను వర్థిల్లింపజేసిన దేవుడు నేడు మిమ్మును కూడా వర్ధిల్లింపజేస్తాడు. దేవుడు మీకు గొప్ప నామమును అనుగ్రహిస్తాడు. నా ప్రియులారా, మీరు ప్రభువును నమండి, అప్పుడు మీరు వర్థిల్లుతారు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మా యొక్క నమ్మకాన్ని నీ మీద మేము ఉంచునట్లుగా చేయుము. దేవా, నీవు మాకు ఇచ్చిన ఆశీర్వాదాల వలన అసూయ పెరిగినప్పుడు, మా రక్షకునిగా నీవు మా పక్షమున ఉండి మమ్మును కాపాడుము. దురాశ లేదా వ్యతిరేకత మా శాంతిని లేదా మా ఆనందాన్ని దొంగిలించకుండా చేయుము. ప్రభువా, నీవు ఇశ్రాయేలీయులను అభివృద్ధి పరచినట్లుగానే, నీవు మా జీవితంలోని ప్రతి రంగంలో మమ్మును అభివృద్ధిపరచుము. ప్రభువా, ప్రతి దాడిని నీ శక్తి మరియు కృపకు సాక్ష్యంగా మమ్మును మార్చుము. దేవా, మా జీవితములో వ్యతిరేకతలను మేము ఎదుర్కొన్నప్పుడు మేము ఎప్పుడూ భయపడకుండా ఉండటానికి మాకు సహాయం చేయుము. ఎందుకంటే నీవు మాతో ఉన్నావు. నీ జ్ఞానం, దైవీక అభివృద్ధి మరియు అందరిలో మంచి పేరును మాకు అనుగ్రహించుము. మా విజయం నీ నమ్మకమైన ప్రేమకు ఇతరులకు సాక్ష్యంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మాకు కేడెముగాను, మాకు ఆశ్రయం, ఆధారంగాను ఉండి, అందుకు ప్రతిగా మాకు ప్రతిఫలం దయచేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.