నా ప్రియమైన స్నేసితులారా, నేటి దినమున మీకు దేవుడు జ్ఞానమును అనుగ్రహించు దినము. ఆయన తన జ్ఞానమును వర్షపు జల్లులుగా మీ కుమ్మరించువాడై యున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 28:26వ వచనమును, మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును'' ప్రకారము వినాశము నుండి వారు రక్షింపబడినవారుగా ఉంటారని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది.

నా ప్రియ స్నేహితులారా, ఈ లోకములో మనము రాణించుటకు కావలసిన శక్తి మరియు సామర్థ్యమై యున్నది. కేవలము లోకపరమైన జ్ఞానము కాదు, ఇంకను మానవుల జ్ఞానము కాదు. కానీ, అది దేవుని జ్ఞానమై ఉన్నది. దేవుని జ్ఞానము లోకపరమైన జ్ఞానము కంటె విభిన్నమైనది. లోకపరమైన జ్ఞానము ఈ లోకములో ఇతరులను ఏలాగున అధిగమించాలో మనకు కనపరుస్తుంది. లోకపరమైన జ్ఞానము, మీ స్వార్థ ప్రయోజనాలను పొందుకొను విధానము ఇతరులను అధిగమించుటను చూపిస్తుంది. ఇది కేవలము మనకు గాయములను మరియు ద్వేషములను మాత్రమే మనకు కల్పిస్తుంది. అవును, ప్రజలు లోకపరమైన జ్ఞానమును శక్తిని బట్టి అధికారమును కలిగి ఉంటారు. కానీ, దానిని వారు ఎలా వినియోగిస్తారు? వారికంటె వారు ఎవరినైతే, శక్తివంతులనుగా భావిస్తున్నారో? అటువంటి వారిని నాశనమునకు గురిచేయుటకు దానిని వినియోగిస్తున్నారు. లోకపరమైన జ్ఞానము వినాశనకరమైనది. చివరికి ఇది వారిని కూడా నాశనమును చేయుచున్నది. మానవ జ్ఞానము ఒక వ్యక్తికి ఔన్నత్యమును కలిగిస్తుంది. అయినప్పటికిని గర్వము, స్వార్థప్రియత్వము వస్తుంటాయి. అది కూడా వారికి నాశనమును కలిగిస్తుంది. కానీ, దేవుని యొక్క జ్ఞానమును, ఆ యొక్క జ్ఞానము యేసుక్రీస్తునందు ఉన్నది. దేవుని యొక్క వాక్యము చెబుతుంది, యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై యున్నాడు. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 2:3వ వచనములో చూచినట్లయితే," బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.'' అవును, దేవుని యందు జ్ఞానము సర్వసంపదలు గుప్తములై యున్నవి. కనుకనే, మీరు భయపడకండి.

అవును, నా ప్రియులారా, యేసు కలిగియున్న జ్ఞానము ఎట్టిదై యున్నది? అసూయపరులైనవారు ఆయనకు విరుద్ధుముగా లేచియున్నప్పుడు, ఎందుకనగా, వారు చూచినప్పుడు, కొన్ని వేలమంది ఆయనను అనుసరిస్తూ, యేసు వెంబడి వెళ్లుచున్నారు. యేసు ప్రజల కోసమై సహాయము చేయుచున్నాడు. బీదలైన వారి కొరకు జాగ్రత్త వహిస్తున్నాడు, శ్రద్ధ వహించవలసిన వారి కోసము శ్రద్ధ తీసుకొనుచున్నాడు. కానీ, ఆయన దినములలో ఉన్న ప్రజలు దానిని ఏ మాత్రము సహించలేకపోయారు. ఆయన వారి మీద తప్పుగా నేరారోపణ చేసియున్నారు. వారికి విరుద్ధముగా, అక్రమముగా, ప్రభుత్వ అధికారమును వినియోగించియున్నారు. ఆయనను ఖైదు చేశారు. సిలువకు మేకులతో కొట్టారు. అంతటితో వారు ఆగిపోలేదు. ఆయన సిలువలో భౌతిక ఆవేదనలో ఉన్నప్పుడు, వారు ఎదురుగా నిలిచి ఉంటూ, ఆయన మీద ఎంతగానో ఎగతాళి చేయుచుండిరి. అయినప్పటికిని, యేసు ఏమి చేశాడు? ఆయన, 'నేను అమయాకుడను, నేను నిరపరాధిని, నన్ను రక్షించండి' అని చెప్పియున్నాడా? అట్టి దుష్ట శక్తుల ఎదురుగా తనను తాను న్యాయవంతుడని ఆయన చెప్పుకొనియున్నాడా?లేక తనను శపించుచున్నవారిని ఆయన తిరిగి వారిని మరల శపించడానికి వినియోగించాడా? లేదు. ఆయన ఈ మూడింటిలో ఏదియు కూడా చేయలేదు. ఆయన మానవ జ్ఞానము వైపు మరియు మానవ శక్తి వైపు ఎప్పుడు కూడా చూడలేదు. ఆ స్థలములో ఆయన దేవుని జ్ఞానమును ప్రదర్శించాడు.

నా ప్రియులారా, కనుకనే, దేవుని జ్ఞానమును ప్రేమించుటకు మరియు ప్రేమించుట కొరకు మాత్రమే ఉన్నది. దేవుని జ్ఞానము ప్రేమ ద్వారా ద్వేషమును నాశనము చేయు నిమిత్తము మాత్రమే. లోకపరమైన జ్ఞానము ద్వారా వచ్చే స్వార్థపియత్వమును, ద్వేషమును తన ప్రేమ ద్వారా దేవుడు నాశనము చేయునట్లుగా ఆలాగున దైవీకమైన జ్ఞానమును ఆయన వినియోగించియున్నాడు. యేసు సిలువలో, "తండ్రీ, వీరేమి చేయుచున్నారో, వీరు ఎరుగరు గనుకనే, వీరిని క్షమించుమని'' సెలవిచ్చాడు. మానవాళి రక్షణ కొరకై యేసు తను మాత్రమే మార్గము అని ఆయనే ఎరిగియున్నాడు. కనుక సిలువలో నుండి సహితము తనను అక్రమముగా ఎంచుచున్నవారి యొక్క రక్షణ కొరకు, 'ప్రభువా, వారిని క్షమించుమని' తండ్రి యొద్ద ప్రార్థించాడు. ' తండ్రీ, వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుకనే, వారిని క్షమించగల శక్తిని నేను మాత్రమే కలిగియున్నాను, నేను వారిని క్షమించవలసినదిగా ఉన్నాను'' అని యేసు సిలువలో సెలవిచ్చాడు. అదియే దేవుని యొక్క జ్ఞానము మరియు దేవుని యొక్క ప్రేమయై యున్నది. ఈ రోజు అందుచేతనే, మనము ఆయనను దేవునిగా విజయోత్సవముతో ఊరేగించుచున్నాము. సర్వశక్తిని కలిగియున్నవాడు ఆయన. మనము అనుభూతి చెందుచున్న శ్రమలన్నియు కూడా, ఆయన కూడ అనుభూతి చెందుచున్నప్పటికిని, అక్రమము చేయువారిని క్షమించుటకు ఆయన ఎంపిక చేసుకున్నాడు. మనము కూడా ప్రభువునకు విరోధమైన కార్యములను చేసినప్పటికిని, ప్రభువు మనలను క్షమించియున్నాడు. తద్వారా, మనము యేసునకు బిడ్డలమై ఉన్నాము.

నా ప్రియులారా, మీరు కూడా యేసుకు బిడ్డలు కావచ్చును. నాకు లోకపరమైన జ్ఞానము ఉన్నదని మీరు అనుకుంటున్నారా? కానీ, మీరు ఇతరులను గాయపరచుచున్నారేమో? మీరు జీవించుట కొరకై ఇతరులను నాశనము చేద్దాము అని వారిని నాశనము చేయుచున్నారేమో? మానవ జ్ఞానమును కలిగియున్నారేమో? ఉన్నతమైన స్థాయికి మీరు లేవనెత్తబడియున్నారేమో? మానవ జ్ఞానమును మీరు కలిగియున్నారేమో? కానీ, మీరు స్వార్థప్రియత్వముతో మీరు ఉండి యున్నారేమో? మీరు అతిశయమును కలిగియున్నారేమో?మీరు శాంతిలేకుండా ఉండి యున్నారేమో? అయితే, మీరు దిగులుపడకండి.

కానీ, నా ప్రియులారా, ఈ రోజు యేసు యొక్క జ్ఞానము కొరకై ఆయనను అడగండి. అది మిమ్మును క్షేమముగా ఉంచుతుంది. అది మిమ్మును దేవుని యొక్క బిడ్డలనుగా ఉంచుతుంది. మీరు వేలాది మందికి ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉంటారు. ప్రతిఒక్కరు మిమ్మును ప్రేమిస్తారు. దేవుడు ఈ కృపను మీకు అనుగ్రహించును గాక. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మా యొక్క ప్రాణ ఆత్మ, దేహములను నీకు స్వాధీనము చేయుచున్నాము. ప్రభువా, నీ ప్రేమతో మమ్మును స్వయంగా నింపుము. యేసయ్యా, మేము నిన్ను ప్రేమించుటకు మాకు సహాయము చేయుము. యేసయ్యా, క్షమించడానికి, దీవించడానికి, మరియు దీవెనకరముగా ఉండడానికి మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీవు మాత్రమే ఇవ్వగల జ్ఞానాన్ని వెదకుతూ మేము దీనత్వముతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, మా హృదయాన్ని నీ దైవీకమైన ప్రేమతో మరియు ద్వేషాన్ని మరియు స్వార్థాన్ని జయించే నీ జ్ఞానంతో మమ్మును నింపుము. ప్రభువా, నీ మార్గాలలో నడవడానికి మరియు గర్వాన్ని మరియు ఈ లోకాశలను తిరస్కరించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, సిలువపై నిన్ను బాధపెట్టిన వారిని నీవు క్షమించినట్లుగానే, మా పట్ల నేరారోపణ చేసిన వారిని క్షమించుటకు మాకు నేర్పుము. దేవా, నీ యొక్క ప్రేమ మరియు దయను మేము విస్తరింపజేయుటకును మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ జ్ఞానం మమ్మును నడిపించునట్లుగా చేయుము. దేవా, ఈ లోకపు క్షణికమైన జ్ఞానం కాకుండా, నీ యొక్క దైవీమైన జ్ఞానంపై ఆధారపడడానికి దయచేసి మాకు సహాయం చేయుము. ప్రభువా, ద్వేషం కంటే ప్రేమను, గర్వం కంటే దీనత్వమును మరియు దురాశ కంటే నిస్వార్థతను ఎంచుకునే కృపను మాకు అనుగ్రహించుము. యేసయ్యా, నీ యందు గుప్తములై యున్న నీ జ్ఞానంలో, మమ్మును సురక్షితంగా ఉంచుము మరియు ఆ జ్ఞానము ద్వారా ప్రతిరోజు మమ్మును నీకు సమీపముగా తీసుకొని వచ్చునట్లుగా కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.