నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 కొరింథీయులకు 12:27లో బైబిల్ చెప్పినట్లుగా, "అటువలె, మీరు క్రీస్తు యొక్క శరీరమై యుండి వేరు వేరుగా అవయవములై యున్నారు'' ప్రకారం, మీరందరు కలిసి క్రీస్తు శరీరము మరియు మీలో ప్రతి ఒక్కరు దానిలో ఒక భాగముగా అవయవములై యున్నారు. మనం క్రీస్తు శరీరంలో భాగమని, ఆయనలో దాగి ఉన్నామని తెలుసుకోవడం ఎంత అద్భుతమైనది కదా.
నా ప్రియులారా, ఏదైనా పరిచర్య అభివృద్ధి చెందాలంటే, మనమందరం వేర్వేరు సభ్యులుగా ఒకటిగా కలిసి పనిచేయడం చాలా అవసరం. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని నిర్దిష్టమైన పాత్రలను నెరవేర్చడానికి ప్రత్యేకంగా రూపొందించియున్నాడు. ఐక్యతతో పనిచేయడానికి వేర్వేరు వరములను మనకు అనుగ్రహించాడు. కొందరు ఎన్నో వరములను కలిగి ఉన్నారని గొప్పలు పలుకుతారు, మరి కొందరు తామకు తాముగానే తక్కువ అని భావించుకుంటారు. కానీ నా ప్రియ స్నేహితులారా, ఎప్పుడూ అలా తలంచకండి! ప్రతి వరం, దాని పరిమాణంతో సంబంధం లేకుండా, దేవుని ప్రణాళికకు ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. ఆయన మిమ్మల్ని ఒక ఉద్దేశ్యంతో ఈ పరిచర్యలో ఉంచాడు మరియు ఆయన మీకు ఇచ్చిన వరములు ఆయనకు చిత్తానికి అనుగుణంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ ఒక్కడే కానీ అనేక ఆధ్యాత్మిక వరములను మన నిమిత్తము కలిగియున్నాడు. మనలో ప్రతి ఒక్కరికి మన వరములను సమర్ధవంతంగా ఉపయోగించుకునే శక్తిని ఇచ్చేది పరిశుద్ధాత్మయే.
అందుకే నా ప్రియమైన వారలారా, మనం 1 కొరింథీయులకు 12:8-10లో చదివినట్లుగానే, " ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి'' ఇంకను అనేకమైనవి కలవు. ప్రభువు ఈ తొమ్మిది వరములను ఒక్కొక్కరికి విడివిడిగా పంచిపెట్టియున్నాడు. కాబట్టి, దేవుడు మీకు ఇచ్చిన వరాన్ని దాచుకొనవద్దు లేదా నిర్లక్ష్యం చేయవద్దు. మీరు దానిని ఉపయోగించనప్పుడు, క్రీస్తు శరీరమంతయు బాధపడుతుంది. ఎందుకనగా, శరీరం మీ మీద ఆధారపడి ఉంటుంది!
అవును నా ప్రియులారా, ఆయనకు సేవ చేయుటకు అవకాశం వచ్చినప్పుడు మీ వరములను ఉపయోగించుకొనండి. నేను పరిచర్య చేయుచున్న ప్రారంభంలో, ఆ దినములలో నేను ఎంతో బలహీనంగా ఉంటాను, అందునిమిత్తము, మా తండ్రిగారైన సహోదరులు దినకరన్‌గారి యొద్ద ప్రార్థన కొరకు వెళ్లాను. ఆ రోజు, ప్రభువు నాతో ప్రవచనం ద్వారా ఇలాగున చెప్పారు, ఆ దినములలో నేను ఎంతో బలహీనంగా ఉంటాను, ఆరోజు ప్రభువు నాతో మాట్లాడుతూ, మా తండ్రిగారి ద్వారా ఇలాగున తెలియజేశాడు, 'నా కుమార్తె, నేను బలహీనురాలనని చెప్పవద్దు, నేను నీకు ఇచ్చిన వరములను ఎంత ఎక్కువగా ఉపయోగించి, నా పరిచర్య చేసిన కొలది, నీలోనే బలము అధికమవుతుంది. నీవు అంత ఎక్కువగా బలపరచబడతావు'' అని చెప్పారు. ప్రభువు ఇచ్చిన వాగ్దానము ప్రకారముగానే, నిజానికి, నేను పరిశుద్ధాత్మ యొక్క వరములను ఉపయోగించుచున్నకొలదిగా, ప్రభువు వాగ్దానం చేసినట్లుగానే ఆయన నా జీవితములో అధికమగుట నేను అనుభూతి చెందుచున్నాను. ఈ సమయము వరకు కూడా నేను ఆయనను సేవించడానికి మరియు ఆయనకు పరిచర్య చేయడానికి వెనకాడలేదు.
నా ప్రియ స్నేహితులారా, మీకు సమయము దొరికిన కొలది మీకివ్వబడిన వరములను ఉపయోగించాలని గుర్తుంచుకోండి. మీరు ఆలాగున ఉపయోగించుకొనుచున్నప్పుడు, దేవుడు మిమ్మును చూసి, 'యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అని చెబుతాడు.' ఆలాగుననే, నేడు మీరు ప్రభువును సేవించడానికి మరియు ప్రేమించడానికి పరిచర్యలో ఇతరులతో కలిసి క్రీస్తు శరీరంలో ఒక అవయవమై యున్నారు. మీరు, 'నేను ఏమీ కాదు. నేను దేవుని ముందు ఎలా సేవ చేయగలను? ' అని ఆలోచించడం ద్వారా సందేహించకండి లేదా మిమ్మల్ని మీరు అనుమానించుకొనకండి. ముందుకు సాగండి, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొనండి మరియు పరిశుద్ధాత్మ వరముల కొరకు హృదయపూర్వకంగా ప్రార్థించండి. దేవుడు పిసినారి కాదు-ఆయన ధారళముగా దయచేయువాడు మరియు ఆత్మ యొక్క మొత్తం తొమ్మిది వరములతో మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు! నేడు, ఈ వరములను స్వీకరించడానికి మరియు క్రీస్తు శరీరంలో బలమైన అవయవంగా మారడానికి ప్రార్థించండి. మీరు కేవలం భూసంబంధమైన యజమానికి సేవ చేయడం లేదు; మీరు యేసుక్రీస్తును స్వయంగా సేవ చేయుచున్నారు. కారణం, మీరు ఆయన శరీరంలో ఒక అవయవమై యున్నారు. కాబట్టి, మీరు దిగులుపడకండి.
కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, దేవుని పరిచర్య చేయుటకు మిమ్మును మీరు ఆయన హస్తాలకు సమర్పించుకొనండి. ఇంకను యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురములో పరిచర్యలో చేరడానికి మరియు ఇతరుల కొరకు విజ్ఞాపనము చేయడానికి మీకు అద్భుతమైన అవకాశం కలదు. మీరు దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఆయన మిమ్మల్ని శక్తివంతులనుగా చేసి తన మహిమ కొరకు మిమ్మును వాడుకుంటాడు. సంశయించకుండా, మీ పిలుపులో అడుగు ముందుకు పెట్టండి, మీ వరములు ఉపయోగించండి మరియు విశ్వాసంతో ప్రభువును సేవించంచినట్లయితే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు!
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరమ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మమ్మును నీ శరీరంలో ఒక అవయవంగా చేసినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, దయచేసి నీవు మాలో ఉంచిన అద్వితీయమైన వరమును అర్థం చేసుకోవడానికి మరియు అంగీకరించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, ఈ వరములు నీ మహిమ మరియు ఇతరుల మేలు కొరకు అని గుర్తించుటకు మమ్మును నీ యొక్క పరిశుద్ధాత్మ వరములతో నింపుము మరియు అవకాశం వచ్చినప్పుడు మా వరములను తగిన సమయములో చక్కగా ఉపయోగించుకునేలా మమ్మును నడిపించుము. దేవా, నీ ఆత్మ నుండి వచ్చు జ్ఞానం, తెలివి మరియు విశ్వాసంను మాకు దయచేయుము. ప్రభువా, మేము నీకు సేవ చేయడానికి ముందుకు సాగుతున్నప్పుడు నీవు మమ్మును శక్తివంతం చేయగలవని మేము నమ్ముచున్నాము. దేవా, మా హృదయం నుండి ఎటువంటి సందేహమును లేదా సంశయమును తొలగించి, అందరికంటే గొప్ప యజమాని అయిన నీకు మేము చేయుచున్నామని మాకు గుర్తించునట్లు చేయుము. దేవా, నీవు మమ్మును బలపరుస్తావనియు మరియు మా పిలుపులో మమ్మును నడిపిస్తావని నమ్ముచూ, మమ్మును మేము నీకు సంపూర్ణంగా సమర్పించుకొనుచున్నాము. యేసయ్యా, నేడు నీవు మాకివ్వబడిన తలాంతులను మరియు వరములతో నిన్ను నిత్యము ఘనపరచడానికి మాకు నీ కృపను అనుగ్రహించి, మా జీవితములో నీ నామము మహిమపరచబడునట్లు చేయుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.