నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి గలతీయులకు 5:13వ వచనములో చెప్పబడినట్లుగానే, "సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాత్రంత్యమును శారీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి'' అని వ్రాయబడినట్లుగానే, నేడు మీరు స్వతంత్రులుగా జీవించాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు.

అందుకే, పౌలు ఏమని వ్రాయుచున్నాడంటే, మీ యొక్క స్వాతంత్య్రమును పాపమునకు కాకుండా, ఒకనికొకడు దాసులుగా సేవ చేసుకొనుటకు వినియోగించుకొనుడి అని తెలియజేయుచున్నాడు. గలతీయులకు 4:9లో కూడ పౌలు ఏమని చెబుతున్నాడంటే, "యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండగోర నేల?'' అని పౌలు అంటున్నాడు. ఇంకను పౌలు, ఈ లోకములో ఉన్న బలహీనమైన మరియు నిష్‌ప్రయోజనమైన ఆధ్యాత్మిక సూత్రాలకు బానిసలుగా ఉండటానికి ఎందుకు తిరిగి వెళ్లుచున్నారని ప్రశ్నించుచున్నాడు. అయితే, దేవుని ఎరిగియున్న తర్వాత, మీ గత కాలపు పాప జీవితమునకు వెళ్లవద్దు అని పౌలు స్పష్టముగా తెలియజేయుచున్నాడు.

నా ప్రియులారా, ఈ రోజున ప్రజలు వాక్ స్వాతంత్య్రపు హక్కును మరియు మత స్వాతంత్య్రపు హక్కును అనుభవించి, ఆనందించుచూ, వారు ఏమైన చేయుచూ, దేనినైనా జరిగించుచూ, ఎంతైనా అనందించవచ్చును అన్నట్లుగా జీవించుచున్నారు. కానీ, ప్రభువును ఎరిగిన తర్వాత మరల పాప సంబంధమైన జీవితానికి తిరిగి రావడం అనేది ఎంతైన సరికాదు. అందుకే బైబిల్‌నందు 1 పేతురు 2:16వ వచనములో చూచినట్లయితే, దేవుని యొక్క వాక్యము స్పష్టముగా ఏమని తెలియజేయుచున్నదనగా, "స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాత్రంత్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి'' ప్రకారం మీ యొక్క స్వాతంత్య్రమును లేక దుష్ట చెడు కార్యములను చేయుటకు సాకుగా వినియోగించుకొనకండి. 'మీరు దేవునికి దాసులై ఉన్నారని' దేవుని వాక్యము మీకు స్పష్టముగా తెలియజేయుచున్నది. దాని యొక్క భావమేమనగా, ఈ లోక రీతిగా ఉన్నట్టువంటి బానిసత్వము కాదు. ప్రభువు మన పట్ల కలిగియున్న సమస్తమును కూడ మనము అనుభూతి చెంది ఆనందించవలెనని దేవుడు మన పట్ల కోరుచున్నాడు. ఈ వచనం దేవుని పట్ల భక్తితో కూడిన భయాన్ని సూచిస్తుంది. దేవుడు మనకు ఈ లోకమునకు సమస్తాన్ని అనుభూతి చెంది, ఆనందించుటకు అనుగ్రహిస్తాడు. నిజముగా దేవుడు ఈ లోకములో ఉన్నవన్నీ మనకు అనందించడాని కొరకే ఇచ్చాడు. అయినప్పటికీ, మనము సంపూర్ణముగా దేవునికి స్వాధీనము చేసుకోవాలి. అందుకే మనము అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ఇక మీదట ఏ శోధన కూడ మనము ఎదుర్కొనము. 

సహోదరి ఆదిలక్ష్మి యొక్క సాక్ష్యమును మీకు తెలియజేయాలని నేను కోరుచున్నాను. ఆమె భర్త వ్యాపారము చేయుచున్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అయినప్పటికిని భర్త మద్యపాన వ్యసనముతో ఉన్నాడు. కుటుంబమును గురించిన ఆశ లేదు. వ్యాపారమును, కుటుంబాన్ని, యాజమాన్యమును చేసుకొనుట ఆ సహోదరికి చాలా కష్టముగా ఉండెను. అటువంటి సమయములో ఆ యొక్క కుమార్తె,12వ తరగతి చదువుచుండెను. ఆమె చాలా భయపడుచుండెను. అటువంటి సమయములోనే ఆమె కుమారుడు వెల్లూరులో ఉన్న ప్రార్థనా గోపురమును పరిచయము చేశాడు. వెల్లూరులో ఉన్న ప్రార్థనా గోపురమునకు వెళ్లదాము, వారు మన కొరకు ప్రార్థన చేస్తారు అని చెప్పాడు. అక్కడకు వెళ్లిన తర్వాత, ప్రార్థనా యోధులు ఎంతో భారముతో వారి కొరకు ప్రార్థన చేశారు. కుటుంబ ఆశీర్వాద పధకమును గురించి వారు తెలుసుకొని, ఆ కుటుంబ ఆశీర్వాద పధకములో తన కుటుంబ సభ్యులందరిని భాగస్థులుగా చేర్పించడము జరిగింది. క్రమక్రమంగా దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించుటకు ప్రారంభించాడు. ప్రభువు వారి యొక్క విద్య అక్కరలను సంధించులాగున చేసియున్నాడు. ప్రార్థనా యోధుల యొక్క ప్రార్థనల సహాయము ద్వారా భర్త యొక్క మద్యపాన వ్యసనమును పూర్తిగా విడిచిపెట్టాడు. అతడు మత్తుపానీయముల సమస్య నుండి బయటకు వచ్చాడు. ప్రభువు తన భర్త యొక్క చెడు వ్యసనముల నుండి ఏలాగున బయటకు వచ్చాడని, ఆమె ఉత్తరము ద్వారా మనకు తెలియజేశారు. ఈ రోజు వారు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించుచున్నారు. దేవునికే మహిమ కలుగును గాక.

నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు అనేక రకములైన దుర్‌వ్యసనములకు బానిసలుగా ఉన్నారేమో? వాటి నుండి బయటకు రాలేకపోతున్నామని చింతించుచున్నారా? వాటి నుండి బయటకు వచ్చుటకును, ఈ రోజు విడుదల పొందుటకును దేవుని అడగండి. ఈ లోకమునంతటిని ఆనందించడానికి నాకు చాలా స్వాతంత్య్రము ఉన్నదని అనుకొని, మీరు స్వతంత్రంగా అన్నిటిని అనుభవించి ఆనందింపకూడదు. అందుకు మారుగా మిమ్మును మీరు దేవునికి స్వాధీనపరచుకున్నప్పుడు, మీ సమస్త బాధల నుండి మరియు సమస్యల నుండి ఆయన మీకు విడుదలను అనుగ్రహిస్తాడు. మరియు దేవుడు సర్వశక్తిమంతుడై యున్నాడు. మీ వ్యసనములన్నిటిలో నుండి ఆయన మిమ్మును విడిపిస్తాడు. రండి, ఇప్పుడు మీ నిమిత్తము ప్రార్థన చేయుదమా? ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును దీవించును గాక. మీరు విడుదల పొందియున్నారు. ప్రభువు మీకు విడుదల అనుగ్రహించియున్నాడు. దేవుని ఆశీర్వాదములను ఆనందించండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. 

ప్రార్థన:
మాకు ప్రియమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, దుర్ వ్యసనములకు గురియైన మా ప్రియులను మరియు మమ్మును నీవు విడిపించుము. ప్రియమైన ప్రభువా, నీలో మేము కలిగి ఉన్న స్వాత్రంత్యానికి మరియు సిలువపై నీవు మా కొరకు చేసిన త్యాగానికి వందనాలు. యేసయ్యా, పాపం, శాపం లేదా ఎలాంటి ఒత్తిడి యొక్క బానిసత్వం నుండి విడుదల పొందిన జీవితాన్ని మేము జీవించగలుగునట్లుగాను, మమ్మును మేము నీకు సమర్పించుకొనుటకును మరియు మా జీవితంలో ఏదైనా శోధనలను లేదా పోరాటాన్ని అది భయం, సందేహం లేదా ఆందోళనను అధిగమించడానికి మాకు సహాయం చేయుము. దేవా, ఈ అడ్డంకులను అధిగమించడానికి నీవు మాకు సహాయం చేస్తావనియు మరియు అపవాదిని ఎదిరించడానికి మరియు నీలో స్థిరంగా నిలబడటానికి మాకు శక్తిని అనుగ్రహిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మమ్మును ఘనపరచే మరియు మా చుట్టూ ఉన్న వారి పట్ల నీ ప్రేమను ప్రతిబింబించే ఎంపికలు చేయడంలో మాకు సహాయం చేయుము. దేవా, మా మాటలు మరియు క్రియలు నిన్ను ఘనపరచునట్లుగాను మరియు నీవు మాత్రమే అనుగ్రహించగల స్వతంత్రను వెదకడానికి ఇతరులను ప్రేరేపించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించు ము. ప్రభువా, నీవు అడుగడుగునా మాతో ఉన్నావనియు మరియు నిజమైన స్వాత్రంత్య జీవితం వైపు మమ్మును నడిపిస్తావనియు మేము నమ్ముచున్నాము. దేవా, మేము నిన్ను గుర్తెరుగుటకును మరియు మా గత పాపమునకు తిరిగి వెళ్లకుండా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.