నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 కొరింథీయుల కు 6:19 వ వచనమును తీసుకొనబడినది. దేవుని వాగ్దానముతో ఈరోజు మీకు శుభములు తెలియజేయుటలో నేను ఎంతో ఆనందించుచున్నాను. ఆ వచనము, "మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు'' ప్రకారం నా స్నేహితులారా, 'మనము మన సొత్తుకాదు' అని ఈ వచనము మనకు గుర్తు చేయుచున్నది. అవును, మనము కలిగియున్న సమస్తము దేవునికి చెందినది. కనుకనే, మనము ఆయన ఆలయముగాను, పరిశుద్ధాత్మకు నివాస స్థలముగా సృష్టింపబడియున్నాము. కాబట్టి, దేనికిని మీరు భయపడకండి.
నా ప్రియులారా, నేడు మీలో దేవుని ఆలయము ఉన్నదని ఒక్కసారి ఊహించుకోండి. ఆ దేవాలయం ఎంతో మహిమాన్వితమైనది మరియు సంతోషకరమైనదిగా ఉంటుంది కదా! కనుకనే, మనం మందిరములోనికి ప్రవేశించినప్పుడు, దేవుని గృహములో, మనము ఆయన సన్నిధిని మరియు ఆయన శాంతి సమాధానమును అనుభవిస్తాము. అదేవిధంగా, మీరు మీలో అదే సన్నిధిని కలిగి ఉండాలనియు, దేవుడు మీ పట్ల కోరుకుంటున్నాడు. ఆయన నివసించే నివాస స్థలము మీరు పరిశుద్ధాత్మకు ఆయలంగా ఉండాలని ఆయన మీ పట్ల ఆశించుచున్నాడు. దీనికి అర్థం మీ స్వంత ఆలోచనలు, కోరికలు మరియు ప్రణాళికలను విడిచిపెట్టాలి. బదులుగా, మీరు 'ప్రభువా, నీవు మమ్మును ఎక్కడికి తీసుకొని వెళ్లాలనుకుంటున్నావు? మా ద్వారా నీవు ఏమి చేయాలనుకుంటున్నావు?' మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే, మీ హృదయము ఆయన సంతోషముతో నింపబడుతుంది, మీ హృదయము ఆయన సంతోషముతో నింపబడినప్పుడు, మీరు ఆయనను నడిపించుటకు మీలోనికి ఆయనను అనుమతి స్తారు మరియు మీరు అలాగున చేసినప్పుడు, మీ హృదయము మరియు శరీరము జీవముగల దేవుని యొక్క నిజమైన ఆలయముగా మారుటకు మీరు సజీవ సాక్ష్యముగా నిలిచి ఉంటారు.
నా ప్రియులారా, మరి దేవుని ఆలయములో ఏమి జరుగుతుంది? ఇది ప్రజలు ఆయన సన్నిధిని అనుభవించే ప్రార్థనా స్థలం. ఇంకను మీ ద్వారా, ఇతరులు కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తారు మరియు ఆయనకు సమీపముగా జీవిస్తారు. మీరు జీవించుచున్న జీవితమును బట్టి, వారు ఇదివరకు లేని విధంగా ప్రభువును గుర్తెరుగుతారు. ఆలయంలో, దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు మరియు మీ ద్వారా, ఇతరులను నడిపించుటకు ఆయన మరియు మీకు బోధిస్తాడు.
ఇందుకు ఒక చక్కటి ఉదాహరణను మీతో పంచుకోవాలని కోరుచున్నాను. మా కళాశాలలో ఒక విద్యార్థి ఉండెను. అతడు చిన్న వయస్సులో కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. అక్కడే క్యాంపస్‌లో, యేసు పట్ల అతనికున్న ప్రేమ మరియు తృష్ణను స్పష్టంగా కనిపించాయి. అతడు నిరంతరం ప్రార్థిస్తూ మరియు దేవునితో సహవాసము కలిగియుండెను. హాస్టల్‌లో, విద్యార్థులు తమ సమస్యల కొరకు ప్రార్థనలు కోరుతూ అతనిని కలవడానికి బారుగా వరుసక్రమములో నిలవబడియుంటారు. అతని ద్వారా, వారు దేవుని సన్నిధిని అనుభవించారు. అంతమాత్రమే కాదు, ప్రభువు యొద్ద నుండి జవాబులను పొందుకున్నారు. మరికొందరు ఆయన జ్ఞానాన్ని కోరుకునేవారు, వారి చదువుల కొరకు సహాయం కూడా అడిగేవారు. దేవుడు అతనికి గొప్ప అవగాహనను అనుగ్రహించి అతనిని ఆశీర్వదించాడు మరియు అతను అన్ని విషయాలలో ఎంతో ఉత్తమముగా నడుచుకునేవాడు. అనేకులను ప్రభువు యొద్దకు మరియు ఆయన జ్ఞానం వైపునకు నడిపించాడు. అదేవిధంగా, నా స్నేహితులారా, మీరు కూడా యేసును దేవుని ఆలయంగా ఇతరులకు ప్రతిబింబించునట్లు చేయగలరు. అదియుగాక, మీ జీవితాన్ని ఆయన సన్నిధితో ప్రకాశింపజేయండి, ఆయన ప్రేమను అనుభవించడానికి మరియు ఆరాధించడానికి ఇతరులను ఆయన యొద్దకు ఆకర్షించండి. మీరు ఆయన ఆలయంగా మారినప్పుడు, మీరు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రూపాంతరమును అనుభవిస్తారు, ఆయన మీ ద్వారా ఇతరుల జీవితంలోనికి తన సన్నిధిని ప్రవహించునట్లుగా చేస్తాడు. మీలో ఆయన నివాస స్థలంగా ఉండడం ఇది ఎంతటి గొప్ప ప్రాముఖ్యమైన విషయం కదా! నేడు మీరు కూడా, ఆయన ఆలయంగా మారాలంటే, మీ హృదయాలను ఆయనకు సమర్పించి, పరిశుద్ధతను మరియు ఆయన సన్నిధిని మీరు కోరుకున్నప్పుడు, నిశ్చయముగా, మిమ్మును తన ఆలయముగా మార్చుకొని, ఆయన మీలోనికి వచ్చి నివసిస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సర్వోన్నతుడా, సర్వశక్తిగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మా దేహము నీ యొక్క పరిశుద్ధాత్మకు ఆయలం అనే నీవు మాకు తెలియజేసిన సత్యమునకై నీకు వందనాలు. దేవా, మమ్మును నీ ఆలయంగా ఎంచుకున్నందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభు వా, దయచేసి మా ఆలోచనలు, కోరికలు మరియు ప్రణాళికలను పూర్తిగా నీకు అప్పగించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితం నీ మహిమ మరియు ప్రేమను ప్రతిబింబించేలా నీ సన్నిధితో మమ్మును నింపుము. దేవా, మేము వేయు ప్రతి అడుగులో మమ్మును ముందుకు నడిపించుము, నీ పరిపూర్ణ సంకల్పం ప్రకారం మాకు బోధించి, మమ్మును సరైన మార్గములో నడిపించుము. ప్రభువా, మేము ఇతరులు నిన్ను సంధించే ఆరాధనా స్థలంగా మా హృదయం ఉండునట్లుగా చేయుము. దేవా, మా ద్వారా ప్రవహించు నీ ఆత్మ శక్తిని గుర్తెరగడానికిని మరియు నీ సమాధామును అనుభవించడానికి మేము ఇతరులను ప్రేరేపించునట్లుగా చేయుము. దేవా, మేము నీకు ఆలయముగా ఉండడానికి మా హృదయాలలో వాంఛను కలిగించుము. ప్రభువా, ఈ లోకములో నీ వెలుగును ప్రకాశింపజేయడానికి మమ్మును బలపరచుము, అనేకులను నీ వైపునకు ఆకర్షించునట్లుగా మమ్మును మార్చుము. దేవా, ఎల్లప్పుడు నీతో మరియు నీకు నివాస స్థలంగా ఉండటానికి మరియు జీవితంలో నీ యొక్క ఆనందం మరియు ఉద్దేశ్యంతో నింపబడి ఉండడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ యొక్క ఆత్మకు మా దేహము ఆలయముగా ఉండడానికి మా హృదయాన్ని పరిశుద్ధపరచుము. యేసయ్యా, నీ నామమునకు మహిమకరముగాను మరియు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగాను మరియు మేము నీ సొత్తుగా ఉండునట్లుగాను మాకు కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.